తొంభై సినిమాలంటే మాటలు కాదు | Avantika Telugu Movie Audio Launch by Konijeti Rosaiah | Sakshi
Sakshi News home page

తొంభై సినిమాలంటే మాటలు కాదు

Published Mon, Jun 5 2017 12:48 AM | Last Updated on Tue, Sep 5 2017 12:49 PM

తొంభై సినిమాలంటే మాటలు కాదు

తొంభై సినిమాలంటే మాటలు కాదు

మాజీ గవర్నర్‌ రోశయ్య
‘‘ఓ సినిమా తీసేందుకు ఎన్నో కష్టాలు పడాలంటుంటారు. అలాంటిది మా రామసత్యనారాయణ 90 సినిమాలు తీశాడంటే మాటలు కాదు. చాలా గ్రేట్‌. తెలివిగా, బడ్జెట్‌ కంట్రోల్‌తో కష్టనష్టాల్ని దగ్గరికి రానివ్వకుండా సినిమాలు నిర్మిస్తున్నారంటే హ్యాపీ’’ అని తమిళనాడు మాజీ గవర్నర్‌ కె. రోశయ్య అన్నారు.
‘అవును’ ఫేమ్‌ పూర్ణ ముఖ్యతారగా శ్రీరాజ్‌ బళ్ల దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన ‘అవంతిక’ పాటల సీడీలను రోశయ్య విడుదల చేయగా, దర్శకులు ‘ధవళ’ సత్యం అందుకున్నారు. నిర్మాత మాట్లాడుతూ – ‘‘మా గురువుగారు దాసరి చేతుల మీదుగా ఈ సినిమా ప్రారంభమైంది. సినిమాను ఆయనకు అంకితం ఇస్తున్నా.

ఓ సినిమా హిట్టవ్వాలంటే నిర్మాత డబ్బు పెడితే సరిపోదు. దర్శకుడు బాగా తీయాలి. అప్పుడే హిట్‌ వస్తుంది. శ్రీరాజ్‌ బళ్ల చెప్పిన బడ్జెట్‌లో చెప్పిన టైమ్‌లో సినిమా తీశాడు. ఈ నెల 16న సినిమాను విడుదల చేస్తున్నాం’’ అన్నారు. దర్శకులు రేలంగి నరసింహారావు, కళ్యాణ్‌కృష్ణ, బాబ్జీ, సూర్యకిరణ్, నిర్మాతలు కేవీవీ సత్యనారాయణ, శోభారాణి, కొడాలి వెంకటేశ్వరరావు, చిత్ర సంగీత దర్శకుడు రవిరాజా బళ్ల పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement