జమ్మూకశ్మీర్: పాకిస్థాన్ సైన్యం మరోసారి రెచ్చిపోయింది. ఒప్పందాలను మరోసారి ఉల్లంఘించింది. జమ్మూకశ్మీర్ లోని సాంబా సెక్టార్ లో కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఈ సెక్టార్ లోని పలు ప్రాంతాలపై ఆదివారం రాత్రంతా కాల్పులకు తెగబడింది.
నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తం 30 సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని పాకిస్థాన్ సైన్యం కాల్పులకు దిగినట్లు సైనికాధికారులు తెలిపారు. గత కొద్ది రోజులుగా పాక్ కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడుతున్న విషయం తెలిసిందే.
30 చోట్ల పాకిస్థాన్ కాల్పులు
Published Mon, Oct 26 2015 6:55 AM | Last Updated on Sun, Sep 3 2017 11:31 AM
Advertisement
Advertisement