
హిందీ భాష సలహా సంఘం సభ్యునిగా యార్లగడ్డ
న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రిత్వ శాఖ హిందీ సలహా సంఘం సభ్యునిగా రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షుడిగా, ఆ శాఖ సహాయ మంత్రులు ఉపాధ్యక్షులుగా, ఆరుగురు ఎంపీలు సభ్యులుగా ఉన్న ఈ సలహా సంఘంలో యార్లగడ్డ మాత్రమే హిందీయేతర రాష్ట్రానికి చెందినవారు. మూడేళ్ల కాల వ్యవధి కలిగి ఉన్న ఈ సంఘం కేంద్ర ప్రభుత్వంలో హోం మంత్రిత్వ శాఖకు అనుబంధంగా పనిచేసే అన్ని విభాగాల్లో హిందీ భాష వినియోగం, వికాసానికి కృషి చేస్తుంది. ఈ సందర్భంగా యార్లగడ్డను పలువురు ప్రముఖులు అభినందించారు.