
లక్నో: ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ మండిపడ్డారు. శనివారం డిప్యూటీ సీఎం మౌర్య మాట్లాడుతూ.. లుంగీ ధరించి, టోపీ పెట్టుకున్న వాళ్లు గతంలో ఉత్తరప్రదేశ్‌లో శాంతి భద్రలతకు సవాల్‌గా మారారని అన్నారు. అయితే 2017లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం.. అటువంటి నేరస్తులను మళ్లీ కనిపించలేదని తెలిపారు.
చదవండి: పాక్‌తో వాణిజ్య చర్చలు వృథా.. సిద్ధూ వ్యాఖ్యలపై విమర్శలు
లుంగీ, టోపీ ధరించిన గూండాలు చేతిలో గన్‌పట్టుకొని వ్యాపారస్తులను బెదిరింపులకు గురిచేసేవారని అన్నారు. ఆయన వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ మట్లాడుతూ.. లుంగీ ధరించినవాళ్లంతా నేరస్తులు కాదన్నారు. ఉత్తరప్రదేశ్‌లో గెలవడానికి బీజేపీ ఓ కులాన్ని టార్గెట్ చేస్తోందని మండిపడ్డారు.
లుంగీ, టోపీ ధరించినవారిని నేరస్తులంటూ కించరుస్తున్నారని, అలా అయితే హిందూవుల్లో అధికంగా లుంగీ, టోపీ ధరించేవాళ్లు ఉన్నారని తెలిపారు. లుంగీ ధరించిన వారందరినీ నేరస్తులని ఎలా అంటారని ప్రశ్నించారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఉద్దేశం ప్రజలకు అర్థం అవుతోందని, బీజేపీ సత్యానికి భయపడుతోందని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment