
సాక్షి, న్యూఢిలీ: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన డిప్యూటీ సీఎం కేశవ్ప్రసాద్మౌర్యకు చుక్కెదురైంది. తన సొంత నియోజగవర్గం సిరాతూలో కొందరు మహిళలు.. మౌర్య మొహం మీదే తలుపులు మూసేశారు. ప్రచారంలో భాగంగా మూడురోజుల నుంచి కనిపించకుండా పోయిన జిల్లా పంచాయతీ సభ్యుడు రాజేశ్ మౌర్య కుటుంబాన్ని పరామర్శించడానికి ఆదివారం ఆయన వెళ్లారు.
ఈ క్రమంలోనే స్థానికులు.. డిప్యూటీ సీఎం రాగానే తలుపులు మూసుకున్నారు. అనంతరం ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిని నిశబ్దంగా ఉండాలని మౌర్య చేతితో సంజ్ఞలు చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే రాజేశ్ మౌర్య కేసులో పోలీసుల వ్యవహరించిన తీరుకు వ్యతిరేకంగా స్థానికులు నిరసన చేయడం వల్లే ఈ ఘటన జరిగినట్లు బీజేపీ తెలిపింది.
(చదవండి: బీజేపీకి గుడ్‌బై.. ఏ పార్టీలోకి వెళ్లను.. ‘ఏక్ నిరంజన్’: మాజీ సీఎం)
Comments
Please login to add a commentAdd a comment