లక్నో: ఉత్తరప్రదేశ్ బీజేపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కంటే సంస్థ(పార్టీ) పెద్దది అంటూ కేశవ్ మౌర్య చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.
కాగా, పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో యూపీలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో పార్టీ నేతల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఇలా జరిగిందని చర్చ పార్టీలో నడుస్తోంది. ఇందుకు సీఎం యోగి పనితీరు కూడా ఒక కారణమని పార్టీ నేతలు విమర్శించారు. ఇక, రాష్ట్రంలో త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి.
UP: On UP Deputy CM Keshav Prasad Maurya's post on X stating "Organisation bigger than government", BJP MP Ravi Kishan says, "He has said correct...Organisation only forms the party..."
— RAKESH CHOUDHARY (@R_R_Choudhary_) July 17, 2024
ఈనేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో డిప్యూటీ సీఎం కేశవ్ ఒంటరిగా ఢిల్లీలో సమావేశం కావడం చర్చకు దారి తీసింది. ఇక, వీరి భేటీ దాదాపు గంట పాటు జరిగింది. ఈ సందర్భంగా యూపీలో పది అసెంబ్లీ స్థానాల్లో జరుగనున్న ఉప ఎన్నికలపై చర్చించినట్టు తెలుస్తోంది. కాగా, ఈ భేటీలో సీఎం పదవి మార్పు గురించి ఎలాంటి చర్చ జరగలేదని సమాచారం.
మరోవైపు.. జేపీ నడ్డాతో భేటీ అనంతరం కేశవ్ మౌర్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కేశవ్ మౌర్య ట్విట్టర్ వేదికగా..‘ప్రభుత్వం కంటే పార్టీ పెద్దది. కార్యకర్తల ఆవేదనే నా బాధ. పార్టీ కంటే ఎవరూ ముఖ్యం కాదు. పార్టీకి కార్యకర్తలే గర్వ కారణం’ అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి.
ఇదిలా ఉండగా.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ , డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యకు మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక, ఉప ఎన్నికల తర్వాత యోగి కేబినెట్‌లో మార్పులు జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరోవైపు.. యూపీ బీజేపీ చీఫ్ భూపేంద్ర చౌదరి కూడా నడ్డాతో విడిగా సమావేశమైనట్లు సమాచారం. పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలను తొలగించేందుకు కృషి చేయాలని నడ్డా సూచించినట్లు వర్గాలు పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment