న్యూఢిల్లీ, సాక్షి: సార్వత్రిక ఎన్నికల్లో చివరిదైన ఏడో విడత లోక్ సభ ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రంతో ముగిసింది. ఎనిమిది రాష్ట్రాల్లో మైకులు మూగబోయాయి. చివరి విడతలో 57 లోక్ సభ నియోజకవర్గాల్లో జూన్ 1న పోలింగ్ జరగనుంది.
బీహార్ లో ఎనిమిది లోక్‌సభ స్థానాలకు 134 మంది అభ్యర్థులు బరిలో నిల్చున్నారు. చండీగఢ్ 1 లోక్ సభ స్థానానికి 19 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ నాలుగు లోక్‌సభ స్థానాలకు 37 మంది పోటీ పడుతున్నారు. జార్ఖండ్ 3 లోక్‌సభ స్థానాల్లో 52 మంది, ఒడిశాలో 6 లోక్‌సభ స్థానాలకు 66 మంది, పంజాబ్ 13 లోక్‌సభ స్థానాలకు 328 మంది, ఉత్తర ప్రదేశ్ 13 లోక్‌సభ స్థానాల్లో 144 మంది బరిలో నిలిచారు. వెస్ట్ బెంగాల్ 9 స్థానాలకు ,124 మంది బరిలో ఉన్నారు.
చివరి విడతలో పలు కీలక నియోజకవర్గాలు ఉన్నాయి. వారణాసి నుంచి ప్రధాని మోదీ, మండి నుంచి బీజేపీ అభ్యర్థిగా కంగనా రనౌత్, హామిపూర్ నుంచి కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, గోరక్‌పూర్ నుంచి నటుడు రవికిషన్, డైమండ్ హార్బర్ నుంచి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పోటీలో ఉన్నారు.
18వ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మొత్తం ఏడు దశల్లో 44 రోజులపాటు సాగనుంది. 1951-52లో తొలి పార్లమెంటు ఎన్నికల తర్వాత అత్యంత సుదీర్ఘ కాలం సాగనున్న ఎన్నికలు ఇవే.
Comments
Please login to add a commentAdd a comment