ఆమెతో పెళ్లి.. విడాకులు.. అసలు కారణం వెల్లడించిన హీరో! | Imran Khan finally opens up about the reason why he separated from Avantika | Sakshi
Sakshi News home page

Imran Khan: ఎనిమిదేళ్ల తర్వాత భార్యతో విడాకులు.. తొలిసారి నోరు విప్పిన ఇమ్రాన్ ఖాన్!

Published Tue, May 28 2024 7:46 PM | Last Updated on Tue, May 28 2024 7:57 PM

Imran Khan finally opens up about the reason why he separated from Avantika

బాలీవుడ్ హీరో ఇమ్రాన్‌ ఖాన్‌ చివరిసారిగా కట్టి బట్టి చిత్రంలో కనిపించారు. ఈ సినిమాలో కంగనా రనౌత్‌ అతనికి జంటగా నటించింది 2008లో జెనీలియాతో కలిసి జానే తూ...యా జానే నా చిత్రంలో తొలిసారిగా మెరిసన ఇమ్రాన్‌.. ప్రస్తుతం గూఢచారి అనే వెబ్ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

అయితే 2011లోనే అవంతిక మాలిక్‌ను ఇమ్రాన్‌ ఖాన్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి ఇమారా అనే కూతురు కూడా జన్మించారు. అయితే దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత తన భార్య అవంతిక మాలిక్‌తో వివాహాబంధానికి గుడ్‌ బై చెప్పారు హీరో. అప్పట్లో ఈ జంట విడిపోవడానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఇమ్రాన్ ఖాన్‌ ఆమెతో విడాకులపై తొలిసారి స్పందించారు. విడిపోవడానికి గల కారణాలను వివరించారు. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.

ఇంటర్వ్యూలో ఇమ్రాన్ మాట్లాడుతూ..'ఆ విషయంలోకి పెద్దగా వెళ్లాలనుకోవడం లేదు. గాసిప్స్‌కు ఆజ్యం పోయడానికి నేను సంకోచిస్తున్నా. అయితే నేను అంతర్గతంగా చాలా ఇబ్బందులు పడ్డా. ఇద్దరు వ్యక్తుల మధ్య ఆరోగ్యకరమైన బంధం ఉండాలి. అప్పుడే ఇద్దరి మధ్య బంధం బలంగా తయారవుతుంది. అంతేకాదు ఒకరికొకరు మద్దతు ఉంటూ ఉత్తమంగా నిలుస్తారు. కానీ మా ఇద్దరి మధ్య అదే లోపించింది. అందుకే విడిపోవాల్సి వచ్చింది.' అని పంచుకున్నారు. కాగా.. అవంతికను 2011లో ఇమ్రాన్‌తో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఆ తర్వాత ఇమారా అనే కుమార్తెకు తల్లిదండ్రులయ్యారు. 2019లో వీరి వివాహాబంధానికి ముగింపు పలికారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement