Rashid alvi
-
లుంగీ ధరించినవాళ్లు నేరస్తులు కాదు: రషీద్ అల్వీ
లక్నో: ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ మండిపడ్డారు. శనివారం డిప్యూటీ సీఎం మౌర్య మాట్లాడుతూ.. లుంగీ ధరించి, టోపీ పెట్టుకున్న వాళ్లు గతంలో ఉత్తరప్రదేశ్‌లో శాంతి భద్రలతకు సవాల్‌గా మారారని అన్నారు. అయితే 2017లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం.. అటువంటి నేరస్తులను మళ్లీ కనిపించలేదని తెలిపారు. చదవండి: పాక్‌తో వాణిజ్య చర్చలు వృథా.. సిద్ధూ వ్యాఖ్యలపై విమర్శలు లుంగీ, టోపీ ధరించిన గూండాలు చేతిలో గన్‌పట్టుకొని వ్యాపారస్తులను బెదిరింపులకు గురిచేసేవారని అన్నారు. ఆయన వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ మట్లాడుతూ.. లుంగీ ధరించినవాళ్లంతా నేరస్తులు కాదన్నారు. ఉత్తరప్రదేశ్‌లో గెలవడానికి బీజేపీ ఓ కులాన్ని టార్గెట్ చేస్తోందని మండిపడ్డారు. లుంగీ, టోపీ ధరించినవారిని నేరస్తులంటూ కించరుస్తున్నారని, అలా అయితే హిందూవుల్లో అధికంగా లుంగీ, టోపీ ధరించేవాళ్లు ఉన్నారని తెలిపారు. లుంగీ ధరించిన వారందరినీ నేరస్తులని ఎలా అంటారని ప్రశ్నించారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఉద్దేశం ప్రజలకు అర్థం అవుతోందని, బీజేపీ సత్యానికి భయపడుతోందని మండిపడ్డారు. -
'పాక్ కు దీటైన సమాధానం చెప్పాల్సి ఉంది'
న్యూఢిల్లీ: భారత సరిహద్దుల్లో తరచు కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడుతున్న పాకిస్థాన్ కు దీటైన సమాధానం చెప్పాల్సి ఉందని కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ స్పష్టం చేశారు. పాక్ సేనలు పదే పదే భారత్ ను రెచ్చగొడుతున్నాయన్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం సరైన రీతిలో బదులు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఇదిలా ఉండగా పాక్ కాల్పుల ఉల్లంఘన చర్యలపై చర్చిస్తున్నామని కేంద్ర హోంమత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. గత రాత్రి పాక్ బలగాలు 12 భారత స్థావరాలపై దాడులకు పాల్పడి ఉద్రిక్త పరిస్థితులకు తెరలేపింది. జమ్మూ కశ్మీర్ లోని సాంబా జిల్లాలోని మోర్తార్ షెల్లింగ్ లో పాకిస్థాన్ బలగాలు కాల్పులకు పాల్పడటంతో ఒక భారత జవాన్ తో సహా ఐదుగురు మృతి చెందారు.ఈ ఘటనలో నలుగురు పాక్ జవాన్లు అసువులు బాసారు. జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు గుండా భారత్ భూభాగంలోకి ప్రవేశించిన పాక్ బలగాలు దాడులకు దిగడంతో స్థానిక పౌరుడొకరు తీవ్రంగా గాయపడ్డాడు. గత రెండు రోజుల్లో పాకిస్థాన్ మూడోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. అంతకుముందు పాక్ జరిపిన కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాన్ ఒకరు మరణించారు. -
మోడీని ఢీకొనేందుకు అల్వీ తహతహ
వారణాసిలో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని ఢీకొనేందుకు తాను సిద్ధమని కాంగ్రెస్ నాయకుడు రషీద్ అల్వీ ముందుకొచ్చారు. ఈ మేరకుపార్టీ అధినేత్రి సోనియాగాంధీకి ఆయన విజ్ఞప్తి చేశారు. వారణాసి నుంచి పోటీ చేసేందుకు తనకు అవకాశం కల్పించాల్సిందిగా అధినేత్రి సోనియాగాంధీకి తాను ఓ లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. వారణాసి చాలా లౌకిక నగరమని, అక్కడి వాళ్లు తనకు తప్పకుండా మద్దతిస్తారనే భావిస్తున్నానని అన్నారు. వారణాసి నుంచే పోటీ చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ బీజేపీకి డూప్ అని అల్వీ అభివర్ణించారు. మాజీ ఎంపీ అయిన రషీద్ అల్వీ గతంలో కాంగ్రెస్ పార్టీకి అధికార ప్రతినిధిగా కూడా వ్యవహరించారు. -
‘లోక్‌సభ’పై అసెంబ్లీ ప్రభావం: రషీద్ అల్వీ
న్యూఢిల్లీ: నవంబర్-డిసెంబర్ నెలల్లో ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలపై ప్రభావం చూపుతాయని కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ సాధారణంగా స్థానిక సమస్యలపై ఆధారపడి ఉంటుందని, అయితే, ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు లోక్‌సభ ఎన్నికలకు దగ్గర్లో ఉన్నాయని ఆయన అన్నారు. ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాల్లో నవంబర్ 11 నుంచి డిసెంబర్ 4 మధ్య అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఐదు రాష్ట్రాల్లోనూ డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఢిల్లీ, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాలు కాంగ్రెస్ పాలనలో ఉండగా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లు బీజేపీ పాలనలో ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్, బీజేపీల నడుమనే ప్రధానంగా పోటీ ఉంటుంది. అయితే, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ కొత్తగా ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ కీలక శక్తిగా పుంజుకుంది. మరోవైపు, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కీలకమైనవేనని బీజేపీ కూడా అంగీకరించింది. అయితే, కేంద్రంలోని యూపీఏ సర్కారు అవినీతి, దుష్పరిపాలన కూడా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపుతాయని బీజేపీ నాయకుడు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అవినీతి ముఖ్య ప్రచారాంశం కాగలదని సీపీఐ నేత డి.రాజా అన్నారు.