సాక్షి, హైదరాబాద్: రాజ్యాధి కారంలో బీసీలకు తమవంతు వాటా దక్కినప్పుడే వారికి న్యాయం జరిగినట్లు అని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. రాను న్న ఎన్నికల్లో బీసీలే ప్రధాన పాత్ర వహించాలని చెప్పారు. గత తొమ్మిళ్లలో బీసీలను ఆదుకునేలా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, పథకాలను ఆదరించి మద్దతుగా నిలవాలని కోరారు. దేశంలోని కుల, చేతివృత్తుల బలోపేతానికి మోదీ– పీఎం విశ్వకర్మ యోజన వంటి బృహత్తరమైన పథకాన్ని తీసుకొచ్చారని చెప్పా రు. ‘కాంగ్రెస్, బీఆర్‌ఎస్ బీసీలను వంచించి దగా చేశాయి.
బీసీలకు రాజకీయంగా ఇవ్వాల్సిన 33 శాతం వాటాకు కోతపెట్టి.. ఇప్పుడు ఓబీసీ ఎజెండా ఎత్తుకుని ఓట్ల కోసం పాకులాడుతు న్నాయి’ అని మండిపడ్డారు. మంగళవారం పార్టీ కార్యాల యంలో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె చిత్రప టానికి లక్ష్మణ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ ఆధి పత్య, పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా, కుల వృత్తులు, వ్యవసాయాధారిత పేద కుటుంబాలకు మద్దతుగా ఐలమ్మ పోరాటం చేశారని కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment