లక్నో: దేశంలో కరోనా వైర్‌స్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. కోవిడ్-19 సామాన్యులతో పాటు ప్రజా ప్రతినిధులను కూడా వదలడంలేదు. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యకి కరోనా సోకింది. స్వల్ప లక్షణాలు కనిపించడతో ఆయన కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. కోవిడ్ పరీక్షలో తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆయన స్వయంగా వెల్లడించారు. తనతో గత కొన్ని రోజులుగా సన్నిహితంగా కలిసి తిరిగినవారు కరోనా జాగ్రత్తలు తీసుకోని, కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇటీవల యూపీ మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి నందగోపాల్ గుప్తా కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ కరోనా మహమ్మారి ఉత్తరప్రదేశ్ సాంకేతిక విద్యా శాఖ మంత్రి కమల్‌రాణిని పొట్టన పెట్టుకున్న సంగతి విధితమే. చదవండి: (విజృంభణ: లక్ష దాటిన కరోనా మరణాలు)
Comments
Please login to add a commentAdd a comment