'పాక్ కు దీటైన సమాధానం చెప్పాల్సి ఉంది' | Rashid Alvi calls government should strong response on pakistan cease fire | Sakshi
Sakshi News home page

'పాక్ కు దీటైన సమాధానం చెప్పాల్సి ఉంది'

Published Thu, Jan 1 2015 11:04 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

'పాక్ కు దీటైన సమాధానం చెప్పాల్సి ఉంది' - Sakshi

'పాక్ కు దీటైన సమాధానం చెప్పాల్సి ఉంది'

న్యూఢిల్లీ: భారత సరిహద్దుల్లో తరచు కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడుతున్న పాకిస్థాన్ కు దీటైన సమాధానం చెప్పాల్సి ఉందని కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ స్పష్టం చేశారు. పాక్ సేనలు పదే పదే భారత్ ను రెచ్చగొడుతున్నాయన్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం సరైన రీతిలో బదులు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఇదిలా ఉండగా పాక్ కాల్పుల ఉల్లంఘన చర్యలపై చర్చిస్తున్నామని కేంద్ర హోంమత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు.
 

గత రాత్రి పాక్ బలగాలు 12 భారత స్థావరాలపై దాడులకు పాల్పడి ఉద్రిక్త పరిస్థితులకు తెరలేపింది. జమ్మూ కశ్మీర్ లోని సాంబా జిల్లాలోని మోర్తార్ షెల్లింగ్ లో పాకిస్థాన్ బలగాలు కాల్పులకు పాల్పడటంతో ఒక భారత జవాన్ తో సహా ఐదుగురు మృతి చెందారు.ఈ ఘటనలో నలుగురు పాక్ జవాన్లు అసువులు బాసారు.
 
జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు గుండా భారత్ భూభాగంలోకి ప్రవేశించిన పాక్ బలగాలు  దాడులకు దిగడంతో స్థానిక పౌరుడొకరు తీవ్రంగా గాయపడ్డాడు. గత రెండు రోజుల్లో పాకిస్థాన్ మూడోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. అంతకుముందు పాక్ జరిపిన కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాన్ ఒకరు మరణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement