బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ మేనల్లుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నటుడు ఇమ్రాన్ ఖాన్. చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న హీరో.. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండస్ట్రీలో తాను పడిన ఇబ్బందులపై మాట్లాడారు. తనలో అభద్రతా భావం ఎక్కువగా ఉండేదని తెలిపారు. అసలు నటుడి నేను రాణించగలనా? అని భావించేవాడినని అన్నారు. ఇలా కెరీర్ ప్రారంభించిన తొలి రోజుల్లో చాలా ఇబ్బందులు పడినట్లు వెల్లడించారు.
హృతిక్ రోషన్, సల్మాన్ ఖాన్ లాంటి స్టార్స్‌లా శరీరాకృతి కలిగి ఉండాలని ప్రయత్నించినట్లు ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. అందుకోసం స్టెరాయిడ్స్‌ను వినియోగించినట్లు షాకింగ్ కామెంట్స్ చేశారు. సిక్స్ ప్యాక్ బాడీతో సూపర్ హీరో లుక్‌లో కనిపించేందుకు ఇలా చేసినట్లు వెల్లడించారు. ఆ తర్వాత మన లుక్ కోసం ఇలాంటి కెమికల్స్‌తో ఎలాంటి ఉపయోగం లేదని అర్థమైందని చెప్పుకొచ్చారు. సినీ పరిశ్రమలో ఉంటే ఫేమ్ మాత్రమే కాదు.. చాలా ఇబ్బందులు కూడా పడాల్సి ఉంటుందని తెలిపారు. గతంలో నటీమణులు మాత్రమే గ్లామర్‌పై దృష్టిపెట్టేవారని.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారిపోయి నటులు సైతం తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని పేర్కొన్నారు.
కాగా.. కిడ్నాప్, ఐ హేట్ లవ్ స్టోరీస్, లక్ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఇమ్రాన్ ఖాన్ పలు చిత్రాల్లో నటించారు. చివరిసారిగా 2015లో కట్టి బట్టి చిత్రంలో కనిపించారు.
Comments
Please login to add a commentAdd a comment