raj nath singh
-
మోదీపై చేసిన వ్యాఖ్యలకు రాజ్‌నాథ్ సింగ్ కౌంటర్
పాట్నా: మీరు చేప, ఏనుగు లేదా గుర్రాన్ని తినండి. ఇలా చూపించడం ఎందుకు? అంటూ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌పై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ నేతల్ని జైల్లో పెట్టిస్తాంటూ రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) పార్టీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తన ఏడుగురు కుమార్తెల్లో ఒకరైన పాటలీపుత్ర లోక్‌సభ అభ్యర్ధి మిసా భారతి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. బీహార్‌లో ఎన్నికల ప్రచారం ఈ తరుణంలో అలయన్స్‌లో భాగంగా ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న లోక్‌జన శక్తి పార్టీ (LJP) రాంవిలాస్ పాశ్వాన్ వర్గం తరుపున నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. బీహార్‌లోని జమూయిలో ఎన్డీయే అభ్యర్థి, ఎల్జేపీ (రామ్ విలాస్) పార్టీ నేత అరుణ్ భారతికి మద్దతుగా రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగించారు. మాంసాహారం తింటూ వీడియోలు ఈ సందర్భంగా ఆర్జేడీ నేత, లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్‌ను ఉద్దేశిస్తూ.. ‘కొంతమంది నాయకులు ఓ వర్గం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నవరాత్రుల సమయంలో మాంసాహారం తింటున్న వీడియోల్ని పోస్టు చేశారని’ ఆరోపించారు. మీరు తినే తిండి మాకు చూపించడం ఎందుకు? ‘నవరాత్రులలో చేపలు తింటున్నావు. ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నావు. చేప, పంది, పావురం, ఏనుగు, గుర్రం ఏది కావాలంటే అది తిను. ఇందులో చూపించాల్సిన అవసరం ఏముంది. ఇది ఓట్ల కోసం, బుజ్జగింపు రాజకీయాల కోసమేనని దుయ్యబట్టారు. ఇలా చేస్తే ఒక నిర్దిష్ట మతానికి చెందిన ప్రజలు తమకు ఓటు వేస్తారని భావిస్తున్నారు అని ఆరోపించారు. మోదీని జైల్లో వేస్తారా? లాలూ ప్రసాద్ యాదవ్‌ను తన స్నేహితుడంటూ.. ఆయన కుటుంబ సభ్యులు.. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మోదీని జైల్లో పెడతామని చెబుతున్నారు. జైల్లో లేదా బెయిల్‌పై ఉన్నవారు మోదీని జైలుకు పంపిస్తారా? బీహార్ ప్రజలు అన్నింటినీ సహిస్తారు, కానీ ఇది కాదు’ అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మరోసారి మోదీయే ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కాబోతున్నారని ప్రపంచమంతా చెబుతోందని, వచ్చే ఏడాది జరిగే కార్యక్రమాలకు ఇతర దేశాలు ఆయనను ఆహ్వానించడం ప్రారంభించాయని,ఈ ఎన్నికలను లాంఛనప్రాయంగా చూస్తున్నారని తెలిపారు. చిరాగ్ పాశ్వాన్‌ను ప్రశంసిస్తూ, యువ నాయకుడు ఎన్డీయే పిచ్‌పై రన్ హిట్టర్ అని, అవసరమైనన్ని పరుగులు చేస్తారని కొనియాడారు. రామ్ విలాస్ పాశ్వాన్ కలలను ఆయన నెరవేరుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. -
పాక్ ఆర్మీపై రాజ్‌నాథ్ సింగ్ విమర్శలు
లక్నో: భారతదేశ మిలిటరీ సైనికులు రాజ్యాంగ విలువలకు కట్టుబడి, దేశ రక్షణకు కృషి చేస్తారని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. పొరుగుదేశంలో ఇటువంటి పరిస్థితి లేదని పాకిస్తాన్ ఆర్మీపై పరోక్షంగా ఆయన విమర్శలు గుప్పించారు. 76వ ‘ఆర్మీ డే’ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ సోమవారం లక్నోలో నిర్వహించిన ‘శౌర్య సంధ్య’ కార్యక్రమంలో మాట్లాడారు. మన పొరుగు దేశంలో మిలిటరీకి, దేశ రాజ్యాంగం విలువలకు అసలు సంబంధం ఉండదని తెలిపారు. సైనికులు కూడా దేశ రాజ్యాంగ విలువల పట్ల గౌరవం, అంకితభావం చూపారని పేర్కొన్నారు. కానీ, భారత దేశంలో మాత్రం అలా కాదన్నారు. దేశ రాజ్యాంగ విలువల పట్ల భారత ఆర్మీ సైనికుల అకింతభావం సాటిలేదని కొనియాడారు. సైనికులు చూపించే గౌరవం దేశ ప్రజలంతా గుర్తించదగినది పేర్కొన్నారు. భారతీయ సైనికులు దేశం పట్ల ప్రత్యేకమైన ప్రేమతో మెలుగుతారని అన్నారు. సైనికులు దేశం పట్ల అంకితభావాన్ని సంస్కృతి విలువల మూలాల నుంచి అలవర్చుకున్నారని తెలిపారు. భారత రాజ్యాంగం పట్ల.. దేశభక్తి, ధైర్యం, మానవత్వం, విధేయత అనే నాలుగు ముఖ్యమైన లక్షణాలు ప్రతి భారత సైనికుడిలో కనిపిస్తాయని చెప్పారు. ఏ సైనికుడు అయితే తన మాతృభూమి రక్షణ కోసం ప్రాణాలు సైతం లెక్కచేయడో అతనే నిజమైన దేశభక్తుడని అన్నారు. ఇటువంటి దేశభక్తి మాత్రమే ప్రతి సైనికుడిలో మరింత ధైర్యాన్ని నింపుతుందని తెలిపారు. చదవండి: రాముని గుడి బయట గొడవ.. కాంగ్రెస్ జెండా చించివేత -
ఆకాశ్ ప్రైమ్ క్షిపణి పరీక్ష విజయవంతం
ఒడిశా రాష్ట్రం చండిపూర్ లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఆకాశ్ క్షిపణి కొత్త వెర్షన్ 'ఆకాశ్ ప్రైమ్'ను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) విజయవంతంగా పరీక్షించింది. ఆకాశ్ ప్రైమ్ అనే కొత్త క్షిపణి శత్రు విమానాలను అనుకరించే మానవరహిత వైమానిక లక్ష్యాన్ని ఈ క్షిపణి అడ్డగించి నాశనం చేసినట్లు డీఆర్డీఓ తెలిపింది. ఆకాశ్ క్షిపణి కొత్త వెర్షన్‌ను మెరుగుపరిచి ఆ తర్వాత పరీక్షించినట్లు డీఆర్డీఓ వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను డీఆర్డీఓ ట్విటర్ వేదికగా షేర్ చేసింది. "ఆకాశ్ ప్రైమ్ క్షిపణిలో మెరుగైన ఖచ్చితత్త్వం కోసం దేశీయ పరిజ్ఞానంతో రూపొందిన యాక్టివ్ ఆర్ఎఫ్ సీకర్ ఉంది. లక్ష్య ఛేదనలో క్షిపణి కచ్చితత్వాన్ని ఇది బాగా మెరుగుపరచింది. అధిక ఎత్తులో తక్కువ ఉష్ణోగ్రతల వద్ద మంచి పనితీరును కనబరుస్తుంది" అని ఒక అధికారి మీడియాతో పంచుకున్నారు. ఈ క్షిపణి పరీక్ష విజయవంతంగా నిర్వహించినందుకు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ), భారత సైన్యం, భారత వైమానిక దళం, ఇతర వాటాదారులను కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభినందించారు. ఆకాశ్ ప్రైమ్ వ్యవస్థపై భారత సైన్యం, భారత వైమానిక దళం విశ్వాసం మరింత పెరుగుతుందని డీఆర్డీవో ఛైర్మన్ జి.సతీశ్ రెడ్డి తెలిపారు. (చదవండి: నా కెరియర్లో విచిత్రమైన ఒప్పందం : సత్య నాదేళ్ల) DRDO today conducts Successful Maiden Flight Test of Akash Prime Missile from Integrated Test Range (ITR), Chandipur, Odisha. pic.twitter.com/QlvMHtTWVj — DRDO (@DRDO_India) September 27, 2021 -
నేడు 21వ కార్గిల్ విజయ్ దివస్
-
తల్లిలాంటి పార్టీ బీజేపీ
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ తల్లివంటిదని, ఎంపీలు, మంత్రులుగా ఎదిగిన వారు పార్టీని మరిచిపోరాదని ప్రధాని మోదీ అన్నారు. పార్టీ ఎంపీల శిక్షణా కార్యక్రమాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. పార్టీని, పార్టీ కార్యకర్తలను తల్లితో పోల్చిన మోదీ.. ‘కుమారుడిని పెంచి పెద్దచేసిన తల్లి.. పెళ్లయిన తర్వాత ఆ కొడుకు తన కంటే భార్యపైనే ఎక్కువ మమకారం చూబితే చిన్నబుచ్చుకుంటుంది. అలాంటి కొడుకు మాదిరిగా కాకుండా ఎంపీలు, మంత్రులు అయిన మీరు పార్టీని, కార్యకర్తలను మరవకండి. మీకోసం ఎంతో శ్రమకోర్చిన కార్యకర్తలతో సంబంధాలు కొనసాగించండి’ అని వారికి ఉద్బోధించారు. పార్టీ ఈ స్థాయికి చేరుకోవడం కార్యకర్తల కృషి ఫలితమేనన్నారు. చట్ట సభల సభ్యులైనా, మంత్రులయినా పార్టీ కార్యకర్తగా క్షేత్ర స్థాయిలో పనిచేయాలని సూచించారు. ‘వయస్సుతో పనిలేకుండా, విద్యార్థిగా భావించినప్పుడే ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకోగలుగుతారు’ అని ప్రధాని తెలిపారు. ‘బీజేపీ కృత్రిమంగా ఏర్పడిన పార్టీ కాదు. క్షేత్రస్థాయి నుంచి బలంగా ఏర్పడిన పార్టీ. సైద్ధాంతిక బలం, ఆలోచనా విధానం కారణంగానే ఈ స్థాయికి చేరుకుంది. అంతేగానీ, ఏదో ఒక్క కుటుంబ వారసత్వంపై నడుస్తున్న పార్టీ కాదు’ అని ఈ సందర్భంగా ప్రధాని అన్నారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అనంతరం మీడియాకు తెలిపారు. రెండు రోజుల ఈ శిక్షణ కార్యక్రమంలో హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా కూడా ప్రసంగించారు. జేపీ నడ్డా ప్రసంగిస్తున్న సమయంలో ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్ తదితరులు వేదికపై నుంచి కిందికి దిగి మిగతా ఎంపీల మధ్యన కూర్చున్నారు. -
సాగు సంక్షోభం .. నిరుద్యోగం
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్ ఎన్నికలు, నిరుద్యోగం, సాగు సంక్షోభం, కరువు, పత్రికా స్వేచ్ఛ వంటి అంశాలను ఆదివారం నాటి అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా లేవనెత్తింది. జమ్మూ కశ్మీర్లో త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కోరింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు ఒకరోజు ముందు కేంద్రం నిర్వహించిన ఈ భేటీలో.. ఈ అంశాలన్నిటినీ పార్లమెంటులో చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఇది ఇప్పటికీ ఒక సైద్ధాంతిక పోరాటమేనని కాంగ్రెస్ పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రాజ్యసభలో విపక్ష నేత గులాంనబీ ఆజాద్, కాంగ్రెస్ ఎంపీలు అధీర్ రంజన్ చౌదరి, కె.సురేష్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, తృణమూల్ కాంగ్రెస్ నేత డెరెక్ ఒబ్రీన్ తదితరులు పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అంశాన్ని కూడా విపక్షాలు గట్టిగా ప్రస్తావించాయి. కాగా ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని టీఎంసీ నేతలు సుదీప్ బంద్యోపాధ్యాయ్, ఒబ్రీన్లు నొక్కిచెప్పారు. అదే సమయంలో సమాఖ్యవాదం బలహీనపడుతుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తూ..రాష్ట్రాలను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేయడం ఆమోదనీయం కాదని విపక్షాలు స్పష్టం చేశాయి. ‘అధికారంలోకి వచ్చినందుకు ప్రభుత్వాన్ని అభినందించాం. ఇది సైద్ధాంతిక పోరాటం, గతంలోనూ సైద్ధాంతిక పోరాటమే. సైద్ధాంతిక పోరాటంగానే ఉంటుంది కూడా..’ అని ప్రభుత్వానికి చెప్పినట్లు సమావేశం తర్వాత ఆజాద్ విలేకరులకు తెలిపారు. లౌకిక శక్తులకు కాంగ్రెస్ పార్టీ పునాది వంటిదని, ప్రభుత్వంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా ఆ స్ఫూర్తిని సజీవంగా ఉంచేందుకు తమ పార్టీ కృషి చేస్తుందని చెప్పారు. అధికారంలో లేకపోయినా రైతులు, కార్మికులు, మహిళల అభ్యున్నతికి కృషి కొనసాగిస్తామని అన్నారు. దేశంలో భారీ నిరుద్యోగిత, కరువు పరిస్థితులు, సాగు సమస్యలు, తాగునీటి కొరత వంటి అంశాలపై దృష్టి పెట్టాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. ‘పత్రికా స్వేచ్ఛ గురించి కూడా లేవనెత్తాం. జర్నలిస్టుల విషయంలో అధికార పార్టీ కార్యకర్తలు వ్యవహరిస్తున్న తీరును ప్రస్తావించాం. వారిని కొడుతున్నారు. వారి గొంతును అణిచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిని ఖండిస్తూ ఈ విషయాన్ని పరిశీలించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరాం..’ అని ఆజాద్ తెలిపారు. కశ్మీర్లో రాష్ట్రపతి పాలన అవసరం లేదని, త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కోరినట్లు చెప్పారు. పంచాయతీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించగలిగినప్పుడు, అసెంబ్లీ ఎన్నికలు ఎందుకు నిర్వహించకూడదన్నారు. ఎన్నికలకు రాష్ట్రాల నిధులు, బ్యాలెట్ పేపర్ల వంటి ఎన్నికల సంస్కరణలను టీఎంసీ లేవనెత్తింది. ప్రతిదానికీ ఆర్డినెన్సును ఉపయోగించడాన్ని కూడా టీఎంసీ ప్రస్తావించింది. దురదృష్టవశాత్తూ 16వ లోక్‌సభలో గత 70 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా దానిని మితిమీరి ఉపయోగించారని బంద్యోపాధ్యాయ, ఒబ్రీన్ చెప్పారు. వైఎస్సార్సీపీ ఎంపీలు వి. విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, టీఆర్ఎస్ ఎంపీలు కే కేశవరావు, నామా నాగేశ్వరరావు అఖిలపక్ష భేటీలో పాల్గొన్నారు. అఖిలపక్ష భేటీ ఫలప్రదం: మోదీ ‘ఎన్నికల ఫలితాల తర్వాత, పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు ఒక ఫలప్రదమైన అఖిలపక్ష భేటీ జరిగింది. విలువైన సూచనలిచ్చిన నేతలకు కృతజ్ఞుడినై ఉంటా’ అంటూ అఖిలపక్ష భేటీ అనంతరం మోదీ ట్వీట్ చేశారు. మరోవైపు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం, అలాగే ఎన్డీయే భేటీ ఆదివారం ఢిల్లీలో జరిగాయి. బడ్జెట్, ట్రిపుల్ తలాక్ ప్రభుత్వ ప్రధాన ఎజెండా పదిహేడవ లోక్‌సభ మొదటి సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. కేంద్ర బడ్జెట్‌కు ఆమోదం, ట్రిపుల్ తలాక్ వంటి ఇతర కీలక చట్టాలు ప్రభుత్వ ఎజెండాలో అగ్రభాగాన ఉండనున్నాయి. మొదటి రెండురోజులు సభ్యుల ప్రమాణ స్వీకారానికి వినియోగిస్తారు. 19న స్పీకర్ ఎన్నిక ఉంటుంది. మరుసటి రోజు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. జూలై 5న బడ్జెట్ ప్రవేశ పెడతారు. 26 వరకు సమావేశాలు కొనసాగుతాయి. జూన్ 20 నుంచి రాజ్యసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నేడు ఏపీ ఎంపీల ప్రమాణస్వీకారం సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు సోమ, మంగళవారాల్లో లోక్‌సభ సభ్యులుగా ప్రమాణం చేయనున్నారు. ప్రొటెం స్పీకర్ వీరేంద్ర కుమార్ వీరితో ప్రమాణం చేయిస్తారు. ఆంధ్రప్రదేశ్ నుంచి గెలిచిన ఎంపీల ప్రమాణస్వీకారం సోమవారం మధ్యాహ్నానికి పూర్తికానుంది. అక్షర క్రమంలో మొదటగా అండమాన్ నికోబార్ ఎంపీలు, తర్వాత ఏపీ ఎంపీలు ప్రమాణం చేయనున్నారు. తెలంగాణ ఎంపీలు మంగళవారం ప్రమాణం చేస్తారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికెన వైఎస్సార్సీపీ ఎంపీలందరూ సోమవారం ఉదయం వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి నివాసంలో భేటీ కానున్నారు. -
చంద్రబాబుకు ఓటేస్తే ఆత్మహత్య చేసుకున్నట్టే
సాక్షి, తాడేపల్లిగూడెం : చంద్రబాబుకు ఓటేస్తే ఆత్మహత్య చేసుకున్నట్టే అని, చంద్రబాబునాయుడును అబద్ధాలనాయుడు అంటే అతికినట్టు సరిపోతుందని కేంద్ర మాజీ మంత్రి యూవీ.కృష్ణంరాజు అన్నారు. బుధవారం పట్టణంలోని మాగంటి కల్యాణ మండపం ఆవరణలో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ఈ సభలో ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖామంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ అబద్ధాల బాబు చంద్రబాబు అన్నారు. పోలవరం వరం మోడీదైతే బాబు తనదిగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. పోలవరం నేనే తెచ్చానంటాడు. మోడీ, కేసీఆర్‌ను విమర్శిస్తుంటాడు తప్ప బాబుకు వేరే పనిలేదన్నారు. బీజేపీతో చంద్రబాబు ఎందుకు తగవు పెట్టుకున్నాడో అర్థంకాదన్నారు. పోలవరానికి, కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన సొమ్ములను మింగేసి పనులు చేయకుండా కూడా మింగేసి వాటి గురించి ఆరా అడిగితే బీజేపీతో బాబు తగవుపెట్టుకున్నారన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి 3.5 లక్షల కోట్ల రూపాయలు వచ్చాయన్నారు. వీటిని దాచి అబద్ధాలు చెప్పే బాబుకు అబద్ధాల నాయుడు పేరు సరిపోతుందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోడూరి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అవినీతి చేయకుండా బీజేపీ అడ్డుపడటం వల్ల టీడీపీ బీజేపీతో విడాకులు తీసుకుందన్నారు. పోలవరం ఖర్చు గురించి ఆరా అడిగినందుకే ఎన్డీఏ నుంచి బాబు బయటకు వచ్చారన్నారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాకా వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అనైతిక రాజకీయం చేస్తుందన్నారు. రాష్ట్రంలో ఇసుక లూటీ, బాక్సైట్ లూటీ, ఎర్రచందనం స్మగ్లింగ్ వంటి వాటితో పాలన పెచ్చరిల్లిందన్నారు. దుర్మార్గ చరిత్ర కలిగిన పార్టీ తెలుగుదేశం అన్నారు. త్వరలో ఆ పార్టీ సెలవు తీసుకుంటుందని జోస్యం చెప్పారు. బాబు కాపులను మోసం చేశారని, కులాల మధ్య చిచ్చుపెట్టిన సామాజిక ఉగ్రవాది చంద్రబాబే అన్నారు. టీడీపీకి ప్రజలు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి పైడికొండల మాణిక్యాలరావు మాట్లాడుతూ జరగబోయే ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి, నీతికి, అవినీతికి మధ్య జరిగే పోరాటం అన్నారు. మార్పునకు ఈ ఎన్నికలు శ్రీకారం చుట్టబోతున్నాయన్నారు. అవినీతి భారతంగా దేశాన్ని తీర్చిదిద్ది మోదీ ప్రపంచంలో దేశాన్ని అగ్రభాగంలో నిలిపారన్నారు. చైనా, పాకిస్తాన్ దేశాలను ఖబడ్దార్ అంటున్నారన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ, ఈబీసీ రిజర్వేషన్లు, త్రిపుల్ తలాక్ బిల్లు వంటి వాటి ద్వారా మోదీ ఉక్కుమనిషిగా నిరూపించుకున్నారన్నారు. రాష్ట్ర విభజన సమయంలో పోలవరం ముంపు మండలాలను రాష్ట్రంలో కలుపకపోతే పోలవరం నిర్మాణం జరిగేదా అన్నారు. స్టిక్కర్ బాబుగా మారిన చంద్రబాబు నాటకాలపై ప్రజల్లో అవగాహన ఉందన్నారు. బీజేపీని గెలిపించాలని కోరారు. అభ్యర్థులతో సంఘీభావం ప్రకటించారు. పార్టీ నాయకులు శరణాల మాలతీరాణి, పురిఘళ్ల రఘురాం, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఈతకోట తాతాజీ, గమిని సుబ్బారావు, నరసాపురం పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు పాల్గొన్నారు. -
ప్యాకేజీయే లాభమని చంద్రబాబు అన్నారు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీవల్లే ఎక్కువ లాభమని, హోదా సంజీవని కాదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబే అసెంబ్లీలో చెప్పారని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చెప్పారు. రైల్వే జోన్ ఏర్పాటుచేసి తీరుతామని తొలిసారి స్పష్టంచేశారు. రాజ్యసభలో మంగళవారం ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీల అమలు’ అంశంపై 4 గంటలపాటు జరిగిన స్వల్పకాలిక చర్చకు సమాధానమిచ్చారు. ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్న హామీలన్నింటినీ పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నాం. ప్రస్తుత ప్రధాని ఇచ్చిన హామీలనే కాదు, మాజీ ప్రధాని మన్మోహన్ ఇచ్చిన హామీలనూ మా ప్రభుత్వం అమలు చేస్తుంది. సభలో ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వానికైనా ఉంది. వాటన్నింటినీ మా ప్రభుత్వం అమలు చేస్తోంది.. 