సరిహద్దుల్లో పాకిస్తాన్ బరితెగింపు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే కొన్ని వందల సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్ బలగాలు మరోసారి అదే పనికి తెగబడింది
శ్రీనగర్ :సరిహద్దుల్లో పాకిస్తాన్ బరితెగింపు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే కొన్ని వందల సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్ బలగాలు మరోసారి అదే పనికి తెగబడింది. ఆధీన రేఖ వెంబడి భారత ఔట్ పోస్టులపై పాక్ సైనికులు కాల్పులు జరిపారు. జమ్మూ, రాజౌరీ, పూంఛ్, కేజీ సెక్టార్లలో పాక్ బలగాల కాల్పులు కొనసాగాయి. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి పాక్ సైన్యం పెద్ద ఎత్తున కాల్పులకు పాల్పడింది.
మొదట భారీ మోర్టార్లతో కాల్పులు జరిపిన దాయాది సైనికులు........ ఆ తర్వాత తుపాకులతో కాల్పులు కొనసాగించారు. గత రాత్రి పదిన్నర వరకు కాల్పులు కొనసాగినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ సైన్యానికి భారత సైన్యం దీటుగా జవాబిచ్చింది. మరోవైపు సరిహద్దుల్లో 150 మంది టెర్రరిస్టులు నక్కి ఉన్నట్లు సమాచారం. ఈ ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేలా చేసేందుకే పాక్ బలగాలు కాల్పులు జరుపుతున్నాయని సమాచారం.