మోడీని ఢీకొనేందుకు అల్వీ తహతహ | Rashid Alvi wants to contest from Varanasi | Sakshi
Sakshi News home page

మోడీని ఢీకొనేందుకు అల్వీ తహతహ

Published Mon, Mar 31 2014 3:52 PM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM

మోడీని ఢీకొనేందుకు అల్వీ తహతహ - Sakshi

మోడీని ఢీకొనేందుకు అల్వీ తహతహ

వారణాసిలో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని ఢీకొనేందుకు తాను సిద్ధమని కాంగ్రెస్ నాయకుడు రషీద్ అల్వీ ముందుకొచ్చారు. ఈ మేరకుపార్టీ అధినేత్రి సోనియాగాంధీకి ఆయన విజ్ఞప్తి చేశారు. వారణాసి నుంచి పోటీ చేసేందుకు తనకు అవకాశం కల్పించాల్సిందిగా అధినేత్రి సోనియాగాంధీకి తాను ఓ లేఖ రాసినట్లు ఆయన తెలిపారు.

వారణాసి చాలా లౌకిక నగరమని, అక్కడి వాళ్లు తనకు తప్పకుండా మద్దతిస్తారనే భావిస్తున్నానని అన్నారు. వారణాసి నుంచే పోటీ చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ బీజేపీకి డూప్ అని అల్వీ అభివర్ణించారు. మాజీ ఎంపీ అయిన రషీద్ అల్వీ గతంలో కాంగ్రెస్ పార్టీకి అధికార ప్రతినిధిగా కూడా వ్యవహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement