లక్నో: లోక్‌సభ 2024 ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న తరుణంలో జాతీయ పార్టీల కీలక నేతలు కూడా క్యాంపెయిన్‌లో చురుగ్గా పాల్గొంటున్నారు. జాతీయ పార్టీలకు మద్దతుగా ప్రాంతీయ పార్టీల నేతలు కూడా ప్రచారం సాగిస్తున్నారు. ఈ తరుణంలో శ్రావస్తి నుంచి బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి 'సాకేత్ మిశ్రా'కు మద్దతుగా ఒక సభలో ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి 'కేశవ్ ప్రసాద్ మౌర్య' కీలక వ్యాఖ్యలు చేశారు.
లోక్‌సభ ఎన్నికల్లో కన్నౌజ్ నుంచి పోటీ చేస్తున్న సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తున్న రాహుల్ గాంధీలు ఓడిపోతారని కేశవ్ ప్రసాద్ మౌర్య అన్నారు. 2019లో కన్నౌజ్ నుంచి అఖిలేష్ భార్య డింపుల్ యాదవ్ ఎలా ఓడిపోయారో.. ఈ సారి కూడా అదే విధంగా ఓడిపోతారని, రాయ్‌బరేలీ నుంచి రాహుల్ ఓటమిని చవి చూస్తారని అన్నారు.
ఎన్నికల్లో బీజేపీ పార్టీ 400 సీట్లకు పైగా గెలుస్తుందని అన్నారు. ఇండియా కూటమి నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ.. అవినీతి పార్టీలన్నీ ఒకే తాటిపైకి వచ్చాయని ఆరోపించారు. రాజ్యాంగం ప్రమాదంలో పడిందని ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని అన్నారు.
भारत विरोधी ताकतें नहीं चाहती कि मोदी जी फिर से प्रधानमंत्री बने।#NarendraModi @Saketmisra_ #AbkiBaar400Paar #LokSabhaElections2024#PhirEkBaarModiSarkar#4JuneKo400Paar pic.twitter.com/QZJzb2EEVx
— Keshav Prasad Maurya (मोदी का परिवार) (@kpmaurya1) May 6, 2024
Comments
Please login to add a commentAdd a comment