lions club
-
కాకినాడ జీజీహెచ్ సిబ్బందికి లయన్స్ క్లబ్ సాయం
-
రికార్డు స్థాయిలో మరణాలు
న్యూఢిల్లీ: దేశంలో కరోన రక్కసి జనం ప్రాణాలను బలిగొంటూనే ఉంది. కరోనా సంబంధిత మరణాలు వెయ్యి మార్కును దాటేశాయి. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం సాయంత్రం వరకు.. కేవలం 24 గంటల్లో రికార్డు స్థాయిలో 71 మంది కన్నుమూశారు. కొత్తగా 1,813 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటిదాకా మొత్తం మరణాలు 1,008కు, మొత్తం పాజిటివ్ కేసులు 31,787కు ఎగబాకాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. భారత్‌లో యాక్టివ్ కరోనా కేసులు 22,982 కాగా, 7,796 మంది బాధితుల కోలుకున్నారు. అంటే మొత్తం బాధితుల్లో 24.52 శాతం మంది ఆరోగ్యవంతులైనట్లు స్పష్టమవుతోంది. కేవలం 0.33% మంది వెంటిలేటర్లపై దేశంలో మొత్తం కరోనా వైరస్ బాధితుల్లో కేవలం 0.33 శాతం మంది వెంటిలేటర్లపై ఉన్నారని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ చెప్పారు. 1.5 శాతం మంది ఆక్సిజన్ సపోర్టుపై ఉన్నారని, 2.34 శాతం మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారన్నారు. హర్షవర్దన్ బుధవారం లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. దేశంలో సరిపడా ఐసోలేషన్ పడకలు, వెంటిలేటర్లు, వ్యక్తిగత రక్షణ పరికరాలు, మాస్కులు అందుబాటులో ఉన్నాయని అన్నారు. దేశంలో ప్రస్తుతం 288 ప్రభుత్వ ల్యాబ్‌లు 97 ప్రైవేట్ ల్యాబ్‌లతో కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. 16,000 కరోనా నమూనా సేకరణ కేంద్రాలు ఉన్నాయన్నారు. నిత్యం 60 వేల కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయని వివరించారు. రోజుకు లక్ష పరీక్షలు నిర్వహించేలా టెస్టింగ్ కెపాసిటీని పెంచుతామన్నారు. అందుబాటులో ఉన్న సోషల్ వ్యాక్సిన్లు లాక్డౌన్, భౌతిక దూరం అని స్పష్టం చేశారు. కరోనాపై జరుగుతున్న పోరాటంలో లయన్స్ క్లబ్ సభ్యులు ప్రశంసనీయమైన పాత్ర పోషిస్తున్నారని హర్షవర్దన్ కొనియాడారు. 129కి తగ్గిన హాట్‌స్పాట్ జిల్లాలు దేశంలో కరోనా హాట్‌స్పాట్ జిల్లాలు గత 15రోజుల్లో 170 నుంచి 129కి తగ్గాయి. అలాగే కరోనా ప్రభావం ఏమాత్రం లేని గ్రీన్జోన్లు 307 నుంచి 325కు పెరిగాయి. నాన్–హాట్‌స్పాట్ జిల్లాలు(ఆరెంజ్ జోన్లు) 207 నుంచి 297కు చేరాయి. ఏప్రిల్ 15వ తేదీన కేంద్ర ప్రభు త్వం 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతా ల్లోని 170 జిల్లాలను కరోనా వైరస్ హాట్స్పాట్లుగా గుర్తించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 325 జిల్లాల్లో కరోనా కేసులేవీ నమోదు కాలేదని కేంద్రం వెల్లడించింది. దేశంలో కరోనా కేసులు రెట్టింపు కావడానికి లాక్డౌన్ కంటే ముందు 3 నుంచి 3.25 రోజులు పట్టగా, ప్రస్తుతం 10.2 నుంచి 10.9 రోజులు పడుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. -
డాక్టర్లకు లయన్స్ క్లబ్ సభ్యుల సంఘీభావం
సాక్షి, హైద్రాబాద్ : ఇటీవల భారతదేశంలో డాక్టర్లపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ...మల్టిపుల్ డిస్ట్రిక్స్ -320 పరిధిలో తెలంగాణ,కర్ణాటక రాష్ట్రాల్లోని 500 లయన్స్క్లబ్లలో ఉన్న 19వేల మంది సభ్యులు డాక్టర్లకు సంఘీభావం తెలిపారు.డాక్టర్లు ప్రాణదాతలని, మానవ జాతి రక్షణకు కంకణం కట్టుకున్న సేవాదురంధరులని, వారిపై దాడి హేయమైందని అన్నారు. దేశ వ్యాప్తంగా లయన్స్ క్లబ్‌ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆస్పత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్లు వైద్యశిబిరాల ద్వారా నిరుపేదలకు వలందిస్తూ సహాయ సహకారాలను అందిస్తున్నారని 320 డిస్ట్రిక్ట్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్, ఎండీ ఎస్.నరేందర్‌రెడ్డి కొనియాడారు. శుక్రవారం సోమాజిగూడలో ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతర్జాతీయ లయన్స్ క్లబ్ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా 210 దేశాల్లో 102 సంవత్సరాలుగా మానవాళికి సేవలందిస్తున్నాయని, అంతేకాకుండా తమ సభ్యులతో పాటు ఆయా దేశాల్లో వైద్యవృత్తిలో ఉన్న డాక్టర్లు కూడా తమ సహకారాన్ని అందించడం ముదావహమని నరేందర్‌రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ డాక్టర్ ప్రతాప్‌రెడ్డి, సెక్రటరీ డాక్టర్ సంజీవ్‌సింగ్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని స్థానిక లయన్స్ క్లబ్‌ల సహకారంతో అట్టడుగు వర్గాలకు, నిరుపేదలకు వైద్య శిబిరాలు నిర్వహించి సహాయమందించడానికి తాము సంసిద్ధంగా ఉన్నామని మల్టిపుల్ డిస్ట్రిక్ట్-320 లయన్స్ క్లబ్‌ల సభ్యులకు తెలిపారు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మాజీ డైరెక్టర్ ఆర్. సునీల్‌కుమార్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలోని 60శాఖల్లోని 16వేల మంది స్పెషలిస్టులు, సూపర్ స్పెషలిస్టులు దేశవ్యాప్తంగా వైద్యులపై జరుగుతున్న దాడులను నిరసించి వారికి నైతిక మద్దతు తెలిపామన్నారు. వైద్యవృత్తిలో ఉన్న డాక్టర్లకు తగు భద్రత కల్పించి, డాక్టర్లపై దాడులకు పాల్పడుతున్నవారిపై తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఈ సమావేశంలో లయన్స్ క్లబ్‌ల ప్రతినిధులు కోరారు. ఈ సమావేశంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత, అసోసియేషన్ సర్జన్స్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ పి.రఘురాం మాట్లాడుతూ వైద్యవృత్తి పవిత్ర మైనదని, ఎక్కడో ఓ పొరపాటు జరిగినంత మాత్రాన మొత్తం వైద్యులందరినీ బాధ్యులను చేసి దాడులకు దిగడం సరికాదన్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత, కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ ఏవీకే గోఖలే మాట్లాడుతూ..కోల్‌కతాతో పాటు ఇటీవల హైదరాబాద్‌లో కూడా ఇలాంటి దాడులు జరగడం విచారకరమన్నారు. వైద్యులపై దాడులు జరగకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని గోఖలే కోరారు. తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్‌హోమ్స్ అసోసియేషన్ గౌరవ కార్యదర్శి డాక్టర్ రవీందర్రావు, మల్టిపుల్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు ఎం.ప్రమోద్‌కుమార్‌రెడ్డి, కార్యదర్శి మామిడాల శ్రీనివాస్,మల్టిపుల్ కౌన్సిల్ ట్రెజరర్ సయ్యద్ జావీద్, సంయుక్త కార్యదర్శి బి.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
టాలెంట్ ఒక్కరి సొత్తు కాదు: రోశయ్య
సాక్షి, హైదరాబాద్: ప్రతిభ ఏ ఒక్కరి సొంతం కాదని తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్ కె.రోశయ్య అన్నారు. ఆదివారం నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్, సద్గురు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో పీస్ పోస్టర్ పోటీ విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. నవంబర్ 2న నిర్వహించన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులను సత్కరించారు. లయన్స్‌క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320ఏ చైర్మన్ సత్యవోలు రాంబాబు అధ్యక్షతన జరిగిన సభలో రోశయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విజేతలు సాయితేజ, సంహిత రెడ్డి, సంజన బహుమతులు అందుకున్నారు. మరో 10 మంది చిన్నారులకు ప్రత్యేక బహుమతులు ప్రదానం చేశారు. 300 మందికి పోత్సాహక బహుమతులు అందజేశారు. ఉత్తమ సేవా అవార్డు, ఉత్తమ డ్రాయింగ్ టీచర్ పురస్కారాలు కూడా ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఈవెంట్ చైర్మన్, లయన్ ఎంఆర్ఎస్ రాజు, లయన్స్‌క్లబ్ గవర్నర్ బి.ప్రభాకర్, డాక్టర్ రాజగోపాల్‌రెడ్డి, మనోజ్‌కుమార్ పురోహిత్, బండారు ప్రభాకర్, రమేశ్ చంద్ర పండిత్, ఎల్లా సుబ్బారెడ్డి, కృష్ణా రెడ్డి, వెంకట సురేశ్, డాక్టర్ పరం శివం, మహేశ్, పూజిత, మనాలి తదితరులు పాల్గొన్నారు. -
లయన్స్‌క్లబ్ మొదటి వైస్ గవర్నర్‌గా ఏవీఆర్ ప్రసాద్
నంద్యాల: లయన్స్ క్లబ్ 316హెచ్ 2017-18 మొదటి వైస్ గవర్నర్‌గా ఏవీఆర్ ప్రసాద్ ఎంపికయ్యారు. గత ఏడాది ఆయన క్లబ్ రెండవ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. శుక్రవారం గుంటూరులో జరిగిన మల్టిబుల్ కాన్ఫరెన్స్‌కు ఏవీఆర్ ప్రసాద్‌తో పాటు క్లబ్ జిల్లా చైర్మన్లు శ్రీకాంత్, రవిప్రకాష్, జోనల్ చైర్మన్ కశెట్టి చంద్రశేఖర్, అధ్యక్షుడు భవనాశి నాగమహేష్, కార్యదర్శి ఉపేంద్రనాథరెడ్డి, కోశాధికారి ఇమ్మడి శ్రీనివాసులు, సభ్యుడు బైసాని రామశేషు హాజరయ్యారు. గుంటూరు, కర్నూలు, కడప, అనంతపురం, ప్రకాశం జిల్లాల ప్రతినిధులు చేతులెత్తే విధానంలో 99శాతం మెజార్టీతో ఆయనకు పట్టం కట్టారు. 2016-17కు రెండవ గవర్నర్‌గా ఉన్న ఆయన 2017-18కి మొదటి గవర్నర్‌గా సేవలందిస్తారు. 2018-19కి గవర్నర్‌గా పదవిని పొందుతారు. లయన్స్ సేవా ప్రగతి కార్యదర్శి శివశంకర్, రామకృష్ణ విద్యాసంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి, కళారాధన అధ్యక్షుడు డాక్టర్ మధుసూదనరావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవికృష్ణ, క్లబ్ మాజీ అధ్యక్షుడు గెలివి సహదేవుడు ఆయనను అభినందించారు. -
ముద్రిక కళా స్రవంతి ప్రారంభం
కర్నూలు(అర్బన్): సాహిత్యంతో పాటు పలు రంగాల్లో అభిరుచి కలిగిన వారి కలయికతో ఆదివారం ముద్రిక కళా స్రవంతి అనే సంస్థ ప్రారంభమైంది. స్థానిక శిల్పా బిర్లా కాంపౌండ్‌లోని ముద్రిక ప్రింటర్స్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు రేగటి పాండురంగారెడ్డిని సంస్థ గౌరవాధ్యక్షుడిగా నియమిస్తూ సభ్యులు తీర్మానించారు. ఈ సందర్భంగా పరిమళానంద రచించిన ‘మాస్టర్‌తో మాటామంతి ’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. డా.రాధాశ్రీ, మారేడు రాముడు, మద్దూరి రామ్మూర్తి, రథబంధ కవి చక్రపాణి, ముద్రిక అధిపతి పీవీ భాస్కర్, మాధవరావు, అక్రంబాషా తదితరులు పాల్గొన్నారు. -
పోటీపరీక్షలకు ఉచిత శిక్షణ
అనంతపురం కల్చరల్ : లయన్స్ క్లబ్ అనంతపురం వారి ఆధ్వర్యంలో ఈనెల 3 నుంచి స్థానిక లిటిల్‌ఫ్లవర్ పాఠశాలలో ఆర్ఆర్బీ, గ్రూప్-3 అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు లయన్స్‌క్లబ్ మహిళా విభాగం నిర్వాహకురాలు విజయలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి రోజు సాయంత్రం 6 నుంచి 7.30 గంటల వరకు 40 రోజుల పాటు జరిగే ఉచిత శిక్షణను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
అమర జవాన్లకు ఘన నివాళి
పుంగనూరు టౌన్ : కశ్మీర్‌లోని యూరి సైనిక శిబిరంపై పాక్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో అశువులు బాసిన జవాన్లకు మంగళవారం మున్సిపల్ సిబ్బంది, లయన్స్ క్లబ్ సంయుక్తంగా నివాళులర్పించారు. పట్టణంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. జవాన్ల ఆత్మశాంతి కోసం మౌనం పాటించారు. లయన్స్ జిల్లా డయాబెటిక్ చైర్పర్సన్ డాక్టర్ శివ మాట్లాడుతూ భారత్‌పై పాక్ ఉగ్రవాద చర్యలను ప్రోత్సహించడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ లోకేష్‌వర్మ, వైస్ చైర్మన్ ఆవుల అమరేంద్ర , లయన్స్ క్లబ్ సభ్యులు వరదారెడ్డి, సుట్లూరు శ్రీనివాసులు, ముత్యాలు, సరస్వతమ్మ, గిరిధర్, ఇంతియాజ్, ప్రభాకర్‌నాయుడు, గోపాలకృష్ణ, సమాఖ్య సభ్యులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
‘లయన్స్’ సేవలు అభినందనీయం
♦ మారుమూల గ్రామాల ప్రజలకు దగ్గర కావాలి ♦ తాండూరులో విజయ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తా ♦ రాష్ట్ర రవాణ శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పెద్దేముల్: మారుమూల గ్రామాల్లో పేదలకు ఉచిత సేవ చేస్తూ.. వారి జీవితాలకు ఊపిరి పొయడం అభినందించదగ్గ విషయమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని జనగాం గ్రామంలో ఆదర్శ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత నేత్ర వైద్యశిబిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సంస్థలు సేవా కార్యక్రమాలతోపాటు మొక్కలు నాటే కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు హరితహారం, మిషన్ కాకతీయ, భగీరథ కార్యక్రమాలు ప్రారంభించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. తాండూరు పట్టణంలో రూ.10 లక్షలతో కంటి పరిక్షతోపాటు విజయ సెంటర్ ఏర్పాటు చేసి, అక్కడే ఆపరేషన్ కార్యక్రమాలకు స్థలం ఇవ్వాలని కొరగా వెంటనే స్పందించిన మంత్రి.. స్థలం ఇచ్చెలా చర్యలు తీసుకుంటానన్నారు. తాండూరు మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి, జిల్లా పశుగణాభివృద్ధి సంఘం చైర్మన్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. లయన్స్‌క్లబ్ సేవలు మరువలేన్నారు. స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా తాము సహకారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పట్లోళ్ల సువర్ణ, తాండూరు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ప్రసాద్, కార్యదర్శి రవీందర్‌రెడ్డి, బస్సప్ప, హైదరాబాద్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం 25 మందికి కంటి శస్త్రచికిత్సల కోసం హైదరాబాద్‌కు తరలించారు. -
త్వరలో సేవా బ్రహ్మోత్సవం
హనుమాన్‌జంక్షన్ రూరల్: లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో ఒకే రోజు రూ. కోటి వ్యయంతో సేవా బ్రహ్మోత్సవాన్ని త్వరలో నిర్వహించబోతున్నట్లు క్లబ్ జిల్లా గవర్నర్ మూల్పూరి ఉపేంద్ర తెలిపారు. స్ధానిక ఏలూరురోడ్డులోని ఆశాజ్యోతి వికలాంగుల పాఠశాలలో లయన్స్‌క్లబ్ ఆఫ్ గొల్లపూడి కీర్తి ఆధ్వర్యంలో మదర్ «థెరెసా జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మదర్ చిత్రపటానికి ఉపేంద్ర పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆశాజ్యోతి ప్రాంగణంలో మొక్కలు నాటిన అనంతరం 100 పండ్ల మొక్కలను ఉచితంగా పంపీణీ చేశారు. లయన్స్‌క్లబ్ ఆఫ్ గొల్లపూడి కీర్తి తరుపున ఆశాజ్యోతి వికలాంగుల సొసైటీకి రూ 1.25 లక్షల విరాళాన్ని వ్యవస్థాపకుడు మరీదు వెంకటస్వామికి అందజేశారు. గొల్లపూడి కీర్తి క్లబ్ అధ్యక్షురాలు శారదా వాణి, బాపులపాడు సర్పంచ్ కాకాని అరుణ, అక్కినేని శ్రీనివాస ఫణీంధ్ర, డాక్టర్ కడియాల రామారావు, ఎం.మాధవీలత పాల్గొన్నారు. -
హన్మకొండ లయన్స్‌క్లబ్‌కు బెస్ట్ బ్యానర్ అవార్డు
హన్మకొండ కల్చరల్ : సేవా కార్యక్రమాల్లో ముందు వరుసలో నిలుస్తున్న హన్మకొండ లయన్స్‌క్లబ్ 2015–16 సంవత్సరానికి బెస్ట్ బ్యానర్ అవార్డు కు ఎంపికైంది. సికింద్రాబాద్‌లో శని వారం రాత్రి జరిగిన సమావేంలో మ ల్టిఫుల్ చైర్పర్సన్, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్న ర్ బీఎన్.రెడ్డి చేతుల మీదుగా హన్మకొండ లయన్స్‌క్లబ్ అధ్యక్షుడు ప్రొఫెస ర్ ఎస్.ఆగయాచారి, కార్యదర్శి కొంగమోహన్, కోశాధికారి కె.సుభాష్, పోకలచందర్, ప్రొఫెసర్ ఎస్.ఎం.రెడ్డి ఈ అవార్డు స్వీకరించారు. అలాగే, ఎంజేఎఫ్ బ్లడ్ డొనేషన్ చైర్మన్ జిల్లా పురుషోత్తం బెస్ట్ బ్లడ్ డొనేషన్ చైర్మన్ అవా ర్డు స్వీకరించారు. ఈ సందర్భంగా అవార్డులు అందుకున్న వారిని జిల్లా గవర్నర్ గోపాల్‌రెడ్డి అభినందించారు. -
అందరిని కలుపుకుపోయేవాడే నాయకుడు
లయన్స్ క్లబ్ జిల్లా మాజీ గవర్నర్ జనార్దన్‌రెడ్డి నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం రామాయంపేట: అజమాయిషీతో కాకుండా అందరినీ కలుపుకుపోయేవాడే నాయకుడని లయన్స్ క్లబ్ జిల్లా మాజీ గవర్నర్, ప్రముఖ న్యాయవాధి జనార్దన్‌రెడ్డి అన్నారు. శనివారం రాత్రి స్థానిక బాలాజీ ఫంక్షన్ హాలులో జరిగిన లయన్స్ క్లబ్ ఆఫ్ రామాయంపేట నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన మాట్లాడారు. లయనిజం అంటే మనల్ని మనం ఉద్దరించుకోవడమేనని తెలిపారు. క్లబ్ ద్వారా సేవా కార్యక్రమాలను విస్తృతపర్చాలని సూచించారు. మరో మాజీ జిల్లా గవర్నర్ గంప రమేశ్ మాట్లాడుతూ.. లయన్స్ ముఖ్య ఉద్దేశం సేవా కార్యక్రమాలేనన్నారు. క్లబ్ మాజీ గవర్నర్ డాక్టర్ టీవీపీ చారి మాట్లాడుతూ.. పిల్లలకు చిన్నతనం నుంచే నైతిక విలువలు నేర్పించాలని సూచించారు. క్లబ్ రీజియన్ చైర్మన్ వలిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ.. లయనిజం ప్రపంచంలోనే అతి పెద్ద సేవా సంస్థ అని పేర్కొన్నారు. క్లబ్ నూతన అధ్యక్షుడు వెంకటయ్య మాట్లాడుతూ.. అందరి సహకారంతో సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. రామాయంపేటలో లయన్స్ భవనం నిర్మాణానికిగాను కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రమాణ స్వీకారం... నూతనంగా ఎన్నికైన క్లబ్ అధ్యక్షుడు వెంకటయ్య, కార్యదర్శి ఏలేటి రాజశేఖర్‌రెడ్డి, కోశాధికారి దోమకొండ శ్రీనివాస్‌తోపాటు కొత్తగా చేరిన సభ్యులు నవాత్ సురేశ్, పవన్‌కుమార్, నర్సింహారెడ్డితో ఇన్స్ట్రలేషన్ అధికారి జనార్దన్‌రెడ్డి ప్రమాణం చేయించారు. ఈ సందర్బంగా క్లబ్ సభ్యులైన ప్రముఖ డాక్టర్లు టీవీపీ చారి, డాక్టర్ సురేందర్, డాక్టర్ రమేశ్‌లను సన్మానించారు. పాటలు పాడి అలరించిన చిన్నారులు మధులిక, ప్రణీత్‌ను కూడా సత్కరించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం చైర్పర్సన్ లక్ష్మణ్ యాదవ్, ఇతర డైరెక్టర్లు మెదక్ రాములు ఆచారి, కైలాసం, దేమె యాదగిరి, చంద్రమౌళి, దారం రమేశ్, చప్పెట ముత్యంరెడ్డి, ఇందూరి రామాగౌడ్, కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలి
ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు ఆర్కేపీలో లయన్స్ క్లబ్ పట్టణ శాఖ ప్రారంభం రామకృష్ణాపూర్ : సమాజంలో ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు అన్నారు. తోటి వారికి సహాయం చేయాలన్న మంచి గుణం అందరికీ ఉండాలని ఆకాంక్షించారు. పట్టణంలోని ఆర్కేసీవోఏ క్లబ్లో మంగళవారం రాత్రి లయన్స్ క్లబ్ పట్టణ శాఖ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లయన్స్ క్లబ్ సభ్యులు ఆయా ప్రాంతాల్లో చేస్తున్న సామాజిక సేవలు అభినందనీయమని అన్నారు. లయన్స్ క్లబ్ గవర్నర్ సురేశ్ మాట్లాడుతూ ఆర్కేపీ శాఖకు తమ పూర్తి సహాయసహకారాలు ఉంటాయని అన్నారు. పట్టణానికి చెందిన ఇరుకుల ఆనంద్, పందెన కృష్ణ, కల్కూరి సత్యనారాయణ రూ.60వేలు అందించారు. అనంతరం క్లబ్ ఆవరణలో మొక్కలను నాటారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ కంభగోని సుదర్శన్‌గౌడ్, ఎంపీపీ బొలిశెట్టి కనకయ్య, క్యాతనపల్లి సర్పంచ్ జాడి శ్రీనివాస్, లయన్స్ క్లబ్ వైస్ గవర్నర్ శివప్రసాద్, రీజినల్ చైర్మన్ నారాయణరావు, లయన్స్ సిరిపురం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ పట్టణ కమిటీ.. ఆర్కేపీ లయన్స్‌క్లబ్ నూతన కమిటీని గవర్నర్ సురేశ్ ప్రకటించారు. క్లబ్ అధ్యక్షుడిగా కంభగోని సుదర్శన్‌గౌడ్, కార్యదర్శిగా కట్కం నాగరాజు, కోశాధికారిగా ఆడెపు కృష్ణ, సంయుక్త కార్యదర్శిగా వనం సత్యం, ఉపాధ్యక్షులుగా అరికొళ్ల సంపత్, బొలిశెట్టి కనకయ్య, ప్రభాకర్, మెంబర్షిప్ డైరెక్టర్‌గా సలీం పాషా, పీఆర్వోగా మహేందర్, పమేర్గా ఎల్లంకి గోపాల్, డైరెక్టర్లుగా బత్తుల శ్రీనివాస్, అమర్నాథ్రెడ్డి, వెంకటేశ్, రఘు, రాజబాబు, మల్లేశ్ , శ్రీనివాసులు, సత్యం, రాజేశ్, శ్రీనివాస్‌లను నియమించినట్లు తెలిపారు. -
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్లేట్ల పంపిణీ
బి.చందుపట్ల(చివ్వెంల) : గ్రామీణ ప్రాంత పేద విద్యార్థుల కోసం లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట చేస్తున్న సేవలు అభినందనీయమని మండల విద్యాధికారి కట్టా యల్లారెడ్డి అన్నారు. మంగళవారం సంస్థ ఆధ్వర్యంలో బి.చందుపట్ల ప్రాథమిక పాఠశాలలోని 243 మంది విద్యార్థులకు రూ.20 వేల విలువ చేసే పెన్నులు, పుస్తకాలు, ప్లేట్లు అందజేశారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ ధరావత్ రతిరాం నాయక్, లయన్స్ క్లబ్ చైర్మన్ బండారి రాజా, సభ్యులు యామా రామ్మూర్తి, భోనగిరి విజయ్‌కుమార్, యాదా కిరణ్, బజ్జూరి శ్రీహరి, ఏనుగుల లింగారెడ్డి, హెచ్ఎం నూకల వెంకట్‌రెడ్డి , ఉపాధ్యాయలు క్రిష్ణ, రవీందర్, పద్మజ, కమల తదితరులు పాల్గొన్నారు, -
ఉచితంగా 7 వేల మట్టివినాయకుల పంపిణి
మారేడుపల్లి: హైదరాబాద్ నగరంలో 7 వేల మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణి చేయనున్నట్లు లయన్స్ ఎంటర్ ప్రై జర్స్ క్లబ్ చైర్ పర్సన్ రమేష్ తెలిపారు. పర్యావరణాన్ని కాపాడుకునేందుకు గత మూడు సంవత్సరాలుగా ఉచితంగా మట్టి గణపతులను నగరంలో వివిధ ప్రాంతాలలో అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.సోమవారం మహేంద్రహిల్స్ లో విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సంవత్సరం లక్ష యాబై వేల రుపాయల వ్యయంతో 7 వేల విగ్రహాలను కోనుగోలు చేశామని,ఈ విగ్రహాలను బుధవారం నాడు ఉచితంగా జంట నగర వాసులకు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.దిల్సుఖ్ నగర్ పిఅండ్‌టి కాలనీ,వెస్ట్‌మారేడుపల్లి పార్కు,సైనిక్‌పురి సాయిబాబా ఆఫిసర్ కాలనీ, బిహేచ్ఈఎల్ మహిళ కమ్యూనిటి హాల్ తో పాటు పలు సేంటర్ల వద్ద ఉచితంగా మట్టి వినాయకులను అందించానున్నట్లు రమేష్ తెలిపారు. లయన్స్ ఎంటర్ ప్రై జర్స్ క్లబ్,సుడే పౌండేషన్ సంయుక్తంగా ఉచిత వినాయక పంపిణి కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వారు తెలిపారు. ఈ సమావేశంలో శశికాంత్,సందీప్ గోండ్రలా తో పాటు పలువురు పాల్గొన్నారు. -
లయన్‌క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం
బేతంచర్ల : కర్నూలు జిల్లా బేతంచర్ల పట్టణంలో ఆదివారం నంద్యాల లయన్‌క్లబ్, కిమ్స్(సికింద్రాబాద్)వారి సహకారంతో లయన్‌క్లబ్(బేతంచర్ల) ఉచిత మెగా వైద్యశిబిరం నిర్వహించింది. ఈ వైద్యశిబిరాన్ని అనంతపురం జిల్లా గుత్తి కోర్టు సివిల్ జడ్జి వెంకటేశ్వర్లు నాయక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా లయన్ క్లబ్ అధ్యక్షుడు శ్రీకాంత్, పట్టణ సీఐ సుబ్రహ్మణ్యంతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వైద్యశిబిరానికి పట్టణంలోని 300 మంది రోగులు వచ్చి చికిత్స తీసుకున్నారు. అనంతరం నిర్వాహకులు రోగులకు మందులు అందజేశారు. అట్టడగువర్గాల వారు ఇటువంటి వాటిని సద్వినియోగం చేసుకోవాలని లయన్‌క్లబ్ నిర్వాహకులు కోరారు. -
డబ్బిస్తేనే .. రక్తమిస్తున్నారు
సిద్దిపేట టౌన్ : ‘రక్తాన్ని సేకరించి బాధితులకు అందజేస్తే ఎన్నో ప్రాణాలు నిలుస్తాయి.’ ఈ విలువ తెలిసిన సిద్దిపేటలోని పలు స్వచ్ఛంద, సామాజిక సేవా సంస్థలు రక్తదాన శిబిరాలను నిర్వహించి దాతల నుంచి రక్తాన్ని సేకరిస్తున్నారు. ఇలా సేకరించిన రక్తాన్ని పట్టణంలోని ఏరియా ఆస్పత్రి బ్లడ్‌బ్యాంక్‌లో 30 శాతం వరకు నిల్వ చేస్తున్నారు. అయితే దాతలకు గాని, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు రక్తం అవసరం వస్తే ఆస్పత్రి సిబ్బంది ముక్కు పిండి మరీ డబ్బు వసూలు చేస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. సిద్దిపేటలో వాసవీక్లబ్, లయన్స్‌క్లబ్, స్ఫూర్తి లయన్స్‌క్లబ్, పతాంజలి యోగ సమితి మొదలగు సుమారు 20 స్వచ్ఛంద, సామాజిక సేవా సంస్థలు పని చేస్తున్నాయి. వివిధ సందర్భాల్లో వారు ర క్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. సేకరించిన రక్తాన్ని హైదరాబాద్‌లోని మెటోడిన్, సంజీవిని, జనని మొద లగు బ్లడ్‌బ్యాంక్‌లకు అందిస్తున్నారు. సంబంధిత బ్లడ్ బ్యాంక్‌లు రక్తదాతలకు పండ్లు, బిస్కెట్లు, బహుమతులు, ప్రశంస పత్రాలు, డోనర్ కార్డులను, ప్రత్యేక బహుమతులను, బీమా పత్రాలను అందిస్తున్నారు. ఈ సందర్బంగా సుమా రు రూ.1000 విలువైన బ్లడ్ గ్రూప్ వైద్య పరీక్షలు నిర్వహించి రిపోర్ట్ అందజేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే అత్యవసర పరిస్థితుల్లో రక్తదాతలకు, వారి బంధుమిత్రులకు ఎలాంటి గ్రూపు రక్తానైన్నా ఉచితంగా అందజేసి ఆదుకుంటున్నారు. శిబిర నిర్వాహకులు లేఖ రాస్తే ఉచితంగా బ్లడ్ అందజేస్తున్నారు. రక్తం మాకే... కాసులు మాకే...: రక్తదాన శిబిరాల్లో సేకరించిన రక్తంలో 30శాతం రక్తాన్ని స్వచ్ఛంద సంస్థలు సిద్దిపేట ఏరియా ఆసుపత్రిలోని బ్లడ్‌బ్యాంక్‌కు అందజేస్తున్నారు. సిద్దిపేట ఆస్పత్రుల్లో అత్యవసరమైనప్పుడు ప్ర భుత్వ వైద్యులు స్వచ్ఛంద సంస్థలకు ఫో న్ చేసి రక్త దాతల ద్వారా రక్తాన్ని సేకరించి అవసరమైన వారికి ఉచితంగా అందజేస్తున్నారు. ఇందుకు ప్రతిఫలం గా వారు ఏమి ఇవ్వడం లేదు. చివరికి రక్తం అవసరమైతే కూడా సరిగా స్పం దించడం లేదు. రూ. 1050 చెల్లిస్తేనే రక్తాన్ని అందజేస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలపై గరంగరం సామాజిక సేవలో భాగంగా రక్తదానం శిబిరాలను నిర్వహించే స్వచ్ఛంద సంస్థలను కొందరు వైద్యాధికారులు బెదిరిస్తున్నారు. అనుమతి లేనిదే రక్తదాన శిబిరాలు నిర్వహించ వద్దని చెబుతున్నారు. చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. నోటీసులు కూడా అందజేస్తున్నారు. సేకరించిన రక్తం అంతా తమకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో స్వచ్ఛంద సంస్థలు బేజారవుతున్నాయి. సేవలకు కూడా ఇలా ఆటంకం పర్చడం సరైంది కాదంటున్నారు. ఉచితంగా ఇచ్చే నిబంధనలు లేవు.. సేకరిస్తున్న రక్తాన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు ఉచితంగా అంద జేస్తున్నాం. ప్రైవేటు వ్యక్తులకు, ఆస్పత్రులకు రక్తాన్ని డబ్బులు తీసుకుని అందిస్తున్నాం. స్వచ్ఛంద సంస్థలకు, శిబిరాల్లో రక్తదానం చేసిన వారికి ఉచితంగా రక్తం ఇవ్వాలని ఎలాంటి నిబంధనలు లేవు. - డాక్టర్ రాంమోహన్, బ్లడ్ బ్యాంక్ ఇన్చార్జ్ సేవలకు గుర్తింపు లేదు.. రక్తదాన శిబిరాల నిర్వహణకు ఎన్నో వ్యయ ప్రయాసలకు ఒర్చి రక్తాన్ని సేకరించి బ్లడ్ బ్యాంకులకు అప్పగిస్తున్నాం. అత్యవసర పరిస్థితుల్లో మేము సిఫార్సు చేస్తున్న వ్యక్తులకు ప్రైవేటు బ్లడ్‌బ్యాంక్ వారు ఉచితంగా రక్తాన్ని అందిస్తున్నారు. అయితే సిద్దిపేట వైద్యాధికారులు మాత్రం రక్తం లేదంటున్నారు. డబ్బు ఇస్తేనే రక్తాన్ని ఇస్తున్నారు. - శివశ్రీనివాస్, రక్తదాన శిబిర ఇన్చార్జ్ -
పిచ్చయ్యకు లయన్స్ క్లబ్ సహాయం
‘సాక్షి’ కథనానికి స్పందన దేశాయిపేట, న్యూస్‌లైన్: బాల్ బ్యాడ్మింటన్ దిగ్గజ ఆటగాడు జమ్మలమడక పిచ్చయ్యకు కూకట్పల్లి లయన్స్ క్లబ్ ఆర్థిక సహాయాన్ని అందించింది. ఈనెల ఒకటో తేదీన ‘సాక్షి’ మైదానం పేజీలో పిచ్చయ్య జీవితంపై ప్రచురితమైన ‘బాల్ బ్యాడ్మింటన్‌లో భీష్ముడు, కష్టాలలో అర్జునుడు’ కథనానికి క్రీడాకారులు, క్రీ డాభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. ఆయనకు అన్నివేళలా తాము అండగా ఉంటామని లయన్స్ క్లబ్ కూకట్పల్లి శాఖ అధ్యక్షుడు కె. జయవర్ధన్ రెడ్డి తెలిపారు. ఈసందర్భంగా పిచ్చయ్యకు సన్మానం చేసి ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా జయవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పిచ్చయ్య క్రీడా ప్రతిభతోపాటు ఆయన కష్టాలను బాహ్య ప్రపంచానికి తెలియజేసిన ‘సాక్షి’ కృషి మరువలేనిదన్నారు. కార్యక్రమంలో కూకట్పల్లి లయన్స్ క్లబ్ కార్యదర్శి ఆర్.ఈశ్వర్‌రెడ్డితోపాటు సభ్యులు పాల్గొన్నారు. వరంగల్ ఎన్పీ డీసీఎల్ అధికారులు, శాప్ మాజీ డెరైక్టర్ రాజనాల శ్రీహరితోపాటు పలువురు పిచ్చయ్యకు ఆర్థిక సహాయాన్ని అందించారు. -
వికలాంగులకు కృత్రిమ పరికరాలు
ఆదిలాబాద్ రిమ్స్, న్యూస్‌లైన్ : జిల్లాలోని వికలాంగులకు ఉచితంగా కృత్రిమ పరికరాలు అందజేయడానికి లయన్స్‌క్లబ్ ముందుకొచ్చింది. బుధవారం ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రిలో వికలాంగులకు వైద్య పరీక్షలు నిర్వహించింది. జిల్లాల నలుమూలల నుంచి 500 మంది వికలాంగులు వచ్చారు. 250 మందిని పరీక్షించి పరికరాలకు ఎంపిక చేశారు. లయన్స్‌క్లబ్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ చౌదరి మాట్లాడుతూ ఆర్టిఫీషియల్ లింబ్స్ మ్యాను ఫ్యాక్టరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వికలాంగులు, అంధులు, చెవిటి వారికి ఉచితంగా పరికరాలు అందజేస్తామని అన్నారు. కృత్రిమ అవయవాలు, సహాయపరికరాలు, క్రచ్‌లు, మూడు చక్రాల సైకిళ్లు, వీల్చైర్లు, వినికిడి పరికరాలు, బ్రెయిల్కేన్, ఎంఎస్ఈడీ కిట్లు ఎంపికైన 250 మంది వికలాంగులకు 45 రోజుల్లో అందిస్తామని అన్నారు. రిమ్స్ డెరైక్టర్ శశిధర్, లయన్స్‌క్లబ్ రీజినల్ చైర్పర్సన్ వెంకటేశ్వర్, ఉపాధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, పోగ్రాం చైర్మన్ డాక్టర్ యండి.సమీయొద్దీన్, సభ్యులు పాల్గొన్నారు. -
ఉద్యమమే ఊపిరిగా..
సాక్షి, విజయవాడ : జిల్లాలో సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమం జోరుగా సాగుతోంది. మంగళవారం నాగాయలంకలో జేఏసీ- లయన్స్‌క్లబ్ నాయకులు కృష్ణానది వరదనీటిలో జలదీక్ష చేశారు. గన్నవరంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది ఉద్యమించారు. ఏపీఎన్జీవోస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జేఏసీ నాయకుల పిలుపు మేరకు నియోజకవర్గంలోని పలు పీహెచ్‌సీల నుంచి తరలివచ్చిన వైద్య, ఆరోగ్య శాఖకు చెందిన వైద్యులు, సిబ్బంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. చల్లపల్లిలో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు 81వ రోజుకు చేరాయి. వాసవీ మహిళా మండలి నాయకులు దీక్షలో పాల్గొన్నారు. అవనిగడ్డలో నాయీబ్రాహ్మణ సంఘం సభ్యులు దీక్షలు చేశారు. కలిదిండి మండలం ఆరుతెగలపాడు జెడ్పీ పాఠశాల విద్యార్థులు సమైక్యాంధ్రకు మద్ధతుగా గ్రామంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. వివేకానంద కాన్వెంట్ విద్యార్థులు సెంటరులో మానవహారం నిర్వహించి, సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. అనంతరం దిగ్విజయ్‌సింగ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. గుడివాడ నెహ్రూచౌక్‌లో జరుగుతున్న రిలేనిరాహారదీక్షలు 84వ రోజుకు చేరుకున్నాయి. చిన్న పరిశ్రమల సంఘ రాష్ట్ర కార్యదర్శి అల్లం రామ్మోహనరావు శిబిరాన్ని ప్రారంభించారు. కాకర్లవీధి యూత్ సభ్యులు పాల్గొన్నారు. జగ్గయ్యపేటలో జేఏసీ ప్రతినిధులు స్థానిక విజ్ఞాన్ విద్యాసంస్థల విద్యార్థులతో కలసి మున్సిపల్ కూడలిలో ధర్నా, మానవహారం నిర్వహించారు. నందివాడ మండలం టెలిఫోన్‌నగర్ కాలనీలో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షలు 59వ రోజుకు చేరాయి. కైకలూరులో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు నేతృత్వంలో విద్యార్థులు మానవహారం చేపట్టారు. వైఎస్ జగన్ మాస్క్‌లను ధరించి నినాదాలు చేశారు. నూజివీడు చిన్నగాంధీబొమ్మ సెంటరులో నిర్వహిస్తున్న రిలేదీక్షలు 83వ రోజుకు చేరుకున్నాయి. రైతులు, జేఏసీ నాయకులు, విద్యార్థులు కలసి చిన్నగాంధీబొమ్మ సెంటరులో గంట సేపు ధర్నా నిర్వహించారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో స్థానిక జంక్షన్‌రోడ్డులో నిర్వహిస్తున్న రిలేనిరాహార దీక్షలు 63వ రోజుకు చేరాయి. ఈ దీక్షలను నూజివీడు ఏఎంసీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ నాయకుడు పల్లెర్లమూడి అభినేష్ ప్రారంభించారు. బంటుమిల్లిలో జేఏసీ నాయకులు 216 జాతీయ రహదారిని ఊడ్చి నిరసన తెలిపారు. ఆగిరిపల్లిలో మండల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలేదీక్షలు 34వ రోజుకు చేరాయి. చాట్రాయి మండలం తెలంగాణ సరిహద్దు గ్రామమైన కృష్ణారావుపాలెం గ్రామంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యాన నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. తిరువూరు బోసుసెంటర్లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగాయి. 28వ రోజు దీక్షలో నియోజకవర్గ సమన్వయకర్త బండ్రపల్లి వల్లభాయ్, మండల పార్టీ కన్వీనర్ శీలం నాగ నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉయ్యూరులో జరిగిన 86వ రోజు దీక్షలో సీనియర్ సిటిజన్లు, జేఏసీ నాయకులు పాల్గొన్నారు. విజయవాడలో వైఎస్సార్ సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త పి.గౌతమ్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. -
జోరువానలోనూ సమైక్య హోరు
సాక్షి, విజయవాడ : తలకిందులుగా తపస్సుచేసి అయినా రాష్ట్రాన్ని కాపాడుకుంటామంటూ నాగాయలంకలో గురువారం జేఏసీ, లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలిపారు. పలువురు తలకిందులుగా నిలబడి జైసమైక్యాంధ్ర, తెలంగాణ వద్దు-సమైక్యాంధ్రముద్దు అంటూ నినాదాలు చేశారు. విజయవాడలో ఇరిగేషన్ కార్యాలయం వద్ద జోరువానలో ఎన్జీవోలు, ఇరిగేషన్ ఉద్యోగులు భోజనవిరామ సమయంలో ధర్నా చేశారు. కైకలూరు వెలంపేటకు చెందిన మహిళా కార్యకర్తలు రిలే దీక్షల్లో కూర్చున్నారు. నందివాడ మండలం టెలిఫోన్ నగర్లో ఉపాధ్యాయుల దీక్షలు కొనసాగుతున్నాయి. ఉపాధ్యాయుల జేఏసీ ఆధ్వర్యంలో పామర్రు హైస్కూల్ విరామ సమయంలో ఉపాధ్యాయులు ధర్నా చేశారు. తిరువూరులో సమైక్యాంధ్ర కోరుతూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు 21వ రోజు కొనసాగాయి. చల్లపల్లిలో 76వరోజుకు దీక్షలు చేరాయి. చల్లపల్లి మండలంలోని మాజేరుకు చెందిన మహిళలు దీక్ష చేశారు. అవనిగడ్డలో 63వరోజు చేరుకున్నాయి. అవనిగడ్డలో గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షుడు మండలి వెంకట్రామ్ యూత్‌కు చెందిన వేకనూరు యువకులు దీక్ష చేశారు. వైఎస్సార్సీపీ యూత్ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా మైలవరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. యూత్ మండల కన్వీన ర్ చామల సీతారామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త జ్యేష్ఠ రమేష్‌బాబు, వివిధ మండలాల కన్వీనర్లు, నాయకులు. కార్యకర్తలు పాల్గొన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా మైలవరంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టి, పాఠశాలల ముందు రాష్ట్ర విభజనకు నిరసనగా నినాదాలు చేశారు. ఆగిరిపల్లిలో జేఏసీ ఆధ్వర్యంలో 32వ రోజూ రిలే నిరహార దీక్షలు జోరువానలో కొనసాగాయి.పామర్రు ఏపీఎన్జీవో సంఘం పిలుపు మేరకు . పామర్రు కంచర్ల రామారావు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు మధ్నాహ్న భోజన విరామ సమయంలో సమైక్యాంధ్ర కోసం నినాదాలు చేశారు. చిన్నగాంధీబొమ్మ సెంటరులో జేఏసీ ఆధ్వర్యంలోని రిలేదీక్ష శిబిరాన్ని విశాలాంధ్రమహాసభ రాష్ట్రఅధ్యక్షుడు నల్లమోతు చక్రవర్తి సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ శిబిరంలో పట్టణంలోని శారదా డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులు, త్రివిధ, కుమార్, విజేత ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు దీక్షలో కూర్చున్నారు. సెయింట్‌జోన్స్ కళాశాలకు చెందిన విద్యార్థులు చిన్నగాంధీబొమ్మ సెంటరులో వర్షం పడుతున్నా గొడుగులు వేసుకుని నిరసన ప్రదర్శన నిర్వహించారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో స్థానిక జంక్షన్‌రోడ్డులో నిర్వహిస్తున్న రిలేనిరాహార దీక్షలు 59వ రోజుకు చేరాయి. పట్టణంలోని బాపునగర్‌కు చెందిన కార్యకర్తలు దీక్షలో కూర్చున్నారు. ఏపీఎన్జీవోల అధ్వర్యంలో మైలవరం పంచాయతీ కార్యాలయం ఎదుట మధ్యాహ్న భోజన విరామ సమయంలో సమైక్యాంధ్రకు మద్దతుగా నిరసన కార్యక్రమం చేపట్టారు. మైలవరం నియోజక వర్గ సమన్వయ కర్త జోగిరమేష్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం రింగుసెంటర్లో వైఎస్సార్ సీపీ యూత్ నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఏపీ ఎన్జీవో రాష్ట్ర నాయకులు అశోక్‌బాబు పిలుపు మేరకు కలెక్టరేట్ వద్ద మధ్యాహ్నభోజన సమయంలో నిరసన వ్యక్తం చేశారు. నందివాడ మండలంలోని టెలిఫోన్ నగర్ కాలనీలోని సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలేదీక్షలు గురువారంతో 54వ రోజుకు చేరుకున్నాయి. అరిపిరాల గ్రామానికి చెందిన రైతులు దీక్షలో కూర్చున్నారు. -
రక్తదానం చేసి మానవత్వం చాటాలి
ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : రక్తదానం చేసి మానవత్వం చాటాలని అదనపు సంయుక్త కలెక్టర్ వెంకటయ్య సూచించారు. మంగళవారం ఆదిలాబాద్‌లోని పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. రక్తదానం చేయడంలో ఉన్న సంతృప్తి మరే పనిలో ఉండదని, సమాజానికి ఉపయోగపడే రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలన్నారు. రక్తదానంతో శరీరం ఉల్లాసంగా, ఆరోగ్యంగా ఉంటుందని పేర్కొన్నారు. శిబిరంలో 85 మంది ఉద్యోగులు రక్తదానం చేశారు. అనంతరం కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు విఠల్‌రావు దేశ్‌పాండే, స్టెప్ సీఈవో వెంకటేశ్వర్లు, లయన్స్ క్లబ్ పట్టణ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, పశు సంవర్ధక శాఖ అధికారులు సుధాకర్, రామారావు, మజీద్, కుమారస్వామి, దూద్‌రాం రాథోడ్, రిమ్స్ సిబ్బంది బిపాష, విజయ్‌కుమార్, సత్యనారాయణ, విలాస్, మోహన్‌నాయక్, పశు సంవర్ధక శాఖ అధికారులు పాల్గొన్నారు.