kasmir
-
కశ్మీర్‌పై మళ్లీ విషం చిమ్మిన పాక్.. తిప్పికొట్టిన భారత్
ఐక్యరాజ్యసమితి: పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితిలో మరోమారు కశ్మీర్ అంశంపై విషం చిమ్మింది. ఈ నేపధ్యంలో కశ్మీర్ విషయంలో పాక్ ఐక్యరాజ్యసమితిలో అసత్యాలను ప్రచారం చేస్తూ, ఈ ప్రపంచ వేదికను దుర్వినియోగం చేస్తోందని భారత్ ఆరోపించింది.అబద్ధాలు ప్రచారం చేసేందుకు ఐక్యరాజ్యసమితి వేదికను పాక్ ఉపయోగించుకుంటోందని భారత్ పొరుగుదేశం పాక్‌పై దుమ్మెత్తి పోసింది. పాక్ ఇలాంటి ఎన్ని ప్రచారాలు సాగించినా, క్షేత్రస్థాయిలో వాస్తవాలు మారబోవని భారత్ పేర్కొంది. సమాచార సంబంధిత ప్రశ్నలపై యూఎన్ జనరల్ అసెంబ్లీకి చెందిన నాల్గవ కమిటీ సాధారణ చర్చలో రాజ్యసభ సభ్యుడు రాజీవ్ శుక్లా ప్రసంగించారు. ఒక పాకిస్తానీ ప్రతినిధి బృందం మరోసారి అబద్ధాలను వ్యాప్తి చేయడానికి ఈ ప్రతిష్టాత్మక వేదికను ఉపయోగించుకున్నదని ఆయన ఆరోపించారు.దుష్ప్రచారం చేయడం, తప్పుడు సమాచారం ఇవ్వడం ఈ ప్రతినిధి బృందానికి అలవాటైందని రాజీవ్ శుక్లా ఆరోపించారు. ఐక్యారాజ్య సమితిలో పాకిస్తాన్.. జమ్ము కశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన దరిమిలా శుక్లా పాక్‌కు ఘాటుగా సమాధానం ఇచ్చారు. పాక్ ఎన్ని తప్పుడు సమాచారాలు ఇచ్చినా వాస్తవాలు మారవన్నారు. ఈ ఫోరమ్ (పాక్) రాజకీయ ఎజెండా కోసం కాకుండా నిర్మాణాత్మకంగా చర్చలో పాల్గొనాలని అన్నారు. ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా, విశ్వసనీయ సమాచారం అందిస్తూ ప్రజలను సాధికారతపరచడానికి భారత్ కృషి చేస్తున్నదన్నారు. ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్‌లో నిరసనలు -
కశ్మీర్ ప్రజలు ఏమంటున్నారంటే...?
‘జమ్మూ–కశ్మీర్’ విభిన్న జాతులు, మతాలు, భాషలు, నైసర్గిక స్వరూపాలు కలిగిన ప్రాంతాల సమాహారం. ఏదో ఒక కారణంగా కశ్మీర్ రోజూ వార్తల్లో ఉంటోంది. పార్టీలు, నాయకులు, మేధావులు, జాతీ యవాదులు ఏదో ఒక సంద ర్భంలో కశ్మీరు గురించి మాట్లా డుకుంటూనే ఉంటారు. దేశమంతా కశ్మీరు గురించి చర్చిస్తున్న విషయాల్నే కశ్మీరీలు మాట్లాడుకుంటు న్నారా? అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అసలు కశ్మీరీల మనసుల్లో ఏముంది? అని అన్వేషించడానికి ‘పీపుల్స్ పల్స్’ బృందం క్షేత్రస్థాయిలో పర్య టించింది. కశ్మీరు లోయ నుంచి జమ్మూ మైదాన ప్రాంతాల వరకు... ఎందరో సామాన్య కశ్మీరీలతో మాట్లాడి, వారి మనసులో ఏముందో పసిగట్టే ప్రయత్నం చేసింది.1977లో మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయిన తర్వాత కశ్మీరులో జరిగిన అసెంబ్లీ ఎన్నిక ఒక్కటే ఈ 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో స్వేచ్ఛగా, న్యాయంగా జరిగిన ఎన్నిక అని కశ్మీరీలు అంటారు. అంతకు ముందు, ఆ తర్వాత జరిగిన ఎన్నిక లన్నీ ఢిల్లీ పాలకులకు అనుకూలంగా జరిగిన ఎన్నికలేనని వారు భావిస్తున్నారు. జమ్మూ– కశ్మీరులో ఏ మూలకు వెళ్లి ఎవ్వరితో మాట్లాడినా... చాలా సమస్యలపై వారికి ఏకాభిప్రాయం లేనప్ప టికీ, ఉమ్మడి అభిప్రాయం ఉన్నది ఒక విషయంలోనే: ఆ రెండు ప్రాంతాల్లోనూ ఎన్నికలు రావాలని బలంగా కోరుకుంటున్నారు.2019 ఆగస్టు 5న ఎన్డీయే ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో జమ్మూ–కశ్మీర్‌కు ఉన్న స్వయంప్రతిపత్తి హోదా తొలగిపోయింది. రాష్ట్రాన్ని కశ్మీర్, లద్దాఖ్ అని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ఆ తర్వాత అక్కడ ఎన్నికలు జరగలేదు. 2023 డిసెంబరు 11న సుప్రీంకోర్టు, పూర్వ జమ్మూ– కశ్మీర్‌కి లభిస్తున్న స్వయంప్రతిపత్తి రద్దు నిర్ణయాన్ని సమర్థించింది. అయితే, రాష్ట్ర హోదాను పునరుద్ధరించి, ఈ సెప్టెంబర్ 30 నాటికి అసెంబ్లీ ఎన్నికలు నిర్వ హించాలని ఆదేశించింది. ‘‘ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదే శాలతో ఎన్నికలు జరిగినా... మహా అయితే ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం లాంటిది ఏర్పడవచ్చు. అక్కడ అన్ని కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. అలాంటి ప్రభుత్వం మాకొద్దు’’ అని శ్రీనాగ్లో ఒక వ్యాపారి చెప్పాడు. ఇంచుమించు ఇదే అభిప్రాయం చాలా చోట్ల వినపడింది.రాష్ట్ర హోదాపాలన విషయంలో ఢిల్లీ మోడల్ని, సామాన్య స్థానికులతో పాటు గతంలో బీజేపీకి ఓటేసిన వాళ్లే వ్యతిరేకిస్తున్నారు. బీజేపీకి బలమైన మద్దతుదా రులుగా ఉన్న గుజ్జర్ సామాజిక వర్గం బీజేపీకి ఇప్పుడు దూరం జరిగింది. స్థానిక బీజేపీ నాయకులు కూడా జమ్మూ–కశ్మీర్‌కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదాను పునరు ద్ధరించాలని, ఢిల్లీ ప్రభుత్వం లాంటిది వద్దని చెప్తు న్నారు. కశ్మీర్ విషయంలో తమది చరిత్రాత్మక నిర్ణయ మని బీజేపీ దేశమంతా ప్రచారం చేసుకుంటోంది. కానీ, కశ్మీరులో స్థానిక బీజేపీ నాయకులు కూడా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదే అని ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. అందుకే, లోక్‌సభ ఎన్నికల్లో కశ్మీర్లో బీజేపీ తమ పార్టీ నుంచి అభ్యర్థిని నిలబెట్టలేదు. దీంతో రానున్న అసెంబ్లీ ఎన్ని కల్లో బీజేపీ పరి స్థితిపై కొంత అనిశ్చితి నెలకొంది.కశ్మీర్లో లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) మనోజ్ సిన్హా పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంలో కొన్ని లోపాలు, వైఫ ల్యాలు ఉంటాయి. కానీ, అది మిలిటరీ సాయంతో ఇష్టారీతిన వ్యవహరిస్తున్న ఎల్జీ పాలన కంటే ఏ విధంగా చూసినా మెరుగ్గానే ఉంటుందని ప్రజలు భావి స్తున్నారు. ‘‘ఎల్జీకి, ప్రజలకు మధ్య సంబంధాలు తెగి పోయాయి. ఎన్నికలు లేకుండా వచ్చిన ఎల్జీ, అతని బ్యూరోక్రాట్ల బృందం నుంచి ప్రజాస్వామిక పరిపాల నను ఆశించలేం అని జమ్మూ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకరు అన్నారు. ప్రజలకు, అధికారులకు మధ్య అంతరం పెరిగి పోయింది. మీడియాలో చూపించే వంతెనలు, అండర్ పాస్‌లను పక్కన పెడితే, స్థానిక ప్రాంతాలను కలిపే రోడ్లు అధ్వాన్నంగా తయార య్యాయి. కొత్త రోడ్లు వేయడం, రోడ్లను రిపేర్ చేయడం పూర్తిగా ఆపేశారని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా పరిస్థితి చూస్తే, ఇప్పుడున్న దాని కన్నా 2019కి కంటే ముందే బాగుండేదని అనేక ఉదాహరణలు చెబు తున్నారు.జమ్మూ, శ్రీనగర్‌లు గవర్నమెంట్ ప్రకటనల్లో మాత్రమే పేరుకు స్మార్ట్ సిటీలనీ, తగిన మౌలిక వస తులు లేక తమ వ్యాపారాలన్నీ దెబ్బతిన్నాయనీ స్థానిక వ్యాపారులు చెబుతు న్నారు. బయటి రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులు అక్రమ మైనింగ్ చేస్తున్నారనీ, బయట నుంచి వచ్చిన వాళ్లే మద్యం వ్యాపారం చేస్తు న్నారనీ, ముఖ్యమైన స్థానాలన్నింటీలో బయటి రాష్ట్రాల నుంచి వచ్చిన అధికారులే ఉంటున్నారనీ, ఇది తమకు న్యాయం చేయడం లేదనీ ప్రజలు ఏకాభిప్రా యంతో ఆరోపిస్తున్నారు. ‘‘ఐఐఎం, ఐఐటీల్లో కూడా ముఖ్యమైన పదవుల్లో బయటి వాళ్లనే ఎందుకు నియ మిస్తున్నారు? ఎందుకు అంత భయం?’’ అని అడ్వ కేట్‌గా పనిచేస్తున్న షేక్ షకీల్ ప్రశ్నించారు.‘‘మాకు ఉద్యోగాలు లేవు, పెద్ద ఎత్తున రాష్ట్రానికి పెట్టుబడులు రావాల్సిన అవసరం ఉంది. మేం ప్రభు త్వాన్ని ప్రశ్నిస్తే దేశ ద్రోహుల కింద నేరం మోపు తున్నారు. గత 5 ఏళ్లుగా మేం ఎన్నుకోని ప్రభుత్వంలో ఉన్నాం’’ అనేది కశ్మీరీ యువత అభిప్రాయం. చలికాలంలో జమ్మూ, వేసవికాలంలో శ్రీనగర్ నుంచి జరిగే దర్బార్ పాలనకు 2019లో ఎన్డీయే ప్రభుత్వం చెక్ పెట్టింది. దీనికి అనవసర ఖర్చు అవు తోందనీ, ఇది కూడా చరిత్రాత్మక నిర్ణయ మనీ బీజేపీ ప్రచారం చేసుకుంది. కానీ, 5 ఏళ్ల తర్వాత చూస్తే దర్బార్ని పునరుద్ధరించాలని ప్రజలు కోరుకోవడం గమనార్హం. ‘‘దర్బార్ ఉన్నప్పుడు అధికారులు, వాళ్ల కుటుంబాలు ఇక్కడే బస చేసేవి. వారు జమ్మూలో ఐదారు నెలలు పెట్టే ఖర్చే మాకు ఆదాయం అయ్యేది. కానీ, ఇప్పుడు ఆ దారులన్నీ మూసుకు పోయాయ’’ని జమ్మూ వ్యాపారి వికాస్ శర్మ చెప్పాడు. జనం కోరు తున్నట్టు దర్బార్‌ను పునరుద్ధరిస్తే, కేంద్ర ప్రభుత్వం ఇంకా చాలా నిర్ణయాలు వెనక్కి తీసుకోవాల్సి వస్తుందనీ, అందుకే తాము అడిగినా నాయకత్వం పట్టించు కోవడం లేదని స్థానిక బీజేపీ నాయకులు చెబు తున్నారు.35 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో జమ్మూ–కశ్మీరులో 58.58 శాతం ఓటింగ్ నమోదైంది. గతంలో ఎన్నికలను బహిష్కరించిన ఈ ప్రాంతంలో, ప్రభుత్వాన్ని ఎన్ను కోవడానికి తపిస్తున్న ప్రజల గాఢమైన కోరికకు ఈ ఓటింగ్ శాతం అద్దం పడుతోంది. ప్రజాస్వామ్యాన్ని పునరిద్ధరించాలనీ, ‘దిగుమతి’ సర్కారు కాకుండా సామాన్యులకు అందుబాటులో ఉండే ప్రభుత్వం రావా లనీ కోరుకుంటున్న కశ్మీరీల కల నెరవేరుతుందా, లేదా అనేది ఇంకో నెలన్నరలో తేలనుంది.– జి. మురళీకృష్ణ, వ్యాసకర్త పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థలో పరిశోధకులు -
ఈ ట్విన్స్ చిరుహాసానికి దక్కిన పదం.. 'షాయరీ ఆన్ స్నో'
చిన్నారుల వచ్చిరాని మాటలు భలే ముద్దు ముద్దుగా ఉంటాయి. వారితో గడుపుతుంటే రోజులే తెలియవు. అలాంటిది చిన్నారులకు సంబంధించిన వీడియోలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నెటిజన్లను ఇట్టే ఆకర్షిస్తాయి. అమాయకత్వంతో కూడిన ఆ మాటలు వింటే ఎంతటి పెద్దవాళ్లైన చిన్న పిల్లాడిలా మారిపోవాల్సిందే. అంతలా ఆకట్టుకుంటాయి వారి మాటలు చేష్టలు. అందులోనూ ట్వీన్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అలాంటి ట్విన్ సిస్టర్స్‌కి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. అందులో.. ఆరు సంవత్సరాల వయసు ఉన్న కశ్మీరి ట్విన్ స్విస్టర్స్ జైబా బింటీ తలిబ్, జైనబ్ బింటీ తలిబ్ వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. కశ్మీర్లో ఫస్ట్ స్నోఫాల్‌ను సెలబ్రెట్ చేసుకోవడానికి సంబంధించిన వీడియో ఇది. ఒకేరకం దుస్తులు ధరించి, మంచుతో నిండిన వీధిలో నిలబడి 'హమ్ యహా పే బహుత్ జాదా ఎంజాయ్ కర్ రహే హై. మస్తీ కర్ రహే హై' అంటూ పిల్లలు ముద్దు ముద్దుగా మాట్లాడుతున్న మాటలు నెటిజనులను ఆకట్టుకుంటున్నాయి. పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్ర 'షాయరీ ఆన్ స్నో' కాప్షన్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియో పదకొండు మిలియన్లను దక్కించుకుంది. ఇవి చదవండి: Pillala Katha: పాపన్న కొలువు! -
అయోధ్యకు ఆఫ్గనిస్థాన్ కానుక
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయి. ఆలయంలో కొలువయ్యే బాలరామునికి ఆఫ్గనిస్థాన్‌తో సహా ప్రపంచం నలుమూలల నుండి కానుకలు అందుతున్నాయి. విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు అలోక్ కుమార్ తాజాగా కశ్మీర్, తమిళనాడు, ఆఫ్గనిస్థాన్ నుండి వచ్చిన కానుకలను రామాలయ ట్రస్ట్‌కు అందజేశారు. అయోధ్య రామాలయ నిర్మాణంపై ముస్లిం సమాజం కూడా సంతోషంగా ఉందని అలోక్ కుమార్ పేర్కొన్నారు. కాశ్మీర్‌కు చెందిన ముస్లిం సోదరులు, సోదరీమణులు తనను కలవడానికి వచ్చి, రామమందిర నిర్మాణంపై సంతోషం వ్యక్తం చేస్తూ, వారు సేంద్రియ పద్ధతిలో తయారు చేసిన రెండు కిలోల స్వచ్ఛమైన కుంకుమపువ్వును అందజేశారన్నారు. ప్రపంచంలోని వివిధ దేశాలతో పాటు ఆఫ్గనిస్థాన్ నుండి కూడా ప్రత్యేక బహుమతి వచ్చిందని అలోక్ కుమార్ చెప్పారు. ఆఫ్గనిస్థాన్లోని కాబూల్‌లో గల ‘కుబా’నదిలోని నీటిని కానుకగా స్వీకరించామని అన్నారు. తమిళనాడుకు చెందిన పట్టు వస్త్రాల తయారీదారులు శ్రీరాముని ఆలయ చిత్రంతో నేసిన సిల్క్ దుస్తులను పంపారన్నారు. -
ఢిల్లీలో చలి విజృంభణ.. కశ్మీర్లో జీరోకు దిగువన ఉష్ణోగ్రతలు!
దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తుండటంతో చలి మరింతగా పెరుగుతోంది. రానున్న రోజుల్లో పలు రాష్ట్రాల్లో విరివిగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇంతేకాదు డిసెంబర్ 12 నుండి పశ్చిమ బెంగాల్, సిక్కింలోని వివిధ ప్రాంతాలలో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ(ఐఎండీ)హెచ్చరిక జారీ చేసింది. జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వర్షాలు, మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఢిల్లీ-ఎన్సీఆర్ వాతావరణ స్థితిగతుల విషయానికి వస్తే ఉష్ణోగ్రతలో నిరంతరం క్షీణత కనిపిస్తోంది. ఆదివారం (డిసెంబర్ 10) రాజధానిలో కనిష్ట ఉష్ణోగ్రత 8.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఈ ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గుతాయని, ఉదయం పొగమంచు కురుస్తుందని వాతావరణ శాఖ తెలియజేసింది. సోమవారం (డిసెంబర్ 11) గరిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 8 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఢిల్లీ-ఎన్సీఆర్లో గాలి నాణ్యత పేలవమైన విభాగంలోనే కొనసాగుతోంది. అంతే కాదు రాబోయే మూడు రోజుల్లో రాజధానిలో కాలుష్య సమస్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. కాగా డిసెంబరు 11న పశ్చిమ బెంగాల్, సిక్కింలోని కొన్ని చోట్ల, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జమ్మూకశ్మీర్ వేసవి రాజధాని శ్రీనగర్‌లో ఉష్ణోగ్రత మైనస్ 4.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బారాముల్లా జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గుల్మార్గ్లో ఉష్ణోగ్రతలు మైనస్ 4.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. ఇది కూడా చదవండి: ఈ మూడు కారణాలే బాబాను సీఎం రేసు నుంచి తప్పించాయా? -
పుల్వామాలో ఇద్దరు టెర్రరిస్టులు హతం
కశ్మీర్: జమ్ము- కశ్మీర్లో మారోసారి కాల్పుల మోత మోగింది. పుల్వామా జిల్లాలో శుక్రవారం ఎన్కౌంటర్ జరిపిన భద్రతా బలగాలు.. ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టారు. ఇంటలిజెన్స్ సమాచారం మేరకు దక్షిణ కశ్మీర్‌లోని అవంతీపురా జిల్లాలో భద్రతా బలగాలు కార్డన్‌సర్చ్ నిర్వహించాయి. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న ఉగ్రవాదులు వారిపై కాల్పులకు తెగబడటంతో.. ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో వారి వద్ద లభించిన మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే వీరు ఏ సంస్థకు చెందినవారో గుర్తించేందుకు విచారణ చేపట్టామన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు అవంతీపురా జిల్లా పరిధిలోని రైలు, ఇంటర్నెట్ సర్వీస్‌లను నిలిపివేసినట్లు వెల్లడించారు. -
ఆర్మీ క్యాంపుపై దాడికి తెగబడిన ఉగ్రవాదులు
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఉత్తర కశ్మీర్ కుప్వారా జిల్లాలోని రెండు సైనిక శిభిరాలపై గురువారం తెల్లవారు జామున 5 గంటలకి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. హంద్వారాలోని 30 ఆర్ఆర్ ఆర్మీ క్యాంపు, లాంగ్ గేట్ ఆర్మీ క్యాంపును లక్ష్యంగా చేసుకొని మెరుపుదాడికి యత్నించారు. ఉగ్రదాడిని భద్రతాదళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. జవాన్లకు ఉగ్రవాదులకు హోరాహోరీగా కాల్పులు జరిగాయి. ఇందులో ఇద్దరు ఉగ్రవాదులను ఆర్మీ మట్టుపెట్టింది. అదనపు బలగాలను రంగంలోకి దింపిన ఆర్మీ ముమ్మర గాలింపు చర్యలు చేపట్టింది. -
దాడి ఎలా జరిగిందంటే?
-
జమ్ములో కొనసాగుతున్న కాల్పులు
-
అమర జవాన్లకు ఘన నివాళి
పుంగనూరు టౌన్ : కశ్మీర్‌లోని యూరి సైనిక శిబిరంపై పాక్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో అశువులు బాసిన జవాన్లకు మంగళవారం మున్సిపల్ సిబ్బంది, లయన్స్ క్లబ్ సంయుక్తంగా నివాళులర్పించారు. పట్టణంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. జవాన్ల ఆత్మశాంతి కోసం మౌనం పాటించారు. లయన్స్ జిల్లా డయాబెటిక్ చైర్పర్సన్ డాక్టర్ శివ మాట్లాడుతూ భారత్‌పై పాక్ ఉగ్రవాద చర్యలను ప్రోత్సహించడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ లోకేష్‌వర్మ, వైస్ చైర్మన్ ఆవుల అమరేంద్ర , లయన్స్ క్లబ్ సభ్యులు వరదారెడ్డి, సుట్లూరు శ్రీనివాసులు, ముత్యాలు, సరస్వతమ్మ, గిరిధర్, ఇంతియాజ్, ప్రభాకర్‌నాయుడు, గోపాలకృష్ణ, సమాఖ్య సభ్యులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
వీర సైనికులారా వందనం
కశ్మీర్లో జరిగిన ఉగ్ర దాడిలో వీరమరణం పొందిన భారత జవాన్లకు నివాళిగా సోమవారం కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. లోక్‌సత్తా విద్యార్థి విభాగం, మాజీ సైనికుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. హన్మకొండ జూనియర్ కళాశాల నుంచి పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు ర్యాలీ సాగింది.