ఐక్యరాజ్యసమితి: పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితిలో మరోమారు కశ్మీర్ అంశంపై విషం చిమ్మింది. ఈ నేపధ్యంలో కశ్మీర్ విషయంలో పాక్ ఐక్యరాజ్యసమితిలో అసత్యాలను ప్రచారం చేస్తూ, ఈ ప్రపంచ వేదికను దుర్వినియోగం చేస్తోందని భారత్ ఆరోపించింది.
అబద్ధాలు ప్రచారం చేసేందుకు ఐక్యరాజ్యసమితి వేదికను పాక్ ఉపయోగించుకుంటోందని భారత్ పొరుగుదేశం పాక్‌పై దుమ్మెత్తి పోసింది. పాక్ ఇలాంటి ఎన్ని ప్రచారాలు సాగించినా, క్షేత్రస్థాయిలో వాస్తవాలు మారబోవని భారత్ పేర్కొంది. సమాచార సంబంధిత ప్రశ్నలపై యూఎన్ జనరల్ అసెంబ్లీకి చెందిన నాల్గవ కమిటీ సాధారణ చర్చలో రాజ్యసభ సభ్యుడు రాజీవ్ శుక్లా ప్రసంగించారు. ఒక పాకిస్తానీ ప్రతినిధి బృందం మరోసారి అబద్ధాలను వ్యాప్తి చేయడానికి ఈ ప్రతిష్టాత్మక వేదికను ఉపయోగించుకున్నదని ఆయన ఆరోపించారు.
దుష్ప్రచారం చేయడం, తప్పుడు సమాచారం ఇవ్వడం ఈ ప్రతినిధి బృందానికి అలవాటైందని రాజీవ్ శుక్లా ఆరోపించారు. ఐక్యారాజ్య సమితిలో పాకిస్తాన్.. జమ్ము కశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన దరిమిలా శుక్లా పాక్‌కు ఘాటుగా సమాధానం ఇచ్చారు. పాక్ ఎన్ని తప్పుడు సమాచారాలు ఇచ్చినా వాస్తవాలు మారవన్నారు. ఈ ఫోరమ్ (పాక్) రాజకీయ ఎజెండా కోసం కాకుండా నిర్మాణాత్మకంగా చర్చలో పాల్గొనాలని అన్నారు. ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా, విశ్వసనీయ సమాచారం అందిస్తూ ప్రజలను సాధికారతపరచడానికి భారత్ కృషి చేస్తున్నదన్నారు.
ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్‌లో నిరసనలు
Comments
Please login to add a commentAdd a comment