
గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాతున్న వేళ.. పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ కాల్పుల విరమణకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది. కొత్త షరతులేవీ లేకుంటే.. గతంలో అగ్రరాజ్యం అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందానికి సిద్ధమేనని పేర్కొంది.
ఇజ్రాయెల్- హమాస్ మధ్య కాల్పులు విరమణ కోసం ముందు నుంచి అమెరికా, ఖతార్, ఈజిప్టు దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ అల్ తాని, ఈజిప్టు ఇంటెలిజెన్స్ చీఫ్ అబ్బాస్ కమెల్ హమాస్ నేతలతో దోహాలో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఇతర కొత్త షరతులు లేకుంటే గతంలో అమెరికా ప్రతిపాదించిన కాల్పుల ఒప్పందం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని హమాస్ సీనియర్ అధికారి ఖలీల్ అల్ హయ్యా వెల్లడించారు.
ఇదీ చదవండి: బైడెన్ వ్యాఖ్యలపై భగ్గుమన్న హమాస్