సాక్షి, హైదరాబాద్: ప్రతిభ ఏ ఒక్కరి సొంతం కాదని తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్ కె.రోశయ్య అన్నారు. ఆదివారం నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్, సద్గురు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో పీస్ పోస్టర్ పోటీ విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. నవంబర్ 2న నిర్వహించన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులను సత్కరించారు. లయన్స్‌క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320ఏ చైర్మన్ సత్యవోలు రాంబాబు అధ్యక్షతన జరిగిన సభలో రోశయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
విజేతలు సాయితేజ, సంహిత రెడ్డి, సంజన బహుమతులు అందుకున్నారు. మరో 10 మంది చిన్నారులకు ప్రత్యేక బహుమతులు ప్రదానం చేశారు. 300 మందికి పోత్సాహక బహుమతులు అందజేశారు. ఉత్తమ సేవా అవార్డు, ఉత్తమ డ్రాయింగ్ టీచర్ పురస్కారాలు కూడా ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఈవెంట్ చైర్మన్, లయన్ ఎంఆర్‌ఎస్ రాజు, లయన్స్‌క్లబ్ గవర్నర్ బి.ప్రభాకర్, డాక్టర్ రాజగోపాల్‌రెడ్డి, మనోజ్‌కుమార్ పురోహిత్, బండారు ప్రభాకర్, రమేశ్ చంద్ర పండిత్, ఎల్లా సుబ్బారెడ్డి, కృష్ణా రెడ్డి, వెంకట సురేశ్, డాక్టర్ పరం శివం, మహేశ్, పూజిత, మనాలి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment