పుంగనూరు గోకుల్‌సర్కిల్లో అమరజవాన్లకు కొవ్వొత్తులతో నివాళులర్పిస్తున్న దృశ్యం
పుంగనూరు టౌన్ : కశ్మీర్‌లోని యూరి సైనిక శిబిరంపై పాక్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో అశువులు బాసిన జవాన్లకు మంగళవారం మున్సిపల్ సిబ్బంది, లయన్స్ క్లబ్ సంయుక్తంగా నివాళులర్పించారు. పట్టణంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. జవాన్ల ఆత్మశాంతి కోసం మౌనం పాటించారు. లయన్స్ జిల్లా డయాబెటిక్ చైర్‌పర్సన్ డాక్టర్ శివ మాట్లాడుతూ భారత్‌పై పాక్ ఉగ్రవాద చర్యలను ప్రోత్సహించడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ లోకేష్‌వర్మ, వైస్ చైర్మన్ ఆవుల అమరేంద్ర , లయన్స్ క్లబ్ సభ్యులు వరదారెడ్డి, సుట్లూరు శ్రీనివాసులు, ముత్యాలు, సరస్వతమ్మ, గిరిధర్, ఇంతియాజ్, ప్రభాకర్‌నాయుడు, గోపాలకృష్ణ, సమాఖ్య సభ్యులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.