90% హామీలను పూర్తిచేశాం. మిగిలినవి కూడా పూర్తిచేస్తాం. కడప, బయ్యా రం స్టీలు ప్లాంటు, రైల్వేజోన్ తదితర ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాలను తేల్చి కమిటీ నివేదిక ఇస్తుందని చట్టంలో ఉంది. వాటిని ఏర్పాటుచేయాలని స్పష్టంగా ఉంటే వేరే రకంగా ఉండేది. చట్టంలో ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తిచేసేందు కు కట్టుబడి ఉన్నాం. రైల్వేజోన్ ఏర్పాటుచేసి తీరుతాం. రికార్డు సమయంలో పోలవరం పూర్తి 2014లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి కేబినెట్ భేటీలోనే పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణ నుంచి 7 మండలాలను ఏపీలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు రూ. 6,754 కోట్లు విడుదల చేశాం. ప్రాజెక్టును తామే నిర్మిస్తామన్న ఏపీ విజ్ఞప్తిని ఆమోదించాం. దీనిని రికార్డు సమయంలో పూర్తిచేస్తామని భరోసా ఇస్తు న్నాను. రాష్ట్రానికి హోదా ఇస్తామన్న అప్పటి ప్రధాని మన్మోహన్ నిర్ణయాన్ని మేం గౌరవిస్తాం. అయితే.. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు విరుద్ధంగా వచ్చా యి. ఈ అంశంపై ఆర్థికమంత్రి స్పష్టత ఇచ్చారు. ప్యాకేజీకి సీఎం అంగీకరించారు హోదా కంటే ప్యాకేజీవల్లే ఎక్కువ లాభమని చంద్రబాబే చెప్పారు. ఆయనతో సంప్రదింపుల తర్వాత రాష్ట్రం సమ్మతితో హోదాకు బదులుగా ప్యాకేజీ ఇచ్చేందుకు నిర్ణయించారు. 14వ ఆర్థిక సంఘం రెవెన్యూ లోటును ఐదేళ్లకు రూ.22,123 కోట్లు సిఫారసు చేసింది. ఈ నిధులను ఇస్తూనే ఉన్నాం. హోదా ఉంటే కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రాష్ట్రానికి ఎంత వస్తుందో ఆ మొత్తాన్ని రాష్ట్రానికి ఇచ్చేందుకు నిర్ణయించారు. ఆ అంతరం ఏటా రూ.3,200 కోట్లు ఉంటుందని లెక్కించారు. ఈ నిధులను ఎక్స్టెర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టుల ద్వారా సమకూర్చి వాటిని కేంద్రం చెల్లించేందుకు అంగీకారం కుదిరింది. సెప్టెంబర్ 2016లో దీనికి సీఎం సమ్మతి తెలిపారు. దీనిపై కేంద్ర ఆర్థికమంత్రి, సీఎం కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో కూడా దీనిని స్వాగతించారు. ఏపీ సీఎం తొలుత ఈఏపీల రూపంలో నిధులు స్వీకరించేందుకు సమ్మతించి.. తర్వాత వేరే రూపం లో ఇవ్వాలన్నారు. దాని వల్ల ఇబ్బందులున్నాయని, స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. కానీ, రాష్ట్రం స్పందించలేదు. ఇక తెలంగాణ, ఏపీ సీఎంలు కూర్చుని సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆ రాష్ట్రాలకు నెరవేర్చాల్సిన హామీలన్నీ నెరవేరుస్తాం’ అని రాజ్‌నాథ్ చెప్పారు. -
హిందీ భాష సలహా సంఘం సభ్యునిగా యార్లగడ్డ
న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రిత్వ శాఖ హిందీ సలహా సంఘం సభ్యునిగా రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షుడిగా, ఆ శాఖ సహాయ మంత్రులు ఉపాధ్యక్షులుగా, ఆరుగురు ఎంపీలు సభ్యులుగా ఉన్న ఈ సలహా సంఘంలో యార్లగడ్డ మాత్రమే హిందీయేతర రాష్ట్రానికి చెందినవారు. మూడేళ్ల కాల వ్యవధి కలిగి ఉన్న ఈ సంఘం కేంద్ర ప్రభుత్వంలో హోం మంత్రిత్వ శాఖకు అనుబంధంగా పనిచేసే అన్ని విభాగాల్లో హిందీ భాష వినియోగం, వికాసానికి కృషి చేస్తుంది. ఈ సందర్భంగా యార్లగడ్డను పలువురు ప్రముఖులు అభినందించారు. -
కేంద్ర హోంమంత్రితో వైఎస్ జగన్ భేటీ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రేరేపిస్తున్న పార్టీ ఫిరాయింపుల అంశంపై కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్‌ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలిశారు. సీఎం చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న విధానాలపై ఫిర్యాదు చేసేందుకు ఆయన 'సేవ్ డెమోక్రసీ' పేరిట బృందంగా రాజ్ నాథ్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో వైఎస్ఆర్ సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా రాజ్ నాథ్ కు ఓ విజ్ఞాపన పత్రం కూడా ఇవ్వనున్నారు. దీంతోపాటు 'ది ఎంపరర్ ఆఫ్ కరప్షన్' అనే పుస్తకాన్ని కూడా కేంద్ర హోమంత్రికి వైఎస్ జగన్ ఇవ్వనున్నారు. అమరావతి పేరుతో భూముల దోపిడీ, కరెంటు దోపిడీ, ఇసుక మాఫియాలను ఇలా అన్ని అంశాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. మొత్తం లక్షా ముప్పైవేల కోట్ల రూపాయల అవినీతి వ్యవహారం ఈ పుస్తకంలో పొందుపరిచారు. పూర్తి ఆధారాలతో, డాక్యుమెంట్లు కూడా ఈ పుస్తకంలో పేర్కొన్నారు. -
'పోలీస్ వ్యవస్థ ఆధునీకరణకు నిధులు కేటాయించండి'
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఆధునీకరణకు నిధులు కేటాయించాలని సీఎం కేసీఆర్ కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు విజ్ఞప్తి చేశారు. గురువారం కేసీఆర్ తో పాటు సీఎస్ రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మలు రాజ్ నాథ్ తో సమావేశమయ్యారు. తెలంగాణలో పోలీస్ వ్యవస్థ ఆధునీకరణకు నిధులు కేటాయించాలని వారు ఈ సందర్భంగా రాజ్ నాథ్ కు విన్నవించారు. దీంతో పాటు పునర్ విభజన చట్టంలోని హామీల అమలకు చర్యలు తీసుకోవాలని కేసీఆర్ రాజ్ నాథ్ ను కోరారు. -
మైనార్టీల రక్షణకు ఎందాకైనా వెళ్తాం: రాజ్‌నాథ్
న్యూఢిల్లీ: మైనార్టీల రక్షణకోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరోసారి స్పష్టం చేశారు. అందుకోసం తాను ఎందాకైనా వెళతానని, మైనార్టీల సంరక్షణే తమ ధ్యేయం అని చెప్పారు. వారిలో భయాందోళనలు తొలిగిపోయేందుకు ఏం చేయాలంటే అది చేస్తానని హామీ ఇచ్చారు. ఇటీవల కాలంలో, దేశంలోని పలు మతాల ప్రార్థన సంస్థలపై గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా హర్యానాలో ఓ చర్చిపై అక్కడి విద్యాసంస్థలపై దాడులకు పాల్పడటం, బెంగాల్లో 71 ఏళ్ల నన్‌పై అత్యాచారానికి పాల్పడి నగదు దోచుకెళ్లడం వంటి ఘటనలు జరగడంతో వారి భద్రత విషయంలో ఆయన ప్రతిచోట హామీ ఇస్తున్నారు. రక్షణ కల్పించడంలో మత పరమైన వివక్షకు అవకాశం లేదని తెలిపారు. -
ఆ భాగస్వామ్యం మాకు ముఖ్యం కాదు!
ఘజియాబాద్:కశ్మీర్ వేర్పాటువాద నేత, ముస్లింలీగ్ నాయకుడు మసరత్ అలంను ప్రభుత్వం విడుదల చేయడంపై జమ్మూ కశ్మీర్ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములైన బీజేపీ-పీడీపీల మధ్య విభేదాలు అంతకంతకూ ముదిరి పాకాన పడుతున్నాయి. కశ్మీర్ ప్రభుత్వ చర్య తమకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ మంగళవారం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తమకు అక్కడి ప్రభుత్వంతో భాగస్వామ్యం కంటే దేశ ప్రజల భద్రతే ముఖ్యమని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఎప్పటికీ సామాజిక భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. ఇదే విషయాన్ని నిన్న పార్లమెంట్ లో కూడా చెప్పానని, మరోసారి దానికే కట్టుబడి ఉన్నానని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం బీజేపీ-పీడీపీల మధ్య భిన్నమైన వాతావరణం నెలకొనడంతో వారి భాగస్వామ్యం కడవరకూ కొనసాగుతుందా?అనేది పలు సందేహాలకు తావిస్తోంది. -
'పాక్ కు దీటైన సమాధానం చెప్పాల్సి ఉంది'
న్యూఢిల్లీ: భారత సరిహద్దుల్లో తరచు కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడుతున్న పాకిస్థాన్ కు దీటైన సమాధానం చెప్పాల్సి ఉందని కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ స్పష్టం చేశారు. పాక్ సేనలు పదే పదే భారత్ ను రెచ్చగొడుతున్నాయన్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం సరైన రీతిలో బదులు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఇదిలా ఉండగా పాక్ కాల్పుల ఉల్లంఘన చర్యలపై చర్చిస్తున్నామని కేంద్ర హోంమత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. గత రాత్రి పాక్ బలగాలు 12 భారత స్థావరాలపై దాడులకు పాల్పడి ఉద్రిక్త పరిస్థితులకు తెరలేపింది. జమ్మూ కశ్మీర్ లోని సాంబా జిల్లాలోని మోర్తార్ షెల్లింగ్ లో పాకిస్థాన్ బలగాలు కాల్పులకు పాల్పడటంతో ఒక భారత జవాన్ తో సహా ఐదుగురు మృతి చెందారు.ఈ ఘటనలో నలుగురు పాక్ జవాన్లు అసువులు బాసారు. జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు గుండా భారత్ భూభాగంలోకి ప్రవేశించిన పాక్ బలగాలు దాడులకు దిగడంతో స్థానిక పౌరుడొకరు తీవ్రంగా గాయపడ్డాడు. గత రెండు రోజుల్లో పాకిస్థాన్ మూడోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. అంతకుముందు పాక్ జరిపిన కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాన్ ఒకరు మరణించారు. -
'తుపాను సాయంలో ఏపీ ప్రభుత్వం విఫలం'
ఢిల్లీ: ఉత్తరాంధ్ర తుపాను బాధితులను ఆదుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. ఆదివారం కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసిన జగన్.. హుదూద్ తుపాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్... కేంద్ర నుంచి తుపాను సాయాన్ని మరింత పెంచాలని కోరామని తెలిపారు. ఇప్పటికే ఉత్తరాంధ్రలో చాలా గ్రామాల్లో విద్యుత్ ను పునరుద్ధరించలేదన్నారు. పది రోజుల పాటు ఉత్తరాంధ్ర పర్యటిస్తే.. ప్రతీ గ్రామంలోనూ ఎలాంటి సాయం అందలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారన్నారు. తుపాను సాయం గురించి ప్రధాని నరేంద్ర మోదీతో చంద్రబాబు మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు, ఆయన కేబినెట్ పనిచేయకపోగా, పని చేసే వారిపై బురద జల్లుతారని జగన్ మండిపడ్డారు. సుజనా చౌదరికి కేబినెట్ లో చోటు కల్పించడంలో చూపిన శ్రద్ధ, తుపాను బాధితుల సాయం కోరడంలో చూపలేకపోవడం దారుణమని జగన్ అన్నారు. హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసిన బృందంలో వైఎస్ జగన్‌తో పాటు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, అవినాష్ రెడ్డి తదితర నాయకులు ఉన్నారు. -
సీఎం పవర్‌ను పలుచన చేయం
టీఆర్ఎస్ ఎంపీలతో రాజ్‌నాథ్‌సింగ్ గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలపై చర్చ రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు రానివ్వం సమాఖ్య స్ఫూర్తిని కాపాడుతాం రాష్ర్ట అధికారాల్లో జోక్యం చేసుకోం సమావేశం ఫలవంతమైందన్న టీఆర్ఎస్ ఎంపీలు సర్క్యులర్ ఉపసంహరణ పై హామీ ఇవ్వని కేంద్ర హోంమంత్రి సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి రాజధాని గ్రేటర్ హైదరాబాద్‌లో గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టడం ద్వారా తెలంగాణ ప్రభుత్వ అధికారాలను పలుచన చేసే ఉద్దేశం లేదని కేంద్రం స్పష్టం చేసింది. గురువారం ఇక్కడి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఆ శాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో టీఆర్ఎస్ ఎంపీలు భేటీ అయ్యారు. గవర్నర్‌కు ప్రత్యేక అధికారాల విషయంలో రాష్ర్ట ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బం దులు ఉండబోవని ఈ సందర్భంగా ఎంపీలకు రాజ్‌నాథ్ భరోసా ఇచ్చారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డి, ఎంపీలు బి.వినోద్‌కుమార్, బీబీ పాటిల్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కల్వకుంట్ల కవిత, బూర నర్సయ్య గౌడ్, బాల్క సుమన్, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గవర్నర్‌కు ప్రత్యేక బాధ్యతల పేరుతో ముఖ్యమంత్రి అధికారాల్లోకి చొచ్చుకు వచ్చేలా అవకాశం కల్పించడంపై ఎంపీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట విభజన చట్టంలోని సెక్షన్ 8 ప్రకారమే ముందుకు వెళ్లాలని కోరారు. పోలీస్ బదిలీల వరకూ గవర్నర్‌కు అధికారాలు కల్పించవద్దని కోరారు. స్టేషన్ హౌస్ అధికారి స్థాయి బదిలీకి కూడా గవర్నర్ ఆమోదం అవసరమని ఇటీవల కేంద్రం జారీ చేసిన సర్క్యూలర్‌ను ఎంపీలు తప్పుబట్టారు. దీనిపై హోంమంత్రి సర్ది చెప్పినట్టు సమాచారం. అయితే సర్క్యులర్ ఉపసంహరణకు నిరాకరించినట్టు సమాచారం. దీనివల్ల ముఖ్యమంత్రి అధికారాలకు ఎలాంటి ఢోకా ఉండదని అనునయించినట్టు తెలిసింది. దేశ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసే చర్యలను ఎప్పటికీ చేపట్టబోమని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశం అనంత రం బయటకు వచ్చిన హోంమంత్రి మీడియా తో ముచ్చటిస్తూ.. ‘ముఖ్యమంత్రి అధికారాల్లో మేం జోక్యం చేసుకోవడం లేదు. అలాంటి ఉద్దేశం మాకు లేదు. కేవలం ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అమలు చేస్తున్నాం.’ అని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఎంపీలు కూడా మీడియాతో మాట్లాడారు. ‘హోంమంత్రితో సమావేశం ఫలవంతమైంది. గవర్నర్‌కు అధికారాలపై ఈ నెల 8న హోం శాఖ నుంచి వచ్చిన లేఖ వల్ల మాకు కొంత ఆవేదన కలిగింది. పార్లమెంటులో దాన్ని లేవనెత్తాం. రాజ్‌నాథ్‌తో భేటీ లో అన్ని విషయాలు వివరించాం. రాజ్యాంగం ప్రకారం కేంద్రం ఎంత మేరకు జోక్యం చేసుకోగలదో చెప్పాం. ఏ విషయంలోనూ ముఖ్యమంత్రి అధికారాలను పలుచన చేయబోమని హోంమంత్రి మాకు హామీ ఇచ్చారు. సమాఖ్య స్ఫూర్తికి కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగానికి లోబడే వ్యవహరిస్తామని భరోసా ఇచ్చారు. ఎలాంటి అనుమానాలు అవసరం లేదని చెప్పారు.’ అని కె.కేశవరావు తెలిపారు. దేశంలోని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ అధికారాలను ఎలా కలిగి ఉన్నారో.. తెలంగాణ ముఖ్యమంత్రి కూడా వాటినే కలిగి ఉంటారని రాజ్‌నాథ్ తమకు హామీ ఇచ్చినట్లు ఎంపీ జితేందర్‌రెడ్డి తెలిపారు. అయితే హోంశాఖ సర్క్యులర్ ఉపసంహరణకు రాజ్‌నాథ్ హామీ ఇచ్చారా? అన్న ప్రశ్నకు సమాధానాన్ని టీఆర్ఎస్ ఎంపీలు దాట వేశారు. ఉపసంహరించుకుంటుందని భావిస్తున్నాం: కవిత హోం శాఖ సర్క్యులర్‌ను కేంద్రం ఉపసంహరించుకుంటుందనే భావిస్తున్నట్లు ఎంపీ కవిత చెప్పారు. ‘రోజువారీ వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం ఉండకూడదని మేం కోరాం. దానికి కేంద్ర హోంమంత్రి సానుకూలంగా స్పందించారు. సమాఖ్య స్వరూపాన్ని గౌరవిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి అధికారాలకు భంగం ఉండదని చెప్పారు’ అని ఆమె పేర్కొన్నారు. ‘గవర్నర్ ఒక పెద్దమనిషి తరహాలో మార్గదర్శకత్వం వహిస్తే తప్పేం లేదు. అయితే రోజువారీ వ్యవహారాల్లో జోక్యం ఉండకూడదు. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం నడుచుకుంటే ఫర్వాలేదు. ఈ విషయంపైనే రాజ్‌నాథ్‌తో చర్చించాం.’ అని కవిత తెలిపారు. -
బీజేపీ ఎంపీలకు ప్రధాని మార్గదర్శనం
-
వ్యక్తిపూజకు దూరంగా ఉండండి
విజయంతో నిర్లక్ష్యానికి అవకాశం ఇవ్వొద్దు నియోజకవర్గాలను తరచూ సందర్శించండి కష్టపడి పనిచేసి 2019లో మళ్లీ గెలవండి బీజేపీ ఎంపీలకు ప్రధాని మార్గదర్శనం న్యూఢిల్లీ: వ్యక్తిపూజకు దూరంగా ఉండాలని బీజేపీ ఎంపీలకు ప్రధాని నరేంద్రమోడీ సూచించారు. తనతోపాటు ఇతరుల పాదాలకు మొక్కే విధానానికి స్వస్తి పలకాలని కోరారు. వ్యక్తి పూజను తాను ఆమోదించనని, దానికి బదులు పార్లమెంటు సభ్యులుగా కష్టపడి పనిచేయాలని హితవు పలికారు. శుక్రవారం పార్లమెంటు సెంట్రల్ హాల్లో బీజేపీ ఎంపీలతో మోడీ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అగ్రనేతలు అద్వానీ, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీలకు మోడీ మార్గనిర్దేశం చేశారు. 20 నిమిషాల ప్రసంగంలో... తగిన అధ్యయనం, ప్రవర్తన, సత్సంబంధాలపై దృష్టి సారించాలని మోడీ ఎంపీలకు గీతోపదేశం చేశారు. విజయంతో నిర్లక్ష్యానికి అవకాశమివ్వకుండా, క్షేత్రస్థాయిలో ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ సందేశాలను క్షేత్రస్థాయి వరకూ తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలను తెలియజేయాల్సిన గురుతర బాధ్యత ఎంపీలపై ఉందని స్పష్టమైన సందేశమిచ్చారు.వినయంగా ఉండాలని, నియోజకవర్గాలను తరచూ సందర్శించాలని చెప్పారు. ప్రజల ప్రయోజనాల కోసం పనిచేసి 2019లో మళ్లీ ఎన్నికవ్వాలని వారికి లక్ష్యాన్ని నిర్దేశించారు. పార్లమెంటు సమావేశాలకు సజావుగా హాజరై, సమావేశా లు సాఫీగా సాగేందుకు సహకారం అందించాలని కోరారు.పార్లమెంటులో జరిగే చర్చల్లో పాల్గొనే ముందు సంబంధిత అంశాలపై తగినంత అధ్యయనం చేసి రావాలని కోరారు. చర్చల్లో పాల్గొనడం ద్వారా అనుభవాన్ని గడించవచ్చని పేర్కొన్నారు.మీడియాతో పార్టీ ప్రతినిధులుగా మాట్లాడవద్దని, దానికి బదులు తమ ప్రాంత, నియోజకవర్గ అంశాలపై మాట్లాడాలని సూచించారు.అగ్రనేత అద్వానీ మాట్లాడుతూ... ప్రజల సంక్షేమం కోసం పనిచేయడాన్ని ఇక ముందూ కొనసాగించాలని సూచించారు. 2 ఎంపీ స్థానాల నుంచి 282 ఎంపీ స్థానాలకు పార్టీ సాధించిన ప్రగతిని నిలబెట్టాలని, చెడ్డపేరు తేవద్దని కోరారు. మరింత కష్టపడి పనిచేయాలని రాజ్‌నాథ్‌సింగ్ సూచించారు. తొలి విదేశీ పర్యటన భూటాన్‌లో! నూతన ప్రధాని నరేంద్రమోడీ తొలి విదేశీ పర్యటన కింద భూటాన్‌కు ఈ నెలాఖరులో వెళ్లనున్నారు. ఆ తర్వాత వ్యూహాత్మక భాగస్వామ్య దేశం జపాన్‌లో పర్యటించనున్నారు. ఆ తర్వాత ప్రధాని బ్రెజిల్, అమెరికా పర్యటనలు ఉంటాయని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి శుక్రవారం వెల్లడించారు. అలాగే, బ్రిక్స్ సమావేశం కోసం జూలై మధ్య భాగంలో బ్రెజిల్‌కు వెళ్లనున్నారని చెప్పారు. ఇక, అమెరికా అధ్యక్షుడు ఒబామా ఆహ్వానం మేరకు ప్రధాని ఆ దేశంలో పర్యటించనున్నారని, ఈ విషయమై ఇరువురికీ ఆమోదయోగ్యమైన తేదీపై అమెరికా అధికారులతో చర్చిస్తున్నామని తెలిపారు. -
కేబినెట్ కూర్పుపై చర్చోపచర్చలు
మోడీ, రాజ్‌నాథ్, ఆరెస్సెస్ నేతలతో ఎంపీల భేటీలు నేడు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం మధ్యాహ్నం ఎన్డీఏ భాగస్వాములతో భేటీ న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేయనున్న కేబినెట్ కూర్పుపై ‘కమల’నాథులు తెరిపి లేకుండా చర్చోపచర్చలు సాగిస్తున్నారు. గుజరాత్ భవన్లో బస చేసిన భావి ప్రధాని నరేంద్ర మోడీ తనకు అత్యంత సన్నిహితులైన పార్టీ సీనియర్ నేతలతో సమాలోచనలు సాగిస్తున్నారు. కేబినెట్ ఏర్పాటు విషయంలో మోడీకి ఆరెస్సెస్ పూర్తి స్వేచ్ఛనివ్వడంతో మోడీని, పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌ను ప్రసన్నం చేసుకునేందుకు ఆశావహులైన ఎంపీలు గుజరాత్ భవన్ వద్ద బారులు తీరుతున్నారు. ఆదివారం మొదలైన ఈ చర్చలు సోమవారం కూడా కొనసాగాయి. మోడీ తన సన్నిహితుడు అమిత్ షా, అరుణ్ జైట్లీ తదితర నేతలతో సమావేశమయ్యారు. కేబినెట్ పరిమాణం, బీజేపీ వద్ద ఎన్ని శాఖలు ఉండాలి, భాగస్వామ్య పక్షాలకు ఎన్ని కేటాయించాలి, తదితర అంశాలపై వారు చర్చించినట్లు సమాచారం. పదేళ్ల తర్వాత పూర్తి మెజారిటీ సాధించిన బీజేపీలో మంత్రి పదవుల కోసం పోటీ తీవ్రంగానే ఉంది. పార్టీ అగ్రనేత అద్వానీకి లోక్‌సభ స్పీకర్ పదవి కట్టబెట్టడం దాదాపు ఖరారైనట్లు సమాచారం. అమృత్సర్ నుంచి పోటీచేసి, ఓటమి పాలైన అరుణ్ జైట్లీని కేబినెట్లోకి తీసుకోవాలని మోడీ భావిస్తున్నారు. ఆయనకు ఆర్థిక శాఖను కేటాయించే అవకాశాలున్నాయి. అలాగే, అరుణ్ శౌరికి విదేశాంగ శాఖ కట్టబెట్టే అవకాశాలపైనా చర్చ సాగుతున్నట్లు సమాచారం. పట్టణాభివృద్ధి శాఖను నితిన్ గడ్కారీకి అప్పగించనున్నట్లు ప్రచారం జరుగుతుండగా, ఆయనకు తిరిగి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశాలపైనా చర్చ జరుగుతోంది. ఒకవేళ గడ్కారీకి కేబినెట్లో చోటు కల్పిస్తే, పార్టీ ప్రధాన కార్యదర్శి అనంతకుమార్‌కు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. మోడీ కేబినెట్లో చోటు పొందనున్న వారిలో రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, మురళీమనోహర్ జోషీ, వెంకయ్య నాయుడు, యడ్యూరప్ప, వీకే సింగ్, స్మృతీ ఇరానీ, కల్రాజ్ మిశ్రా, పూనమ్ మహాజన్, రవిశంకర్ ప్రసాద్‌ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మోడీ కేబినెట్లో పార్టీ ఉపాధ్యక్షుడు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఏకైక ముస్లిం మంత్రి కాగలరని కూడా చెబుతున్నారు. అమిత్ షాకు రైల్వేశాఖ లేదా ప్రధాని కార్యాలయంలో కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. యూపీ ప్రయోగం విజయవంతమైనందున వచ్చే ఏడాది జరగనున్న బీహార్ ఎన్నికల్లో సైతం అమిత్ షాకు బాధ్యతలు అప్పగించే అవకాశాలు లేకపోలేదని సమాచారం. ఇక శివసేన, టీడీపీ, అకాలీదళ్, ఎల్జేపీ వంటి మిత్రపక్షాలకూ కేబినెట్లో చోటు కల్పించే అవకాశాలు ఉన్నాయి. రాజ్‌నాథ్ నివాసం, ఆరెస్సెస్ కార్యాలయం బిజీ బిజీ అశోకారోడ్‌లోని రాజ్‌నాథ్ సింగ్ నివాసం, ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయం చుట్టూ కూడా ఆశావహ ఎంపీలు ప్రదక్షిణలు ప్రారంభించారు. మోడీతో భేటీకి ముందు సుష్మా స్వరాజ్ సోమవారం రాజ్‌నాథ్ నివాసానికి వెళ్లి, చర్చలు జరిపారు. రాజస్థాన్ సీఎం వసుంధరా రాజే, గోవా సీఎం మనోహర్ పారికర్, కల్యాణ్ సింగ్, ఉమాభారతి, గోపీనాథ్ ముండే, యోగి ఆదిత్యనాథ్, వరుణ్ గాంధీ, శతృఘ్న సిన్హా, పూనమ్ మహాజన్, రామ్‌విలాస్ పాశ్వాన్ తనయుడు చిరాగ్, వైగో తదితరులు మోడీ, రాజ్‌నాథ్‌లను కలుసుకుని అభినందనలు తెలిపారు. యూపీ సీనియర్ నేత వినయ్ కటియార్‌తో పాటు అమిత్ షా, జైట్లీలు కూడా ఆరెస్సెస్ నేతలతో ఆరెస్సెస్ ఆఫీసులో చర్చలు జరిపారు. పార్లమెంటు సెంట్రల్ హాలులో బీజేపీ పార్లమెంటరీ పార్టీ మంగళవారం భేటీ కానుంది. ఇందులో పార్లమెంటరీ పార్టీ నేతగా మోడీని లాంఛనప్రాయంగా ఎన్నుకోనున్నారు. ఇదే భేటీలో ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకార తేదీని ప్రకటించనున్నారు. అనంతరం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం ఉంటుంది. ఇందులో పాల్గొనేందుకు శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ప్రపంచ నేతలకు మోడీ కృతజ్ఞతలు సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తనను అభినందించిన ప్రపంచ నేతలందరికీ త్వరలోనే ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్న నరేంద్ర మోడీ కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా సహా పలు దేశాల ప్రభుత్వాధినేతలు, దేశాధినేతలకు‘ట్విట్టర్’ ద్వారా ధన్యవాదాలు చెప్పారు. కాగా మోడీకి వివిధ దేశాల నుంచి ఆహ్వానాలు వెల్లువెత్తుతున్నాయి. -
కేసీఆర్‌కు మోడీ ఫోన్
ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానం హైదరాబాద్ : ప్రధానమంత్రి పదవి చేపట్టబోతున్న బీజేపీ నేత నరేంద్రమోడీ, ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ ఆదివారం టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావుకు ఫోన్ చేసి అభినందించారు. ఈ సందర్భంగా మోడీ తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని కేసీఆర్‌ను ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి సహకరించాలని మోడీని కేసీఆర్ కోరగా... తప్పకుండా సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కేసీఆర్‌తో నిమ్మగడ్డ భేటీ.. ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, జీఎం ఆర్ అధినేత గ్రంధి మల్లికార్జునరావు కూడా కేసీఆర్ ను కలిసి అభినందించారు. ఇంకా సీనియర్ ఐఏఎస్ అధికారులు వి.నాగిరెడ్డి, బుర్రా వెంకటేశంతో పాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, పారిశ్రామికవేత్తలు కలిసి అభినందనలు తెలిపారు. మరో క్యాంపు కార్యాలయం కోసం అన్వేషణ ఇప్పుడున్న ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి బదులుగా ప్రత్యామ్నాయ క్యాంపు కార్యాలయం కోసం కేసీఆర్ అన్వేషిస్తున్నారు. బేగంపేటలో ప్రస్తుతమున్న సీఎం క్యాంపు కార్యాలయంలోకి మారడానికి కేసీఆర్ అయిష్టంగా ఉన్నట్టుగా ఆయన సన్నిహితులు వెల్లడించారు. కుందన్‌బాగ్‌లో ఉన్న మంత్రుల క్వార్టర్లను రెండు, మూడు కలిపి లేదా లేక్‌వ్యూ అతిథి గృహాన్ని తెలంగాణ సీఎంకు క్యాంపు కార్యాలయంగా చేసుకోవాలని అనుకుంటున్నారు. అయితే లేక్‌వ్యూ అతిథి గృహాన్ని ఆంధ్రప్రదేశ్ సీఎం క్యాంపు కార్యాలయంగా మార్చిన సంగతి తెలిసిందే. -
ఘనత మోడీదే: రాజ్‌నాథ్
ఈ గెలుపు చరిత్రాత్మకం నేడు బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ సాధించిన విజయం చరిత్రాత్మకమని, ఇదంతా నరేంద్ర మోడీ ఘనతేనని బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. దేశానికి నాయకత్వం వహించే సామర్థ్యం తమ ప్రధాని అభ్యర్థి అయిన ఆయనకే ఉందంటూ ప్రశంసలు కురిపించి, అభినందనలు తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఒక పార్టీ కాంగ్రెస్ కంటే పెద్ద పార్టీగా అవతరించడం, 1984 తర్వాత ఒక పార్టీకి స్పష్టమైన మెజారిటీ రావడం ఇదే తొలిసారి అని చెప్పారు. రాజ్‌నాథ్ శుక్రవారమిక్కడి పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. తమకు స్పష్టమైన మెజారిటీ వచ్చినప్పటికీ మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. శనివారం తమ పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశమై, పార్లమెంటరీపక్ష నేత ఎంపికపై చర్చించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రజల ఆకాంక్షలకు నెరవేర్చగలనని మోడీ నిరూపించుకున్నారని వెంకయ్య నాయుడు కొనియాడారు. బీజేపీ గెలుపుతో ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సంబరాలు అంబరాన్నంటాయి. నేతలు, కార్యకర్తలతో కార్యాలయం సందడిగా మారింది. రెండు ఏనుగులతో ఊరేగింపు నిర్వహించి, భారీగా బాణసంచా కాల్చారు. లక్ష లడ్డులను పంచారు. ‘న.మో’ పేరిట టీస్టాళ్లు పెట్టి ఉచితంగా టీ ఇచ్చారు. మోడీకి పూర్తి క్రెడిట్ ఇవ్వని అద్వానీ: మోడీని పార్టీ అగ్రనేత అద్వానీ ఫోన్ చేసి అభినందించారు. అయితే గెలుపు ఘనతను పూర్తిగా మోడీకే కట్టబెట్టేందుకు విముఖత చూపారు. పార్టీ సాధించిన అపూర్వ విజయానికి మోడీ నాయకత్వం ఎంతమేరకు దోహ దం చేసిందో అంచనా వేయాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు. కాగా, బీజేపీని గెలుపు దిశగా నడిపించిన మోడీని ప్రధాని మన్మోహన్ సింగ్ అభినందించారు. దేశ ప్రజలు మార్పును కోరుకున్నారని, అందుకే బీజేపీకి పట్టం కట్టారని ఆరెస్సెస్ పేర్కొంది. -
‘ప్రధాని అయ్యేందుకు మోడీకే నైతికత’
ముంబై: లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి మారొచ్చన్న ఊహాగానాల నేపథ్యంలో.. మోడీకి మాత్రమే ప్రధాని అయ్యేందుకు నైతికత ఉందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ స్పష్టంచేశారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ 300 సీట్ల మార్కును చేరుకుంటుందని, మోడీ ప్రధాని అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని పదవిని చేపట్టేందుకు పాలనా దక్షతతోపాటు నైతికత అవసరమని, అది మోడీకే ఉందన్నారు. మోడీపై విభజనవాది అన్న ముద్ర వల్ల ఎన్డీఏకు తగినంత మెజారిటీ రాకపోవచ్చని, అప్పుడు కొత్త మిత్రులను ఆకర్షించేందుకు ప్రధానిగా రాజ్‌నాథ్ పేరు తెరపైకి వస్తుందంటూ సాగుతున్న ఊహాగానాలపై గురువారమిక్కడ విలేకరులు ప్రశ్నించగా ఆయన ఈ మేరకు స్పందించారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి హయాంలో ఎన్డీఏలో 24 పార్టీలున్నాయని, ఇప్పుడు ప్రధాని అభ్యర్థిగా మోడీ ఉన్నప్పుడు కూడా 25 పార్టీలున్నాయన్నారు. తమది సమైక్య పార్టీనే కానీ విభజన పార్టీ కాదన్నారు. -
'ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం'
-
బీజేపీ తెలంగాణకు కట్టుబడే ఉంది : రాజ్‌నాథ్ సింగ్
-
లోక్‌సభ ఎన్నికల్లో 272+ సీట్లే లక్ష్యం
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో 272కన్నా ఎక్కువ సీట్ల లక్ష్యసాధనపై ప్రధానంగా దృష్టిసారించాలని బీజేపీ శ్రేణులకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. యూపీఏ పాలనలో అవి నీతి, కుంభకోణాలు, అధిక ధరలు, నిరుద్యోగంతో విసుగుచెందిన ప్రజలు బీజేపీ నాయకత్వం, మోడీ సారథ్యం వైపు చూస్తున్నారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రతి ఒక్కరూ యత్నించాలని సూచించారు. గురువారం ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీ య పదాధికారుల సమావేశంలో రాజ్‌నాథ్‌తోపాటు అగ్రనేత ఎల్.కె.అద్వానీ, ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీ పాల్గొన్నారు. శుక్రవారం నుంచి మొదలవనున్న జాతీయ కార్యవర్గం, జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న తీర్మానాలపై భేటీలో సుదీర్ఘ చర్చ జరిగింది. కార్యవర్గ భేటీలో ఆర్థిక తీర్మానాన్ని జవదేకర్, రాజకీయ తీర్మానాన్ని రవిశంకర్ ప్రసాద్, జాతీయ కౌన్సిల్లో ఆర్థిక తీర్మానాన్ని జైట్లీ, రాజకీయ తీర్మానాన్ని సుష్వా స్వరాజ్ ప్రవేశపెట్టాలని నిర్ణయం. ఎన్నికల విరాళాల సేకరణకు ఇటీవల ఆవిష్కరించిన ‘ప్రధానిగా మోడీ’ నిధికి దేశవ్యాప్తంగా వివిధ హోదాల్లో ఉన్న సుమారు 1.30 లక్షల మంది పార్టీ ప్రజా ప్రతినిధులు నెల వేతనాన్ని ఇవ్వాలని నిర్ణయం.