ప్రముఖ బాలీవుడ్ నటుడు, అమిర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ ఎట్టకేలకు రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. తాను త్వరలోనే సినిమాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. అతను చివరిగా కంగనా రనౌత్‌తో కలిసి 2015లో విడుదలైన కట్టి బట్టి చిత్రంలో కనిపించారు. ఆదివారం ముంబయిలో జరిగిన ముంబయిలో జరిగిన ఐఎఫ్‌పీ ఫెస్టివల్ సీజన్ -13 ముఖ్య అతిథిగా హాజరైన ఇమ్రాన్ ఖాన్ తన పునరాగమనంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. "రీ ఎంట్రీపై నా దగ్గర స్పష్టమైన సమాధానం లేదు. కానీ ప్రస్తుతం స్క్రిప్ట్‌లను చదువుతున్నా. బాలీవుడ్ చిత్రనిర్మాతలతోనూ మాట్లాడుతున్నా. వచ్చే ఏడాది రీ ఎంట్రీ ఉంటుందని ఆశిస్తున్నా.' అని అన్నారు.
సినిమాల గురించి ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. 'సినిమాలను చూడటం, హీరోల నుంచి ప్రేరణ పొందడం వల్ల ప్రేక్షకుల నుంచి తనకు ప్రశంసలు వచ్చాయి. సినిమా చూస్తున్న అనుభూతిని ఆస్వాదించానని.. ఈ ప్రపంచంతో తాను భావోద్వేగాలతో ముడిపడి ఉన్నట్లు చెప్పాడు. నా చిన్నప్పుడు సినిమాలు చూసి ఆనందించాను. నాకు 8 ఏళ్ల వయస్సులో ఇండియానా జోన్స్ చూడటం ఇప్పటికీ గుర్తుంది. అది నా మనసును కదిలించింది. నేను ఇండియానా జోన్స్ హీరో లాగే గోధుమ రంగు లెదర్ జాకెట్ కొన్నాను. ఇదే నేను ఓ హీరోని అనుకరించడానికి ప్రయత్నించిన తొలి జ్ఞాపకం" అని గుర్తు చేసుకున్నారు.
తన సినిమా 'జానే తు యా జానే నా' సినిమా గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. 80వ దశకంలో ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ లాంటి యాక్షన్ చిత్రాలు ఉండేవి.. ఇండియన్ సినిమాలో ఈ పాత్రలు తక్కువగా ఉన్నాయని నేను భావించానని తెలిపారు. కాగా.. ఇటీవలే ఇమ్రాన్ అబ్బాస్ టైర్వాలాతో వెబ్ సిరీస్ నటించనున్నట్లు వార్తలొచ్చాయి. కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment