keshav prasad maurya
-
యమునా తీరే.. ఎవరికి వారే
లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో పేలవ ఫలితాల దెబ్బకు రాష్ట్ర బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు ఒక్కసారిగా తెరపైకి వస్తున్నాయి. 2019తో పోలిస్తే యూపీలో బీజేపీ అనూహ్యంగా సగానికి సగం స్థానాలు కోల్పోవడం తెలిసిందే. పార్టీ కేంద్రంలో వరుసగా మూడోసారి సొంతంగా మెజారిటీ సాధించడంలో విఫలమవడానికి ఇదే ప్రధాన కారణంగా నిలిచింది. దీన్ని కమలనాథులు సీరియస్‌గా తీసుకున్నారు. రాష్ట్ర పారీ్టలోనూ, యోగి కేబినెట్లోనూ త్వరలో భారీ మార్పుచేర్పులకు రంగం సిద్ధమవుతోంది. దీంతోపాటు సీఎం యోగి ఆదిత్యనాథ్ దూకుడుకు పగ్గాలు వేసేందుకు అధిష్టానమే ప్రయతి్నస్తున్నట్టు చెబుతున్నారు. యోగి ప్రభుత్వంపై సాక్షాత్తూ సొంత పారీ్టకే చెందిన ఉప ముఖ్యమంత్రి మౌర్య బాహాటంగా విమర్శలు... రాష్ట్ర పార్టీ చీఫ్‌తో కలిసి ఆయన హస్తిన యాత్రలు... మోదీ, నడ్డా తదితర పెద్దలతో భేటీ... ఇవన్నీ అందులో భాగమేనని రాజకీయంగా జోరుగా చర్చ జరుగుతోంది...!ఉత్తరప్రదేశ్ బీజేపీ చీఫ్ భూపేంద్రసింగ్ చౌదరి బుధవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ప్రసాద్ మౌర్యతో కలిసి ఆయన మంగళవారమే హస్తిన చేరుకున్నారు. అదే రాత్రి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో మౌర్య గంటకు పైగా సమావేశమయ్యారు. అనంతరం చౌదరి కూడా నడ్డాతో విడిగా భేటీ అయ్యారు. నిజానికి యోగి, మౌర్య మధ్య మొదటినుంచీ సత్సంబంధాలు లేవు. యోగి అభీష్టానికి వ్యతిరేకంగా మౌర్యకు అధిష్టానం డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టింది. ఈ నేపథ్యంలో మౌర్య, యూపీ బీజేపీ చీఫ్ హస్తిన యాత్ర రాష్ట్రంలో రాజకీయ కలకలం రేపుతోంది. మౌర్య నెల రోజులుగా కేబినెట్ సమావేశాలకు వరుసగా డుమ్మా కొడుతూ వస్తున్నారు. యూపీలో త్వరలో 10 అసెంబ్లీ స్థానాలకు కీలక ఉప ఎన్నికలు జరగనున్నాయి. వాటి సన్నద్ధత కోసం మంత్రులతో యోగి ఏర్పాటు చేసిన భేటీకి కూడా మౌర్య వెళ్లలేదు. పైగా నెల రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి సీనియర్ కేంద్ర మంత్రులు, పార్టీ పెద్దలను వరుస పెట్టి కలుస్తూ వస్తున్నారు. జూలై 14న కూడా నడ్డాతో చాలాసేపు మంతనాలు జరిపారు. ఆ భేటీతో... ఆదివారం లఖ్‌నవూలో జరిగిన బీజేపీ రాష్ట్రస్థాయి ప్రతినిధుల సమావేశం యూపీలో రాజకీయ వేడిని ఒక్కసారిగా పెంచేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు, బీజేపీ నేతలు, ప్రతినిధులు కలిపి 3,500 మందికి పైగా పాల్గొన్న ఆ భేటీలో వేదిక మీదే యోగి, మౌర్య మధ్య పరోక్షంగా మాటల యుద్ధం సాగింది. మౌర్య ప్రసంగిస్తూ, ‘ప్రభుత్వం కంటే పారీ్టయే మిన్న. కనుక పారీ్టదే పై చేయిగా వ్యవహారాలు సాగాలి’’ అంటూ బాహాటంగా వ్యాఖ్యలు చేశారు. దాంతో అంతా విస్తుపోయారు. ప్రభుత్వ వ్యవహారాల్లో బీజేపీ నేతల మాట పెద్దగా చెల్లడం లేదని పారీ్టలో యోగి వ్యతిరేకులు చాలాకాలంగా వాపోతున్నారు. అధికారులకు యోగి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడమే ఇందుకు కారణమని ఆరోపిస్తున్నారు. అందుకే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతలు, కార్యకర్తలు దూకుడుగా పని చేయలేదని, రాష్ట్రంలో దారుణ ఫలితాలకు ప్రధాన కారణాల్లో ఇదీ ఒకటన్నది వారి వాదన. ఎస్పీ, బీఎస్పీ సానుభూతిపరులైన అధికారులకు కీలక పదవులు కట్టబెట్టారంటూ వారంతా యోగిపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సీఎం సమక్షంలోనే మౌర్య మాటల తూటాలు పేల్చారు. ‘‘కార్యకర్తలే కీలకం. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అందరూ వారిని గౌరవించాల్సిందే. నేనైనా ముందు బీజేపీ కార్యకర్తను. తర్వాతే డిప్యూటీ సీఎంను’’ అన్నారు. ‘‘కార్యకర్తల బాధే నా బాధ. ప్రతి కార్యకర్తకూ నా ఇంటి తలుపులు నిత్యం తెరిచే ఉంటాయి’’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలూ చేశారు. యోగి సమక్షంలోనే ప్రభుత్వ పనితీరును తప్పుబట్టేలా మౌర్య ఇలా మాట్లాడటం వెనక అధిష్టానం ఆశీస్సులున్నట్టు చెబుతున్నారు. అయితే మౌర్య అనంతరం మాట్లాడిన యోగి కూడా ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. ప్రభుత్వ పనితీరు ఏమాత్రం మారబోదని అదే వేదిక నుంచి కుండబద్దలు కొట్టారు. ఆ వెంటనే మౌర్య, చౌదరి హస్తిన వెళ్లడం, మోదీ, నడ్డా తదితరులతో భేటీ కావడం చకచకా జరిగిపోయాయి. అనంతరం తాజాగా బుధవారం ఎక్స్ పోస్టులో కూడా ‘ప్రభుత్వం కంటే పారీ్టయే పెద్ద’దన్న వ్యాఖ్యలను మౌర్య పునరుద్ఘాటించారు. వీటన్నింటినీ బేరీజు వేసి చూస్తే యూపీకి సంబంధించి బీజేపీ అధిష్టానం త్వరలో ‘పెద్ద’ నిర్ణయం తీసుకోవచ్చంటూ యోగి వ్యతిరేక వర్గం జోరుగా ప్రచారం చేస్తోంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత యోగిని సీఎం పదవి నుంచి తప్పించడం ఖాయమని ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం పదేపదే చెబుతూ వస్తుండటం తెలిసిందే.యోగి సంచలన వ్యాఖ్యలు అధిష్టానం మనోగతాన్ని పసిగట్టిన యోగి ముందుగానే వ్యూహాత్మకంగా పై ఎత్తులు వేస్తున్నారని అంటున్నారు. అతి విశ్వాసమే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కొంప ముంచిందని మూడు రోజుల క్రితం ఆయన ఏకంగా బహిరంగ సభలోనే వ్యాఖ్యలు చేయడం ఉద్దేశపూర్వకమేనని భావిస్తున్నారు. ఇవి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. బీజేపీ అధిష్టానం ఇప్పటికిప్పుడు యోగిని మార్చడం వంటి భారీ నిర్ణయాలకు వెళ్లకపోయినా అసెంబ్లీ ఉప ఎన్నికల్లో సత్ఫలితాలు రాబట్టలేకపోతే ఆయనకు ఇబ్బందులు తప్పేలా లేవు. మరోవైపు బీజేపీ ఇంటి పోరుపై విపక్షాలన్నీ చెణుకులు విసురుతున్నాయి. యూపీకి ముగ్గురు సీఎంలున్నారంటూ కాంగ్రెస్, సమాజ్‌వాదీ సహా ఎద్దేవా చేస్తున్నాయి. అంతర్గత కుమ్ములాటల్లో మునిగి తేలుతూ పాలనను గాలికొదిలారంటూ దుయ్యబడుతున్నాయి. మౌర్య, మరో డిప్యూటీ సీఎం బ్రిజేశ్ పాఠక్ కూడా సీఎంలుగానే వ్యవహరిస్తున్నారన్నది వాటి విమర్శల ఆంతర్యం. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల్లో అత్యధిక స్థానాలను నెగ్గడం యోగికి అత్యవసరం. రాష్ట్ర పార్టీ కీలక నేతల సహాయ నిరాకరణ నేపథ్యంలో ఈ కఠిన పరీక్షలో ఆయన ఏ మేరకు నెగ్గుకొస్తారన్నది ఆసక్తికరం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
యూపీ బీజేపీలో రగడ.. అఖిలేష్ వ్యాఖ్యలకు కేశవ్ మౌర్య స్ట్రాంగ్ కౌంటర్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో రాజకీయంగా ఒక్కసారిగా వేడెక్కింది. అధికార బీజేపీలో కోల్డ్ వార్ కొనసాగుతున్న వేళ కాషాయ పార్టీ నేతలపై ఎస్పీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో అఖిలేష్‌కు డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య కౌంటరిచ్చారు.కాగా, అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలపై కేశవ్ మౌర్య స్పందిస్తూ..‘కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం బలంగా ఉంది. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ గుండాయిజం తిరిగి రావడం అసాధ్యం. 2017 ఎన్నికల ఫలితాలే 2027లో కూడా రిపీట్ అవుతాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో గెలుస్తుంది’ అంటూ కామెంట్స్ చేశారు.ఇక, అంతకుముందు యూపీ బీజేపీ రాజకీయాలపై అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ..‘యోగి ఆదిత్యానాథ్ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వం అస్ధిరతతో సతమతమవుతోంది. బీజేపీ నేతలు సీఎం కుర్చీ కోసం కొట్టాడుకుంటున్నారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు చోటుచేసుకుంటున్నాయి. కాషాయ నేతల మధ్య ఆధిపత్య పోరుతో అభివృద్ధి అటకెక్కింది. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధ్యాయులను వేధిస్తోంది. రాష్ట్ర రాజధాని లక్నోలో ఇళ్ల కూల్చివేత నిర్ణయాన్ని వాయిదా వేశారు. యూపీలో యోగి సర్కార్ బలహీనపడుతుంది అనేందుకు ఇదే ఉదాహరణ అని సెటైరికల్ కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య మధ్య విభేదాలు మరింతగా ముదిరినట్లు తెలుస్తున్నది. లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో బీజేపీ పేలవ ప్రదర్శన తర్వాత వీరి మధ్య విభేదాలు మరింతగా పెరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఆయన సమావేశం కావడం యూపీలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. కాగా, యూపీలో పార్టీ వ్యూహాన్ని రూపొందించేందుకు ఈ సమావేశాలు జరిగినట్లు సమాచారం.మరోవైపు.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలోని 80 లోక్‌సభ స్థానాలకు గాను సమాజ్‌వాదీ పార్టీ, ఇండియా కూటమి 43 స్థానాలను గెలుచుకోగా.. బీజేపీ నేతృత్వంలోని ఏన్డీయే 36 స్థానాలను గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 64 స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. -
యూపీ బీజేపీలో బిగ్ ట్విస్ట్.. సీఎం యోగిపై కేశవ్ మౌర్య ప్లానేంటి?
లక్నో: ఉత్తరప్రదేశ్ బీజేపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కంటే సంస్థ(పార్టీ) పెద్దది అంటూ కేశవ్ మౌర్య చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.కాగా, పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో యూపీలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో పార్టీ నేతల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఇలా జరిగిందని చర్చ పార్టీలో నడుస్తోంది. ఇందుకు సీఎం యోగి పనితీరు కూడా ఒక కారణమని పార్టీ నేతలు విమర్శించారు. ఇక, రాష్ట్రంలో త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. UP: On UP Deputy CM Keshav Prasad Maurya's post on X stating "Organisation bigger than government", BJP MP Ravi Kishan says, "He has said correct...Organisation only forms the party..."— RAKESH CHOUDHARY (@R_R_Choudhary_) July 17, 2024 ఈనేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో డిప్యూటీ సీఎం కేశవ్ ఒంటరిగా ఢిల్లీలో సమావేశం కావడం చర్చకు దారి తీసింది. ఇక, వీరి భేటీ దాదాపు గంట పాటు జరిగింది. ఈ సందర్భంగా యూపీలో పది అసెంబ్లీ స్థానాల్లో జరుగనున్న ఉప ఎన్నికలపై చర్చించినట్టు తెలుస్తోంది. కాగా, ఈ భేటీలో సీఎం పదవి మార్పు గురించి ఎలాంటి చర్చ జరగలేదని సమాచారం.మరోవైపు.. జేపీ నడ్డాతో భేటీ అనంతరం కేశవ్ మౌర్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కేశవ్ మౌర్య ట్విట్టర్ వేదికగా..‘ప్రభుత్వం కంటే పార్టీ పెద్దది. కార్యకర్తల ఆవేదనే నా బాధ. పార్టీ కంటే ఎవరూ ముఖ్యం కాదు. పార్టీకి కార్యకర్తలే గర్వ కారణం’ అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి.ఇదిలా ఉండగా.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ , డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యకు మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక, ఉప ఎన్నికల తర్వాత యోగి కేబినెట్లో మార్పులు జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరోవైపు.. యూపీ బీజేపీ చీఫ్ భూపేంద్ర చౌదరి కూడా నడ్డాతో విడిగా సమావేశమైనట్లు సమాచారం. పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలను తొలగించేందుకు కృషి చేయాలని నడ్డా సూచించినట్లు వర్గాలు పేర్కొన్నాయి. -
మళ్ళీ బీజేపీదే విజయం: యూపీ డిప్యూటీ సీఎం
లక్నో: లోక్‌సభ 2024 ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న తరుణంలో జాతీయ పార్టీల కీలక నేతలు కూడా క్యాంపెయిన్‌లో చురుగ్గా పాల్గొంటున్నారు. జాతీయ పార్టీలకు మద్దతుగా ప్రాంతీయ పార్టీల నేతలు కూడా ప్రచారం సాగిస్తున్నారు. ఈ తరుణంలో శ్రావస్తి నుంచి బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి 'సాకేత్ మిశ్రా'కు మద్దతుగా ఒక సభలో ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి 'కేశవ్ ప్రసాద్ మౌర్య' కీలక వ్యాఖ్యలు చేశారు.లోక్‌సభ ఎన్నికల్లో కన్నౌజ్ నుంచి పోటీ చేస్తున్న సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తున్న రాహుల్ గాంధీలు ఓడిపోతారని కేశవ్ ప్రసాద్ మౌర్య అన్నారు. 2019లో కన్నౌజ్ నుంచి అఖిలేష్ భార్య డింపుల్ యాదవ్ ఎలా ఓడిపోయారో.. ఈ సారి కూడా అదే విధంగా ఓడిపోతారని, రాయ్‌బరేలీ నుంచి రాహుల్ ఓటమిని చవి చూస్తారని అన్నారు.ఎన్నికల్లో బీజేపీ పార్టీ 400 సీట్లకు పైగా గెలుస్తుందని అన్నారు. ఇండియా కూటమి నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ.. అవినీతి పార్టీలన్నీ ఒకే తాటిపైకి వచ్చాయని ఆరోపించారు. రాజ్యాంగం ప్రమాదంలో పడిందని ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని అన్నారు.भारत विरोधी ताकतें नहीं चाहती कि मोदी जी फिर से प्रधानमंत्री बने।#NarendraModi @Saketmisra_ #AbkiBaar400Paar #LokSabhaElections2024#PhirEkBaarModiSarkar#4JuneKo400Paar pic.twitter.com/QZJzb2EEVx— Keshav Prasad Maurya (मोदी का परिवार) (@kpmaurya1) May 6, 2024 -
యూపీ పాలిటిక్స్‌లో ట్విస్ట్.. సీఎం యోగి సీటుకు ఎసరు పెట్టిన అఖిలేష్?
ఉప ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్‌లో మరోసారి రాజకీయం రసవత్తరంగా మారింది. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సీటుకే ఎసరు పెట్టారు. దీంతో, యూపీ పాలిటిక్స్ చర్చనీయాంశంగా మారాయి. వివరాల ప్రకారం.. ఎస్పీ వ్యవస్థాపకుడు, అఖిలేష్ యాదవ్ తండ్రి ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఖాళీ అయిన రాంపూర్ ఎంపీ స్థానంలో అఖిలేష్ భార్య డింపుల్ యాదవ్ పోటీ చేస్తున్నారు. కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా అఖిలేష్ యాదవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రచారంలో అధికార బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే డిప్యూటీ సీఎంలు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని, అయితే ఆ ప్రయత్నంలో వారిద్దరూ విఫలమయ్యారని సంచలన కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో వారికి అఖిలేష్ యాదవ్ బంపరాఫర్ ఇచ్చారు. వాళ్లకు ఆఫర్ ఇచ్చేందుకు మేం ముందుకొచ్చాం. మా నుంచి 100 మంది ఎమ్మెల్యేలను తీసుకోండి. మేం మీ వెంట ఉంటాం. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు సీఎం అవ్వండి అని కామెంట్స్ చేశారు. దీంతో, యూపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇక, అఖిలేష ఆఫర్‌పై డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య స్పందించారు. ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్ ఆఫర్‌ను నేను తిరస్కరిస్తున్నాను. అఖిలేష్ యాదవ్ ఎప్పటికీ సీఎం కాలేదు. అఖిలేష్ ముందుగా.. తన సొంత ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నం చేయాలి. సమాజ్‌వాదీ పార్టీలో గూండాలు ఉన్నందున వారిని మా పార్టీలోకి తీసుకోవడం లేదు అంటూ కామెంట్స్ చేశారు. ఇక, రాంపూర్ ఉప ఎన్నికలకు డిసెంబర్ 5వ తేదీన పోలింగ్ జరుగనుంది. డిసెంబర్ 8వ తేదీన ఎన్నికలు ఫలితాలు విడుదల కానున్నాయి. "SP chief Akhilesh Yadav, you will not be able to become the chief minister, nor will you be able to make anyone (Chief Minister)," Uttar Pradesh Dy CM Keshav Prasad Maurya said. https://t.co/nYKynmoDPM — The New Indian Express (@NewIndianXpress) December 2, 2022 -
వారి అవినీతికి ‘ట్విన్ టవర్స్’ సజీవ సాక్ష్యం: డిప్యూటీ సీఎం
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో సూపర్‌టెక్ సంస్థ అక్రమంగా నిర్మించిన జంట భవనాలు క్షణాల వ్యవధిలోనే నేలమట్టమయ్యాయి. అనధికారికంగా, అక్రమంగా గ్రీన్జోన్లో నిర్మించిన అత్యంత ఎత్తైన టవర్స్‌ను కూల్చేయాల్సిందేనంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు నోయిడా అథారిటీ అధికారులు కూల్చేశారు. ఈ క్రమంలో విపక్షాలపై విమర్శలు గుప్పించింది ఉత్తర్‌ప్రదేశ్ అధికార బీజేపీ. అలాంటి అక్రమ కట్టడాలతో రాజకీయ నాయకులు, బిల్డర్స్, అధికారుల మధ్య అనుబంధం ఎలా ఉంటుందో తెలుస్తుందని విమర్శించింది. భవిష్యత్తులో రాష్ట్రంలోని అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది. నోయిడా ట్విన్ టవర్స్ నిర్మాణానికి 2004లో అనుమతులు లభించాయి. దీంతో అప్పటి సమాజ్‌వాదీ పార్టీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య. ‘సమాజ్ వాదీ పార్టీ అవినీతి, అరాచకాలకు నోయిడా ట్విట్ టవర్స్ సజీవ సాక్ష్యం. నేడు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో ఎస్పీ అవినీతి భవనం కూలిపోతుంది. ఇదే న్యాయం, ఇదే సుపరిపాలన.’ అని ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు డిప్యూటీ సీఎం. नोएडा का सुपरटेक ट्विन टॉवर श्री अखिलेश यादव और सपा के शासनकाल के भ्रष्टाचार और अराजकता की नीति का जीवंत प्रमाण है। आज मुख्यमंत्री श्री योगी आदित्यनाथ जी के नेतृत्व में भाजपा की सरकार में सपा के भ्रष्टाचार की इमारत ढहेगी। यह है न्याय, यही सुशासन।#TwinTowers — Keshav Prasad Maurya (@kpmaurya1) August 28, 2022 డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ఆరోపణలను తిప్పికొట్టింది సమాజ్ వాదీ పార్టీ. ‘ఈ అవినీత కట్టడం నిర్మించటానికి బీజేపీ సైతం కారణం. బీజేపీకి సూపర్‌టెక్ భారీగా నిధులు ముట్టజెప్పింది. కాషాయ పార్టీకి చెందిన ఆఫీసులో కూర్చుని ఓ బ్రోకర్ అందుకు బ్రోకరేజ్ అందుకున్నాడు.’ అని ఆరోపించింది. ఇదీ చదవండి: Noida Twin Towers: పేకమేడల్లా కుప్పకూలిన నోయిడా ట్విన్ టవర్స్ .. 9 సెకన్లలోనే.. -
తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే
సాక్షి, హైదరాబాద్/కాచిగూడ: తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ఉత్తరప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఆయన హైదరాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లా డుతూ, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజలకు శ్రీరామరక్షగా మారాయన్నారు. ప్రపంచదేశాలన్నీకూడా మోదీ పాలనను ఆదర్శంగా తీసుకుంటున్నాయని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ప్రజలకు కమలంపై భరోసా పెరిగి బహ్మరథం పడుతున్నారని, ఫలితంగా బీజేపీ అనుకూల పవనాలు వీస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీదే విజయమన్నారు. తెలంగాణలో అవినీతి రాజ్యమేలుతోందని, సీఎం కేసీఆర్ సంకుచిత మనస్తత్వంతో వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు లక్ష్యం గాడితప్పిందని దుయ్యబట్టారు. అవినీతిరహిత పాలనకోసం టీఆర్ఎస్ను తరిమి కొట్టి బీజేపీకి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. హోర్డింగ్‌లతో దివాలాకోరుతనం ప్రధానమంత్రి, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు హైదరాబాద్‌కు వస్తుంటే స్వాగతించాల్సింది పోయి, టీఆర్ఎస్ తన ప్రచార కార్యక్రమాల హోర్డింగ్‌లతో రోడ్లన్నీ నింపేసి దివాలాకోరుతనాన్ని నిరూపించుకుందని మౌర్య దుయ్యబట్టారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గౌతంరావు, ఇతర నేతలు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో బీజేపీదే అధికారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అతి త్వరలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ప్రసాద్ మౌర్య చెప్పారు. అధికార టీఆర్‌ఎస్ట్‌పై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ప్రత్యామ్నాయం కోసం బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కనుమరుగవుతోందని, ఆ పార్టీ ప్రజాదరణ కోల్పోయిందంటూ.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం తథ్యమన్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్ వచ్చిన మౌర్య ‘సాక్షి’తో మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... మోదీ పాలనకు అందరూ జై కొడుతున్నారు.. వెనుకబడిన వర్గాలకు అత్యంత ప్రాధాన్యమిచ్చే పార్టీ బీజేపీయే. ప్రధాని పదవిలోనే ఒక వెనుకబడ్డ వర్గానికి చెందిన వ్యక్తిని ఉంచిన పార్టీ మాది. రాష్ట్ర అధ్యక్షుడు మొదలు చాలా రాష్ట్రాల్లో అత్యంత ప్రాధాన్యత ఉన్న పదవుల్లో ఓబీసీలున్నారు. పేదలు, బడుగులు, బలహీన వర్గాలు, వ్యాపారులు, రైతులు, విద్యావేత్తలు.. ఇలా అన్ని వర్గాలకు చెందిన ప్రజలంతా మోదీ పాలనకు జై కొడుతున్నారు. కానీ రాష్ట్రంలో మోదీపై విషం చల్లే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడాన్ని ప్రజలు క్షమించరు. ఈ పరిస్థితులన్నీ పరిశీలిస్తున్న ప్రజలు బీజేపీకి మరింత మద్దతు ఇస్తారు. ఇవన్నీ వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా మారతాయి. టీఆర్ఎస్కు ఓట్లు వేసే పరిస్థితి లేదు.. టీఆర్ఎస్ కేవలం ఒక రాష్ట్రానికే పరిమితమైన పార్టీ. దేశంలోని చాలామందికి ఈ పార్టీ గురించి తెలియదు. కానీ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ. చాలా రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన పార్టీ ఇది. అలాంటి బీజేపీని కేంద్రంలో టీఆర్ఎస్ ఎలా ఎదుర్కోగలుగుతుంది? మరోవైపు టీఆర్ఎస్పై తెలంగాణలోని ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్రాన్ని దివాలా తీయించిన టీఆర్ఎస్కు ప్రజలు ఈసారి ఓటు వేసే పరిస్థితిలో లేరు. అందుకే బీజేపీ వైపు చూస్తున్నారు. బీజేపీ కూడా తెలంగాణ రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. అందులో భాగంగానే ఇక్కడ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహిస్తున్నాం. త్వరలో తెలంగాణలో డబు ల్ ఇంజన్ ప్రభుత్వాన్ని ప్రజలు చూడనున్నారు. ఉత్తర, దక్షిణ భారత్‌లు రెండూ సమానమే మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీతో ఉన్న కూట మిని ప్రజలు తిరస్కరించారు. అందుకే ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ, శివసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. మాకు ఉత్తరా ది, దక్షిణాది అంతా సమానమే. ఏక్ భారత్.. శ్రేష్ట్ భారత్ నినాదాన్ని అందుకున్నది బీజేపీనే. -
సీఎం కేసీఆర్‌కు రోజులు దగ్గరపడ్డాయి: డిప్యూటీ సీఎం మౌర్య
సాక్షి, హైదరాబాద్: 2023 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ భారీ మెజార్టీ సాధిస్తుందని ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'సీఎం కేసీఆర్‌కు రోజులు దగ్గరపడ్డాయి. తెలంగాణ ప్రజలు బీజేపీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ దేశ రాజకీయాలకంటే తెలంగాణ పాలనపై దృష్టి పెడితే బాగుంటుంది. మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు పెడితే పేద, బలహీన వర్గాలు క్షమించవు. మహారాష్ట్రలో అనైతిక పొత్తుపెట్టుకున్న ఉద్ధవ్‌ను ప్రజలు వ్యతిరేకించారు. ఉదయ్‌పూర్‌లో టైలర్ కన్హయ్యలాల్ హత్య సహించరానిది. కాంగ్రెస్ దేశ రాజకీయాల్లో అస్థిత్వాన్ని కోల్పోయింది' అని డిప్యూటీ సీఎం కేశవ్‌ప్రసాద్ మౌర్య అన్నారు. చదవండి: (సీతారామన్ టంగ్ స్లిప్: కేటీఆర్ కౌంటర్, వైరల్ వీడియో) -
అఖిలేష్ నోట అసభ్యకరమైన పదాలు.. సీఎం యోగి మందలింపు
లక్నో: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీలో బుధవారం ఆసక్తికర పరిణామాలు.. అదీ వాడీవేడిగా కొనసాగాయి. ప్రతిపక్ష నేత, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ నోటి నుంచి అసభ్య పదజాలం వెలువడగా.. జోక్యం చేసుకున్న సీఎం యోగి ఆయన్ని తీవ్రంగా మందలించారు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అధికార-ప్రతిపక్ష నేతల మాటల యుద్ధంతో బుధవారం అట్టుడికిపోయింది. తన హయాంలో జరిగిన అభివృద్ధినే బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు తమ ఘనతగా చూపించుకుంటోందని అఖిలేష్ పదే పదే ప్రకటించుకున్నారు. దీనికి కౌంటర్‌గా డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య చేసిన వ్యాఖ్యలతో చిర్రెత్తుకొచ్చిన అఖిలేష్ యాదవ్.. ఒకానొక టైంలో సభలోనే అనుచిత వ్యాఖ్యలు చేశారు. అఖిలేష్ అధికారంలో ఉన్నప్పుడు.. తన పాలన గురించి గొప్పగా చెప్పుకునేవారు. అదే నిజమైతే ఆయన పార్టీని జనాలు.. ఎన్నికల్లో ఊడ్చిపడేసేవాళ్లు కాదు కదా! అని మౌర్య వ్యాఖ్యానించారు. అలాగే తన హయాంలో సంక్షేమ పథకాల గురించి అఖిలేష్ పదే పదే చెప్పుకుంటున్నారని, దీనికి ఆయనకు చికిత్స అవసరమంటూ వ్యాఖ్యానించారు. రోడ్లు, మెట్రో, ఎక్స్‌ప్రెస్‌వే.. ఇవన్నీ సైఫాయ్‌లోని మీ భూములు అమ్మి కట్టించారా? అంటూ మండిపడ్డారు మౌర్య. ఈ కామెంట్లతో చిర్రెత్తుకొచ్చిన అఖిలేష్ యాదవ్.. ఒక్కసారిగా అసభ్య పదజాలంతో మౌర్యపై విరుచుకుపడ్డాడు. దీంతో జోక్యం చేసుకున్న సీఎం యోగి ఆదిత్యానాథ్.. అఖిలేష్‌ను మందలించారు. तुमने राशन के लिए पैसे क्या अपने पिता जी से लेकर बाँटे …? फ्लावर समझा है क्या, फायर हैं फायर #AkhileshYadav #kpmaurya समाजवादी पार्टी #KeshavPrasadMaurya #BJP pic.twitter.com/kD8GJT2uFb — parasmudgal (@Spamudgal786) May 26, 2022 ‘‘సభలో అదీ గౌరవ సభ్యుడ్ని ఉద్దేశించి అలా మాట్లాడడం ఎంతమాత్రం సరికాదు. ఇక్కడ విషయం సైఫాయ్ గురించి కాదు. అభివృద్ధి పనులు చేయడం.. పర్యవేక్షించడం ప్రభుత్వంగా మా విధి. సంక్షేమ పనులను, అభివృద్ధిని ప్రకటించుకునే హక్కు మాకు కూడా ఉంది. డిప్యూటీ సీఎం ఇదే విషయాన్ని చెప్పదల్చుకున్నారు. ఆయన ఏం చెప్తున్నారో మీరు ముందుగా వినాల్సింది. ప్రతిపక్ష సభ్యులు చాలామంది చేసే తప్పు ఇదే. ఇది అంగీకరించాల్సి విషయం. అంతేగానీ.. అంతగా ఉద్రేకపడాల్సిన అవసరం లేదు. సభలో సభ్యతతో వ్యవహరిస్తే మంచిది అని మందలించారు. అంతేకాదు సభ రికార్డుల నుంచి అఖిలేష్ వ్యాఖ్యలను తొలగించాల్సిందిగా స్పీకర్ సతీష్ మహానాకు సీఎం యోగి రిక్వెస్ట్ చేశారు. అంతకు ముందు రోజు(మంగళవారం) అసెంబ్లీలో ఎస్సీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ చేసిన బాయ్స్ విల్ బాయ్స్ కామెంట్లు తీవ్ర దుమారం రేపాయి. అత్యాచారాలకు మరణశిక్ష విధించాలన్న వాదనను వ్యతిరేకిస్తూ.. అబ్బాయిలు అబ్బాయిలే.. కొన్నిసార్లు తప్పులు జరుగుతుంటాయి అంటూ ములాయం వ్యాఖ్యలు చేశారు. అయితే యూపీలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ అసెంబ్లీ సమావేశాల్లో అఖిలేష్ వ్యాఖ్యలకు.. సీఎం యోగి ‘ములాయం వ్యాఖ్యలను’ వ్యాఖ్యలను కౌంటర్‌గా తెరపైకి తెచ్చారు. -
కీలక నేత మౌర్య.. ఈయన కూడా చాయ్‌వాలానే!
ఆరెస్సెస్ మూలాలు, రామమందిరం, గో సంరక్షణ కోసం పోరాటం, ఓబీసీ కులం కార్డు ఇవన్నీ కలిపి ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యను రాష్ట్ర బీజేపీలో శక్తిమంతుడిగా మార్చాయి. గత ఎన్నికల్లో సీఎం కావల్సిన వ్యక్తికి ఆఖరి నిమిషంలో పదవి చేజారిపోయింది. ఇప్పుడు ఇతర కీలక ఓబీసీ నేతలు పార్టీని వీడడంతో అంతా తానై వ్యవహరిస్తున్నారు. బీజేపీకి సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇమేజ్ ఎంత ముఖ్యమో, ఓబీసీ వర్గాల్లో, పార్టీలో మంచి పట్టున్న మౌర్య కూడా అంతే ముఖ్యం. అందుకే ఇద్దరి మనసు నొప్పించకుండా, కలుపుకొని ముందుకు వెళుతోంది కమలదళం. గత ఎన్నికల్లో ఏకంగా 200 ర్యాలీలు నిర్వహించి పార్టీ గెలుపులో కీలకంగా మారిన మౌర్య ఈసారి కూడా ఎన్నికల ప్రచారాన్ని తన భుజస్కంధాలపై నడిపిస్తున్నారు. యాదవేతర ఓబీసీ ఓట్లను సంఘటితం చేసే ప్రధాన బాధ్యతను తీసుకొని అందులో విజయం సాధించారు. రాష్ట్రంలో 45% మంది ఓబీసీలు ఉంటే యాదవులు మొదట్నుంచీ ఎస్పీ వైపే ఉన్నారు. మిగిలిన ఓబీసీలందరూ బీజేపీ వైపు ఆకర్షితులు కావడంతో ఆ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో 312 సీట్లతో ఘన విజయం సాధించింది. అప్పట్లో యూపీ సీఎం పదవి మౌర్యకే దక్కుతుందని అందరూ భావించారు. కానీ ఆశ్చర్యకరంగా యోగి ఆదిత్యనాథ్ తెరపైకి రావడంతో మౌర్యకి ఉప ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించారు. పీడబ్ల్యూడీ మంత్రిగా ఉన్నారు. 2019లో యోగి ఆదిత్యనాథ్‌కు అత్యంత సన్నిహితుడు, ఓబీసీ నాయకుడు స్వతంత్రదేవ్ సింగ్‌కు రాష్ట్ర బీజేపీ పగ్గాలు అప్పగించడాన్ని మౌర్య జీర్ణించుకోలేకపోయారు. అప్పట్నుంచి అసంతృప్తితో ఉన్నప్పటికీ ఆరెస్సెస్ జోక్యంతో యోగి, మౌర్య మళ్లీ ఒక్కటయ్యారు. ఈసారి ఎన్నికల్లో ఓబీసీ నాయకులు స్వామి ప్రసాద్ మౌర్య సహా పలువురు ఎస్పీ బాట పట్టడంతో బీజేపీలో ఓబీసీలకు పెద్ద దిక్కుగా మారారు. టికెట్ల పంపిణీలో బీజేపీ నాయకత్వం మౌర్య చెప్పిన మాటకు అధిక ప్రాధాన్యాన్నే ఇచ్చింది. ఎస్పీ బాట పట్టిన ఓబీసీ నాయకులు కూడా కేశవ్ ప్రసాద్ మౌర్య వ్యక్తిత్వాన్ని గొప్పగా చెబుతారు. బీజేపీలో ఆయనకి అన్యాయం జరుగుతోందని, నిస్సహాయంగా ఉండిపోయారని కామెంట్లు చేస్తూ ఉంటారు. చాయ్‌వాలా కేశవ్‌ప్రసాద్ మౌర్య మృదుభాషి. ప్రజలతో నేరుగా సంబంధాలు ఉన్నవారు. వారి సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీలాగే చిన్నప్పుడు తన తండ్రి శ్యామ్‌లాల్ మౌర్యతో కలిసి టీ అమ్మేవారు. పేపర్ బాయ్‌గా పని చేశారు. ఇంటర్మీడియట్ చదివారు. అది కూడా గుర్తింపు లేని కళాశాలలో చదవడంతో ఆయన విద్యార్హతలపై వివాదాలున్నాయి. సహచర ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు ఆయన గురించి చాలా గొప్పగా చెబుతారు. మొదట్నుంచీ యూపీలో పార్టీని పటిష్టపరచడానికి పని చేశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన కేబినెట్లో ఎవరికి విలువ ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. యూపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అటు యోగి, ఇటు మౌర్య ఎవరినీ వదలుకోలేని స్థితిలో పార్టీ కొట్టుమిట్టాడింది. అప్పుడు స్వయంగా ఆరెస్సెస్ రంగంలోకి దిగి ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఒక మెట్టు దిగి స్వయంగా మౌర్య ఇంటికి వెళ్లి మాట కలిపారు. సంఘ్ అగ్రనాయకుల సమక్షంలో ఇద్దరూ రాజీకి రావడంతో బీజేపీ కేడర్ ఊపిరిపీల్చుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని కౌశంబి జిల్లాలోని సిరాథు గ్రామంలో 1969 మే 7న జన్మించారు. యుక్త వయసులోనే ఆరెస్సెస్, బజరంగ్‌దళ్‌లో సభ్యునిగా ఉన్నారు. గో సంరక్షణ, రామజన్మభూమి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. రాజకుమార్ మౌర్యను పెళ్లాడారు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. 2002లో తొలిసారిగా బాందా నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తే కేవలం 204 ఓట్లు వచ్చాయి. 2007లో రెండోసారి అలహాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఈసారి కూడా బీఎస్పీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు 2012లో ముచ్చటగా మూడోసారి సిరాథు నియోజకవర్గంలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. బీఎస్పీ అభ్యర్థి ఆనంద్ మోహన్‌పై 9 వేల ఓట్లతో విజయం సాధించారు 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఫుల్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 3 లక్షలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. పోలయిన ఓట్లలో 52 శాతం ఓట్లు సాధించి రికార్డ్ సృష్టించారు. 2016లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికలను రాష్ట్ర అధ్యక్షుడిగా, ప్రముఖ ఓబీసీ నాయకుడిగా ముందుండి నడిపించారు. మరే నాయకుడు చేయలేని విధంగా 200 ర్యాలీలు చేపట్టారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఓబీసీ నేతల జంప్.. కీలకంగా మారిన కేశవ్ ప్రసాద్.. యోగి లేకుంటే సీఎం అయ్యేవారే!
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లో కాషాయ పార్టీకి పట్టుకొమ్మలుగా ఉన్న ఓబీసీ నేతలు ఒక్కొక్కరుగా నిష్క్రమిస్తున్న వేళ... సామాజిక సమీకరణాలు మారకుండా చూసుకునేందుకు పార్టీ నమ్ముకున్న ఏకైక వ్యక్తి ‘కేశవ్ ప్రసాద్ మౌర్య’. ఐదేళ్ల కిందట యూపీ పీఠాన్ని అధిరోహించేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ముందుండి నాయకత్వం వహించిన ఆయనే ప్రస్తుత ఎన్నికల్లో పార్టీకి పెద్దదిక్కుగా మారారు. ఓబీసీల్లో బలమైన పట్టున్న కేశవ్ప్రసాద్నే ప్రధాన ముఖంగా పెట్టి ఎన్నికలను ఢీకొనే కార్యాచరణను తీసుకోవడంతో ఆయన ప్రాధాన్యం మరింత పెరిగింది. 2017లోనే ముఖ్యమంత్రి పదవికి ఆయన బలమైన పోటీదారుగా ఉన్నప్పటికీ, ఆశ్చర్యకరంగా యోగి ఆదిత్యనాథ్ తెరపైకి రాగా, ఈ మారు మాత్రం మౌర్యను సీఎంగా చూడాలనుకుంటున్న నేతల సంఖ్య గణనీయంగా పెరగడం ఆయన ఛరిష్మాను చెప్పకనే చెబుతోంది. (చదవండి: స్కూలు విద్యార్థి ఆత్మహత్య కేసులో దోషుల్ని విడిచిపెట్టం) సంఘ్ నుంచి డిప్యూటీ దాకా... యూపీలో అధికంగా ఓబీసీ వర్గాలకు చెందిన వారు 42 శాతం వరకు ఉండగా, వర్గాల్లో అధిక పట్టు కలిగిన వర్గంగా మౌర్యాలు ఉన్నారు. మౌర్య వర్గానికి చెందిన కేశవ్ ప్రసాద్‌కు తొలినుంచి జన్‌సంఘ్ బజ్రంగ్దళ్తో అనుబంధం ఉంది, గోసంరక్షణ, రామజన్మభూమి ఉద్యమాల్లో పాల్గొన్న కేశవ్‌ప్రసాద్ అనంతరం బీజేపీలో చేరి వివిధ విభాగాల్లో పనిచేశారు. అనంతరం 2002, 2007లో సిరతు నియోకవర్గం నుంచి ఓడిన కేశ్ప్రసాద్ తదనంతరం 2012లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం 2014 ఎన్నికల్లో పుల్పూర్ స్థానం నుంచి లోక్‌సభకు పోటీ చేసి గెలిచారు. జవహార్‌లాల్ నెహ్రూ ప్రాతినిధ్యం వహించిన ఈ నియోజకవర్గం కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండగా, దాన్ని బద్ధలు కొట్టడంతో ఈయన పేరు అందరికీ తెలిసింది. అనంతరం 2016లో సంఘ్ జోక్యంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల నాయకత్వ బాధ్యతలను పూర్తిగా తనపై మోసిన కేశవ్‌ప్రసాద్ ఏకంగా 200 ర్యాలీలు చేపట్టి 312 సీట్లు రావడంలో కీలకపాత్ర పోషించారు. ఈ సమయంలోనే కేశవ్‌ప్రసాద్‌ను సీఎంను చేస్తారని అంతా భావించినా అనూహ్యంగా యోగి తెరపైకి రావడంతో ఆయన ఎమ్మెల్సీగా ఎంపిక చేసి డిప్యూటీ సీఎం చేశారు. పీడబ్ల్యూడీ మంత్రిగా యూపీ అభివృధ్ధిలో తనదైన ముద్ర వేసిన కేశవ్‌ప్రసాద్ తనకిచ్చిన పనిని చేసుకుంటూ వెళ్లారు. అయితే ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీకి చెందిన ఇద్దరు ఓబీసీ మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య, ధారాసింగ్ చౌహాన్లు పార్టీని వీడటంతో పార్టీ ఒక్కసారిగా ఖంగుతింది. ఈ సమయంలో కేశవ్‌ప్రసాద్ మౌర్య అత్యంత కీలకంగా వ్యవహరించి, మరింతమంది ఓబీసీ నేతలు జారిపోకుండా చర్యలు చేపట్టారు. అదీగాక సమాజ్‌వాదీ పార్టీలో బలంగా ఉన్న యాదవేతర నేతలు బీజేపీలో చేరేలా కృషి చేశారు. దీంతో పాటే పార్టీ మిత్రపక్షాలు, అప్నాదళ్, నిషాద్ పార్టీలతో కేశవ్ మౌర్యకు ఉన్న మంచి సంబంధాలను దృష్టిలో పెట్టుకొని పార్టీ ఆయనకు సీట్ల సర్దుబాటుకు ప్రధాన అనుసంధాన కర్తగా పెట్టింది. ఆయన వల్లే సీట్ల సర్దుబాటు అంశం సాఫీగా సాగిందనే భావన ఉంది. ఇక ఆయను ప్రస్తుత ఎన్నికల్లో పోటీచేయించే అంశమై చర్చోపచర్చలు జరగ్గా, తన సొంత నియోకవర్గం సిరాతు నుంచి పోటీ చేసేందుకు ఆయన మొగ్గు చూపారు. ఈ స్థానంలో సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే శీతలా ప్రసాద్ సైతం కేశవ్‌ప్రసాద్‌కు సిరాత్ టిక్కెట్ కేటాయించడాన్ని స్వాగతించారు. తన గురువు కోసం సీటును త్యాగం చేయడం తనకేబి ఇబ్బందిగా లేదని ప్రకటించిందంటే కేశవ్‌ప్రసాద్‌పై లాంటి వ్యక్తో అర్థం చేసుకోవచ్చు. (చదవండి: ఆయనొక క్రౌడ్ పుల్లర్.. మాటలు తూటాల్లా పేలుతాయ్..) -
ఉప ముఖ్యమంత్రి మొహం మీదే తలుపులు వేసిన మహిళలు
సాక్షి, న్యూఢిలీ: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన డిప్యూటీ సీఎం కేశవ్ప్రసాద్మౌర్యకు చుక్కెదురైంది. తన సొంత నియోజగవర్గం సిరాతూలో కొందరు మహిళలు.. మౌర్య మొహం మీదే తలుపులు మూసేశారు. ప్రచారంలో భాగంగా మూడురోజుల నుంచి కనిపించకుండా పోయిన జిల్లా పంచాయతీ సభ్యుడు రాజేశ్ మౌర్య కుటుంబాన్ని పరామర్శించడానికి ఆదివారం ఆయన వెళ్లారు. ఈ క్రమంలోనే స్థానికులు.. డిప్యూటీ సీఎం రాగానే తలుపులు మూసుకున్నారు. అనంతరం ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిని నిశబ్దంగా ఉండాలని మౌర్య చేతితో సంజ్ఞలు చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే రాజేశ్ మౌర్య కేసులో పోలీసుల వ్యవహరించిన తీరుకు వ్యతిరేకంగా స్థానికులు నిరసన చేయడం వల్లే ఈ ఘటన జరిగినట్లు బీజేపీ తెలిపింది. (చదవండి: బీజేపీకి గుడ్‌బై.. ఏ పార్టీలోకి వెళ్లను.. ‘ఏక్ నిరంజన్’: మాజీ సీఎం) -
లుంగీ ధరించినవాళ్లు నేరస్తులు కాదు: రషీద్ అల్వీ
లక్నో: ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ మండిపడ్డారు. శనివారం డిప్యూటీ సీఎం మౌర్య మాట్లాడుతూ.. లుంగీ ధరించి, టోపీ పెట్టుకున్న వాళ్లు గతంలో ఉత్తరప్రదేశ్‌లో శాంతి భద్రలతకు సవాల్‌గా మారారని అన్నారు. అయితే 2017లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం.. అటువంటి నేరస్తులను మళ్లీ కనిపించలేదని తెలిపారు. చదవండి: పాక్‌తో వాణిజ్య చర్చలు వృథా.. సిద్ధూ వ్యాఖ్యలపై విమర్శలు లుంగీ, టోపీ ధరించిన గూండాలు చేతిలో గన్‌పట్టుకొని వ్యాపారస్తులను బెదిరింపులకు గురిచేసేవారని అన్నారు. ఆయన వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ మట్లాడుతూ.. లుంగీ ధరించినవాళ్లంతా నేరస్తులు కాదన్నారు. ఉత్తరప్రదేశ్‌లో గెలవడానికి బీజేపీ ఓ కులాన్ని టార్గెట్ చేస్తోందని మండిపడ్డారు. లుంగీ, టోపీ ధరించినవారిని నేరస్తులంటూ కించరుస్తున్నారని, అలా అయితే హిందూవుల్లో అధికంగా లుంగీ, టోపీ ధరించేవాళ్లు ఉన్నారని తెలిపారు. లుంగీ ధరించిన వారందరినీ నేరస్తులని ఎలా అంటారని ప్రశ్నించారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఉద్దేశం ప్రజలకు అర్థం అవుతోందని, బీజేపీ సత్యానికి భయపడుతోందని మండిపడ్డారు. -
యూపీ సర్కార్ – రైతుల రాజీ ఫార్ములా
లక్నో: ఉత్తరప్రదేశ్ లఖీమ్‌పూర్ ఖేరిలో ఆదివారం నుంచి నిరసనలు చేస్తున్న రైతు సంఘాలకు, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి మధ్య రాజీ కుదిరింది. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటనలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతుల మీదుగా రెండు ఎస్‌యూవీలు దూసుకుపోవడం, ప్రతిగా రైతులు బీజేపీ కార్యకర్తలపై దాడులకు దిగిన ఘటనల్లో మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనల్లో మరణించిన నలుగురు రైతు కుటుంబాలకు ప్రభుత్వం రూ.45 లక్షల చొప్పున భారీ నష్ట పరిహారం ప్రకటించింది. ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చింది. గాయపడిన రైతులకు రూ. 10 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వనున్నట్టుగా రాష్ట్ర హోంశాఖ అదనపు కార్యదర్శి అవనీశ్ అవస్తి వెల్లడించారు. దీంతో రైతులు కూడా వెనక్కి తగ్గారు. నిరసన విరమించి మరణించిన రైతన్నలకు అంతిమ సంస్కారాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇక ఈ హింసాకాండపై హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ చేయించాలని యూపీ సర్కార్ నిర్ణయించింది. భారతీయ కిసాన్ యూనియన్ (బికెయూ) నేత రాకేశ్ తికాయత్ సమక్షంలోనే ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించారు. లఖీమ్‌పూర్‌ఖేరి హింసతో సంబంధమున్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్రపతి కోవింద్‌కు లేఖ రాసింది. మంత్రి కుమారుడిపై హత్య కేసు లఖీమ్‌పూర్ హింసాకాండపై రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. కాన్వాయ్ దూసుకుపోయిన ఘటనలో నలుగురు రైతులు మరణించగా, ఆ తర్వాత జరిగిన హింసాకాండలో బీజేపీ కార్యకర్తలు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడైన ఆశిష్ ఒక వాహనాన్ని నడుపుతున్నాడని రైతులు ఆరోపిస్తూండటంతో... అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, లఖీమ్‌పూర్ ఖేరి ఘటనలపై దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు సోమవారం నిరసనలు చేపట్టాయి. రెండు నిమిషాలు చాలు కేంద్ర మంత్రి పాత వీడియో హల్చల్ మంత్రి అజయ్ కుమార్‌దిగా భావిస్తున్న పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఆయన రైతులపై తీవ్ర ఆగ్రహం ప్రదర్శిస్తున్నారు. ‘మిమ్మల్ని క్రమశిక్షణలో పెట్టడానికి నాకు రెండు నిమిషాలు చాలు’ అని ఆయన అంటున్నట్టుగా వీడియోలో ఉంది. ‘‘నాతో తలపడండి. కేవలం 2 నిమిషాల్లో మిమ్మల్ని దారికి తెస్తా. నేను మంత్రినో, ఎంపీనో, ఎమ్మెల్యేనో మాత్రమే కాదు. అంతకు ముందు నుంచి ప్రజలకు నేనెవరో తెలుసు. సవాళ్ల నుంచి నేను పారిపోను’’అని చెబుతున్నట్టుగా ఉంది. -
యూపీ డిప్యూటీ సీఎంకు కరోనా
లక్నో: దేశంలో కరోనా వైర్స్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. కోవిడ్-19 సామాన్యులతో పాటు ప్రజా ప్రతినిధులను కూడా వదలడంలేదు. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యకి కరోనా సోకింది. స్వల్ప లక్షణాలు కనిపించడతో ఆయన కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. కోవిడ్ పరీక్షలో తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆయన స్వయంగా వెల్లడించారు. తనతో గత కొన్ని రోజులుగా సన్నిహితంగా కలిసి తిరిగినవారు కరోనా జాగ్రత్తలు తీసుకోని, కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇటీవల యూపీ మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి నందగోపాల్ గుప్తా కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ కరోనా మహమ్మారి ఉత్తరప్రదేశ్ సాంకేతిక విద్యా శాఖ మంత్రి కమల్‌రాణిని పొట్టన పెట్టుకున్న సంగతి విధితమే. చదవండి: (విజృంభణ: లక్ష దాటిన కరోనా మరణాలు) -
ప్రియాంకా గాంధీ పేరు మార్చిన బీజేపీ నేత
లక్నో : కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వాద్రాకు ఉత్తరప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య కొత్త పేరు పెట్టారు. ఆమెకు ‘ప్రియాంకా ట్విటర్ వాద్రా’గా నామకరణం చేశామని తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రియాంక గాంధీని సోషల్ మీడియా మాత్రమే ఒక గొప్ప జాతీయ స్థాయి నాయకురాలిగా చూపిస్తోందని కానీ, ప్రజలు మాత్రం ఆమెను అలా గుర్తించడంలేదన్నారు. 2019 ఎన్నికల్లో తన సోదరుడు రాహుల్ గాంధీని కూడా గెలిపించుకోని ఆమె.. జాతీయ నాయకురాలు ఎలా అవుతుందని ప్రశ్నించారు. (చదవండి : దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారు) కాగా, లాక్డౌన్ నేపథ్యంలో యాంకా గాంధీ వరుసగా ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్న విషయం తెలిసిందే. వలస కార్మికుల గురించి సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మీద విరుచుకుపడుతున్నారు. యూపీకి చెందిన వలస కార్మికులను సొంతూళ్లకు చేర్చేందుకు సొంతంగా వాహనాలను కూడా ఏర్పాటు చేశారు. వరుసగా ఆమె ట్వీట్లు చేస్తూ బీజేపీ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రియాంక ఈ క్రమంలో కేశవ్ ప్రసాద్ మౌర్య మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రియాంకా గాంధీని నేను ఎప్పుడూ సిరియస్‌గా పరిగణించలేదు. ఆమెకు 'ప్రియాంక ట్విట్టర్ వాద్రా'గా తాము ఎప్పుడో నామకరణం చేశాం. రెండు మూడు రోజులకు ఒక ట్వీట్ చేస్తూ మీడియాలో బిజీ అయిపోతారు. సోషల్ మీడియా మాత్రమే ఆమెను జాతీయ స్థాయి నాయకురాలిగా చూపిస్తోంది. అంతే కానీ ప్రజలు అమెను పట్టించుకోవడం లేదు. 2019 ఎన్నికల్లో సోదరుడు రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేసేందుకు గాను ఉత్తరప్రదేశ్‌లో ప్రచారం చేసిన ప్రియాంకా..ఘోర పరాభావాన్ని చవిచూసిన విషయం అందరికి తెలిసిందే. సొంత సోదరుడినే గెలిపించుకోలేని ఆమె జాతీయ నాయకురాలు ఎలా అవుతుంది’ అని మౌర్య ప్రశ్నించారు. కాగా, గత పార్లమెంటు ఎన్నికల్లో స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. -
ఎస్పీ మాటల్లో తప్పేముంది? : డిప్యూటీ సీఎం
లక్నో : భారత్‌లో ఉండడం ఇష్టం లేకపోతే పాకిస్తాన్ వెళ్లిపోండి అని అన్న మీరట్ ఎస్పీ మాటల్లో తప్పేముందని ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య తిరిగి ప్రశ్నించారు. ఆ మాటలు మొత్తం ముస్లిం సమాజానికి వర్తించవని, కేవలం పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలు చేసిన వారికే వర్తిస్తాయని, విమర్శించేవారు ఇది గమనించాలని కోరారు. మౌర్య ఆదివారం ఓ మీడియాతో మాట్లాడుతూ.. సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో కొందరు పోలీసులపై రాళ్లు విసురుతూ పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేశారు. వారినుద్దేశించి మాత్రమే ఎస్పీ ఆ మాటలన్నారు. ఇందులో తప్పేముందో అర్థం కావట్లేదని వ్యాఖ్యానించారు. కాగా, ఇంతకు ముందు కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ స్పందిస్తూ ఎస్పీ వ్యాఖ్యలు నిజమైతే ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. చదవండి : వాళ్లను పాకిస్తాన్ వెళ్లిపొమ్మని చెప్పండి : మీరట్ ఎస్పీ -
‘పాకిస్తాన్ కూడా మీలా ప్రశ్నించలేదు’
లక్నో: భారత సైనిక బలగాల సామర్థ్యంపై ప్రతిపక్షాలు ప్రశ్నించిన విధంగా శత్రుదేశం పాకిస్తాన్ కూడా ప్రశ్నించలేదని ఉత్తర ప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సైనిక బలగాలపై దేశ ప్రజలకు పూర్తి స్థాయి నమ్మకముందని, కానీ కొంతమంది నేతలకే వారిపై నమ్మకం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జవాన్లను హేలనచేసే విధంగా కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వారి మాట్లాడే విధంగా పాకిస్తాన్‌కు చెందిన నాయకులు కూడా భారత సైన్యంపై చులకనగా మాట్లాడలేదని అన్నారు. విపక్షాలతో వ్యాఖ్యలతో సైనికుల ఆత్మసైర్థ్యం దెబ్బతినే అవకాశం ఉందని మౌర్య విమర్శించారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత ఐదేళ్లతో పోలిస్తే యూపీతో పాటు దేశ వ్యాప్తంగా బీజేపీ బలంగా ఉందని స్పష్టం చేశారు. తమ పార్టీని దెబ్బతీసేందుకు బీఎస్పీ, ఎస్పీ, కాంగ్రెస్ చేతులు కలిపినా తమకు జరిగే నష్టమేమీ లేదనిఅన్నారు. బలమైన నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారని, అది ప్రధాని మోదీతోనే సాధ్యమని మౌర్య అభిప్రాయపడ్డారు. -
పుల్వామా ఉగ్రదాడి కాదు.. ఓ యాక్సిడెంట్ : బీజేపీ నేత
న్యూఢిల్లీ : పుల్వామాలో జరిగింది ఉగ్రదాడి కాదని, అది ప్రమాదవశాత్తు జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దాంతో దిగ్విజయ్ పాకిస్తాన్ మద్దతుదారుడంటూ బీజేపీ సీనియర్ మంత్రులు ఆయనపై విమర్శల వర్షం కురింపించారు. ఈ వివాదం సద్దుమణగకముందే.. బీజేపీ ఎమ్మెల్యే ఒకరు పుల్వామాలో జరిగింది ఉగ్రదాడి కాదు.. ఓ యాక్సిడెంట్ మాత్రమే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బీజేపీని ఇరుకున పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్లో పోస్ట్ చేసిన దిగ్విజయ్.. ‘ఇప్పుడేమంటారు మోదీ’ అంటూ ప్రశ్నించారు. దిగ్విజయ్.. ‘పుల్వామా ఉగ్ర దాడిని నేను ప్రమాదవశాత్తు జరిగింది అంటే నా మీద విరుచుకుపడ్డారు. ఓ ముగ్గురు కేంద్ర మంత్రులైతే.. ఏకంగా నాపై పాకిస్తాన్ మద్దతుదారుడిగా ముద్ర వేశారు. మరి ఇప్పుడు మీ పార్టీ నాయకుడు.. ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ ప్రసాద్ మౌర్య కూడా పుల్వామా ఉగ్ర దాడిని ఓ యాక్సిడెంట్ అని స్పష్టం చేశారు. దీనిపై మీ స్పందన ఏంటి.. మినిస్టర్‌పై మీరు తీసుకోబోయే చర్యలేంటి మోదీజీ’ అంటూ దిగ్విజయ్ ట్వీట్ చేశారు. पुलवामा आतंकी हमले को मैंने “दुर्घटना” कह दिया तो मोदी जी से ले कर ३ केंद्रीय मंत्री जी मुझे पाकिस्तान समर्थक बताने में जुट गये। उत्तर प्रदेश में भाजपा के उप मुख्य मंत्री जी केशव देव मौर्य जी का बयान कृपया सुनें। मोदी जी व उनके मंत्रीगण मौर्य जी के बारे में कुछ कहना चाहेंगे? — digvijaya singh (@digvijaya_28) March 6, 2019 తీవ్ర దుమారం రేపిన ఈ వీడియోలో కేశవ ప్రసాద్ మౌర్య మీడియాతో మాట్లాడుతూ.. ‘ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగింది ఉగ్ర దాడి కాదు. భద్రతా లోపం వల్ల కూడా జరగలేదు. ఇది కేవలం ఓ యాక్సిడెంట్ మాత్రమే. దురదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో పలువురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. దాంతో మోదీ బలగాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఇక ఇప్పుడు బలగాలకు ఏది మంచిదనిపిస్తే దాన్నే ఆచరిస్తాయ’ని తెలిపారు. బాలాకోట్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులకు ఆధారాలు చూపించాలని కాంగ్రెస్ సీనియర్‌నేత కపిల్ సిబాల్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. उत्तर प्रदेश के उपमुख्यमंत्री @kpmaurya1 ने भी #पुलवामा हमले को सुरक्षा में चूक नहीं "दुर्घटना" कहा है। भक्तों इनको देशद्रोही कब घोषित कर रहे हो? या सेना के नाम पर केवल चुनावी रोटियां सेंकनी है? @brajeshabpnews @jarariya91 @AdityaMenon22 @shahnawazk @anandrai177 pic.twitter.com/FYTQzMnuN5 — Anshul Trivedi (@anshultrivedi47) March 5, 2019 -
‘పార్లమెంట్లో రామ మందిరం బిల్లు’
లక్నో : అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక బిల్లును ప్రవేశపెడుతుందని ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య వ్యాఖ్యానించారు. రాజ్యసభలో బీజేపీకి మెజార్టీ లేకపోవడం మూలంగా బిల్లు పెట్టడం లేదని, రాజ్యసభలో పూర్తి స్థాయి మెజార్టీ సాధించిన వెంటనే బిల్లును ప్రవేశపెడతామని ఆయన తెలిపారు. లక్నోలో ఆదివారం ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ రామ మందిర నిర్మాణం కోరకు మేం కట్టుబడి ఉన్నాం. ప్రస్తుతం లోక్‌సభలో పూర్తి మెజార్టీ ఉంది. కానీ బిల్లు ఆమోదం పొందడానికి రాజ్యసభలో తగిన మద్దతు లేదు’’. అని పేర్కొన్నారు. మౌర్యా తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘ఒకవేళ లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందినా.. రాజ్యసభలో అది వీగిపోతుంది. ఈ విషయం ప్రతీ రాముడి భక్తుడికి తెలుసు. త్వరలో దీనిపై సుప్రీంకోర్టు తీర్పును కూడా వెలువరిస్తుంది’’ అని పేర్కొన్నారు. కాగా రామ మందిర నిర్మాణంపై గతకొంత కాలం నుంచి బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు వరస ప్రకటన వెలువరిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్, ఆరెస్సెస్ అధినేత మోహన్ భగత్ సందర్శించి, రామమందిరం నిర్మాణం తప్పకుండా చేపడతామని వ్యాఖ్యానించారు. -
సై అంటే సై: సీఎం, డిప్యూటీ సీఎం సవాళ్లు
పట్నా: ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత కేశవ్ ప్రసాద్ మౌర్య విసిరిన సవాల్‌ను బిహార్ సీఎం నితీశ్ కుమార్ స్వీకరించారు. ఎన్నికలను వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌లోనూ మళ్లీ తాజాగా ఎన్నికలకు జరిపించాలని అన్నారు. బిహార్‌లో ఆర్జేడీ, జేడీ(యూ), కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వానికి తిరుగులేదనుకుంటే 2019 సాధారణ ఎన్నికల వరకు ఆగక్కర్లేకుండా బిహార్ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని కేపీ మౌర్య సవాల్ విసిరారు. యూపీ మాదిరిగా బిహార్‌లోనూ కమలం వికసిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధానిగా మోదీ మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రెండు రోజుల పాటు మౌర్య రెండు రోజుల పాటు పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నితీశ్‌పై విరుచుకుపడ్డారు. ‘నితీశ్‌కు అధికారం పట్ల వ్యామోహం ఉంది. అధికారం లేకుండా ఆయన ఉండలేరు. తన పని(అభివృద్ధి) పట్ల నమ్మకం ఉంటే తాజాగా ఎన్నికలకు వెళ్లి బలం నిరూపించుకోవాల’ని అన్నారు. మౌర్య సవాల్‌పై నితీశ్ స్పందించారు. ‘బిహార్‌లో రేపే ఎన్నికలకు వెళదాం. బీజేపీ నాయకులకు దమ్ముంటే యూపీలోనూ ఎన్నికలకు సిద్ధం కావాలి. బిహార్, ఉత్తరప్రదేశ్ నుంచి గెలిచిన లోక్‌సభ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి, తాజాగా ఎన్నికలు జరిపించాల’ని నితీశ్ కుమార్ అన్నారు. -
రాష్ట్రపతి ఎన్నికల తర్వాతే యోగి రాజీనామా
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గోవా సీఎం మనోహర్ పరీకర్‌లు రాష్ట్రపతి ఎన్నికల తర్వాత ఎంపీ పదవులకు రాజీనామా చేయనున్నారు. అయితే, రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతి ఓటు ముఖ్యమైనది కావడంతో ఎన్నికల తర్వాతే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని అధిష్టానం ఆదేశించినట్లు తెలుస్తోంది. ఉత్తర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా రాష్ట్రపతి ఎన్నికల తర్వాతే లోక్‌సభకు రాజీనామా చేయనున్నారు. ఆదిత్యానాథ్, కేశవ్ ప్రసాద్ మౌర్య లోక్‌సభ ఎంపీలు కాగా, మనోహర్ పరీకర్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. గోవా ముఖ్యమంత్రిగా మార్చి 14న పరీకర్ ప్రమాణస్వీకారం చేశారు. మార్చి 19న యోగి, మౌర్య ప్రమాణం చేశారు. ఆరు నెలల్లో వీరు ముగ్గురు తమ రాష్ట్రాల లెజిస్లేటర్ సభ్యులుగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. ఎంపీ పదవులకు రాజీనామా చేసిన తర్వాతే వీరు ఎమ్మెల్యేలుగా పోటీ చేయనున్నారు. -
యూపీ సీఎం రేసులో నేను లేను: కీలక నేత స్పష్టీకరణ
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ రోజు (శనివారం) సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి ఎవరనేది తేలిపోనుండగా.. రేసులో కీలకంగా ఉన్న పలువురు నేతల మధ్య పోటీ తీవ్రమవుతున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా కేంద్రమంత్రులు రాజ్‌నాథ్, మనోజ్ సిన్హా, బీజేపీ యూపీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య, ఎంపీ యోగిఆదిత్యానాథ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ పేర్లు కాకుండా పూర్తిగా కొత్త పేరు కూడా తుదిదశలో తెరపైకి రావొచ్చునని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేసులో అందరికంటే ముందంజలో ఉన్నట్టు భావిస్తున్న మనోజ్ సిన్హా తాజాగా స్పందించారు. తాను ముఖ్యమంత్రి పదవి రేసులో లేనేలేనని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఎవరన్నది పార్టీ శాసనసభాపక్షం, పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తాయని, తాను రేసులో ముందున్నాననని, తనకే అవకాశం వస్తుందంటూ జాతీయ మీడియా అనవసర కథనాలు వండి వారుస్తున్నదని ఆయన తప్పుబట్టారు. మరోవైపు యూపీ సీఎం రేసు హీటెక్కింది. తమ నాయకుడికే సీఎంగా అవకాశం ఇవ్వాలంటూ ఇటు కేశవ్ ప్రసాద్ మౌర్య, అటు యోగి ఆదిత్యానాథ్ మద్దతుదారులు లక్నోలో రోడెక్కి బలప్రదర్శన ర్యాలీలు నిర్వహించారు. మౌర్య శనివారం ఉదయం ఢిల్లీకి చేరుకొని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో మంతనాలు జరిపారు. సీఎం ఎంపికపైనే చర్చ జరిగినట్టు తెలుస్తోంది. లక్నోలో శనివారం సాయంత్రం 4 గంటలకు కేంద్ర పరిశీలకులు వెంకయ్య, భూపీంద్ర సింగ్ సమక్షంలో భేటీ అవ్వనున్న పార్టీ ఎమ్మెల్యేలు సీఎంను నిర్ణయించనున్నారు. ఈ నేపథ్యంలో వెంకయ్య, ఇతర అధిష్ఠాన నేతలు ఇప్పటికే లక్నో చేరుకున్నారు. మార్చి 19న (ఆదివారం) పార్టీ జాతీయ నాయకుల సమక్షంలో సీఎం ప్రమాణస్వీకారం ఉండనుంది. -
కౌన్ బనేగా యూపీ సీఎం!
-
కౌన్ బనేగా యూపీ సీఎం!
రేసులో ముగ్గురి పేర్లు పూజలు చేసిన మనోజ్ సిన్హా మీడియా కథనాలు అవాస్తవమన్న వెంకయ్య న్యూఢిల్లీ/లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ రోజు (శనివారం) సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి ఎవరు తేలిపోనుందని.. బీజేపీ స్పష్టం చేసినప్పటికీ.. రేసులో పలువురి పేర్లు వినిపిస్తుండటంతో ఎవరు సీఎం అవుతారన్నది ఇంకా స్పష్టత రాలేదు. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్, మనోజ్ సిన్హా, బీజేపీ యూపీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య, ఎంపీ యోగి ఆదిత్యానాథ్ పేర్లు సీఎం రేసులో ప్రధానంగా వినబడుతున్నా.. పూర్తిగా కొత్త పేరు కూడా తుదిదశలో తెరపైకి రావొచ్చునని పార్టీ వర్గాలు అంటున్నాయి. లక్నోలో శనివారం సాయంత్రం 4 గంటలకు కేంద్ర పరిశీలకులు వెంకయ్య, భూపీంద్ర సింగ్ సమక్షంలో భేటీ అవ్వనున్న పార్టీ ఎమ్మెల్యేలు సీఎంను నిర్ణయిస్తారని మౌర్య స్పష్టం చేశారు. మార్చి 19న (ఆదివారం) పార్టీ జాతీయ నాయకుల సమక్షంలో సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందన్నారు. మనోజ్ సిన్హా పూజలు! యూపీ సీఎం రేసులో ముందంజలో ఉన్నట్టు భావిస్తున్న సీనియర్ నేత, కేంద్రమంత్రి మనోజ్ సిన్హా శనివారం కాల భైరవ, కాశీ విశ్వనాథ ఆలయాలను దర్శించుకొని ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం గమనార్హం. ఇప్పటికే సీఎం రేసు నుంచి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ తప్పుకున్నారని, మౌర్య కూడా రేసులో ప్రధానంగా లేరని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో మచ్చలేని వ్యక్తిత్వం, పాలన అనుభవం గల నేతగా పేరొందిన సిన్హాకు యూపీ అందలం దక్కవచ్చునని భావిస్తున్నారు. మరోవైపు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు శనివారం స్పందిస్తూ.. ఈ రోజు సాయంత్రం యూపీ బీజేపీ ఎమ్మెల్యేలు సీఎం ఎన్నుకుంటారని చెప్పారు. సీఎం రేసులో పలువురు ఉన్నారంటూ మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవాలని ఆయన కొట్టిపారేశారు. -
నేడు యూపీ సీఎం ఎంపిక
ఆదివారం సీఎం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు న్యూఢిల్లీ/లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం ఎవరన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్, మనోజ్ సిన్హా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య పేర్లు వినబడుతున్నా.. తుది ఎంపికపై స్పష్టత రాలేదు. శనివారం లక్నోలో కేంద్ర పరిశీలకులు వెంకయ్య, భూపీంద్ర సింగ్ సమక్షంలో సమావేశం కానున్న పార్టీ ఎమ్మెల్యేలు సీఎంను నిర్ణయిస్తారని కేశవ్ ప్రసాద్ మౌర్య స్పష్టం చేశారు. ‘శనివారం సాయంత్రం 4 గంటలకు సీఎం ఎవరో తెలిసిపోతుంది’ అని అన్నారు. మార్చి 19 ఆదివారం పార్టీ జాతీయ నాయకుల సమక్షంలో సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందన్నారు. మీడియా దృష్టిని మళ్లించేందుకేనా? ‘యూపీ కొత్త సీఎం, కేబినెట్ సహచరులతో కలిసి 19 ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రమాణం చేయనున్నారు’ అని లక్నోలో గవర్నర్ రామ్ నాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. కాగా, మీడియా దృష్టిని పక్కదారి పట్టించేందుకే సీఎం ఎంపిక బాధ్యతను మౌర్యకు అప్పగించినట్లు అమిత్ షా చెప్పారని భావిస్తున్నారు. అటు కేంద్ర మంత్రి మనోజ్ సిన్హా తను సీఎం రేసులో లేనని ప్రకటించారు. పాలనలో అనుభవం ఉండటంతోపాటు.. ప్రస్తుత పరిస్థితుల్లో యూపీని ‘మిషన్ 2019’ మోడ్‌లో నడిపే సత్తా కేవలం రాజ్‌నాథ్ ఒక్కరికే ఉందని పార్టీ నేతలు భావిస్తున్నారు. యూపీ రైతుల రుణాల మాఫీ ఉత్తరప్రదేశ్‌లో కొలువదీరనున్న బీజేపీ ప్రభుత్వం చిన్న, మధ్యతరహా రైతుల రుణాలను మాఫీ చేస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ లోక్‌సభలో వెల్లడించారు. ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ ఈ అంశాన్ని చేర్చిందని.. దీనికి అనుగుణంగానే రుణమాఫీ జరుగుతుందన్నారు. -
‘సీఎం ఎవరో మీకు రేపు తెలుస్తుంది’
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరనే విషయం రేపు(శనివారం) తెలుస్తుందని యూపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య స్పష్టం చేశారు. సీఎం ఖరారు విషయంపై శాసనసభా పక్షం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ‘యూపీ సీఎం ఎవరనే విషయంపై లెజిస్టేచర్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమం మార్చి 19న ఉంటుంది. దీనికి బీజేపీ అగ్ర నేతలతోపాటు కేంద్రమంత్రులు, ప్రముఖ వ్యక్తులు హాజరుకానున్నారు’ అని మౌర్య శుక్రవారం పార్లమెంటు వెలుపల చెప్పారు. కొంత అస్వస్థతగా ఉందంటూ ఆస్పత్రిలో చేరిన ఆయన తదనంతరం డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు. ‘నాకు ఏవో చిన్న సమస్యలు అనిపించాయి. అందుకే ఆస్పత్రిలో చేరాను. అయితే, నిన్ననే నేను బయటకొచ్చాను. ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాను’ అని మౌర్య చెప్పాడు. అదే సమయంలో సీఎం ఎవరనే విషయంపై పదేపదే ప్రశ్నించగా ‘రేపు సాయంత్రం 4.30గంటలకు లెజిస్టేచర్ పార్టీ సమావేశం కానుంది. ప్రభుత్వ పెద్దగా ఎవరు వస్తారనేది మీకు రేపు కచ్చితంగా తెలుస్తుంది’ అని అన్నారు. అయితే, సీఎం కాబోయే వ్యక్తిని ఎంపికచేయాలంటూ అమిత్‌షా బాధ్యతలు అప్పగించారంట కదా అని ప్రశ్నించగా.. ఒక పార్టీ అధ్యక్షుడిగా తాను ఏం చేయాలో అది పూర్తి చేస్తానని అన్నారు. సీఎం రేసులో మౌర్య కూడా ఉన్న విషయం తెలిసిందే. -
మాయావతి ఆస్పత్రికి వెళ్లి చూపించుకోవాలి
బీఎస్పీ అధినేత్రి మాయావతి కోర్టుకు వెళ్లినా ఇంకెక్కడికి వెళ్లినా పర్వాలేదని, కానీ అంతకంటే ముందు ఆమె ఒకసారి ఆస్పత్రికి వెళ్లి చూపించుకుంటే మంచిదని బీజేపీ యూపీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య విమర్శించారు. యూపీ ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని, దానివల్ల ఎవరికి ఓటేసినా బీజేపీకే ఓట్లు పడ్డాయని మాయావతి ఆరోపించిన నేపథ్యంలో ఆయన స్పందించారు. ఇతర పార్టీలకు ఓట్లు వేస్తే అసలు ఈవీఎంలు స్పందించలేదని, లేదా ఆ ఓట్లన్నీ కూడా బీజేపీకి వెళ్లిపోయాయని.. అందుకే ముస్లిం ఓట్లు కూడా బీజేపీకి పడ్డాయని మాయావతి అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ముందు కొంతమంది ముస్లిం పెద్దలు, కొన్ని సంస్థలు బాహాటంగా బీఎస్పీకి మద్దతు పలికాయని, కానీ వాళ్ల ఓట్లేవీ తమకు పడలేదని.. అందుకే కేవలం 19 స్థానాలు మాత్రమే వచ్చాయని మాయావతి ఆవేదన చెందుతున్నరు. బీఎస్పీని స్థాపించిన తర్వాత ఇప్పటివరకు యూపీ ఎన్నికల్లో వాళ్లకు ఇంత తక్కువ సంఖ్యలో అసెంబ్లీ స్థానాలు రావడం ఇదే మొదటిసారి. బీఎస్పీ నుంచి 100 మంది ముస్లిం అభ్యర్థులకు టికెట్లు ఇచ్చినా, ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న 77 నియోజకవర్గాలకు గాను కేవలం నాలుగుచోట్ల మాత్రమే బీఎస్పీ అభ్యర్థులు గెలిచారు. ఈ నేపథ్యంలో మాయావతి విమర్శించగా.. దానికి కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా దీటుగా స్పందించారు. -
యూపీ ముఖ్యమంత్రి... మరో చాయ్‌వాలా?
2014లో ఉత్తరప్రదేశ్‌లో మోదీ ప్రభంజనం వీచి.. రాష్ట్రంలోని 80 లోక్‌సభ స్థానాల్లో 73 సీట్లను ఆ పార్టీ గెలుపొందుతుందని ఎవరూ ఊహించలేదు. ఇప్పుడు మూడేళ్ల తర్వాత తిరిగి చూస్తే అదే మ్యాజిక్‌ను బీజేపీ పునరావృతం చేసింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మూడింట రెండొంతుల స్థానాలను గెలుపొందింది. నాడు చాయ్‌వాలాగా పేరొందిన నరేంద్రమోదీ ప్రధానమంత్రి పగ్గాలు చేపట్టారు. నేడు యూపీ అధినేతగా మరో చాయ్‌వాలా పగ్గాలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 80శాతం సీట్లు గెలుపొందడం వెనుక ఒక 'చాయ్‌వాలా' కృషి ఉంది. ఆయనే కేశవ్‌ప్రసాద్ మౌర్య. చాయ్‌వాలా నుంచి ప్రస్థానం..! యూపీ కౌశంబి జిల్లాలోని ఓ పేద రైతు కుటుంబంలో కేశవ్ ప్రసాద్ మౌర్య జన్మించారు. ఆయన బాల్యమంతా పేదరికంలోనే గడిచిపోయింది. ప్రధాని మోదీలాగే కుటుంబానికి అండగా ఉండేందుకు మౌర్య కూడా టీ స్టాల్లో పనిచేశారు. న్యూస్‌పేపర్లు అమ్మారు. మారుమూల గ్రామాల్లో, పట్టణాల్లో టీ అమ్ముకొని జీవించడమంటే ఇప్పుడు రాజకీయాల్లో అదేమీ నామోషి కాదు. గుజరాత్ నుంచి వచ్చిన మోదీ తాను చాయ్ అమ్మిననాటి నిరాడంబర నేపథ్యాన్ని పదేపదే గుర్తుచేసుకుంటారు. అదేవిధంగా మౌర్య బాల్యంలో తాను అమ్ముకొని జీవితం వెళ్లదీసిన రోజులను గర్వంగా చెప్పుకుంటారు. ఈ విషయంలో తనకు, ప్రధాని మోదీతో సారూప్యముందని సంతోషపడతారు. రాజకీయ ప్రస్థానం..! చిన్నప్పటినుంచే మౌర్య ఆరెస్సెస్ బాల స్వయం సేవక్‌లో కొనసాగారు. ఆ తర్వాత విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ), బజరంగ్ దళ్‌కు అనుబంధంగా పనిచేశారు. 12 ఏళ్లు ఈ రెండు సంస్థల్లో కొనసాగిన ఆయన వీహెచ్‌పీ సిద్ధాంతకర్త అశోక్సింఘాల్కు సన్నిహితుడిగా ముద్రపడ్డారు. ఆవేశపూరితమైన ఉపన్యాసాలకు పేరొందిన మౌర్య.. అయోధ్య, గోరక్షణ ఉద్యమాల్లో జైలుకు కూడా వెళ్లారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో అలహాబద్ సిరాతు సీటు నుంచి గెలుపొందిన ఆయన.. 2014 లోక్‌సభ ఎన్నికల్లో.. దేశ ప్రథమ ప్రధాని నెహ్రూ నియోజకవర్గమైన ఫూల్పూర్ నుంచి విజయం సాధించారు. 2016 ఏప్రిల్‌లో మౌర్య యూపీ బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. విజయం వెనుక మౌర్య పాత్ర ఏమిటి? యూపీలో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సంచలన విజయం వెనుక యాదవేతర ఓబీసీలు, జాటవేతర దళితులు కీలక పాత్ర పోషించారు. ఈ విషయాన్ని గుర్తించిన బీజేపీ ఓబీసీ ఉపకులానికి చెందిన మౌర్యకు పార్టీ రాష్ట్ర పగ్గాలు అప్పగించింది. తన బాధ్యతలను చక్కగా నిర్వర్తించిన మౌర్య.. యాదవేతర ఓబీసీల మద్దతు బీజేపీకి కూడగట్టడంలో విజయం సాధించారు. కుశ్వాహా, కోయెరి, కుర్మీ, శాక్య, పటేల్ తదితర సామాజిక వర్గాల నేతలకు జిల్లా యూనిట్ చీఫ్ బాధ్యతలను అప్పగించి.. ఆయా వర్గాలను బీజేపీ వైపు తిప్పుకోగలిగారు. ఇప్పుడు సంపన్నుడే! ఒకప్పుడు మౌర్య పేదరికంలో ఉన్నారు కానీ, ఇప్పుడు ఆయన సంపన్నుడు. ఆయనకు, ఆయన భార్యకు అలహాబాద్ చుట్టూ కోట్లరూపాయలు విలువచేసే ఆస్తులు ఉన్నాయి. ఆయనపై 11 పోలీసు కేసులు కూడా ఉన్నాయి. ఇప్పుడు యూపీ ముఖ్యమంత్రి రేసులో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లలో మౌర్య కూడా ఉన్నారు. ఓబీసీల్లో గట్టి పట్టున్న నేతగా పేరొందిన మౌర్యకు బీజేపీ అధిష్టానం అవకాశమిస్తుందని ఆయన అనుచరులు భావిస్తున్నారు. -
అపర చాణక్యుడు
ముందుండి నడిపించిన కమల దళపతి అమిత్‌షా మోదీ హవా పనిచేసింది. కేంద్రం చేసిన అభివృద్ధి, చేపట్టిన పథకాలు యూపీలో బీజేపీకి విజయాన్ని సాధించిపెట్టాయి. ఏ బీజేపీ నేతను పలకరించినా చెప్పే మాటలివే. మోదీ కరిష్మా పనిచేసి ఉండొచ్చు.. కానీ అంతకంటే ఎక్కువగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఏడాదిన్నరగా తెరవెనుక చేసిన కృషి ఫలితమే కమలదళానికి యూపీలో భారీ విజయాన్ని సాధించి పెట్టింది. సామాజిక సమీకరణాల కూర్పు, ఎలాంటి హడావుడి లేకుండా నిశ్శబ్దంగా పనిచేసుకుపోయే నమ్మకస్తులకు బాధ్యతలు అప్పగించడం నుంచి ఆర్ఎస్ఎస్, బీజేపీ అనుబంధ విభాగాలన్నింటినీ పూర్తిస్థాయిలో ప్రచారంలో పరుగులు పెట్టించడం దాకా... ప్రతీది పక్కా ప్రణాళికతో జరిగింది. అమిత్ షా గత ఏడాదికాలంలో ఎక్కువగా లక్నోలోనే గడిపారు. పార్టీ శ్రేణులను సమరోత్సాహంతో ఎన్నికల రణరంగంలో ముందుండి నడిపించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో యూపీ ఇంచార్జిగా వ్యవహరించి ఏకంగా 71 స్థానాల్లో గెలిపించిన అమిత్ షా బృందం వద్ద బూత్‌స్థాయి నుంచి ఓటర్లు, సామాజిక వర్గాల లెక్కలు పక్కాగా ఉన్నాయి. కార్యక్షేత్రంలోకి దిగే ముందు రెండు సర్వేలు చేయించుకున్న కమలదళపతి వాటి ఆధారంగా ఏయే అంశాలపై దృష్టి పెట్టాలి, ఎక్కడ బలోపేతం కావాలనేది నిర్ణయించుకొని ముందుకువెళ్లారు. తొలుత రాష్ట్ర బీజేపీలో సంస్థాగత మార్పులతో మొదలుపెట్టారు. పార్టీ అధ్యక్షుడిగా ఓబీసీ అయిన కేశవ్ ప్రసాద్ మౌర్యను నియమించి కార్యవర్గంలో ఇదివరకు నిరాదరణకు గురైన వర్గాలకు ప్రాధాన్యత కల్పించారు. జనాభాలో ఎంతశాతం ఉన్నారనే దానితో సంబంధం లేకుండా కులాల వారీగా ప్రతి ఒక్క వర్గంతో భేటీ అయ్యారు. ఇంతకాలం నిరాదరణకు గురయ్యామనే భావన ఉన్నవారికి భరోసా ఇచ్చి వారి మద్దతును కూడగట్టారు. బూత్ స్థాయి నుంచి... 1.5 లక్షల పోలింగ్ బూతుల్లో ప్రతి బూత్ పరిధిలో 20–25 చురుకైన కార్యకర్తలను గుర్తించి శిక్షణ ఇచ్చారు. బూత్‌స్థాయి నుబంచి బ్లాక్ స్థాయి దాకా 100 సమావేశాలను నిర్వహించారు. ఎన్నికలకు ముందు ఏడాది కాలంలో కోటి 80 లక్షల మందికి అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యువ టౌన్ హాల్ సమావేశాన్ని నిర్వహించి 156 చోట్ల నుంచి 74 వేల మంది యువతను పలకరించారు. వాట్సాప్, ట్విటర్.. ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా 40 లక్షల మంది ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించి ‘లోక్ సంకల్ప్ పత్ర్’ను విడుదల చేశారు. జన ఆకాంక్ష అనే మరో కార్యక్రమం ద్వారా సేకరించిన అభిప్రాయాల ఆధారంగానే రైతు రుణమాఫీ, మహిళల భద్రత అంశాలను బీజేపీ మెనిఫెస్టోలో చేర్చింది. లెక్కకు మిక్కిలి సమ్మేళనాలు ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచి బీజేపీ 88 యువ సమ్మేళనాలు, 77 మహిళా సమ్మేళనాలు, 200 ఓబీసీ సమావేశాలు నిర్వహించింది. రాష్ట్రంలోని నాలుగు మూలల నుంచి ప్రారంభమై లక్నోలో ముగిసిన పరివర్తన్ యాత్ర 8,000 కి.మీ. దూరం సాగింది. 50 లక్షల మంది ఓటర్లను ఈ యాత్ర ద్వారా కార్యకర్తలు కలుసుకున్నారు. పశ్చిమ యూపీలో తొలి రెండు దశల్లో ఓటింగ్ ముగిశాక.. పరిస్థితిని అంచనా వేసిన షా సోషల్ మీడియా విభాగాన్ని అప్రమత్తం చేశారు. ఫేస్బుక్, ట్విటర్లో విస్తృతంగా ప్రచారం చేపట్టారు. ఇంకా ఎటూ నిర్ణయించుకోకుండా తటస్థంగా ఉన్న ఓటర్లను ఆకర్షించేలా ఈ ప్రచారానికి రూపకల్పన చేశారు. ప్రశాంత్ కిశోర్ బృందానికి గాలం లోక్‌సభ ఎన్నికల్లో మోదీతో పనిచేసి... తర్వాత దూరమైన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కు అమిత్ షా ఆరునెలల కిందటే షాకిచ్చారు. గత ఏడాది కిశోర్ బృందాన్ని చీల్చి ఓ 50 మందిని బీజేపీ వైపు లాగారు. ఎన్నికల వ్యూహాలు, కుల, మత సమీకరణాలు, ఓట్ల లెక్కలు, ప్రచార రూపకల్పనలో వీరందరూ కిశోర్ శిక్షణ పొందిన వారే. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
ఆ సర్వేలు తప్పు.. మాకు 300 ఖాయం
-
ఆ సర్వేలు తప్పు.. మాకు 300 ఖాయం
ఉత్తరప్రదేశ్ ఎన్నికల విషయంలో ఎగ్జిట్ పోల్స్ అంచాలన్నీ తప్పని, తమకు 300 స్థానాలు ఖాయమని యూపీ బీజేపీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు కొన్ని గంటల ముందు ఆయనీ మాట చెప్పారు. మొత్తం 403 అసెంబ్లీ నియోజకవర్గాలున్న యూపీలో అధికారం చేపట్టాలంటే కనీసం 202 స్థానాలు అవసరం. అయితే ఇక్కడ హంగ్ ఏర్పడే అవకాశాలున్నాయని, బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని ఎగ్జిట్ పోల్స్‌లో చెప్పిన విషయం తెలిసిందే. అయితే.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఉన్న జనాదరణను బట్టి 2014 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 80 స్థానాలకు గాను 71 బీజేపీకే వచ్చాయన్న విషయాన్ని మౌర్య గుర్తు చేశారు. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితి ఏమాత్రం మారలేదని.. ఇప్పుడు జరిగిన ఎన్నికలతో పాటు.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కూడా బీజేపీ విజయం ఖాయమని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కావాలంటే తన అత్తయ్య (మాయావతి)తోను, స్నేహితుడు (రాహుల్)తోను జత కట్టవచ్చని.. కానీ బీజేపీ మాత్రం ఈ ఎన్నికల్లో బీఎస్పీ, సమాజ్‌వాదీ పార్టీలను కూకటివేళ్లతో పెకలించేలా మెజారిటీలు సాధిస్తుందని మౌర్య చెప్పారు. ఫలితాల కోసం గతంలోలా రోజంతా ఎదురు చూడాల్సిన అసవరం ఉండబోదని.. ఉదయం 11 గంటల కల్లా పరిస్థితి మొత్తం స్పష్టం అవుతుందని ఆయన చెప్పారు. -
‘మౌర్య సుప్రీం ఆదేశాలు ఉల్లంఘించారు’
న్యూఢిల్లీ: రామమందిరం నిర్మాణం అంశాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చిన ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్యపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. కోర్టు ఆదేశాలను సైతం దిక్కరించి ఓటర్లను ప్రభావితం చేసే చర్యలకు కేశవ్ దిగారని ఆ ఫిర్యాదులో ఆరోపించింది. గతంలో మతం పేరిట ఏ రాజకీయ పార్టీ కూడా ఓట్లు అడగరాదని, ఎన్నికల ప్రచారం చేయరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయినప్పటికీ ఆ ఆదేశాలను భేఖాతరు చేస్తూ బీజేపీ నేత మతపరమైన అంశాన్ని లేవనెత్తారని పేర్కొంది. ఈ సందర్భంగా లీగల్ అండ్ హ్యూమన్ రైట్స్ కాంగ్రెస్ కార్యదర్శి కె.సి మిట్టల్ ఎన్నికల కమిషన్ చీఫ్, ఇతర అధికారులకు ఫిర్యాదు చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బీజేపీకి ఉన్న కమలం గుర్తును తొలగించాలని చెప్పారు. ఫిర్యాదు అనంతరం మిట్టల్ మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల్లో కులం, మతాలను వాడుకోవడం పై ఎన్నికల కమిషన్, సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని నాంది పలకాలని కోరారు. తాము అధికారంలోకి వచ్చాక రామమందిరం నిర్మిస్తామని అంతకుముందు బీజేపీ రాష్ట్ర చీఫ్ మౌర్య వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. -
సొంత నిర్ణయాలు తీసుకోకుంటే రాజీనామా చేయాలి
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు సొంతంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం లేకుంటే, సీఎం పదవిలో ఉండేందుకు అనర్హులని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అఖిలేష్ సీఎం పదవికి రాజీనామా చేయాలని, అసెంబ్లీని రద్దు చేసి వెంటనే ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములయాం సింగ్ యాదవ్ కుటుంబంలో ఏర్పడ్డ విబేధాలపై ఆయన స్పందించారు. వ్యక్తిగత ప్రయోజనాలు, అధికారం కోసం జరుగుతున్న పోరాటంలో ఎస్పీ కార్యకర్తలు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని మౌర్య విమర్శించారు. సమాజ్‌వాదీ పార్టీలో, అఖిలేష్ ప్రభుత్వంలో జరుగుతున్న హైడ్రామా బజారున పడిందని, ఇది శాంతిభద్రతలకు సవాల్‌గా మారిందని చెప్పారు. అఖిలేష్ సీఎం పదవి హోదాకు భంగం కలిగించారని మౌర్య అన్నారు. అఖిలేష్‌కు ఆయన బాబాయ్, యూపీ కేబినెట్ మంత్రి శివపాల్ యాదవ్‌కు విబేధాలు ఏర్పడటం, పార్టీ చీఫ్ ములయాం జోక్యం చేసుకుని రాజీ చేసిన సంగతి తెలిసిందే. -
సమాజ్ వాదీ పార్టీకి షాక్
లక్నో: అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉత్తరప్రదేశ్ లో అధికార సమాజ్ వాదీ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు ఆదివారం బీజేపీలో చేరారు. మీరట్ జిల్లా పంచాయతీ మాజీ అధ్యక్షుడు మనీందర్ పాల్ సింగ్, యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శి రాహుల్ యాదవ్ తమ మద్దతుదారులతో కలిసి కాషాయ పార్టీలోకి వచ్చారు. ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సమాజ్ వాదీ పార్టీ నాయకులు బీజేపీలో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది.