సాక్షి, విజయవాడ: సాహిత్యకారులకు ‘గుర్రం జాషువా జయంతి’ పురస్కరించుకొని గతంలో ప్రభుత్వం రూ.50 వేలు నగదు అందించేదని.. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూ.1 లక్ష చేశారని ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ, అమరావతి ఆధ్యర్యంలో అధికార భాష సంఘం, భాషా సాంస్కృతిక శాఖలు బుధవారం సమావేశం అయ్యాయి. ఈ సమావేశంలో పాల్గొన్న లక్ష్మీ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. గుర్రం జాషువా 124వ జయంతిని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 28న సాహిత్యకారులకు పురస్కారాలను ప్రదానం చేయనుందని తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరగనున్న ఈ కార్యక్రమంలో ప్రముఖ సాహిత్యకారులు డా. కత్తి పద్మారావు, బోయ్ ఐమావతమ్మ, డా. గుజర్లముడి కృపాచారి, ఆచార్య చందు సుబ్బారావులకు రూ.1 లక్ష నగదు, జ్ఞాపికతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సత్కరిస్తారని ఆయన ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment