cease fire
-
కాల్పుల విరమణకు సై
జెరూసలేం: గాజాలో కాల్పుల విరమణపై సందిగ్ధత తొలగిపోయింది. కాల్పుల విరమణకు హమాస్–ఇజ్రాయెల్ మధ్య కుదిరిన ఒప్పందం అమలు దిశగా మరో అడుగు ముందుకు పడింది. ఈ ఒప్పందాన్ని ఆమోదించాలంటూ ఇజ్రాయెల్ సెక్యూరిటీ కేబినెట్ శుక్రవారం సిఫార్సు చేసింది. దీంతో ఈ ఒప్పందం ఫుల్ కేబినెట్ ఆఫ్ మినిస్టర్స్ కోర్టులోకి చేరింది. మంత్రివర్గం ఆమోదముద్ర వేస్తే గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం ఆదివారం నుంచి అమల్లోకి వస్తుంది. 15 నెలలుగా కొనసాగుతున్న సంక్షోభానికి తెరపడనుంది. హమాస్ మిలిటెంట్ల చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీలు విడుదల కానున్నారు. వారంతా స్వదేశానికి చేరుకుంటారు. కాల్పుల విరమణ కోసం ఖతార్, అమెరికా మధ్యవర్తిగా వ్యవహరించాయి. హమాస్‌తోపాటు ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తెచ్చి ఎట్టకేలకు ఒప్పించాయి. గాజాలో దాడులకు స్వస్తిపలకడానికి ఇజ్రాయెల్, బందీలను విడుదల చేయడానికి హమాస్ అంగీకరించాయి. అయితే, ఒప్పందం కుదిరిన కొన్ని గంటల వ్యవధిలోనే ఇజ్రాయెల్ సైన్యం గాజాపై బాంబుల వర్షం కురిపించింది. కనీసం 72 మంది పాలస్తీనా పౌరులు మరణించారు. ఒప్పందం అటకెక్కినట్లేనన్న ప్రచారం ఊపందుకుంది. గాజా ప్రజలు, బందీల కుటుంబ సభ్యుల్లో ఉత్కంఠ నెలకొంది. ఒప్పందాన్ని అమోదించాలంటూ ఇజ్రాయెల్ సెక్యూరిటీ కేబినెట్ సిఫార్సు చేయడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. -
గాజా ఒప్పందం.. ఆఖరి నిమిషంలో కొర్రీలు!
ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ ఒప్పందం ఆదివారం నుంచి అమలులోకి వస్తుందని ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్‌థానీ ఘనంగా ప్రకటించడం తెలిసిందే. అయితే ఆఖరి నిమిషయంలో ఇటు ఇజ్రాయెల్.. అటు హమాస్‌లు ఒక అడుగు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. కాల్పుల విరమణ(Ceasefire Deal) ఒప్పందానికి ఆమోదం తెలిపేందుకు తమ కేబినెట్ సమావేశం ప్రస్తుతానికి జరగట్లేదని ఇజ్రాయెల్ ప్రకటించింది. అందుకు హమాస్ చివరి నిమిషంలో పెట్టిన కొర్రీలే కారణమని ఆరోపించింది. ఒప్పందం తుది ముసాయిదాపై ఇంకా కసరత్తు జరుగుతోందని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ప్రకటించిన కాసేపటికే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. దీంతో తర్వాత ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠ నెలకొంది.చివరి నిమిషంలో హమాస్(Hamas) ఉగ్రసంస్థ ఒప్పందంలో మార్పులు సూచించడమే అందుకు కారణమని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ప్రకటించింది. అయితే ఆ కారణం ఏంటన్నదానిపై మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు.. హమాస్ మాత్రం మధ్యవర్తులు తెచ్చిన ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని చెబుతోంది. ఇజ్రాయెల్ తాజాగా చేస్తున్న ఆరోపణలపై మాత్రం స్పందించకపోవడం గమనార్హం. పదిహేను నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలుకుతూ ఇజ్రాయెల్-హమాస్‌లు ఓ అంగీకారానికి వచ్చినట్లు మధ్యవర్తిత్వం వహిస్తున్న ప్రతినిధులు బుధవారం ప్రకటించారు. ఖతార్ ఈ ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించింది. తొలి ఫేజ్‌లో భాగంగా.. గాజాలో తాము బంధీలుగా ఉంచిన 33 మందిని హమాస్ విడుదల చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా మొదట ఇద్దరు అమెరికన్లను విడుదల చేస్తారు. దానికి ప్రతిగా తమ దేశ జైళ్లలో మగ్గుతున్న పాలస్తీనా బంధీలను ఇజ్రాయెల్ విడుదల చేయాలి. ఇదీ చదవండి: గాజా శాంతి ఒప్పందం ఘనత ఎవరిదంటే..అయితే.. ఆ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ (Israel) గాజాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ప్రకటన వెలువడినప్పటి నుంచి జరిగిన దాడుల్లో 71 మంది మరణించినట్లు గాజా సివిల్ ఎమర్జెన్సీ సర్వీస్ వెల్లడించింది. పైగా ఈ చర్యలతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారని, పదుల సంఖ్యలో భవనాలు కుప్పకూలగా.. మరికొందరికి గాయాలైనట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో ఈ ఆదివారం(జనవరి 19) నుంచి మొదలుకావాల్సిన ఒప్పందం అమలుపై నీలినీడలు కమ్ముకునే అవకాశం లేకపోలేదు.అక్టోబరు 7, 2023న సరిహద్దులు దాటి ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించి 1200 మంది ఇజ్రాయెల్ పౌరులను హతమార్చి, 250 మందిని బందీలుగా చేసుకోవడం ద్వారా హమాస్ మధ్య ఆసియాలో యుద్ధానికి బీజం వేసింది. హమాస్‌కు మద్దతుగా హెజ్బొల్లా, హూతీ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై దాడులకు దిగాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పరస్పర క్షిపణి దాడులకు పాల్పడ్డాయి. 15 నెలల యుద్ధంలో 46 వేల మంది పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందారు. ఈ యుద్ధాన్ని నివారించడానికి ప్రపంచ దేశాలు కృషి చేస్తూ వచ్చాయి. అటు అమెరికా.. ఇటు ఈజిప్ట్,ఖతారులు కొన్ని నెలలుగా కాల్పుల విరమణ చర్చలు జరుపుతూ వచ్చాయి.ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్‌థానీ టెలివిజన్ ముఖంగా చేసిన ప్రకటనతో.. పాలస్తీనాలో సంబురాలు జరిగాయి. ఇటు గాజా సరిహద్దులో శరణార్థ శిబిరాల్లో ఉన్నవాళ్లు సైతం హర్షం వ్యక్తం చేశారు. ఇకనైనా మానవతా ధృక్పథంతో ముందకు సాగాలని, గాజా కోలుకునేందుకు అవసరమైన సాయం కోసం ఒప్పందంపై ఇరువర్గాలు సంతకాలు చేయాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు.. గాజా శాంతి ఒప్పందం ఓ కొలిక్కి వచ్చిందన్న పరిణామంపై భారత్ సహా పలుదేశాలు స్వాగతించాయి. -
కైరోలో ఇజ్రాయెల్,హమాస్ చర్చలు..వారి విడుదలే కీలకం
గాజా:ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై ఈజిప్టు రాజధాని కైరోలో శనివారం(నవంబర్30) నిర్వహించే చర్చలకు తమ ప్రతినిధులు హాజరవుతారని హమాస్ వెల్లడించింది. ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందం, బందీల విడుదలపై ఈజిప్టు అధికారులతో వారు చర్చలు జరుపుతారని తెలిపారు.హమాస్ వద్ద బందీలుగా ఉన్న తమ దేశ పౌరులు విడుదల తర్వాతే కాల్పుల విరమణపై ఆలోచిస్తామని ఇజ్రాయెల్ పట్టుబడుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే హెజ్బొల్లా,ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. హమాస్ సమస్యకు కూడా త్వరలోనే పరిష్కారం కనుగొంటామని,ఇందుకు ఖతార్,టర్కీ,ఈజిప్టు దేశాల సాయంతో ప్రయత్నిస్తామని అమెరికా ఇప్పటికే పేర్కొనడం గమనార్హం.గతేడాది అక్టోబర్7న హమాస్ ఉగ్రవాదులు ఇజజ్రాయెల్‌పై దాడి చేసి వందల మంది ఆ దేశ పౌరులను చంపడమే కాకుండా కొందరిని తమతో పాటు బందీలుగా తీసుకెళ్లారు.అక్టోబర్ 7 తర్వాత నుంచి గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం మొదలు పెట్టింది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు పాలస్తానాలో 40వేల మందికిపైగా మరణించారు. -
హెజ్బొల్లా కొత్త చీఫ్ తొలి ప్రసంగం.. ఇజ్రాయెల్‌కు వార్నింగ్
షరతుల ప్రకారమైతే ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణను అంగీకరిస్తామని లెబనాన్‌కు చెందిన హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్ కొత్త చీఫ్ నయీమ్ ఖాస్సేమ్ అన్నారు. ఆయన నిన్న (మంగళవారం) హెజ్బొల్లాకు కొత్త చీఫ్‌గా నియమితులయ్యారు. చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన తొలి ప్రసంగాన్ని చేశారు. సెప్టెంబర్ 27న ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మరణించిన మాజీ హిజ్బుల్లా చీఫ్ సయ్యద్ హస్సెన్ నస్రల్లా మార్గంలో కొనసాగుతానని ప్రతిజ్ఞ చేశారు. ‘‘ నా యుద్ధ వ్యూహాం.. మా నాయకుడు సయ్యద్ హసన్ నస్రల్లా యుద్ధ వ్యూహానికి కొనసాగింపు. లెబనాన్‌కు వ్యతిరేకంగా జియోనిస్ట్ పాలన 39 వేల ఉల్లంఘనలకు పాల్పడింది. ఇజ్రాయెల్ దక్షిణ లెబనాన్‌లో స్థావరాలను నిర్మించాలని చూస్తోంది. గాజా, లెబనాన్లలో ఇజ్రాయెల్ చేసిన హత్యానేరాల్లో అమెరికా, యురోపియన్ యూనియన్ రెండూ భాగస్వామిగా ఉన్నాయి. ఇజ్రాయెల్ లెబనాన్‌ను ఆక్రమించుకుని అరబ్ దేశంలో సెటిల్మెంట్లు చేసుకోవాలని యోచిస్తోంది. హెజ్బొల్లా ఇజ్రాయెల్ ఆలోచనలకు అడ్డుగా నిలుస్తోంది. ... గత నెలల్లో బాధాకరమైన ఎదురుదెబ్బలు తగిలిన తర్వాత ప్రస్తుతం హెబ్బొల్లా గ్రూప్ కోలుకుంటోంది. లెబనీస్ నేల నుంచి యూదుల దేశం అత్యవసరంగా ఉపసంహరించుకోకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. నష్టాలను తగ్గించుకోవడానికి మా భూమి నుంచి వెళ్లిపోండి. ఇలాగే ఉండిపోతే.. మీ జీవితంలో ఎన్నడూ చెల్లించని భారీ మూల్యం చెల్లించుకుంటారు. హెజ్బొల్లా రోజులు, వారాలు, నెలల పాటు పోరాటాన్ని కొనసాగించగలదు’’ అని అన్నారు. -
పాత షరతులైతే.. కాల్పుల విరమణకు సిద్ధమే: హమాస్
గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాతున్న వేళ.. పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ కాల్పుల విరమణకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది. కొత్త షరతులేవీ లేకుంటే.. గతంలో అగ్రరాజ్యం అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందానికి సిద్ధమేనని పేర్కొంది. ఇజ్రాయెల్- హమాస్ మధ్య కాల్పులు విరమణ కోసం ముందు నుంచి అమెరికా, ఖతార్, ఈజిప్టు దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ అల్ తాని, ఈజిప్టు ఇంటెలిజెన్స్ చీఫ్ అబ్బాస్ కమెల్ హమాస్ నేతలతో దోహాలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇతర కొత్త షరతులు లేకుంటే గతంలో అమెరికా ప్రతిపాదించిన కాల్పుల ఒప్పందం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని హమాస్ సీనియర్ అధికారి ఖలీల్ అల్ హయ్యా వెల్లడించారు.ఇదీ చదవండి: బైడెన్ వ్యాఖ్యలపై భగ్గుమన్న హమాస్ -
గాజాను చుట్టుముట్టిన ఇజ్రాయెల్ సైన్యం.. హమాస్ కౌంటర్ వార్నింగ్
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం భీకరస్థాయికి చేరిందా?. హమాస్ ఆధీనంలో ఉన్న గాజా నగరాన్ని పూర్తిగా చుట్టుముట్టినట్లు శుక్రవారం ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించుకుంది. దీంతో ఏ క్షణమైనా అన్నివైపుల నుంచి భూతల దాడులకు పాల్పడొచ్చనే సంకేతాలు పంపింది. మరోవైపు అలాంటిదే జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హమాస్ కౌంటర్ వార్నింగ్ ఇచ్చింది. గాజా నగరాన్ని ఇజ్రాయెల్ సైన్యం నాలుగు వైపులా చుట్టుముట్టింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ సైన్య ప్రతినిధి డేనియల్ హగారి అధికారికంగా ప్రకటించారు. తాము సిద్ధంగా ఉన్నామని, భూతల దాడులు చేపట్టేందుకు రక్షణ దళం నుంచి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారాయన. మరోవైపు ఇజ్రాయెల్ సైన్యం చేసిన ప్రకటనకు హమాస్ కౌంటర్ ఇచ్చింది. గాజాలోకి ఇజ్రాయెల్ సైనికులు ప్రవేశిస్తే.. నల్ల సంచుల్లో శవాలుగానే తిరిగి వెళ్తారంటూ హెచ్చరించింది. ఈ మేరకు హమాస్ సైన్యప్రతినిధి ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. తీవ్ర సంక్షోభం నెలకొనే పరిస్థితుల దృష్ట్యా గాజాలో కాల్పుల విరమణ పాటించాలని, దాడులు ఆపాలని ఐక్యరాజ్య సమితి పిలుపు ఇచ్చింది. అయితే ఆ పిలుపును ఇజ్రాయెల్ కఠినవైఖరితోనే తిరస్కరించింది. తాజాగా గాజాలో భూతల దాడులకు సిద్ధమైన నేపథ్యంలోనూ కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ స్పందించింది. అలాంటి ఆలోచనేం లేదని, హమాస్‌ను నామరూపాలు లేకుండా తుడిచిపెట్టడమే తమ ధ్యేయమని ఇజ్రాయెల్ సైన్య ప్రతినిధి డేనియల్ హగారి ప్రకటించారు. మరోవైపు అమెరికా మాత్రం కాల్పుల విరమణకు బదులు.. యుద్ధ విరామం అవసరమని అభిప్రాయపడుతోంది. గాజా ప్రజలకు మానవతా సాయం అందడం, హమాస్ చెరలో బందీలుగా ఉన్నవాళ్లను విడిపించాలంటే ఈ యుద్దానికి విరామం అవసరమేనని అధ్యక్షుడు జో బైడెన్ స్వయంగా ప్రకటించారు. అక్టోబర్ 7వ తేదీన రాకెట్ లాంచర్లతో హమాస్ బలగాలు, ఇజ్రాయెల్ సరిహద్దుల్లో మెరుపు దాడికి దిగాయి. కొన్ని ప్రాంతాలను తమ అదుపులోకి తీసుకున్నాయి. హమాస్ దాడుల్లో 1,400 మంది మరణించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. అత్యాధునిక యుద్ధ వ్యవస్థ ఉన్న ఇజ్రాయెల్.. ఈ దాడిని ఘోర అవమానంగా భావించింది. ఆపై ప్రతిదాడులకు దిగింది. హమాస్ స్వాధీనంలో ఉన్న గాజాపై ఇప్పటిదాకా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 9వేల మందికిపైగా మృతి చెందారు. ఇందులో సగం చిన్నారులే ఉండడం గమనార్హం. మృతుల సంఖ్య పెరిగిపోతుండడంతో అంతర్జాతీయ సమాజం నుంచి ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెరుగుతోంది. అయితే పాశ్చాత్య దేశాల మద్దతుతో ఇజ్రాయెల్ తమ దాడుల్ని కొనసాగిస్తుండగా.. మరోవైపు పాలస్తీనా సంస్థ హమాస్‌కు ఇరాన్ సహా పలు దేశాలు అండగా నిలుస్తున్నాయి. -
గాజా యుద్ధ విరామం అవసరమే.. మళ్లీ నోరు జారిన బైడెన్
మిన్నెపోలీస్: ఇజ్రాయెల్-హమాస్ మధ్య గాజాలో జరుగుతున్న యుద్ధానికి స్వల్ప విరామం అవసరమేనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభిప్రాయపడ్డారు. గాజా స్ట్రిప్‌లో కాల్పుల విరమణ చేపట్టాలని ఐక్యరాజ్య సమితి చేసిన విజ్ఞప్తి నేపథ్యంలో.. ఆయన ఇలా నేరుగా స్పందించడం విశేషం. అయితే.. ఆ సమయంలో ఆయన నోరు జారారు. బుధవారం ఓ విరాళాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న బైడెన్ ప్రసంగించారు. ఆ సమయంలో గాజాలో కాల్పల విరమణ అవసరం అంటూ ఓ వ్యక్తి నినాదాలు చేశాడు. దానికి స్పందించిన ఆయన.. ‘‘అవును.. స్వల్ప విరామం అవసరమే. ఖైదీలను బయటకు క్షేమంగా తెచ్చేందుకు ఆ విరామం కచ్చితంగా అవసరం కూడా’’ అని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయనే చర్చ మొదలుకాగా.. వైట్‌హౌజ్ వివరణ ఇచ్చుకుంది. ప్రెసిడెంట్ బైడెన్, హమాస్ ఉగ్రవాదుల చెరలో ఉన్న బందీలను ఉద్దేశించి అలా వ్యాఖ్యానించారని వైట్‌హౌజ్ ఒక ప్రకటన విడుదల చేసింది. అంతకు ముందు ‘గాజాలో మనవతా సాయం ఆగిపోకుండా ఉండేందుకు యుద్ధానికి తాత్కాలిక విరమణ అవసరం’ అని వైట్‌హౌజ్ అభిప్రాయపడింది కూడా. అక్టోబర్ 7న హమాస్ దాడులతో ఈ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. నాటి దాడుల్లో 1,400 మంది మరణించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించుకుంది. ఆపై ఇజ్రాయెల్ ప్రతిదాడులతో ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరుకున్నాయి. దాడుల సమయంలో హమాస్ సుమారు 200 మందిని తమ బందీలుగా చేసుకుంది. ఇందులో ఇజ్రాయెల్ పౌరులతో పాటు సైనికులు, విదేశీయులు ఉన్నారు. వీళ్లను విడిపించేందుకు తీవ్ర యత్నాలు జరుగుతున్నాయి. హమాస్ బలగాల వేటలో గాజాను మరుభూమిగా మార్చేస్తోంది ఇజ్రాయెల్. కిందటి నెలలో ఇజ్రాయెల్‌లో పర్యటించిన అమెరికా అధ్యక్షుడు బైడెన్.. హమాస్‌పై పోరులో ఇజ్రాయెల్‌కు తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. అయితే.. గాజాలో మరణాల సంఖ్య పెరగడం, మానవతా సంక్షోభం నానాటికీ దిగజారుతున్న వేళ ఐక్యరాజ్య సమితి కాల్పుల విరమణకు పిలుపు ఇచ్చింది. కానీ, ఇజ్రాయెల్ మాత్రం అందుకు అంగీకరించలేదు. మరోవైపు అమెరికా సైతం కాల్పుల విరమణకు బదులుగా.. యుద్ధానికి తాత్కాలిక విరామం ప్రకటిస్తే సరిపోతుందని.. తద్వారా గాజా ప్రజలకు సాయం అందేలా చూడాలని కోరుకుంటోంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటిదాకా 8,796 మంది పాలస్తీనా ప్రజలు మరణించినట్లు గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. అందులో పిల్లలే 3,648 మంది ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు బుధవారం బబాలియా శరణార్థ శిబిరంపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 195 మంది పాలస్తీనా ప్రజలు మరణించినట్లు హమాస్ ప్రభుత్వం ప్రకటించుకుంది. -
గాజాలో కాల్పుల విరమణ పిలుపుపై ఇజ్రాయెల్ స్పందన
టెల్ అవీవ్: గాజాలో కాల్పుల విరమణ పిలుపుపై ఇజ్రాయెల్ స్పందించింది. అది ఎట్టి పరిస్థితుల్లో జరగదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ ప్రకటించారు. కాల్పుల విరమణ పాటిస్తేనే.. మానవతా సాయం గాజాకు అందుతుందని, లేకుంటే అక్కడి పరిస్థితులు మానవతా సంక్షోభానికి దారి తీస్తాయని ఐక్యరాజ్య సమితి హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే నెతన్యాహూ స్పందించారు. ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో కాల్పలు విరమణ ఉండదు. ఎందుకంటే అది హమాస్‌కు లొంగిపోవడమే అవుతుంది గనుక అని అన్నారాయన. ‘‘కాల్పుల విరమణ కోసం ఇస్తున్న పిలుపు.. ఇజ్రాయెల్ హమాస్‌కు లొంగిపోవాలని, ఉగ్రవాదానికి లొంగిపోవాలని పిలుపు ఇవ్వడమే అవుతుంది. కాబట్టి అది జరగదు. యుద్ధంలో గెలిచే వరకు ఇజ్రాయెల్ పోరాడుతుంది అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ సోమవారం ప్రకటించారు. మరోవైపు ఇజ్రాయెల్ మిత్రదేశమైన అమెరికా కూడా కాల్పుల విరమణపై అభ్యంతరం వ్యక్తం చేసింది.‘‘ప్రస్తుత ఉద్రిక్తతలకు కాల్పుల విరమణ సరైన సమాధానం అని మేము భావించం అని అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ అన్నారు. అయితే గాజాలో సాయం అందాలంటే.. యుద్ధ విరమణల సమయం కేటాయిస్తే సరిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. -
పాలస్తీనాకు మద్దతుగా అమెరికాలో ఆందోళనలు
న్యూయార్క్: ఇజ్రాయెల్ తక్షణమే కాల్పుల విరమణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ పాలస్తీనా అనుకూల నిరసనకారులు అమెరికాలో ఆందోళన చేపట్టారు. యూదు సంస్థలకు చెందిన సభ్యులు కూడా ఈ ఆందోళనల్లో పాల్గొని క్యాపిటల్ బిల్డింగ్‌ను చుట్టుముట్టారు. నిరసనలకు అనుమతి తీసుకోకుండానే బిల్డింగ్‌లోకి ప్రవేశించారని పోలీసులు తెలిపారు. నిరసనల్లో దాదాపు 300 మంది అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. గాజాలో ఆల్ రిహ్లా ఆస్పత్రి దాడిలో దాదాపు 500 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని కలిచివేసింది. యుద్ధాన్ని నిలిపివేయాల్సిందిగా ప్రపంచదేశాలు ఇరుపక్షాలను కోరాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బుధవారం ఇజ్రాయెల్‌లో పర్యటించారు. గాజా ఆస్పత్రి ఘటనలో ఇజ్రాయెల్‌కు మద్దతు తెలుపుతూనే కాల్పుల విమరణకు ఒప్పించే ప్రయత్నం చేశారు. Hundreds of primarily Jewish protesters are currently in the Capitol’s Cannon building staging a sit-in protest, calling on Biden and Congress to push for a ceasefire in Gaza. They’re slowly being arrested. pic.twitter.com/mGLELwRj6p — Jack Jenkins (@jackmjenkins) October 18, 2023 జో బైడెన్ పర్యటన అనంతరం బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కూడా నేడు ఇజ్రాయెల్ సందర్శించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో యుద్ధం పరిస్థితులపై చర్చించనున్నారు. అటు.. బైడెన్ పర్యటన అనంతరం యుద్ధంలో ఇజ్రాయెల్ కాస్త పట్ట సడలించినట్లు తెలుస్తోంది. యుద్ధంలో దెబ్బతిన్న గాజాకు ఆహారం, నీటిని రఫా సరిహద్దు గుండా అందించడానికి అంగీకరించింది. BREAKING: According to Marjorie Taylor Greene, an insurrection is currently taking place on Capitol Hill. pic.twitter.com/s30I7UgS1P — Patrick Webb (@RealPatrickWebb) October 18, 2023 అక్టోబర్ 7న హమాస్ దళాలు ఇజ్రాయెల్‌పై దాడులు చేశాయి. ఆ తర్వాత ఇజ్రాయెల్ ఎదురుదాడి చేస్తోంది. గాజాలో నక్కిన హమాస్ దళాలను అంతం దిశగా ఇజ్రాయెల్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే యుద్ధంలో ఇరుపక్షాల వైపు దాదాపు 4000 మందికి పైగా మరణించారు. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలు చొరవ తీసుకుంటున్నాయి. యుద్ధాన్ని నిలిపివేయాలని కోరుతున్నాయి. ఇదీ చదవండి: ఇజ్రాయెల్ చేరుకున్న రిషి సునాక్.. నెతన్యాహుతో చర్చలు -
Sudan Crisis: 72 గంటలపాటు కాల్పుల విరమణ!
ఖార్తోమ్: సూడాన్‌లో సాయుధ బలగాల నడుమ కొనసాగుతున్న అంతర్యుద్ధంపై అమెరికా కీలక ప్రకటన చేసింది. ఇరు వర్గాల జనరల్స్.. మూడు రోజుల పాటు కాల్పుల విమరణపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిపింది. ఈ విషయాన్ని విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ వెల్లడించారు. గత పదిరోజులుగా సూడాన్ ఆర్మీకి, పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్‌కు నడుమ అక్కడ పోరు జరుగుతోంది. నడుమ 400 మందికి పైగా సాధారణ పౌరులు మరణించగా.. దాదాపు నాలుగు వేల మంది గాయపడ్డారు. భారీ ఎత్తున్న విదేశీయులు తమ తమ స్వస్థలాలకు వెళ్తున్నారు. అయితే.. 48 గంటల పాటు జరిగిన తీవ్ర చర్చల తర్వాత.. సుడానీస్ సాయుధ దళాలు (SAF) - ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) కాల్పుల విరమణకు ముందుకు వచ్చాయని బ్లింకెన్ వెల్లడించారు. ఏప్రిల్ 24 అర్ధరాత్రి నుండి దేశవ్యాప్తంగా 72 గంటల పాటు కాల్పుల విరమణను అమలు చేయడానికి అంగీకరించాయని తెలుస్తోంది. సంధి అమలు కావడానికి రెండు గంటల ముందే బ్లింకెన్ ప్రకటన వెలువడడం విశేషం. ఈ మూడు రోజుల్లో పౌరుల తరలింపు ప్రక్రియ వేగవంతం కానుంది. శనివారం నుంచి విదేశీయుల తరలింపు ప్రారంభం కాగా, ఇప్పటిదాకా సుమారు నాలుగు వేల మందికి పైగా స్వస్థలాలకు చేరుకున్నారు. అయితే లక్షల మంది సూడాన్ పౌరులు మాత్రం అక్కడి దీనపరిస్థితుల్లో మగ్గిపోతున్నారు. ప్రస్తుతం అక్కడ తాగునీరు, ఆహారం, మందులు, ఇంధన వనరుల కొరత, విద్యుత్ కోత కొనసాగుతోంది. అలాగే ఇంటర్నెట్ వినియోగంపై ఆంక్షలు విధించారు. ఈ తరుణంలో ఎటు పోవాలో పాలుపోని అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అగాధంలోకి సూడాన్.. సాయుధ బలగాల నడుమ జరుగుతున్న ఆ ఆధిపత్య పోరును.. ఐక్యరాజ్య సమితి తీవ్రంగా తప్పుబట్టింది. అత్యంత పేద దేశమైన సూడాన్ ఈ పోరుతో అగాధంలోకి కూరుకుపోతోందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ హెచ్చరించారు. అంతేకాదు కాల్పుల విరమణకు ఆయన పిలుపు ఇచ్చారు. ఐరాస తరపున పలు విభాగాలు సూడాన్ పౌరులను సరిహద్దులకు దేశాలకు సురక్షితంగా తరలించే యత్నంలో ఉన్నాయి. మరోవైపు సూడాన్ అంశంపై ఐరాస భద్రతా మండలి అత్యవసర సమావేశానికి బ్రిటన్ విజ్ఞప్తి చేస్తోంది. మంగళవారం ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది. పారామిలిటరీ ర్యాపిడ్ ఫోర్స్‌ను ఆర్మీలో విలీనం చేయాలనే ప్రతిపాదన.. ఈ రెండు వర్గాల నడుమ ఘర్షణలకు దారి తీసింది. సూడాన్ రాజధాని ఖార్తోమ్తో పాటు దేశంలో పలు చోట్ల ఈ ఘర్షణలు కొనసాగుతుండగా.. సాధారణ పౌరులు ఇబ్బంది పడుతున్నారు. ఇదీ చదవండి: ఆపరేషన్ కావేరీ.. మనోళ్ల కోసమే! -
యుద్ధం ఇక చాలు: చైనా
ఉక్రెయిన్ యుద్ధ విరమణకు శుక్రవారం చైనా పిలుపునిచ్చింది. ఈ ఇరు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమై నేటికి(ఫిబ్రవరి 24) ఏడాది పూర్తైన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఈ యుద్ధం విరమించేలా 12 పాయింట్ల సమగ్ర నివేదిక ఇచ్చింది చైనా. యుద్ధం ప్రపంచాన్ని చీకట్లోకి నెట్టేసిందని.. వేల మంది మరణించారని, మిలియన్ల మంది ఇతర ప్రాంతాలకు తరలిపోయారని చైనా సదరు నివేదిక ద్వారా తమ ఆవేదన వ్యక్తం చేసింది. పనిలో పనిగా.. అగ్రరాజ్యంపైనా చైనా ఆగ్రహం వెల్లగక్కింది. యుద్ధం తీవ్రత పెరిగేందుకు అమెరికా, దాని మిత్ర దేశాలు కూడా కారణమయ్యాయని నివేదికలో చైనా విమర్శలు గుప్పించింది. అయితే తాము మాత్రం ఈ యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చకుండా అడ్డుకునే యత్నం చేస్తున్నట్లు చైనా తెలిపింది. చర్చల ద్వారానే ఈ సమస్యకు పరిష్కారమని నొక్కి చెప్పింది చైనా. అంతేగాదు ఆ 12 పాయింట్ పొజిషన్ పేపర్లో(సమగ్ర నివేదికలో)..‘‘అణ్వాయుధాలను ఉపయోగించకూడదు, అలాగే అణుయుద్ధాలను చేయకూడదు, బెదిరింపులకు పాల్పడకూడదు. చివరిగా . ఏ దేశమైనా ఎట్టి పరిస్థితుల్లోనూ రసాయన, జీవ ఆయుధాల పరిశోధన, అభివృద్ధి, వినియోగాన్ని వ్యతిరేకించాలి’’ అని చైనా తన నివేదికలో పేర్కొంది. ఇదిలా ఉంటే.. చైనా నివేదికపై ఉక్రెయిన్హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు చైనాలోని ఉక్రెయిన్ రాయబారి ఇదొక శుభపరిణామంటూ పేర్కొన్నారు. అలాగే.. రష్యాపై చైనా ఒత్తిడి తెస్తుందని ఆశిస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు. (చదవండి: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం: కీలక ఓటింగ్‌కు భారత్, చైనా దూరం) -
War Updates: ఉక్రెయిన్‌కు బ్రిటన్ సాయం.. 400 మిలియన్ పౌండ్లు..
Russia-Ukraine war Live Updates: యుద్ధ వాతావరణం నడుమే శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది రష్యా. మరోవైపు తామేమీ తగ్గబోమంటూ ప్రకటించిన ఉక్రెయిన్ సైతం చర్చలకు సుముఖత వ్యక్తం చేస్తోంది. ఈ తరుణంలో యుద్ధం 12వ రోజు కొనసాగుతుండగా.. చర్చలూ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ తరుణంలో.. ►ఉక్రెయిన్‌కు బ్రిటన్ దేశం ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. మానవతా దృక్పథంతో 175 మిలియన్ల పౌండ్లను అందజేస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు. దీంతో ఇప్పటి వరకూ బ్రిటన్ 400 మిలియన్ పౌండ్లను ఉక్రెయిన్‌కు సాయంగా అందించింది. ►ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను పొరుగు దేశాల ద్వారా సోమవారం 7 విమానాల ద్వారా మొత్తం 1,31 మంది భారతీయులను స్వదేశానికి తరలించినట్లు పౌరవిమనయానశాఖ తెలిపింది. ►రష్యా దండయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్‌లో 406 మంది పౌరుల మరణించినట్లు ధృవీకరించినట్లు ఐరాస మానవ హక్కుల కార్యాలయం తెలిపింది. ఆదివారం నాటికి మరో 801 మంది గాయపడినట్లు వెల్లడించింది. ►ఉక్రెయిన్ తమ షరతులను అంగీకరించినట్లయితే సైనిక చర్యను నిలిపివేయడానికి సిద్ధంగా ఉన్నట్లు రష్యా పేర్కొంది. ఈ మేరకు రష్యా అధ్యక్షుడి ప్రెస్ సెక్రటరీ డిమిత్రి పెస్కోవ్మాట్లాడుతూ..కైవ్ తన షరతులను నెరవేర్చినట్లయితే తక్షణం సైనిక చర్యను నిలిపివేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఉక్రెయిన్ ఏ కూటమిలో చేరకుండా ఉండేందుకు వారు రాజ్యాంగ సవరణలు చేయాలని కోరారు. ►ఉక్రెయిన్ దళాలు రష్యా బలగాల నుంచి మైకోలాయివ్ ప్రాంతీయ విమానాశ్రయాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాయని స్థానిక గవర్నర్ విటాలి కిమ్ సోమవారం తెలిపారు. ►ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 400 మంది భారతీయులను తీసుకొచ్చేందుకు రొమేనియా నుంచి మంగళవారం రెండు విమానాలను నడపనున్నట్లు పౌర విమానయానశాఖ పేర్కొంది. ►రష్యా బలగాలు ఉక్రెయిన్ రాజధాని కైవ్‌కు సమీపంలోని గోస్టోమెల్ మేయర్‌ను కాల్చి చంపినట్లు సోమవారం స్థానిక అధికారులు తెలిపారు. గోస్టోమెల్ మేయర్ యూరి ఇల్లిచ్ ప్రైలిప్కో స్థానికంగా ఆకలితో ఉన్నవారికి ఆహారాన్ని,యు రోగులకు మందులు పంపిణీ చేస్తున్నప్పుడు ఆయనతోపాటు మరో ఇద్దరిని కాల్చిచంపారని పేర్కొన్నారు.అని అది పేర్కొంది. ఆయన తన ప్రజల కోసం, గోస్టోమెల్ కోసం హీరోగా ప్రాణాలు విడిచాడని తెలిపారు. ►రష్యా - ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పరోక్షంగా నష్టపోతున్న ప్రపంచ దేశాల స్థితిగతులపై మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్ర స్పందించారు. 21వ శతాబ్దంలో జరుగుతున్న ప్రపంచ యుద్ధానికి స్వాగతం చెబుతూ.. రష్యా - ఉక్రెయిన్ తోపాటు మిగిలిన ప్రపంచ దేశాలు యుద్ధం చేస్తున్నాయని ట్వీట్ చేశారు. ►ఉక్రెయిన్-రష్యా ప్రతినిధుల మధ్య సోమవారం మూడో విడత శాంతి చర్చలు జరగనున్నాయి. ఈ క్రమంలో రష్యా ప్రతినిధు బృంధం నేడు బెలారస్‌కు చేరుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. ►రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఉక్రెయిన్ పరిస్థితులపై 50 నిమిషాలపాటు ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. ఉక్రెయిన్‌తో చర్చల వివరాలను పుతిన్ మోదీకి వివరించారు. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడితో నేరుగా మాట్లాడాలని పుతిన్‌ను మోదీ కోరారు. ఉక్రెయిన్‌లో నగరాలు, సుమీ ప్రాంతాల్లో కాల్పుల విరమణ చేసి మానవతా కారిడార్‌ను ఏర్పాటు చేయడంపై పుతిన్‌కు మోదీ అభినందనలు తెలిపారు. ►తమ దేశంపై రష్యా తన సైనిక చర్యను వెంటనే నిలిపి వేయాలని ఆదేశించాలని కోరుతూ ఉక్రెయిన్ చేసిన అభ్యర్థనపై అంతర్జాతీయ న్యాయస్థానం రెండు రోజుల విచారణను సోమవారం ప్రారంభించింది. ఈ మేరకు ఐసీజే ప్రధాన కార్యాలయం పీస్ ప్యాలెస్‌లో ఏర్పాటు చేశారు. ఉక్రెయిన్ తన వాదలను నేడు కోర్టు ముందు ఉంచనుంది. రష్య మంగళవారం స్పందించే అవకాశం ఉంది. ►భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలిపారు. రష్యా బలగాలకు ఉక్రెయిన్ సమర్ధవంతంగా ఎదుర్కొంటున్న విధానాన్ని మోదీ ప్రశంసించారని జెలెన్స్కీ పేర్కొన్నారు. యుద్ధ సమయంలో అత్యున్నత స్థాయిలో శాంతియుత సంభాషణలు చేసినందుకు, ఉక్రెయిన్ ప్రజలకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు సోమవారం నరేంద్రమోదీతో 35 నిమిషాల పాటు ఫోన్లో ఆయన మాట్లాడారు. అనంతరం ఆయనఅధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ►రష్యా-చైనా మధ్య స్నేహం ఇప్పటికీ చాలా ధృడంగా ఉన్నట్లు చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యూ సోమవారం స్పష్టం చేశారు. అవసరమైనప్పుడు ఇరు దేశాల శాంతి పునరుద్ధర కోసం మధ్యవర్తిత్వంపై పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. అయితే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ప్రపంచ దేశాలు ఖండిస్తున్నన నేపథ్యంలో చైనా మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అదే విధంగా మానవతా సహాయాన్ని ఉక్రెయిన్‌కు అందిస్తున్నామని వాంగ్ తెలిపారు. ►ఉక్రెయిన్‌లో బాంబుల మోత మోగుతుంటే తన ప్రాణాలకు ఏమైనా ఫర్వాలేదు కానీ కొడుకు క్షేమంగా ఉండాలని రైలులో ఒంటరిగా పంపించింది ఓ తల్లి. తన 11 ఏళ్ల కొడుకుకి ధైర్యం చెప్పి..తినటానికి తిండి తాగటానికి నీళ్లు అన్నీ బ్యాగులో సర్ది.. చేతిపై ఫోన్ నెంబర్ రాసి ‘క్షేమంగా..జాగ్రత్తగా వెళ్లు నాన్నా’అంటూ కొడుకును పంపించింది. అమ్మ చెప్పిన మాటలు అన్ని శ్రద్ధగా విన్న ఆ పిల్లాడు బాంబులు, క్షిపణులు, తుపాకులు గర్జిస్తూ, ఆర్తనాదాలు వినిపించే యుద్ధ భూమిలో ఒంటరిగా 1,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి యుక్రెయిన్‌లోని జపోరిజియా ప్రాంతం నుంచి స్లొవేకియా దేశానికి చేరుకున్నాడు. పిల్లాడు సురక్షితంగా అనుకున్న గమ్యానికి చేరుకున్నాడని తెలిసిన ఆ తల్లి హాయిగా ఊపిరి పీల్చుకుంది. ► రష్యా మా బంధం బలంగానే ఉంది: చైనా రష్యా తమకు మిత్రదేశమని, బంధం ఇంకా బలంగానే ఉందని చైనా ప్రకటించుకంది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మరోసారి ‘అవసరమైతే ఉక్రెయిన్-రష్యా సంధిలో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమ’ని స్పష్టమైన ప్రకటన చేశారు. ► ఆపరేషన్ గంగలో భాగంగా.. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులు స్పెషల్ విమానాల్లో భారత్‌కు చేరుకుంటున్నారు. వీలైనంత త్వరగా ఈ ఆపరేషన్ ముగించాలని భారత్ భావిస్తోంది. #WATCH | Tears of joy and some sweets at Delhi airport, as a mother breaks down on seeing her daughter Saloni, who has arrived from war-torn #Ukraine "Can't be expressed in words how happy I feel to see my child back home with me," the mother said pic.twitter.com/V2xUzXgHLG — ANI (@ANI) March 7, 2022 ► రష్యాపై ఆంక్షలు మాత్రమే సరిపోవని, యుద్ధం ఆపేలా చేయడానికి తీవ్ర చర్యలకు దిగాల్సిందేనని పశ్చిమ దేశాలతో జెలెన్స్కీ పేర్కొన్నట్లు తెలుస్తోంది. ► రష్యా సెంట్రల్ బ్యాంక్‌తో లావాదేవీలను నిలిపివేసిన సౌత్ కొరియా. ► జెలెన్స్కీతో ఫోన్లో మాట్లాడిన మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీతో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోనులో మాట్లాడారు. వీరిద్దరి మధ్య దాదాపు 35 నిమిషాల పాటు సంభాషణ కొనసాగింది. ఉక్రెయిన్ నుంచి భారత పౌరుల తరలింపులో సాయం పట్ల జెలెన్ స్కీకి మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికీ కొందరు భారత పౌరులు ఉక్రెయిన్‌లోనే ఉండడంతో భారత పౌరుల తరలింపులో నిరంతరం సహకారం ఉండాలని మోదీ కోరారు. ఉక్రెయిన్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై మోదీకి జెలెన్ స్కీ వివరించారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య ప్రత్యక్ష చర్చలు జరుగుతోన్న తీరును మోదీ అభినందించారు. దౌత్య మార్గాల్లో సమస్యలను పరిష్కరించాలని ఆయన చెప్పారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ► మరోసారి కాల్పుల విరమణ ప్రకటించిన రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా మరోసారి కాల్పుల విరమణ ప్రకటించింది. కీవ్, ఖార్కీవ్, మరియూపోల్, సుమీ నగరాల్లో మధ్యాహ్నం 12గంటల 30 నిమిషాల నుంచి కాల్పుల విరమణ మొదలవుతుందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ విషయాన్ని పలు న్యూస్ ఏజెన్సీలు సైతం ధృవీకరించాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రోన్ వ్యక్తిగత రిక్వెస్ట్ మేరకు రష్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విరమణ ఎంత సేపు ఉంటుందనేది మాత్రం పేర్కొనలేదు. ఈ లోపు కారిడార్ల ద్వారా పౌరులను తరలించనున్నారు. ►ఉక్రెయిన్‌లోని క్రమాటోర్స్క్ నగరంలోని నివాస భవనాలపై రష్యా వాయుసేన సోమవారం క్షిపణి దాడి చేసింది.వాయుసేన జరిపిన దాడుల్లో ఇద్దరు పౌరులు మరణించారు. క్రమాటోర్స్క్ నగరంలోని నివాస భవనాలపై రష్యా క్రూయిజ్ క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరు పౌరులు మరణించారని ఉక్రెయిన్ సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ తెలిపింది. Russian military declares ceasefire in Ukraine from 0700 GMT to open humanitarian corridors at French President Emmanuel Macron's request: Sputnik — ANI (@ANI) March 7, 2022 ఇంకోపక్క సుమీలో భారతీయ విద్యార్థుల తరలింపు కష్టతరంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రధాని మోదీ.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మధ్యాహ్నాం ఫోన్లో సంప్రదించనున్నట్లు పీఎంవో వెల్లడించింది. ► ఖార్కివ్ మీదుగా ఎగురుతున్న రష్యన్ యుద్ధ విమానాన్ని కూల్చేశామని, ఈ ఘటనలో పైలట్ చనిపోయినట్టు ఖార్కివ్ రీజియన్ డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ వెల్లడించింది. కులినిచివ్ ప్రాంతంలో విమానం కూలిపోయినట్టు వివరించింది. పైలట్‌కు తప్పించుకునే సమయం కూడా లేకపోయిందని, ఘటనా స్థలంలోనే ఆయన చనిపోయారని పేర్కొంది. ► బాంబులతో దద్దరిల్లుతున్న మికోలాయివ్ పోర్టు నగరం మికోలాయివ్ బాంబులతో దద్దరిల్లుతోంది. ప్రధాన నగరాలకు వశపర్చుకునే క్రమంలో రష్యా బలగాలకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో దాడులు ఉదృతం చేయాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ సైన్యానికి పిలుపు ఇచ్చాడు. Russian forces appear to have launched a heavy artillery barrage against Mykolaiv, a day after Ukrainian troops pushed them from the city and recaptured the airport. From my vantage, I could see flashes from the attack lighting up the night sky along a large swath of the city. pic.twitter.com/cm4E0cNtN3 — Michael Schwirtz (@mschwirtz) March 7, 2022 ► రష్యాపై ఆంక్షల పర్వం రష్యాపై పాశ్చాత్య దేశాల ఆంక్షలు కొనసాగుతున్నాయి. అమెరికా, మిత్రపక్షాలు రష్యా ఆయిల్‌పైనా బ్యాన్ విధించే యోచనలో ఉన్నాయి. ► అంతర్జాతీయ న్యాయస్థానంలో.. మారణహోమం దావాపై అంతర్జాతీయ న్యాయస్థానంలో ఉక్రెయిన్ మరియు రష్యాలు తలపడనున్నాయి. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలో జరుగుతున్న దారుణాల నేపథ్యంలోనే ప్రత్యేక మిలిటరీ చర్యలకు దిగినట్లు రష్యా.. ఆధారాల్లేకుండా ఆరోపణలపై ఉక్రెయిన్ పరస్పరం వాదించనున్నాయి. ► జెలెన్స్కీకి ప్రధాని మోదీ ఫోన్! ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో భారత ప్రధాని నరేంద్ర మోదీ సంభాషించనున్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో ఫోన్లో మాట్లాడుకోనున్న ఇరు దేశాల నేతలు. మరోసారి భారత్ సాయం కోరనున్న జెలెన్స్కీ. భారత విద్యార్థుల తరలింపుపైనే ప్రధానంగా ప్రధాని మోదీ ఆరా తీసే అవకాశం. PM Narendra Modi to speak to Ukrainian President Zelenskyy on the phone today: GoI sources (file photos) pic.twitter.com/PuWuCv2Fqw — ANI (@ANI) March 7, 2022 ► అత్యాధునిక ప్రపంచ చరిత్రలో అతిపెద్ద మానవ సంక్షోభంగా ఉకక్రెయిన్ యుద్ధం నిలిచిపోనుందనే ఆందోళన ఐరాస వ్యక్తం చేస్తోంది. సుమారు 70 లక్షల మంది ఉకక్రెయిన్ను వీడొచ్చని అంచనా వేస్తోంది. ► ఉక్రెయిన్ సంక్షోభ నేపథ్యంలో నేడు(సోమవారం).. ఐక్యరాజ్య సమితి భద్రతామండలి అత్యవసర సమావేశం నాటో ఎంట్రీ ► నాటో దళాల ఎంట్రీని ఖంచిస్తున్న రష్యా. ఇది తీవ్ర యుద్ధానికి దారితీస్తుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రతిహెచ్చరిక. ► ఉక్రెయిన్‌కు మద్దతుగా రంగంలోకి దిగిన నాటో దేశాలు. జెలెన్స్కీ సాయం కోరిన తర్వాత అమెరికా చొవరతో నాటో దేశాల్లో కదలిక. రొమేనియాకు 40 వేల మంది సైనికులు. ఫ్రాన్స్ రాఫెల్ విమానాలు, 4 పైటర్జెట్లు. పోలాండ్‌కు చేరుకున్న బ్రిటన్ రాయల్ ఎయిర్‌ఫోర్స్. ► ఫలించిన జెలెన్స్కీ విజ్ఞప్తి. నాటోకు అమెరికా గ్రీన్ సిగ్నల్. పోలాండ్‌కు సాయం తరలింపు. ► యుద్ధంతో నన్ను చంపేస్తే.. ఉక్రెయిన్‌కు సాయం చేయాలని అమెరికాను కోరిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. ► ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం12వ రోజూ కొనసాగుతోంది. మిస్సైల్స్‌తో రష్యా బలగాలు విరుచుకుపడుతున్నాయి. మికోలాయివ్ దగ్గర హోరాహోరీ పోరు. ► యుద్ధ భయంతో ఉక్రెయిన్ నుంచి 15 లక్షల మంది వలస వెళ్లిపోయారు: ఐరాస This horrific 500-kg Russian bomb fell on a residential building in Chernihiv and didn’t explode. Many other did, killing innocent men, women and children. Help us protect our people from Russian barbarians! Help us close the sky. Provide us with combat aircraft. Do something! pic.twitter.com/3Re0jlaKEL — Dmytro Kuleba (@DmytroKuleba) March 6, 2022 ► పౌరుల తరలింపునకు సహకరిస్తామని ప్రకటించిన రష్యా.. యుద్ధం ఆపట్లేదు. దీంతో ప్రధాన నగరాల నుంచి పౌరుల తరలింపు కష్టతరంగా మారింది ఉక్రెయిన్‌కు. ముఖ్యంగా మరియూపోల్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఒకవైపు కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతున్న రష్యా.. పవర్, వాటర్‌ను కట్ చేసి పడేసింది నగరానికి. ► రష్యా దాడులతో మధ్య ఉక్రెయిన్‌లోని విన్నిట్సియా ఎయిర్పోర్ట్ సర్వనాశనం అయ్యింది. ► ఉక్రెయిన్‌లోని పౌరులపై రష్యా బలగాలు దాడులకు పాల్పడుతున్నాయని అమెరికా భద్రత ప్రతినిధి ఆంటోనీ బ్లింకెన్ ఆరోపిస్తున్నారు. ► ఇర్పిన్ నగరాన్ని వీడాలని ప్రయత్నిస్తున్న పౌరులు.. రష్యా దాడుల భయంతో, సైనికుల తుపాకీ బెదిరింపులతో వెనక్కి మళ్లుతున్నారు. ► ఓటీటీ కంపెనీ నెట్‌ఫ్లిక్స్‌తో పాటు కేపీఎంజీ, పీడబ్ల్యూసీ లాంటి అకౌంటింగ్ సంస్థలు, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ లాంటి ఫైనాన్షియల్ కంపెనీలు రష్యాతో పూర్తిగా సంబంధాలు తెంపేసుకున్నట్లు ప్రకటించాయి. ► ఉక్రెయిన్‌కు మద్ధతుగా రష్యాలో కొనసాగుతున్న నిరసనలు. 4,500 మంది నిరసనకారులను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ► అయితే సంధి లేకుంటే సమరం ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందని ఉక్రెయిన్‌తో తేల్చి చెప్పారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. -
‘పాక్‌కు దీటుగా బదులిస్తాం’
సాక్షి, న్యూఢిల్లీ: కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే పాకిస్థాన్‌కు ధీటైన బదులిస్తామని రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. రంజాన్ నేపథ్యంలో సరిహద్దు వ్యవహారంపై ఆమె మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాక్‌తో చర్చల అంశంపై ఆమె స్పందించారు. ‘ ఓవైపు సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ.. మరోపక్క చర్చలంటే కుదిరే పని కాదు. ఉగ్రవాదం-చర్చలు ఒకేసారి కుదరవు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటించి శాంతి వాతావరణం నెలకొంటేనే చర్చలు. అలా కాదని ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ధీటైన జవాబిస్తాం. సరిహద్దులను సురక్షితంగా ఉంచటం మా బాధ్యత. భారత్ కాల్పుల ఉల్లంఘన ఒప్పందానికి కట్టుబడి ఉంది. అంతేగానీ కవ్వింపు చర్యలను ఉపేక్షించబోదు’ అని ఆమె పేర్కొన్నారు. ఇక రక్షణ రంగంలో భారత్ -రష్యా సహకారంపై ఆమె స్పందించారు. ‘రక్షణ రంగంలో భారత్ -రష్యా సహకారం, సంబంధాలు చాలా ధృడమైనవి. రాఫెల్ జెట్స్ కొనుగోళ్ళలో ఎటువంటి కుంభకోణం జరగలేదు. ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్షం ఆరోపణలు చేస్తోంది. యూపీఏ హయాంలో ఆయుధాల కొరత ఉండేది. 2013-14 లో 87 వేల కోట్లకు గాను 79వేల కోట్లు ఖర్చు చేశారు. కానీ, ప్రస్తుతం భద్రతా బలగాలకు ఆయుధాల కొరత లేదు. 2017-18లో 86488 కోట్ల కేటాయింపులకు గాను 90460 ఖర్చు చేశాం. అవసరమైన ఆయుధాలు కొనే అధికారాన్ని సులభతరం చేశాం’ అని ఆమె వివరించారు. కంటోన్మెంట్ల రోడ్ల గురించి.. ‘దేశంలోని 62 కంటోన్మెంట్ రోడ్ల మూసివేతపై పలు విజ్ఞప్తులు అందాయి. టీఆర్ఎస్(తెలంగాణ) సహా పలు పార్టీల ప్రతినిధులతో చర్చించాం. మిలటరీ, సివిల్ సొసైటీతో సమావేశాలు నిర్వహించాం. రోడ్ల మూసివేతపై ఎంపీలు చేసిన విజ్ఞప్తిలో అర్ధముంది. ఇప్పటిదాకా 850రోడ్లు మూసివేయబడ్డాయి. 119 రోడ్లు నిబంధనలు పాటించకపోవటంతో మూసేశారు. 80 రోడ్లను మళ్ళీ తెరిపించాం. 15 రోడ్లను పాక్షికంగా తెరిచాం. 24 ఇంకా మూసివేసే ఉన్నాయి ’ అని నిర్మలా సీతారామన్ తెలిపారు. -
30 చోట్ల పాకిస్థాన్ కాల్పులు
-
30 చోట్ల పాకిస్థాన్ కాల్పులు
జమ్మూకశ్మీర్: పాకిస్థాన్ సైన్యం మరోసారి రెచ్చిపోయింది. ఒప్పందాలను మరోసారి ఉల్లంఘించింది. జమ్మూకశ్మీర్ లోని సాంబా సెక్టార్ లో కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఈ సెక్టార్ లోని పలు ప్రాంతాలపై ఆదివారం రాత్రంతా కాల్పులకు తెగబడింది. నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తం 30 సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని పాకిస్థాన్ సైన్యం కాల్పులకు దిగినట్లు సైనికాధికారులు తెలిపారు. గత కొద్ది రోజులుగా పాక్ కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. -
కొనసాగుతున్న పాక్ బరితెగింపు
శ్రీనగర్ :సరిహద్దుల్లో పాకిస్తాన్ బరితెగింపు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే కొన్ని వందల సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్ బలగాలు మరోసారి అదే పనికి తెగబడింది. ఆధీన రేఖ వెంబడి భారత ఔట్ పోస్టులపై పాక్ సైనికులు కాల్పులు జరిపారు. జమ్మూ, రాజౌరీ, పూంఛ్, కేజీ సెక్టార్లలో పాక్ బలగాల కాల్పులు కొనసాగాయి. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి పాక్ సైన్యం పెద్ద ఎత్తున కాల్పులకు పాల్పడింది. మొదట భారీ మోర్టార్లతో కాల్పులు జరిపిన దాయాది సైనికులు........ ఆ తర్వాత తుపాకులతో కాల్పులు కొనసాగించారు. గత రాత్రి పదిన్నర వరకు కాల్పులు కొనసాగినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ సైన్యానికి భారత సైన్యం దీటుగా జవాబిచ్చింది. మరోవైపు సరిహద్దుల్లో 150 మంది టెర్రరిస్టులు నక్కి ఉన్నట్లు సమాచారం. ఈ ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేలా చేసేందుకే పాక్ బలగాలు కాల్పులు జరుపుతున్నాయని సమాచారం. -
'పాక్ కు దీటైన సమాధానం చెప్పాల్సి ఉంది'
న్యూఢిల్లీ: భారత సరిహద్దుల్లో తరచు కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడుతున్న పాకిస్థాన్ కు దీటైన సమాధానం చెప్పాల్సి ఉందని కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ స్పష్టం చేశారు. పాక్ సేనలు పదే పదే భారత్ ను రెచ్చగొడుతున్నాయన్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం సరైన రీతిలో బదులు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఇదిలా ఉండగా పాక్ కాల్పుల ఉల్లంఘన చర్యలపై చర్చిస్తున్నామని కేంద్ర హోంమత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. గత రాత్రి పాక్ బలగాలు 12 భారత స్థావరాలపై దాడులకు పాల్పడి ఉద్రిక్త పరిస్థితులకు తెరలేపింది. జమ్మూ కశ్మీర్ లోని సాంబా జిల్లాలోని మోర్తార్ షెల్లింగ్ లో పాకిస్థాన్ బలగాలు కాల్పులకు పాల్పడటంతో ఒక భారత జవాన్ తో సహా ఐదుగురు మృతి చెందారు.ఈ ఘటనలో నలుగురు పాక్ జవాన్లు అసువులు బాసారు. జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు గుండా భారత్ భూభాగంలోకి ప్రవేశించిన పాక్ బలగాలు దాడులకు దిగడంతో స్థానిక పౌరుడొకరు తీవ్రంగా గాయపడ్డాడు. గత రెండు రోజుల్లో పాకిస్థాన్ మూడోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. అంతకుముందు పాక్ జరిపిన కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాన్ ఒకరు మరణించారు.