yarlagadda laksmi prasad
-
ఎన్టీఆర్‌కు గౌరవం ఇచ్చింది వైఎస్ కుటుంబమే
ఏయూ క్యాంపస్: ఎన్టీఆర్‌కు గౌరవం ఇచ్చింది వైఎస్సార్ కుటుంబమేనని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ చెప్పారు. ఆయన బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. తెలుగు గంగకు ఎన్టీఆర్ పేరును వైఎస్సార్ పెడితే, ఓ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన ఘనత ఆయన తనయుడు, సీఎం జగన్‌దేన్నారు. ఎన్టీఆర్‌కు చంద్రబాబు, టీడీపీ నాయకులు చేసిన ద్రోహాలు అన్నీ ఇన్నీ కావన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న రాకుండా, శంషాబాద్ ఎయిర్‌పోర్టు డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టకుండా చంద్రబాబే అడ్డుకున్నారన్నారు. రాష్ట్ర కొత్త రాజధానికి ఎన్టీఆర్ నగర్ లేదా తారకరామనగర్ అని పేరు పెట్టాలని తాను కోరానని, ఇది ఇష్టంలేని చంద్రబాబు రాజగురువుతో మాట్లాడి అమరావతి పేరు పెట్టారన్నారు. 1998 ఎన్నికల్లో ఎన్టీఆర్ చిత్రపటాలను పార్టీ కార్యాలయాలు, సభల్లో లేకుండా చేశారని చెప్పారు. ఎన్టీఆర్ బసవ తారకం మాతా శిశు కేంద్రం పెట్టాలని భావించిన ఇంటిని, ఎన్టీఆర్ మ్యూజియంగా మార్చాలని ఆశించిన ఇళ్లను సైతం అపార్టుమెంట్లుగా మార్చేశారని చెప్పారు. ఎన్టీఆర్ సిద్ధాంతాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు దండం పెట్టి తెలంగాణలో కాంగ్రెస్‌తో జతకట్టారని చెప్పారు. కుటుంబ రాజకీయాలకు ఎన్టీఆర్ వ్యతిరేకమని, దీనికి భిన్నంగా చంద్రబాబు లోకేష్‌ను తెరమీదకు తెచ్చారన్నారు. తెలుగు భాషకు జగన్ సేవ చేస్తున్నారు రాష్ట్రంలో తెలుగు భాషకు సీఎం జగన్ ఎనలేని సేవ చేస్తున్నారని యార్లగడ్డ చెప్పారు. రాష్ట్రంలో అధికార భాషా సంఘాన్ని పునరుద్ధరించి, తెలుగు ప్రాధికార సంస్థ, ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం నెల్లూరుకు తేవడం, ఉచితంగా ఐదెకరాలు ఇవ్వడం జగన్ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. తాను ఆయనకు విధేయుడినేనని అన్నారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి పదవులను వద్దనుకున్న జగన్ హీరోగా నిలుస్తారని చెప్పారు. పేరు తొలగించడం బాధ కలిగించింది ఆరోగ్య విశ్వవిద్యాయానికి వైఎస్ పేరు పెట్టడానికి తాను వ్యతిరేకం కాదని, ఎన్టీఆర్ పేరును తొలగించడం బాధ కలిగించిందని, అధికార భాషా సంఘం, హిందీ అకాడెమీ, తెలుగు అభివృద్ధి ప్రాధికార సంస్థలకు రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో రానున్న తెలుగు విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు పెట్టి అప్పుడు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి వైఎస్సార్ పేరు పెట్టి ఉండే బాగుండేదని అన్నారు. -
దుష్ప్రచారాలు జయకేతనాన్ని అడ్డుకోలేవు
పుత్రోత్సాహము తండ్రికి/ పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా/ పుత్రుని గనుగొని పొగడగ/ పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! అని సుమతీ శతకంలో బద్దెన చెప్పారు. తండ్రికి నిజమైన పుత్రో త్సాహం కొడుకు పుట్టినప్పుడు లభించదనీ, ఆ కుమారుడిని అందరూ పొగుడుతున్నప్పుడు కలుగుతుందనీ దీని భావం. ఇవాళ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జీవించి ఉంటే తాను కన్న కలలను సార్థకం చేస్తూ ప్రజల మన్ననలు అందుకుంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన చూసి ఎంత ఆనందించే వారో అన్న అభిప్రాయం కలుగు తోంది. ప్రొఫెసర్ అని నన్ను ఆప్యాయంగా పలకరించే వైఎస్ కళ్లలో ఎప్పుడూ ప్రజలకు సేవ చేయాలన్న ఆకాంక్షే తొణికిస లాడేది. ఆయన ప్రారంభించిన ప్రతి పథకమూ ప్రజల కోసమే. ఇవాళ ఆయన బాటలో ప్రవేశించి తనదైన బాటను ఏర్పర్చుకున్న జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చారనడంలో ఏ మాత్రం సందేహం లేదు. గత ఎన్నికల్లో 86 శాతం సీట్లు, 50 శాతం ఓట్లు సంపాదించుకున్న జగన్ రానున్న ఎన్నికల్లో అంత కంటే ఎక్కువగా ప్రజాబలాన్ని సాధిస్తారని ఆత్మ విశ్వా సంతో చెప్పవచ్చు. జగన్ విద్యాధికుడైనందువల్లే విద్య, వైద్య రంగాలకు పెద్ద పీట వేశారు. ప్రజలకు విద్య, వైద్యం చేరువ అయితే... వారు తమంతట తాము అభివృద్ధి చెందుతారని ఆయన అభిప్రాయం. ‘అమ్మ ఒడి’, ‘జగనన్న విద్యాదీవెన’, ‘వసతి దీవెన’, ‘గోరుముద్ద’, ‘విద్యాకానుక’, ‘నాడు–నేడు’ వంటి రకరకాల పేర్లతో విద్యాభివృద్ధికి పథకాలు చేపట్టారు. బడుగు–బలహీన వర్గాల ప్రజల కోరిక మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు. ఇక వైద్యం విషయానికి వస్తే... వైఎస్ హయాంలో మొదలైన ‘ఆరోగ్యశ్రీ’ని జగన్ ప్రభుత్వం మరింత వినూ త్నంగా, సమర్థవంతంగా అమలు చేస్తున్నది. 5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న వారందరికీ ఆరోగ్యశ్రీని వర్తింప చేయడమే కాదు, కరోనాతో సహా 2,446 ప్రొసీజర్స్‌ను ఆ పథకం కింద చేర్చారు. అలాగే ఇవాళ ఏపీలో రైతులకు ప్రభుత్వం ఇస్తున్నంత అండదండలు మరే ప్రభుత్వం ఇవ్వడం లేదు. పెట్టుబడి సాయం, భరోసా కేంద్రాలు, పొలాల్లోనే పంటల కొను గోలు, పంటల బీమా, సరళమైన రిజిస్ట్రేషన్లు, ఉపకరణాల సబ్సిడీ వంటివి జగన్ మనసులో రైతుకున్న అభిమానానికి సంకేతం. రైతులే కాదు, మత్స్యకారులు, నాయీ బ్రాహ్మణులు, రజకులు, చేనేత కార్మికులు; ఆటో, టాక్సీడ్రైవర్లు; డ్వాక్రా మహిళలు... ఇలా వివిధ రంగాలకు చెందిన వారికి ఏదో రకంగా నగదు రూపంలో లబ్ధి లభించేలా జగన్ చర్యలు తీసుకోవడం అపూర్వం. ఎక్కడా దళారులు తమ బొక్క సాలు నింపుకోకుండా కేవలం మీట నొక్కడం ద్వారా నిధులు లబ్ధిదారుల ఖాతాలకు చేరడం జగన్ ప్రభుత్వ ప్రత్యేకత. ఇవాళ ఇళ్లు లేని పేదలు ఉండకూడదనేదే వైఎస్ జగన్ ప్రభుత్వం లక్ష్యం. అందుకే రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇళ్ల స్థలాల పంపిణీ జరిగింది. పేదలకోసం 17 వేల కాలనీలు నిర్మించారు. అధికార వికేంద్రీకరణ ద్వారే ప్రజల సమస్యలను పరిష్కరించవచ్చని భావించినందువల్లే జగన్ 13 జిల్లాలను 26 జిల్లాలకు పెంచారు. వినూత్నమైన గ్రామసచివాలయాల ద్వారా ప్రజల వద్దకు పాలన చేరుకుంది. అందుకే ప్రజా సంక్షేమ పాలనలో దేశంలో జగన్ సర్కార్ ప్రథమ స్థానంలో ఉన్నదని స్కాచ్ గ్రూప్ పరిపాలనా రిపోర్ట్ కార్డు వెల్ల డించింది. పోలీసు వ్యవస్థ, భద్రత, వ్యవసాయం, ఇ– గవర్నెన్స్, జిల్లా పరిపాలన నిర్వహణ, గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టుల అమలులో కూడా ఏపీ ప్రథమ స్థానంలో నిలి చింది. వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కల్పన విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ అద్భుత కృషి చేసిందని నాబార్డ్ వార్షిక నివేదిక విశ్లేషించింది. ఈ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ వార్షికంగా 2 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. దారుణమేమంటే వైఎస్ జగన్ అధికారంలోకి రావ డాన్నీ, ఆయన సమర్థవంతంగా పాలించడాన్నీ, ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయడాన్నీ, ప్రజల ఖాతాల్లోకి ఇప్పటివరకూ లక్షన్నర కోట్లకు పైగా డబ్బు బదిలీ కావడాన్నీ ఆయన ప్రత్యర్థులు జీర్ణించు కోలేకపోతున్నారు. వారంతా కుమ్మక్కై, మీడియాలో అధిక భాగాన్ని ఆక్రమించి జగన్ సర్కార్‌పై తప్పుడు కథనాలను ప్రతిరోజూ ప్రచారం అయ్యేలా చూస్తున్నారు. అనేక ఇతర రాష్ట్రాలకంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్నా ఆ విషయాన్ని ప్రస్తావించకుండా దారుణంగా ఉన్నదంటూ దుష్ప్రచా రానికి దిగుతున్నారు. రెండు పత్రికలు, మూడు టీవీ చానల్స్‌తో జనం మనసును జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చడం సాధ్యం కాదు. అదే సాధ్యమైతే గత ఎన్నికల్లోనూ, తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లోనూ జగన్‌ను జనం ఆదరించేవారు కారు. ఇవాళ జగన్ సర్కార్ విశ్వసనీయత తెలిసినందువల్లే ఈ అభూత కల్పనను జాతీయ స్థాయిలో కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. అధః జగత్సహోదరులకు– ఇంత వరకూ సామాజికంగా, ఆర్థికంగా, అన్నివిధాల వెలుగుకు నోచుకోని వర్గాలకు జగన్ పాలన జగన్మోహనంగా వుంది. జగన్ అంటే విశ్వసనీయత, జగన్ అంటే చెప్పింది చేయడం, జగన్ అంటే జయకేతనం! ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ వ్యాసకర్త అధికార భాషా సంఘం అధ్యక్షులు, ఏపీ (వైకాపా ప్లీనరీ సందర్భంగా) -
‘తెలుగు భాష గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు’
సాక్షి, అమరావతి: తెలుగు భాష గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదని ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మండిపడ్డారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు అకాడమీకి తెలుగు సంస్కృత అకాడమీగా పేరు మారిస్తే వచ్చే నష్టమేంటని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు తన హయాంలో తెలుగు అకాడమీ పేరు కూడా ఉచ్చరించలేదని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం వైఎస్ జగన్ అధికార భాషా సంఘానికి గుర్తింపు ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. -
సీఎం జగన్‌ను కలిసిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ క్యాంప్ కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వార్షిక నివేదికను సీఎంకు సమర్పించారు. కోవిడ్–19 నివారణ చర్యల కోసం అధికార భాషా సంఘం తరపున రూ.5 లక్షలు విరాళాన్ని ఛైర్మన్, సభ్యులు మోదుగుల పాపిరెడ్డి, షేక్ మస్తాన్లు సీఎంకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో ఐదేళ్లపాటు అధికార భాషా సంఘమే లేదన్నారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక అధికార భాషా సంఘం ఛైర్మన్‌ను నియమించారన్నారు. అధికారిక కార్యకలాపాల్లో తెలుగుభాష అమలుపై పర్యవేక్షణ చేయమని సీఎం జగన్ ఆదేశించారన్నారు. చదవండి: సీఎం జగన్‌ను కలిసిన ‘డీఎస్సీ-2008’ అభ్యర్థులు -
పర్యాటక హబ్‌గా ఏపీ: మంత్రి అవంతి
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రాన్ని పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించామని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విదేశీ పర్యాటకులను కూడా ఆకర్షించే విధంగా పర్యాటక ప్రాంతాల్లో స్టార్ హోటల్ సదుపాయాలు కల్పిస్తామని వెల్లడించారు. గ్రామీణ సంస్కృతి, కళలు ఉట్టి పడుతూ పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందన్నారు. శుభ పరిణామం: యార్లగడ్డ అధికార భాషా సంఘం చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ దివంగత మహానేత వైఎస్సార్ హయాంలో విశాఖ సినీ ప్రపంచ అభివృద్ధికి బీజం పడిందన్నారు. సీఎం వైఎస్ జగన్ సినీ రంగాన్ని విశాఖ నగరానికి ఆహ్వానించడం శుభ పరిణామం అని లక్ష్మీ ప్రసాద్ అన్నారు. -
‘ఇంగ్లీష్ మీడియాన్ని బూచిగా చూపడం సరికాదు’
సాక్షి, విశాఖపట్నం: ఇంగ్లీష్ మీడియంపై కోర్టు కేసును కొట్టేసినంత మాత్రాన ప్రతిపక్షాలు జబ్బలు చరుచుకోవల్సిన అవసరం లేదని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా సంకల్పయాత్రలో బడుగు, బలహీన వర్గాలు తమ పిల్లలకు ఆంగ్ల మాధ్యమంలో బోధన జరిగితే బతుకులు బాగుంటాయని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరారని గుర్తు చేశారు. నేను విన్నాను, నేను ఉన్నాను, నేను చేస్తాను.. అన్న మాటకు సీఎం జగన్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి అసెంబ్లీలో ప్రవేశపెట్టారని ఆయన తెలిపారు. ఇంగ్లీష్ మీడియంపై రెండు జీవోలు జారీ చేశామని చెప్పారు. ఒకటి నుంచి 10వ తరగతి వరకు తెలుగు సబ్జెక్టును తప్పని సరి చేస్తూ ఒక జీవో, ఇంగ్లీష్ మీడియాన్ని అన్ని పాఠశాలల్లో ప్రవేశపెట్టాలన్నది మరో జీవో అని ఆయన పేర్కొన్నారు. ప్రతి పక్షాలు ఆంగ్ల మధ్యమాన్ని బూచిగా చూపించి జబ్బలు చరుచుకుంటున్నారని ఇది సరైంది కాదని లక్ష్మీ ప్రసాద్ మండిపడ్డారు. ఇంగ్లీష్ మీడియంపై సీఎం చిత్తశుద్ధితో ఉన్నారని వ్యాఖ్యానించారు. న్యాయ పోరాటం ద్వారా ఇంగ్లీష్ మీడియాన్ని కొనసాగించడానికి ప్రభుత్వం తగిన ప్రణాళిక సిద్ధం చేస్తోందని లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. -
‘క్రాప్ హాలిడే’ పుస్తకాన్ని ఆవిష్కరించిన ఏపీ గవర్నర్
సాక్షి, విజయవాడ : వ్యవసాయం సరిగా లేకపోతే మనిషి మనుగడ సరైన దారిలో ఉండదని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. డాక్టర్ యలమంచిలి శివాజీ రచించిన ‘క్రాప్ హాలిడే’ పుస్తకాన్ని గవర్నర్ బిశ్వభూషణ్ సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అధికార భాష సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, పొగాకు బోర్డు చైర్మన్ యడ్లపాటి రఘునాథ్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశమని, రైతు దేశానికే వెన్నుముక అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు రైతు భరోసా పథకం ప్రవేశ పెట్టిందని, రైతు భరోసా, పీఎం కిసాన్ పథకాలు ప్రవేశపెట్టడం సంతోషకరమన్నారు. క్రాప్ హాలిడే పుస్తకం భగవద్గీత వంటిది క్రాప్ హాలిడే అనేది రైతుల్లో ఒక మేలు కొలుపులా పని చేసిందని అధికార భాష సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. శివాజీ లాంటి మనిషి మనకు దొరకడం అదృష్టమన్నారు. రైతు సమస్యలపై పార్లమెంటులో అనేక పోరాటాలు చేశారని, రైతు సమస్యలపై అన్ని పార్టీల వారిని ఏకం చేసేవారని ప్రస్తవించారు. వ్యాపారవేత్తల చేతిలో పొగాకు రైతులు ఎలా మోసపోయారనే విషయాన్ని పుస్తకంలో స్పష్టం చేశారన్నారు. పొగాకు రైతులు తమ సమస్యలు నుంచి ఎలా బయట పడలనే విషయాన్ని కూడా వివరించారని, రైతు సమస్యలపై ప్రభుత్వాలకు అనేక సలహాలు ఇచ్చారని పేర్కొన్నారు. రైతులకు సంబంధించినంత వరకు క్రాప్ హాలిడే పుస్తకం అనేది భగవద్గీత వంటిదన్నారు. రైతులను ప్రభుత్వాలు ఆదుకోవాలి: యలమంచిలి పది కోట్ల మందికి పైగా రైతులు వ్యవసాయ చేస్తుంటే అందులో పొగాకు పండించేవారు లక్షల్లోనే ఉన్నారని యలమంచిలి శివాజీ తెలిపారు. పొగాకు కోసం పార్లమెంటులో పోరాటం చేస్తే అన్ని ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలిపేవని, గతంలో ఎన్నడూ పొగాకు రైతు క్రాప్ హాలిడే చేసిన సందర్భాలు లేవని గుర్తు చేశారు. పొగాకు రైతులు సరైన ధర లేక ఇబ్బంది పడుతున్నాదని, పారిశ్రామిక వేత్తలకు ఇబ్బందులు తలెత్తితే దేశంలో అందరూ స్పందిస్తున్నారని, అదే రైతులకు నష్టం వస్తే మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులను ప్రభుత్వాలు మరింతగా ఆదుకోవాలని సూచించారు. -
ఏపీ గవర్నర్‌ను కలిసిన యార్లగడ్డ
సాక్షి, విజయవాడ : గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌తో ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమీ, అధికార భాషా సంఘం అధ్యక్షులు అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. శుక్రవారం రాజ్ భవన్లో గవర్నర్‌తో సమావేశమైన యార్లగడ్డ తాను రచించి, అనువదించిన సాహితీ సంపుటాలను గవర్నర్‌కు బహుకరించారు. తెలుగు సాహిత్య ప్రక్రియలను హిందీ భాషలోకి అనువదించటం ద్వారా, ఉత్తర భారత దేశానికి దక్షిణాదికి మధ్య సాహిత్య వారధిగా పనిచేస్తున్న క్రమాన్ని యార్లగడ్డ గవర్నర్‌కు వివరించారు. నాటి నన్నయ మొదలు నేటి నారాయణ రెడ్డి (సినారే) వరకు పలువురు ప్రముఖ కవులు రచించిన కావ్యాలతో రూపొందించిన తాళపత్ర గ్రంధ పేటికను యార్లగడ్డ గవర్నర్ కు అందించారు. గవర్నర్ దానిని ఆసక్తిగా పరిశీలించి అలనాటి నుండి నేటి తరం వరకు సాహిత్య సంపదను కాపాడుతూ వస్తున్న కవుల గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఒరిస్సా రాష్ట్రంలోని పలువురు సాహితీ వేత్తలను వీరు గుర్తు చేసుకున్నారు. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో తనకున్న సాన్నిహిత్యాన్ని తెలిపిన లక్ష్మి ప్రసాద్ జై ఆంధ్రా ఉద్యమంలో వెంకయ్య నాయుడితో కలిసి జైలు జీవితం గడిపానని వివరించారు. అనంతరం బిశ్వ భూషన్ సైతం గత స్మృతులను మననం చేసుకుంటూ, జైలు జీవితం ఎన్నో పాఠాలను నేర్పుతుందని అన్నారు. అయా ప్రాంతాల భాషా సంస్కృతులను పరిరక్షించుకోవాలని అదే క్రమంలో జాతీయతను మరువకూడదని గవర్నర్ పేర్కొన్నారు. సమావేశంలో గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి అర్జున రావు తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా మాజీ ఐఎఎస్ అధికారి డాక్టర్ డి. శ్రీనివాసులు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌ను రాజ్ భవన్లో శుక్రవారం కలిశారు. మర్యాద పూర్వకంగా జరిగిన ఈ భేటీలో శ్రీనివాసులు తాను రచించిన 'ఇప్పచెట్టు నీడలో' పుస్తకం యొక్క ఆంగ్ల భాషా కాపీని గవర్నర్‌కు సమర్పించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో..ప్రత్యేకించి గిరిజన ప్రాంతాలలో ఐఎఎస్ అధికారిగా సేవలు అందించిప్పుడు ఎదురైన అనుభవాలు, జ్ఞాపకాలను గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు. 'ఇప్పచెట్టు నీడలో' పుస్తకాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం పాఠ్యపుస్తకంగా ఎంపిక చేసినట్లు శ్రీనివాసులు గవర్నర్‌కు వివరించారు. -
28న సాహిత్యకారులకు పురస్కారాలు
సాక్షి, విజయవాడ: సాహిత్యకారులకు ‘గుర్రం జాషువా జయంతి’ పురస్కరించుకొని గతంలో ప్రభుత్వం రూ.50 వేలు నగదు అందించేదని.. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.1 లక్ష చేశారని ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ, అమరావతి ఆధ్యర్యంలో అధికార భాష సంఘం, భాషా సాంస్కృతిక శాఖలు బుధవారం సమావేశం అయ్యాయి. ఈ సమావేశంలో పాల్గొన్న లక్ష్మీ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. గుర్రం జాషువా 124వ జయంతిని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 28న సాహిత్యకారులకు పురస్కారాలను ప్రదానం చేయనుందని తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరగనున్న ఈ కార్యక్రమంలో ప్రముఖ సాహిత్యకారులు డా. కత్తి పద్మారావు, బోయ్ ఐమావతమ్మ, డా. గుజర్లముడి కృపాచారి, ఆచార్య చందు సుబ్బారావులకు రూ.1 లక్ష నగదు, జ్ఞాపికతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సత్కరిస్తారని ఆయన ప్రకటించారు. -
రెండూ తప్పే : యార్లగడ్డ
సాక్షి, అమరావతి : ఒకే దేశం - ఒకే భాషా విధానం అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలు సరికాదని ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. అలా కాకుండా త్రిభాషా సూత్రాన్ని పాటించాలని కోరారు. రాష్ట్రాలపై హిందీని బలవంతంగా రుద్దడం ఎంత తప్పో, అలానే హిందీని నేర్చుకోమనడం కూడా అంతే తప్పన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా దక్షిణాది భాషలను నేర్పించాలని సూచించారు. అసెంబ్లీ, సచివాలయంలో తెలుగు భాష అమలుకు చర్యలు తీసుకోవాలని రేపటి నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను కలిసి కోరతానని యార్లగడ్డ వెల్లడించారు. తెలుగు యూనివర్సిటీకి అనుబంధ సంస్థలైన రాజమండ్రి, శ్రీశైలం, కూచిపూడిలలో ఒక్కో కోర్సు మాత్రమే ఉందని, హైదరాబాద్, వరంగల్‌లలో 16 కోర్సులు అమల్లో ఉన్నాయని పేర్కొన్నారు. మరోవైపు భాషా యూనివర్సిటీలకు 10వ షెడ్యూల్ అవరోధంగా మారిందని, విభజన చట్టంలోని 9, 10వ షెడ్యూల్లోని సంస్థల పంపకాలు నెలరోజుల్లోగా పరిష్కారమవుతాయని ఇద్దరు సీఎంలు చెప్పడం హర్షణీయమన్నారు. -
‘వ్యక్తిత్వంతో వైఎస్సార్ విశిష్టత చాటారు’
అమీర్‌పేట: సంస్కారవంతమైన వ్యక్తిత్వంతో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఓ విశిష్టతను చాటారనీ, మని షిలో నిజాయతీ ఉంటే ఎవరికీ భయపడాల్సిన అవసరం ఉండదని ఆయన భావించేవారని ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. అమీర్‌పేట ఆదిత్యపార్క్ హోటల్లో ఆదివారం జరిగిన ‘వైఎస్సార్ ఛాయలో జి.వల్లీశ్వర్’ పుస్తక ఆవిష్కరణ సభకు యార్లగడ్డ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంస్కారవంతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి వైఎస్ఆర్ అని కొనియాడారు. సమర్థవంతమైన నాయకుడు వైఎస్ఆర్ వద్ద పీఆర్ఓగా పనిచేసిన వల్లీశ్వర్.. ఏదైనా ఘటన జరిగినప్పుడు ప్రత్యర్థులు ఏమి ఆలోచిస్తున్నారన్నది ముందుగానే పసిగట్టి వారి కంటే వేగంగా ప్రభుత్వం స్పందించేలా చూసేవారని తెలిపారు. -
‘వైయస్సార్ ఛాయలో’ పుస్తకావిష్కరణ
-
‘వైయస్సార్ ఛాయలో’ పుస్తకావిష్కరణ
సాక్షి, హైదరాబాద్ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సంబంధించి ప్రముఖ జర్నలిస్ట్ జి.వల్లీశ్వర్ రచించిన ‘వైయస్సార్ ఛాయలో’ అనే పుస్తక ఆవిష్కరణ వేడుక అమీర్‌పేటలోని ఆదిత్యపార్క్‌లో జరిగింది. ఈ పుస్తకాన్ని పద్మభూషణ్ గ్రహీత డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రారావు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సీనియర్ పాత్రికేయులు కే.రామచంద్రమూర్తి పాల్గొన్నారు. -
తెలుగును చంపేస్తున్నారు: మాజీ ఎంపీ
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ)పై మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తీవ్రంగా మండిపడ్డారు. ఏపీపీఎస్సీ తెలుగు భాషను నిర్లక్ష్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీపీఎస్సీ వింతగా వ్యవహరిస్తోందని, ప్రశ్నా పత్రాల్లో జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన ప్రశ్నలు కూడా ఇంగ్లీషులోనే ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. సబ్జెక్టు ప్రశ్నా పత్రాలు ఇంగ్లీషులోనే ఉన్నా.. జనరల్ నాలెడ్జికి సంబంధించి మాత్రం తెలుగులోనే ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలుగులో ప్రశ్నాపత్రం ఉండదు..ఇంగ్లీషులోనే ఉంటుంది అనే విషయాన్ని నోటిఫికేషన్లో ఎక్కడా ఇవ్వలేదని చెప్పారు. హాల్ టిక్కెట్లు వచ్చాక ప్రశ్నాపత్రాలన్నీ ఇంగ్లీషులోనే ఉంటాయని చెబుతున్నారు.. దీని వల్ల తెలుగు మీడియం అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. తెలుగు మీడియం విద్యార్థుల పీక కోయడానికే ఉన్నత న్యాయస్థానానికి వెళ్తున్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును యథాతధంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తన ఐదేళ్ల పరిపాలనలో తెలుగుకు చేసిన సేవ శూన్యమన్నారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు తప్పనిసరిగా తెలుగును ఒక పాఠ్యాంశంగా చేస్తానన్న చంద్రబాబు ఆ హామీని అమలు చేయలేకపోయారని విమర్శించారు. చివరికి అమరావతి హైకోర్టు శిలాఫలకాలను కూడా ఇంగ్లీషులోనే వేశారని, తెలుగు భాషను పూర్తిగా చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీలలో కూడా ఇంగ్లీష్‌లో పెట్టడం అన్యాయమన్నారు. -
రాజమండ్రి ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు
సాక్షి, రాజమండ్రి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరుపై ఆచార్య యార్గగడ్డ లక్ష్మీప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబునాయుడు తెలుగు భాషా ద్రోహి అని మండిపడ్డారు. తెలుగు భాషను ఉద్ధరిస్తానని ఇచ్చిన వాగ్దానాల్లో ఏ ఒక్కటి కూడా ఆయన అమలు చేయలేదని విమర్శించారు. గోదావరి పుష్కరాల ఆఖరు రోజున రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటుచేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఆ హామీని నెరవేర్చకుండా రాజమండ్రి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. రాజమండ్రి ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ద్రోహి చంద్రబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు సాంస్కృతిక పీఠానికి సంబంధించిన భూములను అన్యాక్రాంతం చేసే ప్రయత్నం చేస్తున్నారని, దీనిని అడ్డుకోవడానికి అవసరమైతే రాజమండ్రిలో ఆమరణ దీక్ష చేపడతానని ఆయన అన్నారు. -
దుఃఖిస్తున్న తెలుగు తల్లి
ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్, మారిషస్, న్యూజిలాండ్, కెనడా, మలేషియా ఇలా ఎక్కడకు వెళ్లినా అక్కడ తెలుగు వారు తమ భాషా సంస్కతులను కాపాడుకునేందుకు చేస్తున్న కషి చూసి నాకు ఆశ్చర్యం కలుగుతోంది. అనేక దేశాల్లో తెలుగు వారు తమ పిల్లలకు తెలుగు నేర్పేం దుకు తహతహలాడుతున్నారు. ఆ దేశాల్లో తెలుగు సదస్సులకు హాజరైనప్పుడు అక్కడి పిల్లలు చక్కటి తెలుగులో మాటా ్లడుతుండటం విని నేను దిగ్భ్రమ చెందుతుంటాను. ఇవాళ ఇక్కడ మెల్బోర్న్లో వంగూరి చిట్టెం రాజు ఆధ్వర్యంలో వంగూరి ఫౌండేషన్, లోకనాయక్ ఫౌండే షన్, ఆస్ట్రేలియా తెలుగు సంఘం కలిసికట్టుగా ఏర్పాటు చేసిన ఆరవ ప్రపంచ సాహితీ సదస్సులో ఆస్ట్రేలియా లోని వివిధ ప్రాంతాలకు చెందిన పెద్దలూ, పిల్లలూ పాల్గొని దాన్ని విజయవంతం చేయడం చిన్న విషయం కాదు. కానీ నేనూ నా రాష్ట్రం నుంచి మీకు ఏ సందేశం ఇవ్వగలను? ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు భాషా సంస్కృతులు అద్భుతంగా పరిఢవిల్లుతున్నాయని చెపితే అది నన్ను నేను మోసగించు కున్నట్లవుతుంది. ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయి పరిపాలన సాగిస్తున్నాయి. తెలంగాణలో తెలుగు వెలిగి పోతున్నది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు తల్లి ముఖం వెలవెలబోతోంది. ఇక్కడ ఒక ఖండంలో, పరాయిగడ్డపై, మన స్వంత ప్రాంతాలను విడిచివచ్చిన మీరు ఒక్కటై తెలుగు భాషను సంస్కృతినీ అద్భుతంగా కాపాడుతూ, ప్రపంచ తెలుగు సాహితీ సదస్సును నిర్వహిస్తున్నందుకు నేను పులకించి పోతున్నాను. కాని అదే సమయంలో మాతృ భూమిలో తెలుగు భాష పరిస్థితిని తలుచుకుని నాకు దుఃఖం కలుగుతోంది. ఒకప్పుడు హైదరాబాద్ సంస్థానంలో అత్యధిక సంఖ్యలో ప్రజలు మాట్లాడేభాష అయినప్పటికీ ప్రాంతీయభాషగా తెలుగు నిరాదరణకు గురైంది. అన్నింటా అధికార భాషగా ఉర్దూ పీఠం వేసుకుంది. అమ్మ భాషకోసం తెలంగాణలో నాటితరం భారీ ఉద్యమాలు,పోరాటాలు చేయాల్సి వచ్చింది. తెలుగు ప్రజలకు కనీసం సభలూ సమావేశాలు జరుపుకునే స్వేచ్ఛ కూడా ఉండేది కాదు. కొమర్రాజు లక్ష్మణరావు, మాడపాటి హనుమంతరావు, ఆళ్వారుస్వామి, సురవరం ప్రతాపరెడ్డి లాంటి వారు తెలంగాణలో తెలుగు వైభవానికి కృషి చేశారు. ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ తెలుగుకు అత్యున్నత స్థాయి కల్పించారు. జలగం వెంగళరావు ప్రధమ ప్రపంచ మహాసభలు నిర్వహించి ప్రపంచవ్యాప్తంగా అనేక తెలుగు సంఘాలు పురుడు పోసుకోవడానికి దోహదం చేశారు. కాని ఇవాళ రాష్ట్రం విడిపోయిన తర్వాత నందమూరి వారసులమనీ, అమరావతిని రాజధానిగా నెలకొల్పామనీ చెప్పకుంటున్న వారి రాష్ట్రంలో జరుగుతున్నదేమిటి? ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుకు ఆదరణ తగ్గిపోతోంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక స్థాయి నుంచి ఇంటర్మీడియట్ వరకూ తెలుగును తప్పనిసరి పాఠ్యాంశంగా మార్చారు. తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు జీఓ నంబర్ 21ను విడుదల చేసింది. ఈ మేరకు చట్టాన్ని ప్రవేశపెట్టింది. తెలుగులో తప్పనిసరిగా బోధన జరగాలని ఆదేశాలు జారీ చేశామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించి దేశ విదేశాలనుంచి తెలుగు సాహితీవేత్తలను పిలిచి సత్కరించిన ఘనత కూడా కేసీఆర్‌కే దక్కుతుంది. తెలుగుపై మమకారం లేని బాబు పాలన కాని ఎన్టీఆర్ వారసులు నడుపుతున్న ప్రభుత్వంలో తెలుగు భాష అమలు మాటేమిటి? తెలుగు అనే పదాన్ని తన సంస్థకు తగిలించుకున్న ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుని నాలుగున్నరేళ్లు దాటినప్పటికీ ఆ భాషా పరి రక్షణకు ఎన్నికల ముందు, ఆ తర్వాత ప్రకటించిన వాగ్దా నాలను నెరవేర్చిన పరిస్థితులు కనపడటం లేదు. పదో తరగతి వరకు తెలుగు భాషను తప్పనిసరి చేస్తామన్నారు. ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామన్నారు. ప్రభుత్వ పాలనా భాషగా తెలు గును అమలుచేస్తామని, నవ్యాంధ్రలో తెలుగు విశ్వ విద్యా లయం ఏర్పాటు చేస్తామని సీఏం స్వయంగా పలుసార్లు ప్రకటించారు. రాష్ట్రంలో ప్రత్యేక తెలుగు కేంద్రం ఏర్పాటు చేస్తామని, తెలుగు పండితుల శిక్షణా కళాశాలలు ఏర్పాటు చేస్తామని, తెలుగు ప్రాచీన తాళపత్ర గ్రంథాల డిజిటలీకరణ చేస్తామని ఏవేవో ప్రకటనలు గుప్పించారు. ఏ ఒక్కదాన్నీ ఆమలు చేయలేదు. పాఠశాల స్థాయి నుంచి ఇంగ్లీష్ మీ డియంను ప్రవేశపెడుతున్న ప్రభుత్వానికి ఆంగ్లభాషపై ఉన్న మమకారంలో నూరో వంతు కూడా తెలుగు భాషపై లేదని చెప్పడానికి ఏమాత్రం వెనుకాడాల్సిన అవసరం కనపడదు. తెలుగు భాష అంటే తమకు పట్టింపు లేదని, తమకు ఆంగ్ల భాషా వ్యామోహమే ఉన్నదని, తాము, తమ పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదివారు కనుక ప్రజలను తెలుగులో చదవమని చెప్పే అధికారం తమకు లేదని, తెలుగు నేర్చు కుంటే బతుకుతెరువు లభించదని ఆనాడే ప్రకటించి ఉంటే ఇవాళ వారిని నిలదీసి ఎవరూ అడిగేవారు కాదు. కానీ తెలుగు భాషను కాపాడతామని, తెలుగులోనే ప్రధానంగా వ్యవహారాలు సాగిస్తామని 2014లోనే తెలుగుదేశం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన మాట నిజం కాదా? అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన వాగ్దానాల మాటేమిటి? ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యాసంస్థల్లో తెలుగు భాషను తప్పని సరి చేస్తాం, ఆ మేరకు జీవోలు జారీ చేస్తామని నాలుగేళ్ల పాటు వాగ్దానాలు గుప్పించలేదా? పైగా, మునిసిపల్ పాఠశాలల్లో తెలుగు మీడియంలో బోధనను రద్దు చేస్తూ రెండేళ్ల క్రితం జీవో జారీ చేశారు. ఇవాళ మాతృభాష మా జన్మహక్కు అంటూ విద్యార్థులు, ఉపాధ్యాయులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇతర రాష్ట్రాల్లో మాతృభాషను ప్రధాన భాషగా విద్యాబోధన చేస్తుంటే మన రాష్ట్రంలో మాతృభాష మీడియంను రద్దు చేయడంపై ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అంగన్వాడీలలోను తెలుగు లేకుండా చేశారు. తెలుగు భాషను కూకటివేళ్లతో పెకలించేందుకు ఇవాళ ప్రభుత్వంలో మంత్రులు కూడా కంకణం కట్టుకున్నట్లు కనపడుతున్నారు. ఒక కార్పొరేట్, వ్యాపార సంస్కృతి ఇవాళ ఏపీలో తెలుగు భాషను పూర్తిగా కబళించేందుకు ప్రయత్నం చేస్తున్నది. ప్రతి ఏడాది ఆగస్టు 29 వచ్చేసరికి గంభీరమైన వాగ్దా నాలకు కొదువ ఉండదు. పాఠశాలలనుంచి ఇంటర్మీడియట్ వరకు మాతృభాషలో విద్యాబోధన తప్పని సరిచేస్తామన్న వాగ్దానాన్ని తుంగలో తొక్కారు. పాఠశాలల్లో తెలుగు ప్రవే శించడం మాట దేవుడెరుగు, పసిపిల్లలను కూడా అమ్మా అనే బదులు మమ్మీ అనడమే సరైనదని చెప్పారు. తెలుగుకు పీఠాలు కడతామని మరో వాగ్దానం చేశారు. తీరా చూస్తే ఆ పీఠం సమాధి అన్న విషయం అర్థమవుతోంది. ప్రత్యేక కేంద్రం కోసం కేటాయిస్తామన్న పదివేల చదరపు అడుగుల భూమి అంటే తెలుగును పూడ్చి పెట్టడానికి ఏడడుగుల స్థలం కోసం అన్వేషణగా భావించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్ప టికైనా ఏపీ ప్రభుత్వం రాష్ట్రమంతటా తెలుగు అమలుకు కంకణం కట్టుకోవాలి. ఇవాళ తెలుగుభాష ఉనికిని కాపాడేం దుకు ప్రభుత్వాలు విదేశాల్లో తెలుగు సంస్థలనుంచి నేర్చుకో వాల్సిన అవసరం కనపడుతోంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు తల్లి తనను కబళిస్తున్న భాషా హంతకులనుంచి రక్షించమని విలపిస్తోంది. అమ్మ జోలపాట అంతర్ధానమవుతోంది. చెదలు పట్టిన పెద్ద బాలశిక్ష పుటలు చేతులు చాచి రెపరెప కొట్టుకుంటూ ఆర్తనాదం చేస్తున్నది. నినాదాల ఘోషలోభాష మరణిస్తోంది. వాగ్దానాల హోరులో అక్షరాల ఆర్తనాదం కలిసిపోయింది. కూలిన పాఠశాల భవనాల మధ్య మహాకవులూ, కవిసామ్రాట్టులూ కవిత్ర యాలూ, కవికోకిలలూ ఆత్మలై సంభాషిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కాక తెలంగాణలోనో, అమెరికా లోనూ, ఆస్ట్రేలియాలోనో, మారిషస్‌లోనో పుడితే మళ్లీ జీవిస్తామేమోనని చర్చించుకుంటున్నాయి. (నవంబర్ 3,4 తేదీల్లో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగిన ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో ఆచార్య యార్లగడ్డ లక్ష్షీ్మప్రసాద్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు) వ్యాసకర్త రాజ్యసభ మాజీఎంపీ, ఏపీ హిందీ అకాడెమీ చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ -
విదేశాల్లో భారత నేతలను గెలిపించాలి: యార్లగడ్డ
సాక్షి, న్యూఢిల్లీ: అమెరికా రాజకీయాల్లో చురుగ్గా ఉన్న భారతీయులకు చేయూతనిచ్చి వారిని సెనెటర్లుగా, కాంగ్రెస్‌మెన్లుగా గెలిపించినప్పుడే భారతీయుల గర్జన ప్రపంచమంతా వినిపిస్తుందని కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. అమెరికాలో జరిగిన తెలుగు మహాసభల ముగింపు కార్యక్రమంలో అమెరికా తెలుగు సంఘం (ఆటా), తెలంగాణ తెలుగు సంఘం (టాటా) సంయుక్తంగా యార్లగడ్డకు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశాయి. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ.. రాజా కృష్ణమూర్తి, అరుణా మిల్లర్, చివుకుల ఉపేంద్ర వంటి ఇండో–అమెరికన్ రాజకీయవేత్తలకు అమెరికాలోని తెలుగు ప్రజలు చేయూతనివ్వాలని కోరారు. ఎన్టీఆర్ తెలుగు భాష కోసం ప్రాణమిచ్చారని, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తెలుగుకు ప్రాచీన హోదా కోసం కృషి చేశారని గుర్తు చేశారు. సంస్కృతిని కాపాడుకునేందుకు కావాల్సింది సఖ్యత అని ఆటా–టాటా సంస్థలు చాటి చెప్పాయన్నారు. కార్యక్రమంలో ఆటా అధ్యక్షుడు ఆసిరెడ్డి కరుణాకర్, టాటా అధ్యక్షుడు హరనాథ్ పొలిచెర్ల తదితరులు పాల్గొన్నారు. -
లోకేశ్‌కు యార్లగడ్డ చురకలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: పొరుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచ దేశాలన్నీ వేనోళ్ల కీర్తించే తెలుగుభాష ఆంధ్రప్రదేశ్‌లో ధౌర్భాగ్యపరిస్థితిని ఎదుర్కొంటోందని బహుభాషా కోవిదుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలను నమ్ముకోకుండా తెలుగువారే తమ భాషా, సంస్కృతులను కాపాడుకునేందుకు నడుంబిగించాలని పిలుపునిచ్చారు. ప్రపంచ తెలుగు సమాఖ్య (డబ్ల్యూటీఎఫ్) 11వ ద్వైవార్షిక అంతర్జాతీయ మహాసభలు, రజతోత్సవ వేడుకలు అధ్యక్షురాలు వీఎల్ ఇందిరాదత్ అధ్యక్షతన చెన్నైలో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తమిళనాడు క్రీడలశాఖ మంత్రి, తెలుగువారైన పి.బాలకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి పాల్గొన్నారు. ‘తెలుగుభాష, సంస్కృతి’ అంశంపై యార్లగడ్డ ఉద్వేగపూరితమైన ప్రసంగం చేస్తూ.. ‘‘ఇటీవల ఏపీ ఐటీ శాఖ మంత్రి సిలికాన్‌కు వెళ్లి అక్కడున్న ఆంధ్రులను తెలుగు భాషను కాపాడండి, మా కూచిపుడి నృత్యాన్ని ఇక్కడ బ్రహ్మాండంగా చేయిస్తాం.. మీరు సహాయం చేయండని కోరారు. ఇది ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు భాషకు పట్టిన దుస్థితి. ఏపీలో తెలుగుభాషను చంపే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీలోని అంగన్వాడీ పాఠశాలలనూ ఆంగ్లమాధ్యమంగా మార్చే దుర్భర పరిస్థితిలో మేమున్నాం. ప్రభుత్వాలను, ముఖ్యమంత్రులను నిందించి ప్రయోజనం లేదు. మళ్లీ ఎన్నికల్లో గెలవాలి, కొడుకుని, మనవడిని, మునిమనవడిని సీఎంగా చేసుకోవాలి. ఆ స్థానంలో నేనున్నా అదే పని చేస్తాను. భాషా ప్రయోజనాలు కాపాడుతున్న ప్రభుత్వాల జీవోలను పట్టుకెళ్లి ఏపీలో ఇవ్వండి. ఈ సభలకు విదేశాల నుంచి హాజరైన చాలామంది తెలుగుభాష, సంస్కృతులపై మేమేదో తెలుగును ఉద్ధరిస్తామని మావైపు చూస్తున్నారు. తెలుగు భాషా సంస్కృతిపై మీకేదో సహాయం చేస్తామని మీరు భారత్‌కు వస్తుంటే, మేమేమో మీ దేశాలకు వచ్చి మిమ్మల్ని అర్థించడం యథార్థమైన విషయం’ అని పరోక్షంగా లోకేశ్‌కు యార్లగడ్డ చురకలంటించారు. డాక్టర్ వైఎస్సార్‌ది ప్రత్యేక స్థానం ‘తెలుగు భాష, సంస్కృతిని కాపాడిన వారే చరిత్రలో స్థానం పొందుతారు. అలాంటి వారిలో మొట్టమొదట వ్యక్తి జలగం వెంగళరావు. తరువాత మండలి కృష్ణారావుతోపాటు, ఎన్టీఆర్ తెలుగును అజరామరం చేశారు. తెలుగుకు ప్రాచీనహోదా సాధించిపెట్టిన వైఎస్ రాజశేఖరరెడ్డిది ప్రత్యేక స్థానం’ అని అన్నారు. -
ఫిబ్రవరి 3,4న ‘తెలుగు మహాసభలు’
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రపంచ తెలుగు సమాఖ్య 11వ ద్వైవార్షిక మహాసభలు, రజతోత్సవ వేడుకలు ఫిబ్రవరి 3, 4 తేదీల్లో చైన్నెలో నిర్వహించనున్నట్లు నిర్వహణ కమిటీ ప్రతినిధి, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. విజయవాడలో గురువారం యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ.. తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, కళలు, సాంప్రదాయ విలువలను భావి తరాలకు అందించడానికి ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. -
హిందీ భాష సలహా సంఘం సభ్యునిగా యార్లగడ్డ
న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రిత్వ శాఖ హిందీ సలహా సంఘం సభ్యునిగా రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షుడిగా, ఆ శాఖ సహాయ మంత్రులు ఉపాధ్యక్షులుగా, ఆరుగురు ఎంపీలు సభ్యులుగా ఉన్న ఈ సలహా సంఘంలో యార్లగడ్డ మాత్రమే హిందీయేతర రాష్ట్రానికి చెందినవారు. మూడేళ్ల కాల వ్యవధి కలిగి ఉన్న ఈ సంఘం కేంద్ర ప్రభుత్వంలో హోం మంత్రిత్వ శాఖకు అనుబంధంగా పనిచేసే అన్ని విభాగాల్లో హిందీ భాష వినియోగం, వికాసానికి కృషి చేస్తుంది. ఈ సందర్భంగా యార్లగడ్డను పలువురు ప్రముఖులు అభినందించారు.