ప్రయాణికులకు అలెర్ట్.. ఆ నగరాలకు విమానాల రాకపోకలు బంద్‌! | Air India, IndiGo cancel flights to multiple cities | Sakshi
Sakshi News home page

ప్రయాణికులకు అలెర్ట్.. ఆ నగరాలకు విమానాల రాకపోకలు బంద్‌!

May 13 2025 7:33 AM | Updated on May 13 2025 11:29 AM

Air India, IndiGo cancel flights to multiple cities

ఢిల్లీ: ఆపరేషన్‌ సిందూర్‌తో భారత్‌- పాకిస్తాన్ మధ్య కమ్ముకున్న యుద్ధ మేఘాల కారణంగా కేంద్రం గగన తలంపై ఆంక్షలు విధించింది. అయితే, భద్రతా చర్యల దృష్ట్యా విమానాల రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతాయని ఇండిగో,ఎయిరిండియా విమానయాన సంస్థలు ప్రకటించాయి.  మే 13 నుంచి మే 17 అర్ధరాత్రి వరకు రాకపోకలను నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాయి.

శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, లేహ్, చండీగఢ్, రాజ్‌కోట్‌లకు రాకపోకలు నిర్వహించే ఇండిగో అన్ని విమానాలను శనివారం రాత్రి 11:59 గంటల వరకు రద్దు చేసింది. రద్దుతో ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

ప్రయాణికులకు ఇండిగో, ఎయిరిండియా అలర్ట్

ఎయిరిండియా మంగళవారం (మే 13) జమ్మూ, లేహ్, జోధ్‌పూర్, అమృత్‌సర్, భుజ్, జామ్నగర్, చండీగఢ్, రాజ్‌కోట్‌లకు విమానాల రాకపోకల్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేసింది. తాజా పరిణామాలు, ప్రయాణికుల దృష్ట్యా మే 13న పైన పేర్కొన్న ప్రాంతాలకు విమానాల సర్వీసుల్ని రద్దు చేస్తున్నట్లు ట్వీట్‌లో పేర్కొంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement