
షరతుల ప్రకారమైతే ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణను అంగీకరిస్తామని లెబనాన్‌కు చెందిన హెజ్‌బొల్లా మిలిటెంట్ గ్రూప్ కొత్త చీఫ్ నయీమ్ ఖాస్సేమ్ అన్నారు. ఆయన నిన్న (మంగళవారం) హెజ్‌బొల్లాకు కొత్త చీఫ్‌గా నియమితులయ్యారు. చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన తొలి ప్రసంగాన్ని చేశారు. సెప్టెంబర్ 27న ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మరణించిన మాజీ హిజ్బుల్లా చీఫ్ సయ్యద్ హస్సెన్ నస్రల్లా మార్గంలో కొనసాగుతానని ప్రతిజ్ఞ చేశారు.
‘‘ నా యుద్ధ వ్యూహాం.. మా నాయకుడు సయ్యద్ హసన్ నస్రల్లా యుద్ధ వ్యూహానికి కొనసాగింపు. లెబనాన్‌కు వ్యతిరేకంగా జియోనిస్ట్ పాలన 39 వేల ఉల్లంఘనలకు పాల్పడింది. ఇజ్రాయెల్ దక్షిణ లెబనాన్‌లో స్థావరాలను నిర్మించాలని చూస్తోంది. గాజా, లెబనాన్‌లలో ఇజ్రాయెల్ చేసిన హత్యానేరాల్లో అమెరికా, యురోపియన్ యూనియన్ రెండూ భాగస్వామిగా ఉన్నాయి. ఇజ్రాయెల్ లెబనాన్‌ను ఆక్రమించుకుని అరబ్ దేశంలో సెటిల్‌మెంట్లు చేసుకోవాలని యోచిస్తోంది. హెజ్‌బొల్లా ఇజ్రాయెల్ ఆలోచనలకు అడ్డుగా నిలుస్తోంది.
... గత నెలల్లో బాధాకరమైన ఎదురుదెబ్బలు తగిలిన తర్వాత ప్రస్తుతం హెబ్‌బొల్లా గ్రూప్ కోలుకుంటోంది. లెబనీస్ నేల నుంచి యూదుల దేశం అత్యవసరంగా ఉపసంహరించుకోకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. నష్టాలను తగ్గించుకోవడానికి మా భూమి నుంచి వెళ్లిపోండి. ఇలాగే ఉండిపోతే.. మీ జీవితంలో ఎన్నడూ చెల్లించని భారీ మూల్యం చెల్లించుకుంటారు. హెజ్‌బొల్లా రోజులు, వారాలు, నెలల పాటు పోరాటాన్ని కొనసాగించగలదు’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment