Steroids
-
రెండు నెలలకోసారి స్టెరాయిడ్.. జుట్టంతా ఊడిపోతోందన్న హీరోయిన్ (ఫోటోలు)
-
జిమ్ లో స్టెరాయిడ్స్ వాడుతున్నారా?
-
అక్రమంగా స్టెరాయిడ్స్ అమ్మకం
సాక్షి, హైదరాబాద్: శారీరక సౌష్టవం, కండలు పెంచాలనుకునే వారి బలహీనతను ఆసరాగా చేసుకుని స్టెరాయిడ్స్ అమ్ముతున్న రాకేశ్ డిస్ట్రిబ్యూటర్స్ పై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. రూ.2 లక్షల విలువైన 22 రకాల స్టెరాయిడ్స్‌ను స్వా«దీనం చేసుకుని, సంస్థను సీజ్ చేసినట్లు డీసీఏ డీజీ కమలాసన్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోఠిలోని ఈసామియా బజార్లో రాకేశ్ కనోడియా నిర్వహిస్తున్న రాకేశ్ డిస్ట్రిబ్యూటర్స్‌లో అక్రమంగా స్టెరాయిడ్స్ విక్రయి స్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఈనెల 18, 19 తేదీల్లో సోదాలు చేసినట్టు తెలిపారు. స్వా«దీనం చేసుకున్న స్టెరాయిడ్స్‌ను పరీక్షల కోసం పంపామన్నారు. అనుమతి లేకుండానే మందుల దుకాణం.. మియాపూర్‌లోని శ్రీకాంత్ న్యూరోసెంటర్లో లెసెన్స్ లేని మందుల దుకాణాన్ని సీజ్ చేశారు. లైసెన్స్ లేకుండానే మందుల దుకాణాన్ని నిర్వహిస్తున్నట్టు సోదాల్లో భాగంగా గుర్తించామని కమలాసన్‌రెడ్డి వెల్లడించారు. -
HYD: భారీగా స్టెరాయిడ్స్ స్వాధీనం
సాక్షి,హైదరాబాద్: రాజధాని హైదరాబాద్ నగరంలో నార్కొటిక్స్ అధికారులు భారీగా స్టెరాయిడ్స్ స్వాధీనం చేసుకున్నారు. కోఠిలోని స్టెరాయిడ్స్ డిస్ట్రిబ్యూటర్ రాకేష్ షాపులో డ్రగ్ కంట్రోల్ అధికారులు శుక్రవారం(సెప్టెంబర్20) సోదాలు నిర్వహించారు. బాడీ బిల్డింగ్, జిమ్‌కు వెళ్లే వారి కోసం ప్రత్యేకంగా స్టెరాయిడ్స్ విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మియాపూర్‌లోని శ్రీకాంత్ న్యూరో సెంటర్ లోను భారీగా స్టెరాయిడ్స్ పట్టుకున్నారు. రెండు చోట్ల 51 రకాల స్టెరాయిడ్స్ స్వాధీనం చేసుకున్నారు. స్టెరాయిడ్స్ మొత్తం విలువ రూ.3లక్షలుంటుందని నార్కొటిక్ అధికారులు భావిస్తున్నారు. స్టెరాయిడ్స్ వల్ల కాలేయ వ్యాధులతో పాటు గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఇదీ చదవండి.. ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్‌రావుకు బిగుస్తున్న ఉచ్చు -
నాలో అభద్రతా భావం.. అందుకే స్టెరాయిడ్స్ తీసుకున్నా: స్టార్ హీరో మేనల్లుడు
బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ మేనల్లుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నటుడు ఇమ్రాన్ ఖాన్. చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న హీరో.. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండస్ట్రీలో తాను పడిన ఇబ్బందులపై మాట్లాడారు. తనలో అభద్రతా భావం ఎక్కువగా ఉండేదని తెలిపారు. అసలు నటుడి నేను రాణించగలనా? అని భావించేవాడినని అన్నారు. ఇలా కెరీర్ ప్రారంభించిన తొలి రోజుల్లో చాలా ఇబ్బందులు పడినట్లు వెల్లడించారు.హృతిక్ రోషన్, సల్మాన్ ఖాన్ లాంటి స్టార్స్‌లా శరీరాకృతి కలిగి ఉండాలని ప్రయత్నించినట్లు ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. అందుకోసం స్టెరాయిడ్స్‌ను వినియోగించినట్లు షాకింగ్ కామెంట్స్ చేశారు. సిక్స్ ప్యాక్ బాడీతో సూపర్ హీరో లుక్‌లో కనిపించేందుకు ఇలా చేసినట్లు వెల్లడించారు. ఆ తర్వాత మన లుక్ కోసం ఇలాంటి కెమికల్స్‌తో ఎలాంటి ఉపయోగం లేదని అర్థమైందని చెప్పుకొచ్చారు. సినీ పరిశ్రమలో ఉంటే ఫేమ్ మాత్రమే కాదు.. చాలా ఇబ్బందులు కూడా పడాల్సి ఉంటుందని తెలిపారు. గతంలో నటీమణులు మాత్రమే గ్లామర్‌పై దృష్టిపెట్టేవారని.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారిపోయి నటులు సైతం తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని పేర్కొన్నారు.కాగా.. కిడ్నాప్, ఐ హేట్ లవ్ స్టోరీస్, లక్ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఇమ్రాన్ ఖాన్ పలు చిత్రాల్లో నటించారు. చివరిసారిగా 2015లో కట్టి బట్టి చిత్రంలో కనిపించారు. -
స్టెరాయిడ్స్ ఇంత ప్రమాదమా? ఇమ్రాన్ ఖాన్ సైతం..
మంచి కండలు తిరిగే బాడీ కావాలని ఎవరికి ఉండుదు. యువకులు దీని గురించి జిమ్ సెంటర్లలో గంటల తరబడి నానా హైరానా పడుతుంటారు. కండలు తిరిగిన దేహదారుఢ్యం రావాలంటే టైం పడుతుంది. అందులో ఎలాంటి డౌంట్ లేదు. కానీ కొందరూ ఎలాంటి కష్టం లేకుండా ఈజీగా కండల వంటి దేహం కోసం పక్కదారుల్లో ప్రయాణిస్తారు. అందుకోసం స్టెరాయిడ్స్‌ను వాడతారు. ముందు బాగానే ఉన్నా రానురాను దాని దుష్పరిణామాలు ఒక్కొక్కటిగా బయటపడుతుంటాయి. సినితారలు దగ్గర నుంచి కాలేజ్ కుర్రాళ్ల వరకు కండలు తిరిగే దేహం కోసం స్టెరాయిడ్లు వాడి లేనిపోని అనారోగ్య సమస్యల బారిన పడిన ఉదంతాలు కోకొల్లలు. ఈ స్టెరాయిడ్స్ వల్ల కలిగే దుష్పరిణామాల గురించే ఈ కథనం. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్ సైతం తాను కూడా ఈ స్టెరాయిడ్లు వాడానని, ఏమాత్రం సంకోచించకుండా చెప్పడమే కాకుండా వాడొద్దని హెచ్చరిస్తున్నాడు. తాను 'జానే తు యా జానే' సినిమాలోని ఫోటోలను నెట్టింట షేర్ చేస్తూ దీని గురించి వివరించాడు. తాను సన్నగా ఉండటంతో అందరూ ఎగతాళి చేసేవారని, బాడీ బిల్డర్లాగా దేహాన్ని తయారుచేయమని ఒత్తిడి చేసేవారేని చెప్పుకొచ్చాడు. కానీ తాను ఎంత తిన్న.. సన్నగా కనబడే బాడీ తత్వం కారణంగా లావు అవ్వడం కష్టంగా ఉండేది. మొదట్లో ఎస్ సైజు దుస్తులే తనకు చాలా లూజ్‌గా ఉండేవని చెప్పుకొచ్చాడు. అంతేగాదు తన తొలి సినిమా జానే తులో సన్నగా కనిపంచకుండా ఉండటం కోసం రెండు షర్ట్లు వేసుకుని నటించినట్లు తెలిపాడు ఆ తర్వాత బాడీ పెంచడం కోసం స్టెరాయిడ్లు వాడి తన దుస్తుల సైజుని పెంచానని నిర్మొహమాటంగా చెప్పాడు. దీని వల్ల తాను చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తాను వాడటం లేదని, కేవలం సహజసిద్ధమైన వాల్నట్స్, పసుపు వంటి వాటినే తీసుకుంటున్నట్లు ఇమ్రాన్ ఖాన్ తెలిపాడు. స్టెరాయిడ్స్ అంటే.. అనాబాలిక్ ఆండ్రోజెనిక్ స్టెరాయిడ్లు(ఏఏఎస్) లేదా కండరాలను పెంచడానికి ఉపయోగించే టెస్టోస్టెరాన్ సింథటిక్ రూపం. నిపుణుల అభిప్రాయం ప్రకారం..స్టెరాయిడ్స్ శరీరంలోని కండరాలు, వెంట్రుకలు, కుదుళ్లు, ఎముకలు, కాలేయం,మూత్రపిండాలు వంటి వివిధ భాగాలను ప్రభావితం చేస్తాయి. మగవాళ్లలో ఉండే హార్మోన్ అయినా ఇది మహిళల్లో కూడా 15-70 ఎన్జీ/డీఎల్ వరకు ఉంటాయి. స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల శరీరంలో హార్మోన్ల స్థాయి ఒక్కసారిగా పెరుగుతుంది. ఎదురయ్యే దుష్పరిణామాలు.. వ్యాయమం చేయక్కర్లే కుండా మంచి దేహ సౌష్టవం రావడం కోసం వాడినప్పడు ఇది శరీరంలో రక్తపోటు తోపాటు గుండె ఎడమ జఠరిక పరిమాణాన్ని పెంచుతుంది. ఫలితంగా గుండె జబ్బులు బారిన పడి ఆకస్మిక మరణాల సంభవించే అవకాశం ఉంది. ఇది దూకుడుగా ప్రవర్తించేలా లేదా ఉద్రేకతను పెంచుతుంది. కాలేయానికి హాని కలిగించొచ్చు నిరంతరంగా ఉపయోగించడం వల్ల హైపోగోనాడిజమ్కు కారణమవుతుంది. వృషణాల పనితీరు తగ్గిపోయాల చేసి చివరకు వంధ్యత్వానికి దారితీస్తుంది. ఇది నెమ్మదిగా స్పెర్మ్ కౌంట్‌ని తగ్గించేస్తుంది. ఫలితంగా పిల్లలను కనే సామర్థ్యం తగ్గిపోతుంది. View this post on Instagram A post shared by Imran Khan (@imrankhan) (చదవండి: అరుదైన అలెర్జీ..! సాక్షాత్తు వైద్యురాలే ఐనా) -
స్టెరాయిడ్స్ వల్లే నా ముఖం ఇలా మారిపోయింది: సమంత
మయోసైటిస్ వల్ల ఎంతో బాధను అనుభవిస్తోంది హీరోయిన్ సమంత. ఆ బాధను పంటికింద భరిస్తూ తను ఒప్పుకున్న సినిమా షూటింగ్స్‌లో పాల్గొంది. ఓవైపు ఆ వ్యాధికి చికిత్స తీసుకుంటూనే మరోవైపు సినిమాలు చేస్తూ వాటి కోసం ఎక్సర్సైజ్లు చేస్తూ కష్టపడింది. ఇటీవల ఖుషి సినిమాతో పలకరించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం జాలీగా వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. నా చర్మం దెబ్బతింది.. అయితే ఓసారి అభిమానులను పలకరిద్దాం అనుకుందో, ఏమో.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్‌తో చిట్‌చాట్ పెట్టింది. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటన్న ప్రశ్నకు ప్రస్తుతం ఏదీ ఒకే చేయలేదని చెప్పింది. మీ చర్మం ఎందుకంత బాగుందన్న ప్రశ్నకు.. 'అలాంటిదేమీ లేదు, చికిత్సలో భాగంగా చాలా స్టెరాయిడ్స్ తీసుకున్నాను. దానివల్ల నా చర్మం దెబ్బతింది, పిగ్మంటేషన్ వచ్చింది. చిన్మయి నన్ను గ్లాసీగా చేస్తానంది' అని పేర్కొంది. యాక్షన్ సినిమా చేయొచ్చుగా అని ఓ అభిమాని అడగ్గా సిటాడెల్లో యాక్షన్ రోల్ చేశానంది. ఆ మూడు అంశాలు.. నీ జీవితంతో ముడిపడి ఉన్న మూడు అంశాలు చెప్పమనగా.. '1.నేను దేన్నైనా సాధిస్తాను. 2. పరిస్థితులు ఇలా ఉన్నాయేంటని ప్రశ్నించడం మాని యథాతథంగా స్వీకరిస్తాను. 3. నీతి, నిజాయితీతో ముందుకు సాగుతా' అని రిప్లై ఇచ్చింది. టీనేజర్స్‌కు మీరిచ్చే సందేశం ఏంటి? అన్న ప్రశ్నకు 'నా జీవితం ఇక్కడితోనే అయిపోయింది అని ఎప్పుడూ ఫీలవకండి. జీవితంలో ఇంకా ఎన్నో కష్టాలు, సమస్యలు వస్తూ ఉంటాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగండి. నేను 25 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నేను ఈ స్థాయిలో ఉంటానని అసలు ఊహించలేదు. లైఫ్‌లో ఇన్ని ఇబ్బందులు పడతాననీ అనుకోలేదు. పాజిటివ్‌గా ముందుకు వెళ్లండి' అని చెప్పుకొచ్చింది సామ్. చదవండి: జయసుధ ఫోన్ లాక్కున్న మోహన్ బాబు.. వీడియో వైరల్ -
SOMA BANIK: ఆరోగ్యమే ఆత్మవిశ్వాసం
ఓ భారతీయ యువతీ! తెల్లగా ఉండడమే అందానికి కొలమానం అని ఎవరు నిర్దేశించారు? అందంగా ఉన్న వాళ్లే విజేతలవుతారని నీకు ఎవరు చెప్పారు? ఆత్మవిశ్వాసానికి తెల్లగా ఉండడమే గీటురాయి అనే సూత్రం ఎలా వచ్చింది? మీ రెజ్యూమెలో మార్కులతో రాని ఆత్మవిశ్వాసం అందంతో వస్తుందా? నీకు ఉద్యోగం తెచ్చేది నువ్వు సాధించుకున్న మార్కులే... తెల్లదనం కాదు. తెల్లదనమే అందమనే అపోహ కాస్మెటిక్ మార్కెట్ సృష్టించిన మాయాజాలం. ఈ మాయాజాలం ఇప్పుడు భారతీయ మహిళల ఆరోగ్యాన్ని హరిస్తోంది. అరగంట ఎండను తాళలేకపోతే సమానత్వ పోరాటంలో మహిళ స్థానమెక్కడ? భారతీయ మహిళలు ఆరోగ్యం కోసం చేసే ఖర్చు కంటే అందంగా కనిపించడం కోసం చేసే ఖర్చే ఎక్కువగా ఉంటోంది. భవిష్యత్తులో ప్రమాదకరమైన పరిణామాలకు ఇది తొలి సంకేతం. వైటెనింగ్ క్రీమ్‌లు వాడుతున్న వాళ్లను ముంబయిలో ఓ సంస్థ ప్రశ్నించినప్పుడు ‘తెల్లగా ఉంటే మరింత ఆకర్షణీయంగా ఉంటాననే ఉద్దేశం తో ఫెయిర్నెస్క్రీమ్ని వాడుతున్నాను’ అని కొందరు బదులిచ్చారు. ఇంకా... ‘మా ఇంట్లో వాళ్లు, స్నేహితులు ఫెయిర్‌నెస్ క్రీమ్ వాడమని చెప్పారు, వాడినప్పుడు బావున్నానని చెప్పారు. అందుకే కంటిన్యూ చేస్తున్నాను... అని, సినిమా వాళ్లు, యాడ్‌లో ఈ క్రీమ్‌లు వాడినందువల్లనే అందంగా కనిపిస్తున్నట్లు చెబుతున్నారు. కాబట్టి నేను కూడా అలా కనిపించడం కోసం వాడుతున్నాను’... ఇలాంటి సమాధానాలు వచ్చాయి. ఇది ఇలా ఉంటే... కోల్‌కతాకు చెందిన సోమా బానిక్ చేదు అనుభవం ఇలా ఉంది. ∙∙ అది 2003, సోమా బానిక్కి పద్నాలుగేళ్లు. అప్పుడు సోమా బానిక్ తల్లితో ఓ పక్కింటావిడ అన్న మాటలు ఆ అమ్మాయి జీవితం మీద తీవ్రమైన దుష్ప్రభావాన్ని చూపించాయి. ‘చర్మాన్ని తెల్లబరచడానికి మార్కెట్లో అన్ని క్రీమ్‌లున్నాయి కదా! మీ అమ్మాయికి ప్రయత్నించండి. కొత్తగా ఫలానా క్రీమ్ వచ్చింది. మంచి ఫలితం ఉంటోందట’ అని వైటెనింగ్ క్రీమ్ పేరు కూడా చెప్పిందా పక్కింటావిడ. తెల్లగా ఉంటేనే విజేతలవుతారా! ఒక అమ్మాయి విజేతగా నిలవడానికి దగ్గర దారి తెల్లగా ఉండడమే అన్నంతగా కాస్మెటిక్ కంపెనీలు సమాజాన్ని ప్రభావితం చేస్తున్న రోజులవి. క్రీమ్‌ని వాడడం మొదలుపెట్టిన కొద్దిరోజుల్లోనే స్కూల్లో ఫ్రెండ్స్ సోమా చర్మంలో వచ్చిన మార్పును గుర్తించడం, ప్రశంసించడం మొదలైంది. రెండు నెలలు గడిచేటప్పటికి అసలు సమస్య మొదలైంది. ఎండలోకి వెళ్తే చర్మం చిరచిరలాడడం, మంట, దద్దుర్లు రావడం మొదలైంది. వైటెనింగ్ క్రీమ్ వాడేవాళ్లు ఇలాంటి మార్పును స్వచ్ఛందంగా స్వాగతిస్తారు. చర్మం తెల్లగా అయ్యే క్రమంలో ఇలాగే ఉంటుందని తమకు తాముగా సమాధానం చెప్పుకుంటారు. సోమా కూడా అందుకు మినహాయింపు కాలేకపోయింది. ఓ రోజు... క్రీమ్ రాసుకోవడం మరిచిపోయింది. స్కూలుకు వెళ్లిన కొద్ది గంటలకే ఆమె గడ్డం మీద చిన్న మచ్చలా మొదలై మొటిమలా తేలింది. ఇక క్రమం తప్పకుండా క్రీమ్ రాస్తూ ఏడాది పాటు కొనసాగించింది. చెంపల మీద మొదలైన సన్నని వెంట్రుకలు ముఖమంతా రావడాన్ని గమనించిందామె. ఇప్పుడామె వయసు 33. కోల్‌కతాలో స్టేట్గవర్నమెంట్ ఉద్యోగిని. ఇప్పుడామె భర్త ఎపిలేటర్ సహాయంతో ముఖం మీది వెంట్రుకలను తొలగించడంలో సహాయం చేస్తున్నాడు. ఇవన్నీ సోమా బానిక్ తన బ్లాగ్‌లో రాసుకున్న వివరాలు. ఈ లక్షణాలను విశ్లేషించిన డెర్మటాలజిస్టులందరూ ముక్తకంఠంతో చెప్పిన మాట ఒక్కటే... ‘చర్మం తెల్లగా మారడానికి ఆమె వాడిన వైటెనింగ్ క్రీమ్‌లో ఉన్న స్టిరాయిడ్స్ కారణం’ అని. అది కూడా దీర్ఘకాలం వాడడం వల్ల వెంట్రుకల వంటి సమస్యకు దారి తీసిందనీ. రంగు మార్చే క్రీమ్‌లు లేవు! చర్మం రంగును క్రీమ్‌లతో మార్చడం సాధ్యమయ్యే పని కాదన్నారు బెంగళూరుకు చెందిన డెర్మటాలజిస్ట్ ప్రియాంక రెడ్డి. ‘‘డెర్మటాలజీలో ఎంతటి అధునాతనమైన యంత్రాలు, ఔషధాలు వచ్చాయంటే... కోటి రూపాయల మెషినరీ కూడా ఉంది. కానీ చర్మాన్ని తెల్లబరిచే యంత్రం కానీ ఔషధం తయారు కాలేదు, కాదు కూడా. ఎందుకంటే చర్మం రంగు జన్యుపరంగా నిర్ణయమవుతుంది. అలా నిర్ణయమైన చర్మాన్ని ఆరోగ్యకరంగా మార్చడానికి వీలుంటుంది. గ్లూమింగ్తోపాటు చర్మం మెరుపుతో కాంతులీనేటట్లు చేసే ట్రీట్మెంట్లున్నాయి. కానీ తెల్లబరిచే ట్రీట్మెంట్లు లేవు. అది ఆరోగ్యకరం కాదు కూడా. కొంతమంది హీరోయిన్లను ఉదాహరణ గా చూపిస్తూ ఉంటారు. కానీ అది మేకప్, కెమెరా టెక్నిక్స్, ఎడిటింగ్ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే వాళ్లు ఆరోగ్యకరమైన ట్రీట్మెంట్లు చేయించుకుంటారు తప్ప స్టిరాయిడ్స్, హైడ్రోక్వైనోన్లు ఉండే వైటెనింగ్ క్రీమ్‌ల జోలికి వెళ్లరు. చర్మ సంరక్షణలో ఆరోగ్యకరమైన పద్ధతులనే అవలంబిస్తారు’’ అని చెప్పారామె. స్కిన్ వైటెనింగ్, లైటెనింగ్ వంటి హానికారకమైన డ్రగ్స్ మీద ఆంక్షలు విధించాలని 2017లో ఐఏడివీఎల్ (ఇండియన్ అసోసిÄేæషన్ ఆఫ్ డెర్మటాలజిస్ట్స్ వెనెరియాలజిస్ట్) ఢిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం వేసింది. నిషేధిత ఔషధాలు మార్కెట్లో యధేచ్ఛగా లభించడం మనదేశంలో జరుగుతున్న అరాచకమే. ‘అప్పియరెన్స్‌లో ఏముంది’ అని చెప్పడం సులువే, కానీ సమాజం అప్పియరెన్స్నే ప్రధానంగా చూస్తూ తోటివారిని న్యూనతకు గురి చేస్తూనే ఉంటుంది. సమాజం ఆలోచన మారి తీరాల్సిందేనన్నారు ప్రియాంక. అసలు ఈ తెల్లదనపు మాయకు ఆజ్యం పోసింది మన ప్రఖ్యాత చిత్రకారుడు రవివర్మ అంటే ఆశ్చర్యం కలగక మానదు. రవివర్మ చిత్రలేఖనాన్ని డచ్ చిత్రకారుడి దగ్గర నేర్చుకోవడం... మన భారతీయ మహిళల మీద ఈ స్థాయిలో తీవ్రమైన దుష్ప్రభావాన్ని చూపించింది. ఆయన చిత్రించిన బొమ్మల్లో చాలా వరకు తెల్లగా యూరోపియన్ స్కిన్‌టోన్‌తో ఉంటాయి. ఆ బొమ్మల క్యాలెండర్లు దాదాపుగా అన్ని ఇళ్లకూ చేరాయి. అందంగా ఉండడం అంటే చర్మం తెల్లగా ఉండాలనే అపోహ కూడా ఇంటి గోడల నుంచి మెదడుకు దారి తీసింది. సమాజం ఈ అపోహ నుంచి బయటపడాలంటే మేధోవికసితమైన ఉద్యమం ఒకటి మౌనంగానే అయినా మొదలు కావాలి. అప్పుడు వైటెనింగ్, లైటెనింగ్ క్రీమ్‌ల మార్కెట్ మనదేశం నుంచి నిశ్శబ్దంగా నిష్క్రమిస్తుంది. ఆరోగ్యమే అందం వైటెనింగ్ క్రీమ్‌లను రెండు నుంచి మూడు నెలలు వాడినప్పటి నుంచి చర్మం పలుచబడడం, ఎర్రబారడం మొదలవుతుంది. ఎంతగా అంటే.. రక్తనాళాలు కనిపించేటంతగా పలుచబడుతుంది. ఆపేయగానే మొటిమలు, పిగ్మెంటేషన్ (మంగు) మొదలవుతాయి. దీర్ఘకాలం వాడితే చర్మం మీద వెంట్రుకలు మొదలవుతాయి. చర్మ సంరక్షణకు సాధారణంగా అవసరమయ్యేవి మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, ఫేస్ వాష్‌లు మాత్రమే. అంతకు మించి ఏ అవసరం ఏర్పడినా డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించాల్సిందే. చర్మతత్వాన్ని స్వయంగా పరిశీలించి, సమస్యను, వయసును దృష్టిలో పెట్టుకుని క్రీమ్ లేదా లోషన్లను వాడాల్సి ఉంటుంది. తెల్లదనం కోసం ఖర్చు పెట్టడం వృథా ప్రయాస మాత్రమే. పొల్యూషన్ చర్మానికి హాని కలిగిస్తుంది. కాబట్టి చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. దేహం ఆరోగ్యంగా ఉంటే చర్మం కూడా కాంతులీనుతుంది. మంచి ఆహారం, తగినంత నిద్ర, నీరు తీసుకోవడం మీద మాత్రమే దృష్టి పెట్టాలి. అలాగే ఎక్సర్సైజ్ చేసి చెమట ద్వారా మలినాలు బయటకు పంపించడం కూడా చర్మానికి మెరుపునిస్తుంది. – డాక్టర్ ప్రియాంక రెడ్డి, మెడికల్ డైరెక్టర్, డీఎన్ఏ స్కిన్ క్లినిక్, బెంగళూరు – వాకా మంజులారెడ్డి -
ఆర్ఎంపీల చేతిలో అస్త్రాలివే.. ఇష్టమొచ్చినట్లు వాడితే అంతే సంగతులు
సాక్షి, కర్నూలు(హాస్పిటల్): పట్టణాల్లోని మురికివాడల్లోŠ, గ్రామాల్లోని కిరాణా దుకాణాలో కొందరు చిన్న మాత్ర, పెద్ద మాత్ర, ఒళ్లునొప్పుల మాత్రలివ్వాలంటూ అడుగుతూ కనిపిస్తారు. ఇందులో ఒకటి పెయిన్‌కిల్లర్ కాగా.. మరొకటి స్టెరాయిడ్. మద్యానికి అలవాటు పడ్డట్లే నొప్పులను తగ్గించేందుకు వాడే ఈ మాత్రలకు చాలా మంది ప్రజలు అలవాటు పడ్డారు. నొప్పులను భరించలేక వైద్యుల నుంచి ప్రిస్కిప్షన్ లేకుండా లభించే ఈ మాత్రలను వాడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 1800కు పైగా మెడికల్ షాపులు, 2 వేలకు పైగా ఏజెన్సీలు ఉన్నాయి. మండల కేంద్రాలు, గ్రామాలు, పట్టణాల్లోని మురికివాడల్లో ఉండే పలు మెడికల్ షాపుల్లో విచ్చలవిడిగా స్టెరాయిడ్స్, పెయిన్‌కిల్లర్స్ మాత్రలను ప్రజలకు ఎలాంటి ప్రిస్కిప్షన్ లేకుండా అమ్ముతుంటారు. ముఖ్యంగా రోజంతా కాయకష్టం చేసి ఇంటికి వచ్చి ఒళ్లునొప్పులతో బాధపడేవారు, కీళ్లనొప్పులు, పలు రకాల శారీరక నొప్పులతో బాధపడేవారు ఆయా బాధలు తగ్గించుకునేందుకు ఈ మందులు వాడుతుంటారు. నిపుణులైన వైద్యుల వద్దకు వెళితే వారు పరిమిత సంఖ్యలో మాత్రమే ఇలాంటి మందులు వాడాలని చెబుతారు. అత్యవసరం అయితే తప్పా స్టెరాయిడ్స్ సూచించరు. దీంతో నేరుగా దగ్గరలో ఉన్న తెలిసిన మెడికల్ షాప్‌లకు వెళ్లి ఈ మాత్రలను కొని తెచ్చుకుని వాడుతుంటారు. మురికివాడల్లో, గ్రామాల్లోని పలు కిరాణాదుకాణాల్లో సైతం వీటి విక్రయాలు జరుగుతున్నాయి. ఇలా తెచ్చుకుని వేసుకున్న మాత్రల వల్ల వారికి ఆ రోజుకు ఉపశమనం కలుగుతుంది. ఇలా ప్రతి ఐదు రోజులకు ఒకసారి మాత్రలు తెచ్చి వేసుకోవడం పరిపాటిగా మారుతోంది. ఇవి దీర్ఘకాలం వాడటం వల్ల ప్రాణాంతక జబ్బుల బారిన పడుతున్నారు. ఆర్ఎంపీ చేతిలో అస్త్రాలివే గ్రామాల్లో, మురికివాడల్లోని ప్రజలు ఏ రోగమొచ్చినా ముందుగా గుర్తొచ్చేది ఆర్ఎంపీ (రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్)లే. వెంటనే వారి వద్దకు వెళ్లడం చికిత్స తీసుకోవడం, మరునాడే పనులకు వెళ్లడం పరిపాటి. నిపుణులైన వైద్యుల వద్దకు వెళితే ఇంత త్వరగా రోగం తగ్గదు. అందుకే ఆర్ఎంపీలకు అంత గిరాకీ. సదరు ఆర్ఎంపీలు వారి వద్దకు వచ్చే రోగులకు ఒక చేతికి పెయిన్ కిల్లర్, మరో చేతికి స్టెరాయిడ్ మందును ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. గ్రామాల్లోనే కాదు కర్నూలు పట్టణంలోని బుధవారపేట, ఓల్డ్‌సిటీ, శ్రీరామనగర్, శరీన్‌నగర్, కల్లూరు, వీకర్‌సెక్షన్‌కాలనీ వంటి ప్రాంతాల్లో ఆర్ఎంపీలు చేసే వైద్యం ఇదే. దీంతో ఫలానా డాక్టర్ రెండు సూదులు వేయగానే రోగం తగ్గిపోయిందని గొప్పగా చెప్పుకుని దీర్ఘకాలంలో వచ్చే వ్యాధులను ప్రజలు పట్టించుకోవడం మానేస్తున్నారు. స్టెరాయిడ్స్ అంటే.. స్టెరాయిడ్స్ లేదా కార్టికోస్టెరాయిడ్స్ అనేవి ఒక రకమైన మందులు. ఈ మందులను ముఖ్యంగా ఆటో ఇమ్యూన్ జబ్బుల్లో వాడతారు. వీటిని మొట్టమొదటిసారిగా 1949లో రుమటాయిడ్ ఆర్థరైటిస్‌లో వాడారు. అప్పటినుంచి వీటిని రకరకాల వ్యాధుల్లో (ఆస్తమా, అలర్జి, ఎస్‌ఎల్‌ఈ, ఆర్థరైటిస్, వ్యాస్కులైటిస్ మొదలైన) సూదులు, మాత్రలు, పూతమందులు, ఇన్హేలర్ రూపంలో వాడుతూ ఉన్నారు. ఇందులో చాలా రకాలున్నాయి. డెక్సామిథసోన్, ప్రెడ్నిసోన్, ట్రైయామ్సిలోన్ మొదలైనవి. స్టెరాయిడ్స్ వాడకం వల్ల నష్టాలు మన శరీరంలోని రక్తంలో మామూలుగానే స్టెరాయిడ్స్ చిన్న మోతాదులో ఉంటాయి. ఇవి మన జీవక్రియకు సంబంధించిన ప్రక్రియల్లో ఉపయోగపడతాయి. రక్తంలోని షుగర్‌ను నియంత్రించడం, బీపీ నియంత్రణలో ఉంచడం, ఎముకల శక్తిని నిర్ధారించడం, రోగనిరోధక వ్యవస్థను నియంత్రించడం లాంటివి. మందుల ద్వారా ఇచ్చే స్టెరాయిడ్స్ అధిక మోతాదులో ఉండటం వల్ల జీవక్రియ దెబ్బతింటుంది. దీర్ఘకాలంగా వీటిని వాడటం వల్ల చాలా జబ్బులు కోరి తెచ్చుకుంటారు. ఇందులో బీపీ, స్థూలకాయం, ఆస్టియోపోరోసిస్ (ఎముకల బలహీనత), కంట్లో శుక్లాలు ఇలాంటి సమస్యలు చాలా వస్తాయి. ఇష్టమొచ్చినట్లు వాడొద్దు స్టెరాయిడ్స్ కొన్ని జబ్బుల్లో సరైన సమయంలో సరైన మోతాదులో వాడితే ప్రాణాలు కాపాడబడతాయి. అయితే ఇష్టం వచ్చినట్లు వాడితే చాలా సమస్యలు వచ్చి ప్రాణాంతకం అవుతుంది. ఇప్పటికీ చాలా మంది స్టెరాయిడ్స్ అతిగా వాడి కిడ్నీలు దెబ్బతిని, ఎముకలు గుల్లబారి, బరువు పెరిగి కీళ్లనొప్పులు తెచ్చుకుని మా వద్దకు వస్తుంటారు. మాలాంటి కీళ్లవాత నిపుణులు సైతం అవసరమైన మేరకు మాత్రమే స్టెరాయిడ్స్ ఇచ్చి సమస్య తీవ్రత తగ్గాక తగ్గిస్తారు. ఇవి వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడాలి. – డాక్టర్ శ్రీహరిరెడ్డి, కీళ్లవాత నిపుణులు, కర్నూలు -
Russia Ukraine War: పుతిన్‌కు క్యాన్సర్?!
రష్యా అధినేత పుతిన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని మీడియా ప్రాజెక్ట్ సంస్థ ‘ఇన్వెస్టిగేషన్ ఆన్ వ్లాదిమిర్ పుతిన్ హెల్త్’ పేరిట విడుదల చేసిన ఒక కథనంలో అనుమానం వ్యక్తం చేసింది. రష్యా ప్రజల నుంచి ఆయన తన అనారోగ్యాన్ని దాచిపెడుతున్నారని, ఇందుకోసమే ఉక్రెయిన్‌పై దాడికి దిగారని గతంలో వచ్చిన ఆరోపణలకు తాజా కథనం బలం చేకూరుస్తోంది. ఈ మీడియా ప్రాజెక్ట్ (మీడియా ప్రొకెట్ అంటారు) సంస్థను రష్యాలో నిషేధించారు. దీంతో సంస్థ విదేశాల నుంచి కార్యకలాపాలు నడుపుతోంది. పుతిన్ స్టెరాయిడ్ వాడకంలో ఉన్నారని, అందుకే ఆయన మెడ, ముఖం వాచినట్లున్నాయని కథనంలో పేర్కొంది. పుతిన్‌తో ఎప్పుడూ ఉండే కొందరు డాక్టర్ల గురించి కథనంలో ప్రస్తావించారు. వీరిలో ఒకరు థైరాయిడ్ క్యాన్సర్ స్పెషలిస్టు కాగా మరొకరు న్యూరో సర్జన్. పుతిన్ 2020 జూలైలో నేషనల్ మెడికల్ రిసెర్చ్ సెంటర్ ఫర్ ఎండోక్రైనాలజీ అధిపతి ఇవాన్ దెదోవ్ను కలిసారని కథనం తెలిపింది. పుతిన్ పెద్ద కూతురు ఇక్కడే పనిచేస్తారు. ఈ సమావేశంలో థైరాయిడ్ క్యాన్సర్, లక్షణాలు, దానికి కనిపెట్టిన టైరోజిన్ అనే ఔషధం తదితర వివరాలను పుతిన్‌కు ఇవాన్ వివరించారని కథనం పేర్కొంది. కొత్త ఔషధం వల్ల రికవరీ ఎంత వరకు ఉండొచ్చని పుతిన్ ప్రశ్నించారని తెలిపింది. అప్పుడే పుతిన్ ఆరోగ్యంపై చర్చలు మొదలయ్యాయని తెలిపింది. కరోనా సమయంలో పుతిన్ చాలా రోజులపాటు ఐసోలేషన్‌లో ఉన్నారని, ఆ సమయంలో థైరాయిడ్ క్యాన్సర్ స్పెషలిస్టు ఆయనతో ఎప్పుడూ ఉండేవారని పేర్కొంది. తర్వాత రోజుల్లో ఆయన జనాలతో చాలా దూరం నుంచి మాట్లాడేవారని గుర్తు చేసింది. 2016 నుంచే? పుతిన్ అనారోగ్య సమస్యలు 2016–17 నుంచే సీరియస్‌గా మారాయని కథనం పేర్కొంది. ఆ సమయంలో ఆయనకు డిమిట్రీ వెర్బోవోయ్ అనే డాక్టరు చికిత్స చేశారు. సోచీలోని ఒక రిసార్టులో పుతిన్ ఎక్కువగా గడుపుతుంటారు. ఇక్కడ ఆయన చుట్టూ ఎప్పుడూ కనీసం 5– 17మంది డాక్టర్లుండేవారని తెలిపింది. అనారోగ్య కారణాలతో పుతిన్ సడెన్‌గా మాయమవడం ఐదుసార్లు జరిగిందని గుర్తు చేసింది. ఆయనకు చికిత్సనందించినందుకు కృతజ్ఞతగానే ఓలెగ్ మిస్కిన్ అనే వైద్యుడికి పుతిన్ డాక్టర్ ఆఫ్ రష్యా అవార్డిచ్చారని తెలిపింది. థైరాయిడ్ ప్రాంతంలో వాపు, మాట బొంగురుగా రావడం, మింగడంలో ఇబ్బందులు, గొంతు నొప్పి, పొడిదగ్గు తదితరాలుంటే థైరాయిడ్ క్యాన్సర్‌గా అనుమానిస్తారు. పుతిన్‌కు ఈ సమస్యలున్నాయని, అందుకే డాక్టర్ అలెక్సీ షెగ్లోవ్ అనే స్పెషలిస్టు పుతిన్‌తో 282 రోజుల పాటు కలిసిఉన్నారని కథనం తెలిపింది. ఆయనతో పాటు ఇగోర్ ఇసకోవ్ అనే స్పెషలిస్టు 152 రోజులు, క్యాన్సర్ సర్జన్ సెలివనోవ్ 166 రోజుల పాటు పుతిన్‌తో గడిపారని తెలిపింది. అయితే వీరు ఏ సమయంలో పుతిన్‌తో కలిసిఉన్న విషయం కథనంలో వెల్లడించలేదు. ఎంతవరకు నిజం? గతంలో కూడా పుతిన్ ఆరోగ్యంపై పలు కథనాలు వచ్చాయి. వచ్చే అక్టోబర్‌కు ఆయనకు 70 సంవత్సరాలు వస్తాయి. కేవలం వయసు కారణంగా వచ్చే సమస్యలు తప్ప ఆయనకు మరీ తీవ్రమైన అనారోగ్యాలు లేవని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పాశ్చాత్య ప్రభుత్వాలు కావాలని ఇలాంటి కథనాలు వ్యాప్తిచేస్తుంటాయని రష్యా అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆయనకు మానసిక సమస్యలున్నాయంటూ జపాన్‌కు చెందిన రిస్క్ మేనేజ్మెంట్ టెక్నాలజీస్ సంస్థ ఒక కథనం వెలిబుచ్చింది. ప్రస్తుతం ఆయనకు క్యాన్సర్ ముదిరిపోయిందన్న కథనం కూడా ఇలాంటి కల్పిత కథేనని కొందరు నిపుణుల భావన. రష్యా లాంటి దేశంలో అధికారికంగా ప్రకటించేవరకు ఏ సంగతి తెలియదని వీరు గుర్తు చేస్తున్నారు. ఐదుసార్లు గాయబ్! గతంలో అనారోగ్య కారణాలతో పుతిన్ అకస్మాత్తుగా కొన్ని రోజులపాటు కనిపించకుండా పోయిన ఘటనలివే.. 1. 2012 నవంబర్: వ్యాపార యాత్రలు, దూర ప్రయాణాలను పుతిన్ రద్దు చేసుకున్నారు. ఆయన యథావిధిగా విధులు నిర్వహిస్తున్నట్లు చూపడానికి పాత వీడియోలను కొన్నాళ్లు క్రెమ్లిన్ ప్రసారం చేసేది. 2. 2015 మార్చి: ప్రజలకు దూరంగా కొన్నాళ్లు కనిపించలేదు. ఆయన పాల్గొనాల్సిన సమావేశాలు రద్దయినా గత వీడియోలను చూపి సదరు సమావేశాలు జరిగినట్లు మేనేజ్ చేశారు. 3. 2017 ఆగస్టు: సోచీ రిసార్టుకు వెళ్లిన పుతిన్ వారం పాటు కనిపించలేదు. 4. 2018 ఫిబ్రవరి: ఎన్నికల ప్రచారం మధ్యలో అకస్మాత్తుగా అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకొన్నారు. ఆయనకు జలుబు చేసినందున విశ్రాంతికి వెళ్లారని అధికారులు చెప్పారు. 5. 2021 సెప్టెంబర్: సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లారు. అన్ని కార్యక్రమాలకు వీడియో ద్వారా హాజరయ్యారు. – నేషనల్ డెస్క్, సాక్షి. -
Facial Paralysis: ఒకవైపు కనురెప్ప మూసుకుపోతోందా? అయితే...
కొందరిలో ముఖంలోని ఒకవైపు కండరాలపై మెదడు నియంత్రణ తగ్గిపోతుంది దాంతో ఒకవైపు కనురెప్ప వాలిపోవడం, ఒకవైపు భాగమంతా అకస్మాత్తుగా జారిపోయినట్లుగా అయిపోతుంది. దీన్నే వాడుక భాషలో ‘ఫేషియల్ పెరాలసిస్’, వైద్య పరిభాషలో ‘బెల్స్పాల్సీ’ అంటారు. ఇది చాలా సాధారణంగా కనిపించే సమస్య. చాలావరకు నిరపాయకరమైనది. మెదడు కింద ఉన్న వెన్నుపాము నుంచి 12 నరాలు బయటకు వస్తాయి. అలా పుర్రె భాగం నుంచి బయటకు వచ్చిన నాడులను ‘క్రేనియల్ నర్వ్స్’ అంటారు. ఇందులో ముఖం కండరాలను నియంత్రించే ‘ఏడవ నరం’ దెబ్బతినడం వల్ల ముఖంలోని ఒకవైపు భాగమంతా చచ్చుబడినట్లు అయిపోతుంది. ముఖం వంకరగా కనపడుతుంది. నవ్వినప్పుడు, మాట్లాడినప్పుడు ఈ వంకరదనం ఎక్కువగా కనిపిస్తుంది. లక్షణాలు హెర్పిస్ సింప్లెక్స్ లాంటి ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చాక, దాని వల్ల ఉత్పన్నమైన యాంటీబాడీస్ ఫేషియల్‌ను దెబ్బతీసాయి. ఫలితంగా నరానికి వాపు వస్తుంది. దాంతో అది నియంత్రించే భాగాలు చచ్చుబడిపోతాయి. ఫలితంగా మూతి, ముఖం వంకరపోవడం, ఆ వైపు కంట్లోంచి నీరు కారడం, నీళ్లు పుక్కిలిస్తున్నప్పుడు ఒకవైపు నుంచి ఆపని సరిగా చేయలేకపోవడం, ఒకవైపు కనురెప్ప మూసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చికిత్సలో భాగంగా అవసరాన్ని బట్టి డాక్టర్ల సూచన మేరకు యాంటీ వైరల్ మందులు, స్టెరాయిడ్స్ వాడతారు. మెరుగుదల అన్నది జబ్బు తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. తొంభైశాతం పైగా బాధితులు ఆరునెలల్లో పూర్తిగా కోలుకుంటారు. చదవండి: Bappi Lahiri Death: బప్పీలహరి మృతికి కారణం ఇదే.. సాధారణంలా అనిపించినా ఎంతో ప్రాణాంతకం కూడా! -
భార్యను వదిలించుకోవడానికి భర్త మాస్టర్ ప్లాన్.. వైద్యం పేరుతో
ఆర్మూర్ టౌన్(నిజామాబాద్ జిల్లా): వైద్యం పేరుతో భార్యకు స్టెరాయిడ్స్ అందించిన భర్త గంగసాగర్పై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఆర్మూర్‌కు చెందిన ఆర్ఎంపీ గంగసాగర్ తన భార్యను వదిలించుకోవడానికి చికిత్స పేరుతో స్టెరాయిడ్స్ ఎక్కిస్తూ మట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ విషయమై ఆయన భార్య స్రవంతి సోమవారం కలెక్టర్ నారాయణరెడ్డికి ఫిర్యాదు చేసింది. చదవండి: వదినమ్మ కనిపించడం లేదని.. ఆఖరికి అతడే! దీంతో కలెక్టర్ ఈ సంఘటనపై విచారణ జరపాలని సఖీ టీంకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం సఖీ టీం వారు క్షేత్ర స్థాయిలో విచారించి బాధితురాలికి న్యాయం చేయాలని ఆర్మూర్ పోలీసులకు సూచించారు. కాగా రెండేళ్ల క్రితం కులం పెద్ద మనుషుల సమక్షంలో భార్య, భర్తల మధ్య సమస్య పరిష్కారం కాక పోవడంతో ఇరువురికి కౌన్సెలింగ్ నిర్వహించినట్లు ఎస్సై యాదగిరిగౌడ్ తెలిపారు. అలాగే స్టెరాయిడ్స్ కేసులో భర్త గంగసాగర్పై విచారణ చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
కోవిడ్ తగ్గాక మధుమేహం?
సాక్షి, అమరావతి: గుంటూరుకు చెందిన ఉమేశ్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తారు. గత మేలో కరోనా బారినపడ్డారు. తీవ్రమైన ఇన్ఫెక్షన్కు లోనుకావడంతో చికిత్సలో భాగంగా వైద్యులు స్టెరాయిడ్స్ వాడారు. కరోనా నుంచి కోలుకున్నాక రెండు నెలల్లో 10 కిలోల బరువు పెరిగాడు. దీనికి తోడు చర్మంపై దద్దుర్లు, అతిగా మూత్రం రావడం వంటి ఇతర సమస్యలు ఎదురవుతుండటంతో డాక్టర్‌ను సంప్రదించాడు. వైద్య పరీక్షల అనంతరం ప్రీ డయాబెటిక్ దశలో ఉమేశ్ ఉన్నట్లు నిర్ధారించారు. ..ఇలా ఉమేశ్ తరహాలో కరోనా నుంచి కోలుకున్న వారిలో 5–10 శాతం మందిలో మధుమేహం బయటపడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. మధుమేహం బారినపడుతున్న వారిలో ఎక్కువగా స్టెరాయిడ్స్ సాయంతో చికిత్స పొందిన వారు ఉన్నట్లుగా తెలుస్తోంది. సాధారణంగా స్టెరాయిడ్స్ వాడితే శరీరంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. అయితే.. కొందరిలో 2–3 వారాలకు తగ్గుతోంది. మరికొందరిలో మాత్రం మానేసిన 2–3 నెలలకు కూడా చక్కెర స్థాయిలు నియంత్రణలోకి రావడంలేదు. సాధారణ చికిత్స ద్వారా కోలుకున్నప్పటికీ.. కరోనాకు ముందు ఉన్న ఆధునిక జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం, ఊబకాయం, ఇతర లక్షణాలున్న వారు, వైరస్ సోకిన సమయంలో తీవ్ర ఒత్తిడికిలోనై మధుమేహం బారినపడినట్లు వెల్లడవుతోంది. ఈ నేపథ్యంలో.. పోస్ట్ కోవిడ్‌లో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు తప్పనిసరిగా మధుమేహం పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. లేనిపక్షంలో నిశ్శబ్దంగా నష్టాన్ని చేకూరుస్తుందని హెచ్చరిస్తున్నారు. మధుమేహానికి కారణాలివీ.. ► క్లోమ గ్రంధిలోని బీటా కణాలు సక్రమంగా ఇన్సులిన్‌ను స్రవించకపోవడంవల్ల మధుమేహం సమస్య తలెత్తుతుంది. కరోనా సోకిన వారిలో ఊపిరితిత్తుల్లో వైరస్ అతుక్కునేందుకు కారణమయ్యే ఏసీఈ–2 రిసెప్టార్లు.. క్లోమ గ్రంధిపై కూడా ఉండి, ఇన్సులిన్ ఉత్పత్తిని నియంత్రిస్తాయి. దీంతో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోయి శరీరంలో చక్కెరస్థాయి పెరుగుతుంది. ► దీన్ని శరీర కణజాలం త్వరగా గ్రహించుకోలేకపోవడంతో 6 నెలల పాటు రక్తంలో గ్లూకోజ్ ఎక్కువ ఉండేందుకు అవకాశముంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ► స్టెరాయిడ్స్ ద్వారా కరోనా చికిత్స తీసుకున్న వారు పోస్ట్ కోవిడ్‌లో తప్పనిసరిగా మధుమేహం పరీక్షలు చేయించుకోవాలి. ► మధుమేహం ఉన్నట్లు నిర్ధారణ అయితే వైద్యులు సూచించిన మందులు వాడాలి. ► రక్తంలో గ్లూకోజు స్థాయి పరగడుపున 125 ఎంజీ/డీఎల్, ఆహారం తీసుకున్నాక 200 ఎంజీ/డీఎల్ కన్నా ఎక్కువుంటే మధుమేహం వచ్చినట్లే. ► పొగతాగడం, మద్యం సేవించడం పూర్తిగా మానేయాలి. ► తక్కువ కేలరీలున్న ఆహార పదార్థాలు తీసుకుంటూ, బరువు తగ్గించుకోవాలి. ► వాకింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ వంటి వ్యాయామాలు విధిగా చేయాలి. ► క్రమం తప్పని వ్యాయామంవల్ల శరీర కణజాలంలోని ఇన్సులిన్ గ్రాహకాల సెన్సిటివిటీ పెరుగుతుంది. ► శరీరంలో కొవ్వు నియంత్రణకు తోడ్పడే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది శరీరంలో చక్కెర స్థాయి అధికంగా ఉంటే రోగ నిరోధకశక్తి తగ్గుతుంది. కరోనా చికిత్స పొందిన కొందరిలో స్టెరాయిడ్స్, ఇతర మందుల ప్రభావంవల్ల మధుమేహం బయటపడుతోంది. యువత, పెద్ద వయస్కులు ఇలా అన్ని వర్గాల్లో ఈ సమస్య ఉంటోంది. కరోనా బారినపడ్డ వారిలో అప్పటికే మధుమేహం ఉన్నా, కొత్తగా మధుమేహం బయటపడినా వైద్యుల సూచనల మేరకు విధిగా ఇన్సులిన్ వాడాలి. – డాక్టర్ రాంబాబు, విమ్స్ డైరెక్టర్ ప్రారంభంలోనే గుర్తించాలి ప్రారంభ దశలోనే మధుమేహాన్ని గుర్తిస్తే మంచిది. లేదంటే లోలోపల చాలా నష్టం చేకూరుతుంది. అతిగా మూత్రం రావడం, ఊబకాయం, చర్మంపై దద్దుర్లు, గాయాలైతే నెమ్మదిగా మానడం వంటి లక్షణాలున్న వారు వైద్యులను సంప్రదించాలి. మధుమేహం నిర్ధారణ అయిన వారు ఆహార అలవాట్లు మార్చుకోవాలి. క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి. వైద్యులి చ్చిన మందులు వాడాలి. – డాక్టర్ పి. పద్మలత, జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ గుంటూరు మెడికల్ కళాశాల -
కోవిడ్ బాధితులకు ఇన్హేలర్ స్టెరాయిడ్స్!
సాక్షి, అమరావతి: కోవిడ్ బాధితులకు ముక్కు లేదా నోటి ద్వారా పీల్చుకునేందుకు వీలుగా ఉండే స్టెరాయిడ్స్ (ఉత్ప్రేరకాలు)పై పరిశీలించనున్నారు. సాధారణంగా ఆస్తమా పేషెంట్లు ఎక్కువగా ఇలా ఇన్హేలర్ ద్వారా మందును పీల్చుకుని ఆస్తమాను నియంత్రణలో ఉంచుకుంటారు. అయితే, కేరళలో మొదటి వేవ్‌లో ఇంట్లో చికిత్స పొందుతున్న పలువురికి బుడొజినైట్ స్టెరాయిడ్‌ను ఇన్హేలర్ ద్వారా ఇచ్చారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ వైద్య బృందం కేరళకు వెళ్లినప్పుడు ఈ అంశం పరిశీలనకు వచ్చింది. బాగా దగ్గు ఉండి, 94 కంటే ఆక్సిజన్ శాతం పడిపోయినప్పుడు ఇలా ఇన్హేలర్ స్టెరాయిడ్స్ ఇచ్చినట్టు కేరళ వైద్యులు తెలిపారని కేరళకు వెళ్లిన బృందం సభ్యులు డా.సాంబశివారెడ్డి తెలిపారు. దీనిపై ఆంధ్రప్రదేశ్‌లోనూ పరిశీలన చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారన్నారు. ఇన్హేలర్ స్టెరాయిడ్స్పై ఏపీలోనూ పరిశీలన చేయనున్నామని, దీనివల్ల ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయా? ఇలా వాడితే ఎంతవరకు కోవిడ్ నియంత్రణలోకి వస్తుంది? అనే అంశాలపై అధ్యయనం చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు మనం స్టెరాయిడ్స్ ఇంట్రా వీనస్ (నరాల) నుంచి పంపిస్తున్నామని, నోరు లేదా ముక్కు ద్వారా పీల్చితే ఎంతమేరకు పనిచేస్తాయన్నది చూస్తామన్నారు. కేరళలో కూడా ఫలితాలపై ప్రత్యేక డేటా ఏమీ లేదని, ఆంధ్రప్రదేశ్‌లో ముందుగా పలువురు వైద్యనిపుణులతో చర్చించిన తర్వాత అమలుకు సాధ్యాసాధ్యాలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇదికూడా కేసులు ఎక్కువగా ఉండి, పరిస్థితి విషమంగా ఉన్నప్పుడు మాత్రమే చేయాల్సిన వైద్యమని, సాధారణ పేషెంట్లకు ఇవ్వడం కానీ, కోవిడ్ రాకుండా ఇవ్వడం కానీ ఉండదన్నారు. కేరళలో స్టెరాయిడ్స్ వాడకంపై కూడా అక్కడి వైద్యనిపుణులతో మళ్లీ సంప్రదింపులు జరిపి చర్చించనున్నట్టు తెలిపారు. -
వారసుడి కోసం: 8 సార్లు గర్భస్రావం..1500 స్టెరాయిడ్లు
ముంబై: అంతరిక్షంలోకి వెళ్తున్న సరే.. నేటికి మన సమాజంలో ఆడపిల్ల అంటే చిన్నచూపు. కుమార్తె అంటే భారంగానే భావిస్తారు చాలామంది తల్లిదండ్రులు. కొడుకునే కనాలని పట్టుబడతారు కొందరు మగాళ్లు.. ఆడపిల్లను కంటే కోడలిని ఇంట్లో అడుగుపెట్టనివ్వరు చాలా మంది అత్తమామలు. ఎందుకంటే కొడుకు పున్నామా నరకం నుంచి రక్షిస్తాడంటారు.. కానీ వాస్తవం ఏంటంటే వృద్ధాప్యంలో ఆ కొడుకే వారికి బతికుండగానే నరకం చూపిస్తాడు.. అప్పుడు వారిని ఆదరించేది.. కడుపులో పెట్టుకుని చూసుకునేది కుమార్తె. నిత్యం మన చుట్టు ఇలాంటి దృశ్యాలు ఎన్ని కనిపిస్తున్నప్పటికి చాలామందిలో మార్పు రావడంలేదు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా ఇలాంటి వార్తనే. వారసుడే కావాలన్న ఉన్మాదంతో ఓ వ్యక్తి భార్యకు ఎనిమిది సార్లు అబార్షన్ చేయించాడు. కొడుకును కనడం కోసం ఆమెకు 1,500 స్టెరాయిడ్లు ఇప్పించాడు. ఇన్నాళ్లు ఈ నరకాన్ని మౌనంగా భరించిన ఆ మహిళ ఇక తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగు చూసింది. ఆ వివరాలు.. ముంబైకి చెందిన బాధితురాలు(40)కి 2007లో అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో వివాహం అయ్యింది. బాధితురాలి అత్తగారి కుటుంబంలో అందరూ ఉన్నతవిద్యావంతులే. భర్త, అత్తగారు లాయర్లు కాగా ఆడపడుచు ఓ డాక్టర్. మానవత్వం, విచక్షణ లేనప్పుడు ఎంత గొప్ప చదువుల చదివితే మాత్రం ఏం ప్రయోజనం. వారికి మగసంతానం అంటే పిచ్చి. పెళ్లైన నాటిన నుంచి బాధితురాలి భర్త తరచుగా ఆమె దగ్గర ఇదే విషయాన్ని ప్రస్తావించేవాడు. కొడుకు పుడితే కుటుంబాన్ని కాపాడతాడని.. ఆస్తికి వారసుడు ఉంటాడని తెలిపేవాడు. ఈ క్రమంలో బాధితురాలు 2009లో మొదట ఆడపిల్లకు జన్మనిచ్చింది. 2011లో మరోసారి గర్భం దాల్చింది. ఈ సారి భర్త ఆమెను ఓ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి.. లింగనిర్ధారణ పరీక్షలు చేయించాడు. ఆడపిల్ల అని తేలడంతో ఆమెకు అబార్షన్ చేయించాడు. భార్య చేతనే తనకు ఈ బిడ్డ వద్దని డాక్టర్లకు చెప్పించి మరీ గర్భస్రావం చేయించాడు. ఆ తర్వాత నుంచి బాధితురాలి మీద అఘాయిత్యాలు మొదలయ్యియి. అత్తింటివారు మగపిల్లాడి కోసం ఆమెను తీవ్రంగా వేధించేవారు. భర్త కూడా చికిత్స తీసుకోసాగాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం బాధితురాలి భర్త.. ప్రీ-ఇంప్లాంటేషన్ జన్యు నిర్ధారణ కోసం ఆమెను బ్యాంకాక్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెకు గర్భధారణకు ముందే పిండం లింగాన్ని పరీక్షించడం కోసం చికిత్స, సర్జరీలు చేశారు. మగపిల్లాడి కోసం ఆమెకు ఏకంగా 1500 హార్మోనల్ స్టెరాయిడ్ ఇంజెక్షన్లు ఇచ్చారు. ఈ టెస్ట్, చికిత్సను భారతదేశంలో నిషేధించడంతో అతడు బ్యాంకాక్ తీసుకెళ్లాడు. ఇక బాధితురాలికి దీని గురించి ఏమాత్రం అవగాహన లేదు. విషయం తెలుసుకున్న తర్వాత ఆమెకు సహనం నశించింది. కొడుకు కోసం తనకు అప్పటికే ఎనిమిది సార్లు అబార్షన్ చేయించడమే కాక ఇప్పుడు ఆమె అనుమతి లేకుండా ఇంత భారీ ఎత్తున స్టెరాయిడ్లు ఇవ్వడాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. అత్తింటి ఆగడాల గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
బ్లాక్‌ఫంగస్ కేసుల్లో తెలంగాణది ఏడోస్థానం
సాక్షి, హైదరాబాద్: బ్లాక్‌ఫంగస్ కేసులు అధికంగా నమోదైన రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. దేశంలోనే ఏడోస్థానంలో నిలిచిందని, గత నెల 28వ తేదీ నాటికి 2,578 కేసులు నమోదయ్యాయని, అత్యధికంగా మహారాష్ట్రలో 9,654 బాధితులు ఫంగస్ బారినపడ్డారని తెలిపింది. తెలంగాణ కంటే అధికంగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైన రాష్ట్రాల్లో గుజరాత్ 6,846, ఆంధ్రప్రదేశ్ 4,209, తమిళనాడు 4,075, కర్ణాటక 3,648, రాజస్థాన్ 3,536 కేసులు నమోదయ్యాయి. అతి తక్కువ నమోదైన రాష్ట్రాల్లో నాగాలాండ్, త్రిపుర ఒకటి చొప్పున, మణిపూర్ 7, అసోం 10, గోవా 30, హిమాచలప్రదేశ్ 31, జమ్మూకాశ్మీర్ 47 ఉన్నాయని తెలిపింది. బ్లాక్ ఫంగస్ కేసులు దేశంలో మే రెండోవారం తర్వాత ఎక్కువయ్యాయనీ, ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయని పేర్కొంది. కరోనాతో ఆసుపత్రుల్లో చేరినవారికి ఇష్టారాజ్యంగా స్టెరాయిడ్ల ఇవ్వడం వల్ల షుగర్ పెరగడం తదితర కారణాలతో బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువయ్యాయని తెలిపింది. -
స్టెరాయిడ్స్ వల్లే పోస్ట్ కోవిడ్ సమస్యలు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకున్న 40 శాతానికి పైగా పేషెంట్లు బలహీనత, అలసట తదితర లక్షణాలతో బాధపడుతున్నట్లు వెల్లడైనట్లు ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్ డా.డి.నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. చాలామందిలో నిద్రలేమి, నాడీ, మానసిక సంబంధ సమస్యలు వెంటాడుతున్నట్లు పేర్కొన్నారు. 30 ఏళ్ల వయసు పైబడి కరోనా నుంచి కోలుకున్న వారికి అకస్మాత్తుగా గుండెపోటు, ఊపిరితిత్తులు, జీర్ణకోశ సమస్యలు, కీళ్లు, కండరాలు, ఇతర సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఆస్పత్రుల్లో చేరిన వారిలో 34 శాతం మందికే ఆక్సిజన్, స్టెరాయిడ్స్ అందించాల్సి ఉండగా, 74 శాతం మందికి స్టెరాయిడ్స్ వినియోగించినట్లు తేలినట్లు పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా మనదేశంలోనే మందుల దుకాణాల్లో ‘ఓవర్ ది కౌంటర్’ స్టెరాయిడ్స్ సులభంగా లభించడమే ఇందుకు కారణం కావొచ్చని చెప్పారు. ప్రస్తుతం ఎదురవుతున్న పోస్ట్ కోవిడ్ సమస్యలకు స్టెరాయిడ్స్ వినియోగం కారణంగా కనిపిస్తోందని, అందుకే దీనిపై లోతైన పరిశోధన జరపాల్సిన అవ సరం ఉందని వివరించారు. ప్రస్తుతం దేశం థర్డ్‌వేవ్ ముంగిట ఉన్న నేపథ్యంలో ఏఐజీ ఆధ్వర్యంలో జీనోమ్ సీక్వెన్సింగ్, ఇతర అధ్యయనాలు చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో 90 శాతం వరకు డెల్టా వైరస్ ప్రభావం చూపుతున్నట్లు అధ్యయనాల్లో స్పష్టమైనట్లు చెప్పారు. డెల్టా ప్లస్ లేదని తేలినట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 5 వేల మందిపై ఆన్లైన్లో నిర్వహించిన సర్వేలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. సోమవారం ఏఐజీ ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన ‘పోస్ట్ కోవిడ్ కేర్ క్లినిక్’ను సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు ప్రారంభించారు. వర్చువల్‌గా మాట్లాడుతూ కోవిడ్ సమస్యలపై ప్రత్యేకంగా క్లినిక్‌ను ఏర్పాటు చేయడం దేశంలోనే ఇది తొలిసారని డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఈ క్లినిక్‌లో పలు విభాగాల స్పెషలిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉంటారని వివరించారు. సర్కారు ఆస్పత్రుల్లోనూ పోస్ట్ కోవిడ్ కేర్: నర్సింగ్‌రావు కోవిడ్ అనంతరం ఎదురయ్యే సమస్యలపై స్పష్టమైన అవగాహన వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ దీనికి అవసరమైన చికిత్స అం దించేలా చర్యలు చేపట్టాల్సి ఉంటుందని సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు ఓ ప్రశ్నకు బదులిచ్చారు. పోస్ట్ కోవిడ్ చికిత్స కోసం ప్రత్యేక క్లినిక్ ఏర్పాటు అభినందనీయమని చెప్పారు. కరోనా నుంచి కోలుకున్నవారిలో స్వల్ప లక్షణాలున్న వారు నెలలో, మధ్యంతర సమస్యలున్న వారు నెల నుంచి 3 నెలల్లో, సుదీర్ఘకాలం పాటు సమస్యలున్న వారు కోలుకునేందుకు 6నెలలు పడుతున్నట్లు ఓ ప్రశ్నకు నాగేశ్వర్‌రెడ్డి సమాధానమిచ్చారు. శరీరంలో విటమిన్ డి, జింక్, ప్రో టీన్లు తగ్గిపోవడం వల్ల ఈ సమస్యలు వస్తున్నా యని పేర్కొన్నారు. కోవిడ్ వచ్చి తగ్గాక 3 నెలల తర్వాత వ్యాక్సిన్ తీసుకోవాలని కేంద్రం చెబుతున్నా.. తాను మాత్రం నెల తర్వాత ఒక డోస్ తీసుకుంటే పెద్దసంఖ్యలో యాంటీబాడీస్ ఏర్పడుతాయనే అభిప్రాయపడుతున్నట్లు తెలిపారు. -
స్టెరాయిడ్ల వల్లే బ్లాక్ ఫంగస్ ముప్పు
సాక్షి,, న్యూఢిల్లీ: దేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్టెరాయిడ్లను అధికంగా వాడటం వల్ల ఇతర ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతోందని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. కరోనాతో పాటు ఇప్పుడు దేశాన్ని వణికిస్తున్న మ్యూకోర్మైకోసిస్ కేసులను నియంత్రించేందుకు ఆయన పలు సూచనలు చేశారు. కోవిడ్ రోగులలో కనిపించే ఫంగల్ ఇన్ఫెక్షన్ల ప్రాబల్యం ప్రస్తుతం పెరిగిందని, షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉన్నవారు కరోనా బారిన పడటం వలన మ్యూకోర్మైకోసిస్ ప్రమాదం పెరుగుతుందని గులేరియా అన్నారు. కరోనా సెకండ్ వేవ్‌లో వ్యాధి తీవ్రత చాలా తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ, స్పష్టమైన సంకేతాలు లేనప్పటికీ స్టెరాయిడ్లను ఎక్కువ మోతాదులో ఉపయోగించడం ఇతర ఇన్ఫెక్షన్లకు కారణమవుతోందన్నారు. లక్షణాలు లేని రోగులకు అధిక మోతాదులో స్టెరాయిడ్లు ఇస్తే, వారికి రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగి మ్యూకోర్మైకోసిస్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. దీనిని నివారించేందుకు..రక్తంలో షుగర్ లెవల్స్‌ని నియంత్రించుకోవాలని, స్టెరాయిడ్స్ వాడుతున్నవారు రోజూ వారి రక్తంలో షుగర్ లెవల్స్‌ను చెక్ చేసుకోవాలని తెలిపారు. ముడి ఆహారాన్ని తినడం ద్వారా మ్యూకోర్మైకోసిస్ వ్యాప్తి చెందుతోందనే విషయం ధృవీకరించడానికి ఎలాంటి డేటా లేదని వివరించారు. అదే సమయంలో కోవిడ్ చికిత్స సమయంలో ఆక్సిజన్ వాడకంతో బ్లాక్ ఫంగస్‌కు సంబంధం లేదని పేర్కొన్నారు. హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న కొందరు కరోనా రోగుల్లోనూ బ్లాక్ ఫంగస్‌ను ధృవీకరిస్తున్నారని డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. -
మరో మహమ్మారి వైట్ ఫంగస్!
బ్లాక్ ఫంగస్ తరహాలోనే మనపై దాడిచేసే మరో మహమ్మారి.. వైట్ ఫంగస్. దీని అసలు పేరు కాండిడా అల్బికాన్స్. ఇది సోకడం వల్ల నోటిలో అంగిలి, నాలుక, చర్మం, జననేంద్రియాలు.. తదితర ప్రాంతాల్లో తెల్లటి మచ్చలు వస్తాయి. అందువల్ల దీనిని వైట్ ఫంగస్ అని పిలుస్తుంటారు. ఎందుకు సోకుతుంది? బ్లాక్ ఫంగస్ తరహాలో వైట్ ఫంగస్ కూడా మన చుట్టూ ఉన్న వాతావరణంలో, చాలా మంది శరీరంలోనూ ఉంటుంది. కరోనాకు స్టెరాయిడ్లు అతిగా వాడి శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలహీనపడినప్పుడు, షుగర్ లెవల్స్ తీవ్రంగా పెరిగిపోయినప్పుడు ఇది దాడి చేస్తుంది. ఒకవేళ వైట్ ఫంగస్ పెరుగుదలను అడ్డుకునే పరిస్థితి లేకుంటే చాలా తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. కరోనా సోకి ఆక్సిజన్ తీసుకుంటున్న వారికి ఆ పైపుల ద్వారా ఊపిరితిత్తులలోకి, నోటిలోకి ఈ ఫంగస్ ప్రవేశించి ప్రభావం చూపుతోందని వైద్య నిపుణులు చెప్తున్నారు. దేనిపై ప్రభావం చూపుతుంది? బ్లాక్ ఫంగస్ ప్రధానంగా ఊపిరితిత్తులు, నోరు, కళ్లు, ముక్కు, మెదడు వంటి భాగాలపై ఎక్కువ ప్రభావం చూపితే.. వైట్ ఫంగస్ ఊపిరితిత్తులతో పాటు కడుపు, పేగులు, కిడ్నీలు, చర్మం, గోర్లు, జననేంద్రియాలకూ సోకుతుంది. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. మహిళలు, చిన్న పిల్లల్లోనూ ఇది ప్రభావం చూపిస్తుంది. లక్షణాలు ఎలా ఉంటాయి? నోటిలో, గొంతులో, నాలికపై కురుపులు, తెల్లని మచ్చలు ఏర్పడుతాయి. సైనస్ వాపు, గొంతునొప్పి ఉంటుంది. తీవ్రంగా ఆయాసం, నిస్సత్తువ ఆవహిస్తాయి. జననేంద్రియాలు, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లు ఉంటాయి. ఈ లక్షణాలు మహిళల్లో ఎక్కువగా కనిపిస్తాయి. పేగులకు ఫంగస్ ఇన్ఫెక్ట్ అయితే మలబద్ధకం, గ్యాస్, డయేరియా లక్షణాలు ఉంటాయి. బాహుమూలాలు, మోచేతులు, మోకాళ్లు వంటి చోట్ల చర్మంపై దద్దుర్లు వస్తాయి. కీళ్లనొప్పులు తలెత్తుతాయి. ఎలా బయటపడాలి? వైట్ ఫంగస్ ఇన్ఫెక్షన్ తగ్గడానికి యాంటీ ఫంగల్ ఔషధాలు, ఇంజెక్షన్లు వాడాల్సి ఉంటుంది. అదే సమయంలో తగిన పోషకాహారం తీసుకోవడం, వీలైనంత వరకు తీపి పదార్థాలకు దూరంగా ఉండటం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
Black Fungus: తెలంగాణలో పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు
సాక్షి, హైదరాబాద్/సాక్షి నెట్వర్క్: కరోనా నుంచి కోలుకున్న చాలామందికి ఆ సంతోషం ఎక్కువ రోజులు మిగలట్లేదు. బ్లాక్‌ఫంగల్ ఇన్ఫెక్షన్ రూపంలో మళ్లీ అనారోగ్య సమస్యలు తలెత్తుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా నుంచి కోలుకున్న వారిలో ఎక్కువగా బ్లాక్‌ఫంగస్ లక్షణాలు కన్పిస్తున్నట్లు వైద్యులు గుర్తించారు. ఇప్పటివరకు ఢిల్లీ, అహ్మదాబాద్, మహారాష్ట్రలో మాత్రమే వెలుగుచూసిన ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ కేసులు రాష్ట్రం లోనూ పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. సోమవారం నిజామాబాద్ జిల్లాకు చెందిన ముగ్గురు, నల్లగొండ జిల్లాకు చెందిన ఒకరు బ్లాక్‌ఫంగస్‌తో మృతిచెందారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో బ్లాక్ ఫంగస్ లక్షణాలతో 16 మంది చికిత్స పొందుతుండగా, కోఠి ఈఎన్టీ ఆస్పత్రిలో సోమవారం ఒక్కరోజే 25 కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాల ద్వారా తెలిసింది. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా పదిమంది చనిపోయారు. బ్లాక్‌ఫంగస్ కేసుల చికిత్సకు వీలుగా ఈఎన్టీ ఆస్పత్రిని నోడల్ సెంటర్‌గా ప్రకటించారు. ఈ కేసులకు సంబంధించి కచ్చితమైన నిర్ధారణ కోసం కొందరి నమూనాలను బయాప్సీకి పంపారు. అలాగే, బ్లాక్‌ఫంగస్ బాధితుల కోసం గాంధీ ఆస్పత్రి 7వ అంతస్తులో ప్రత్యేక వార్డును ఏర్పాటుచేశారు. బాధితులకు శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు గాంధీ ఈఎన్టీ విభాగం ముందుకు రావడంతో ఇక్కడే ప్రత్యేక ఆపరేషన్ థియేటర్‌ను రెండ్రోజుల్లో అందుబాటులోకి తేవాలని ఆస్పత్రి పాలన యంత్రాంగం నిర్ణయించింది. ఎందుకు సోకుతుందంటే.. కరోనా చికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్ ఎక్కువగా వినియోగిస్తుండటంతో కోలుకున్న అనంతరం బాధితులు బ్లాక్‌ఫంగస్ బారిన పడుతున్నారని వైద్య వర్గాలు చెబుతున్నాయి. మధుమేహం, కిడ్నీ, కాలేయం ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, రోగనిరోధకశక్తి తక్కువ ఉన్నవారికి కరోనా చికిత్స సమయంలో స్టెరాయిడ్స్ మోతాదుకు మించి ఇస్తుండటంతో.. కోవిడ్‌తో విముక్తి లభించిన తర్వాత బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ సోకుతోంది. సాధారణ వాతావరణంలో కూడా ఉండే బ్లాక్‌ఫంగల్.. రోగనిరోధక శక్తి లేనివారికి త్వరగా సోకుతోందని వైద్యులు చెబుతున్నారు. కరోనా నుంచి కోలుకున్నాక ముక్కు దిబ్బడ, ముక్కు నుంచి రక్తం కారడం, చీదినప్పుడు నల్లటి పదార్థం బయటికి రావడం, ముక్కు లోపల వాపు, నొప్పి, జ్వరం వంటి లక్షణాలు కన్పిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒక్కరోజే నలుగురు మృతి.. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం ఎల్కే ఫారమ్ గ్రామానికి చెందిన బెజవాడ హరిబాబు (35) కరోనాతో జిల్లా ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు ముక్కు, చెవుల నుంచి రక్తం రాగా బ్లాక్ ఫంగస్ లక్షణాలుగా భావించి శనివారం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించగా, చికిత్సపొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందారు. వేల్పూర్ మండలం సాహెబ్పేట్కు చెందిన ఉట్నూర్ చిన్న గంగారాం (65) రెండు వారాల క్రితం కరోనా బారిన పడ్డారు. కోలుకున్న కొద్దిరోజులకే మళ్లీ తిరగబెట్టడంతో నిజామాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అక్కడి వైద్యులు బ్లాక్ ఫంగస్‌గా నిర్ధారించి మూడ్రోజుల క్రితం గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ సోమవారం మరణించారు. బోధన్ పట్టణం శక్కర్‌నగర్ కాలనీకి చెందిన మర్రి రాజేశ్వర్ (39) పదిరోజుల క్రితం కరోనా బారినపడి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. నాల్రోజుల కిత్రం బాధితుడిలో బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించడంతో గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా ఆదివారం రాత్రి మృతిచెందారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఆరెగూడెంకు చెందిన ల్యాధా గండయ్య (57) కరోనా బారినపడ్డారు. మూడ్రోజుల క్రితం గండయ్యకు ఒళ్లు నొప్పులు, జ్వరంతోపాటు కంటిచూపు మందగించింది. ఆదివారం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తీసుకురాగా..వైద్యులు బ్లాక్ ఫంగస్‌గా నిర్ధారించి వైద్యం చేశారు. చికిత్సపొందుతూ సోమవారం మృతి చెందాడు. పెరుగుతున్న కేసులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాజాపురం గ్రామానికి చెందిన తూనుకుంట్ల సులోచనరాణి ఈనెల 10న కరోనా బారినపడ్డారు. సోమవారం ఆమెకు కన్ను, ముఖం వాచిపోవడంతో పెనుబల్లిలోని ఆస్పత్రికి రాగా, వైద్యులు బ్లాక్‌ఫంగస్‌గా నిర్ధారించి ఆమెను ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన కె.సత్యనారాయణరెడ్డి (35)కి వారం క్రితం కోవిడ్ పాజిటివ్ వచ్చింది. అకస్మాత్తుగా కంటిచూపు మందగించి, కళ్లు వాచిపోవడంతో కుటుంబసభ్యులు సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఇంకా, రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాలకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు అల్లం లింగయ్య (44) కరోనా బారినపడి ఇటీవలే కోలుకున్నారు. ఆదివారం దవడ, ముక్కులోంచి చీము కారడంతో ఆయనను హైదరాబాద్ నిమ్స్‌కు తీసుకెళ్లారు. సోమవారం పరీక్షలు నిర్వహించిన వైద్యులు బ్లాక్ ఫంగస్‌గా నిర్ధారించారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి (40) కరోనా నుంచి కోలుకున్న మూడ్రోజులకే అనారోగ్యం పాలయ్యారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు బ్లాక్ ఫంగస్‌గా నిర్ధారించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉంటున్న రంగారెడ్డి జిల్లా కందుకూరుకు చెందిన ఓ వ్యక్తి బ్లాక్ ఫంగస్ బారినపడగా, ఆయనకు వైద్యులు సోమవారం ఒక కన్ను తొలగించారు. స్టెరాయిడ్స్ మోతాదు మించడం వల్లే.. రోగ నిరోధకశక్తి తక్కువున్నవారిపై ఫంగస్ ప్రభావం చూపుతోంది. ఇది ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ముక్కు, కన్ను, మెదడు, పై దవడ, సైనస్‌లు దెబ్బతింటాయి. ఎంత వేగంగా విస్తరిస్తుందో.. అంతే వేగంగా కణాలను, ఎముకలను దెబ్బతీస్తుంది. కోవిడ్ చికిత్సల్లో మోతాదుకు మించి స్టెరాయిడ్స్ ఇచ్చిన మధుమేహ బాధితుల్లో ఎక్కువ ప్రభావం చూపుతుంది. – డాక్టర్ మేఘనాథ్, ఈఎన్టీ నిపుణుడు, ’మా’ ఆస్పత్రి కోలుకున్నాక కూడా మాస్క్ వాడాలి కరోనా బాధితులకు స్టెరాయిడ్స్ ఏ దశలో ఎంత మోతాదులో వాడాలనేది చాలామందికి అవగాహన లేదు. స్టెరాయిడ్స్ కరోనా లక్షణాల నుంచి ఉపశమనం కల్పిస్తున్నా.. రోగ నిరోధకశక్తిని తగ్గిస్తాయి. కోవిడ్ నుంచి కోలుకున్నాక కూడా మాస్క్ ధరిస్తే ఫంగస్ బారినపడకుండా ఉండొచ్చు. – డాక్టర్ రవిశంకర్, ఈఎన్టీ నిపుణుడు, కోఠి ఈఎన్టీ ఆస్పత్రి అందరికీ రాదు.. కరోనా బాధితుల్లో ప్రతి వందమందిలో ఒకరిద్దరికే బ్లాక్‌ఫంగస్ వస్తుంది. తొలిదశలో గాంధీలో చికిత్సపొందిన 10 మందిలో దీన్ని గుర్తించాం. ఒకరిద్దరు మినహా అంతా చికిత్సకు కోలుకున్నారు. పౌష్టికాహారం తీసుకుని రోగనిరోధకశక్తిని పెంచుకోవాలి. ఆకుకూరలు, చేపలు, గుడ్లు, మాంసాహారం, సీ విటమిన్ ఎక్కువ లభించే పండ్లు తీసుకోవాలి. – డాక్టర్ రాజారావు, సూపరింటెండెంట్, గాంధీ ఆస్పత్రి -
Black Fungus: బ్లాక్ ఫంగస్‌పై ఆందోళన వద్దు
సాక్షి, అమరావతి: కరోనా బాధితుల్లో ఇప్పుడు బ్లాక్ ఫంగస్ గుబులు రేపుతోంది. నాసో ఆర్బిటల్ మెనింగ్ మ్యుకర్ మైకోసిస్ లేదా రీనో సెరిబ్రల్ మ్యుకర్ మైకోసిస్‌గా పిలిచే ఈ ఫంగస్ వల్ల ఇది ఉత్పన్నమై ప్రాణాపాయం వరకూ తీసుకెళుతుంది. ముక్కు నుంచి కంటికి, కంటి నుంచి మెదడుకు చేరుకుని అవయవాలను పాడు చేస్తోంది. నియంత్రణలో లేని మధుమేహ రోగుల్లో బ్లాక్ ఫంగస్ సోకుతుందని నిపుణులు తేల్చారు. దీంతోపాటు సైనసైటిస్ (ముక్కు లేదా శ్వాసకు సంబంధించిన అలర్జీ) ఉన్న వారిలో ఎక్కువగా వస్తున్నట్టు నిపుణులు గుర్తించారు. బ్లాక్ ఫంగస్‌పై ఆందోళన వద్దని వారు సూచించారు. మధుమేహ బాధితుల్లోనే ఎందుకంటే.. కరోనా సోకిన పరిస్థితి తీవ్రమైన వారికి స్టెరాయిడ్స్ వాడటం తప్పనిసరి. కరోనా తగ్గిపోవాలనే ఉద్దేశంతో మధుమేహ రోగులకు విచక్షణా రహితంగా స్టెరాయిడ్స్ ఇస్తున్నారు. స్టెరాయిడ్స్ వల్ల మధుమేహ బాధితుల్లో ఫంగస్ వచ్చే అవకాశం ఎక్కువ. స్టెరాయిడ్స్ ప్రాణాధార మందులే అయినా.. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. ఈ ఫంగస్ గాలి పీల్చుకోవడం ద్వారా ఎక్కువగా రావచ్చనేది ప్రాథమిక అంచనా. హెచ్ఐవీ బాధితులకు అనుబంధంగా టీబీ ఎలా వచ్చి వాలుతుందో మధుమేహ రోగులకు ఫంగస్ అలా చేరేందుకు ఎక్కువగా అవకాశాలున్నాయి. ఇతర కారణాలూ ఉండొచ్చు వెంటిలేటర్లను శుభ్రం చేయకుండా ఎక్కువ కాలం వాడటం వల్ల కూడా బ్లాక్ ఫంగస్ సోకే అవకాశం ఉంటుంది. ఎక్కువ కాలం ఆక్సిజన్‌పై ఉన్న రోగులకు కూడా ఫంగస్ సోకే అవకాశం ఉంది. ముక్కుకు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధులు అంటే సైనసైటిస్ వంటివి ఉన్నప్పుడు బ్లాక్ ఫంగస్ రావడానికి ఎక్కువ అవకాశాలుంటాయి. అయితే దీనిపై ఇంకా ఎలాంటీ స్టడీలు లేవని వైద్యులు చెబుతున్నారు ఇలా గుర్తించవచ్చు.. ముందుగా ముఖంలో వాపు ఉన్నప్పుడు లక్షణాలు బయటపడతాయి. కంటిగుడ్డు కింద ఎర్రబడి దురదగా ఉండటం (ఆఫ్తాల్మో ప్లీజియా). ముక్కులో దురదగా ఉండటం, పదేపదే ముక్కును నలిపేయాలనిపించడం. కళ్లపైన లేదా కళ్ల కింద చిన్న ఉబ్బులు కనిపించడం. కంటిచూపు తగ్గినట్టుగా లేదా మసకగా అనిపించడం. దంతాల్లో నొప్పిగా ఉండటం. ముఖంపై నొప్పి, తిమ్మిరి, వాపు వంటితో పాటు మొద్దుబారడం వంటివి కూడా దీని లక్షణాలు. జాగ్రత్తలే మందు : ఐసీఎంఆర్ మధుమేహాన్ని వీలైనంత మేరకు అదుపులో ఉంచుకోవడం. మోతాదుకు మించి స్టెరాయిడ్స్ వాడకుండా జాగ్రత్త పడటం. ఇమ్యునో మోడ్యులేటింగ్ డ్రగ్స్‌ను నిలిపివేయడం. లక్షణాలు కనిపించగానే ఇంటర్నల్ మెడిసిన్/న్యూరాలజిస్ట్/ఈఎన్టీ సర్జన్/ లేదా కంటివైద్యులు/ దంత వైద్యులు/మైక్రో బయాలజిస్ట్ వంటి వారిని కలిసి చూపించుకోవాలని ఐసీఎంఆర్ సూచిస్తోంది. (చదవండి: ప్రాంతీయతత్వంతో... ప్రజల ప్రాణాలు తీస్తారా?) స్టెరాయిడ్స్ ప్రభావమే ఎక్కువ స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడటం వల్ల ఫంగస్ అటాక్ అవుతుంది. దీన్నే ఆపర్చ్యునిస్టిక్ (అవకాశవాద) ఇన్ఫెక్షన్ అంటాం. సైనసైటిస్ ఉన్నవారికి కూడా బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. నియంత్రణలో లేని షుగర్ బాధితులకే ఇది ఎక్కువగా ఉంటుంది. – డా.వరప్రసాద్, అనస్థీషియా నిపుణులు, కర్నూలు ప్రభుత్వాస్పత్రి మధుమేహ నియంత్రణతో బయటపడొచ్చు బ్లాక్ ఫంగస్ కొత్తగా పుట్టుకొచ్చిందేమీ కాదు. ఇమ్యునో కాంప్రమైజ్ పర్సన్స్‌కు ఇది వస్తుంది. లైఫ్ సేవింగ్ డ్రగ్స్‌గా భావించే స్టెరాయిడ్స్ వాడితే ఆటోమేటిగ్గా షుగర్ పెరుగుతుంది. కరోనా తగ్గాక కూడా ప్రతిరోజూ మధుమేహంపై పర్యవేక్షణ చేసుకుంటూ ఉంటే బ్లాక్ ఫంగస్ నుంచి బయటపడొచ్చు. వెంటిలేటర్లు, ఆక్సిజన్ మెషిన్ల నుంచి ఫంగస్ సోకుతున్న దాఖలాలను ఇంకా గుర్తించలేదు. – డాక్టర్ కిషోర్, ఈఎన్టీ సర్జన్, కర్నూలు (చదవండి: ఆక్సిజన్ సేకరణ, పంపిణీలో ఏపీ పురోగతి) -
బంజారాహిల్స్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లో భారీగా డ్రగ్స్‌ను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కండరాల బలం కోసం స్టెరాయిడ్స్ అమ్ముతున్న ఫిట్ నెస్ ట్రైనర్ జుబేర్ సహా మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో మిస్టర్ ఇండియా, మిస్టర్ వరల్డ్ పోటీల్లో పాల్గొన్న జుబైర్.. విదేశాల నుండి స్టెరాయిడ్స్ కొనుగోలు చేసి ఇక్కడ యువతకు విక్రయిస్తున్నారు. బంజారాహిల్స్ లోని ఏ 1 సప్లమెంట్ స్టోర్స్ పేరుతో స్టెరాయిడ్స్ విక్రయాలు జరుపుతున్నారు. పక్కా సమాచారంతో దాడి చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి నుంచి మొత్తం రూ. 14 లక్షలు విలువ చేసే స్టెరాయిడ్స్ స్వాధీనం చేసుకున్నారు. -
కండల కోసం స్టెరాయిడ్స్!
సాక్షి, సిటీబ్యూరో : అత్యవసర సమయాల్లో వినియోగించే మెఫన్ టెర్మైన్ సల్ఫేట్ ఇంజక్షన్‌ను నగర యువత స్టెరాయిడ్‌గా వినియోగిస్తోంది. జిమ్‌ల్లో ఎక్కువ సమయం గడిపి, కండలు పెంచడానికి ఈ సూది మందు తీసుకుంటోంది. ఈ ఇంజక్షన్‌ను అక్రమంగా యువతకు విక్రయిస్తున్న ముఠా గుట్టును దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేసి, వారి నుంచి రూ.1.5 లక్షలు విలువైన 130 మెఫన్‌టెర్మైన్ సల్ఫేట్ ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నట్లు అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మి శనివారం వెల్లడించారు. ►చంద్రాయణగుట్ట పరిధిలోని అల్ జూబ్లీ కాలనీకి చెందిన మహ్మద్ షా ఫహద్ గతంలో ఓ ఫార్మా కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పని చేశాడు. ఈ నేపథ్యంలోనే ఇతడికి వివిధ రకాలైన ఔషధాలు, వాటిలో స్టెరాయిడ్స్‌గా ఉపకరించే వాటిపై పట్టుంది. ఇతడికి మెఫన్‌టెర్మైన్ సల్ఫేట్ ఇంజక్షన్ ఉత్ప్రేరకంగా పని చేస్తుందని, దీన్ని యువత ఎక్కువగా వాడతారని తెలిసింది. ►రోగులకు సర్జరీలు చేసే సమయంలో మత్తు (అనస్తీషియా) ఇస్తారు. ఈ ఇంజక్షన్ రక్తపోటును అవసరమైన స్థాయిలో పెంచి, గుండె పక్కాగా పని చేయడానికి ఉపకరిస్తుంది. అలాగే గుండెపోటు వచ్చిన వారికీ వైద్యం కోసం ఈ ఇంజక్షన్‌ను వాడతారు. ►ఈ ఇంజక్షన్‌ను రోగికి ఇవ్వడం ద్వారా అతడి నరాలు పూర్తిస్థాయిలో తెరుచుకునేలా చేయవచ్చు. దీంతో రక్త ప్రసరణ సక్రమంగా జరిగి ముప్పు తప్పే ఆస్కారం ఉంటుంది. అయితే కాలక్రమంగా ఈ ఇంజక్షన్‌ను అథ్లెట్స్ స్టెరాయిడ్‌గా వాడటం మొదలెట్టారు. ►నగరంలో జిమ్‌లకు వెళ్తున్న యువత నిర్ణీత బరువు కంటే ఎక్కువ వెయిట్స్ ఎత్తడానికి, ఎక్కువ సమయం వ్యాయామం చేయడానికి స్టెరాయిడ్‌గా మెఫన్‌టెర్మైన్ సల్ఫేట్ ఇంజక్షన్ వాడుతున్నారు. నిబంధనల ప్రకారం వైద్యుడి ప్రిస్కిప్షన్ లేనిదే ఈ ఇంజక్షన్ విక్రయించేందుకు వీలులేదు. ►కొందరు అక్రమార్కులు వీటిని జిమ్‌లకు వెళ్లే యువతకు అక్రమంగా, ఎక్కువ రేటుకు విక్రయిస్తున్నారు. ఈ విషయం గుర్తించిన ఫహద్ చాదర్‌ఘాట్‌కు చెందిన షేక్ అబ్దుల్ ఓవైసీతో జట్టు కట్టాడు. వీరిద్దరూ ఢిల్లీకి చెందిన అక్షయ్ ఎంటర్ప్రైజెస్ అనే మెడికల్ ఏజెన్సీ నిర్వాహకుడు విక్రమ్ సాయంతో ఈ ఇంజక్షన్లు ఖరీదు చేస్తున్నారు. ►అక్కడి నుంచి కొరియర్లో సిటీకి తెప్పించి జిమ్‌లకు వెళ్లే యువతకు విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర నేతృత్వంలో ఎస్సైలు ఎన్.శ్రీశైలం, వి.నరేందర్, మహ్మద్ థక్రుద్దీన్లతో దాడి చేసి ఇద్దరు నిందితుల్ని పట్టుకున్నారు. ►150 ఇంజక్షన్లను వారి దగ్గర నుంచి స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం చాదర్‌ఘాట్ పోలీసులకు అప్పగించారు. మెఫన్‌టెర్మైన్ సల్ఫేట్ ఇంజక్షన్ స్టెరాయిడ్‌గా వాడటం వల్ల అనేక దుష్ఫరిణామాలు ఉంటా యని పోలీసులు హెచ్చరిస్తున్నారు. -
ప్రభుత్వాసుపత్రులకు కోటి ‘స్టెరాయిడ్స్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు కోటి డెక్సామితాజోన్ స్టెరాయిడ్ ఔషధాలను పంపించాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. అందులో ఇప్పటికే 40 లక్షల మాత్రలు, 6 లక్షల ఇంజెక్షన్ డోస్‌లను పంపించింది. కరోనా వచ్చిన రోగులు త్వరగా కోలుకునేందుకు ఈ స్టెరాయిడ్లను ఇవ్వాలని సర్కారు నిర్ణయించిన నేపథ్యంలో వీటిని ఆగమేఘాల మీద తెప్పించారు. ఏ జిల్లాకు ఆ జిల్లాలోనే కరోనా వైద్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) స్థాయి నుంచి సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ), ఏరియా ఆసుపత్రి, జిల్లా ఆసుపత్రి, ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ బోధనాసుపత్రులకు మందులను సరఫరా చేస్తున్నారు. ఇక మూడు కోట్ల డోలో పారాసిటమాల్ మాత్రలను అందుబాటులో ఉంచారు. 70 లక్షల హైడ్రాక్సిక్లోరోక్విన్ మాత్రలను కూడా పంపించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. అలాగే 2.5 లక్షల ఫ్యాబీఫ్లూ మాత్రలను కూడా పంపించారు. ఇక అత్యంత కీలకమైన రెమిడెసివిర్ ఔషధాలను 6 వేలు పంపించారు. సీరియస్ రోగులకు అత్యవసర పరిస్థితుల్లో వీటిని ప్రస్తుతం ఉపయోగిస్తున్న నేపథ్యంలో ఈ ఔషధాలకు డిమాండ్ ఏర్పడింది. దేశవ్యాప్తంగా డిమాండ్ ఏర్పడటంతో వీటిని అవసరం మేరకు అందుబాటులో ఉంచుతున్నారు. అవసరమైనప్పుడల్లా వీటికి ఇండెంట్ పెట్టి తెప్పించాలని భావిస్తున్నారు. పీహెచ్‌సీలకూ ఆక్సిజన్ సిలిండర్లు ఇప్పటివరకు హైదరాబాద్ కేంద్రంగా కరోనా వైద్య సేవలు అందేవి. ఇప్పుడు జిల్లా కేంద్రంగా పీహెచ్సీ స్థాయి వరకు తీసుకెళ్లడం ద్వారా గ్రామీణ ప్రజల చెంతకే సేవలు అందజేయనున్నారు. కరోనా సామాజిక వ్యాప్తి నేపథ్యంలో సర్కారు ఇలా వికేంద్రీకరణ వ్యూహాన్ని అనుసరిస్తోంది. గ్రామాల్లోకి కూడా వైరస్ ప్రవేశించడంతో తగిన ప్రణాళిక రచించింది. అందుకే పీహెచ్సీ స్థాయి ఆసుపత్రులకు కూడా కరోనా బాధితులకు అవసరాన్ని బట్టి వాడే 51 రకాల మందులను సరఫరా చేస్తారు. యాంటీబయాటిక్స్ సహా విటమిన్ మందులనూ అందుబాటులో ఉంచుతారు. ప్రస్తుతం కొన్ని కరోనా కేసులు సీరియస్ అయి ఆక్సిజన్ అత్యవసరమైన స్థాయికి వెళుతున్నాయి. కాబట్టి గ్రామాలకు అత్యంత సమీపంలో ఉండే పీహెచ్‌సీలకూ మినీ ఆక్సిజన్ సిలిండర్లను పంపించనున్నారు. అవసరమైన రోగులకు ఆక్సిజన్ సపోర్టు అందించిన తర్వాత తక్షణమే అటువంటి రోగులను అంబులెన్స్‌లో సమీపంలోని సీహెచ్‌సీ లేదా ఏరియా ఆసుపత్రికి తరలించేలా రంగం సిద్ధం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నాన్ ఐసీయూ బెడ్స్‌కు కూడా ఆక్సిజన్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 9,700 పడకలకు ఇలా ఆక్సిజన్ వ్యవస్థను ఏర్పాటు చేసే పని దాదాపు పూర్తి కావొచ్చిందని అధికారులు తెలిపారు. -
కండలపై ఇష్టం... కిడ్నీకి కష్టం!
సలీం (పేరు మార్చాం) 24 ఏళ్ల ఈ యువకుడు హైదరాబాద్‌లోని ఒక జిమ్‌లో కోచ్‌గా పనిచేస్తున్నాడు. అథ్లెటిక్ లుక్ కోసం అతను నోటి నుంచి తీసుకునే సహజ సిద్ధమైన ఆహారాన్ని పూర్తిగా మానేశాడు. గ్రోత్ హార్మోన్ ఇంజెక్షన్లు, మల్టీ విటమిన్లు కలిగిన అధిక ప్రోటీన్ తీసుకున్నాడు. మూడు నెలలు గడిచాక అతను పూర్తిగా నీరసించిపోయాడు. పరీక్షలు చేయించగా, కిడ్నీలు ఫెయిల్ అయినట్లు నిర్ధారించారు. శ్రీనివాస్... ఇతనో సాఫ్ట్వేర్ ఇంజనీర్... వయస్సు 50 ఏళ్లు. బరువు తగ్గడం, కండరాలు పెంచడం కోసం ఇతను విచక్షణారహితంగా స్టెరాయిడ్స్ సప్లిమెంట్లు వాడాడు. రెండు నెలల తర్వాత అతను బరువు తగ్గినా, కిడ్నీలు దెబ్బతిన్నట్లు డాక్టర్లు గుర్తించారు. సాక్షి, హైదరాబాద్: సిక్స్ ప్యాక్, బాడీ బిల్డింగ్, బరువు తగ్గడం... ఇలాంటి లక్ష్యాలతో అనేకమంది యువకులు జిమ్‌లలో చేరుతుంటారు. లక్ష్యం మంచిదే, వాటికోసం ఎక్కువ నెలల సమయం తీసుకోవాలి. కానీ రాత్రికి రాత్రే సిక్స్ ప్యాక్ సాధించాలని, కండలు పెంచాలని, కేజీల కొద్దీ బరువు తగ్గాలని కోరుకుంటున్నారు. దీనికోసం జిమ్‌లలో వ్యాయామాలు చేస్తూ, వైద్యులను సంప్రదించకుండానే ఇష్టారాజ్యంగా స్టెరాయిడ్స్ వాడడం, ప్రొటీన్ సప్లిమెంట్లు తీసుకోవడంతో రోగులుగా మారుతున్నారు. కొందరైతే కిడ్నీలు ఫెయిలై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కొన్ని జిమ్ సెంటర్లు స్వల్ప సమయంలోనే బరువు తగ్గిస్తామని ప్రకటనలు గుప్పిస్తున్నాయి. మూడు నాలుగు నెలల్లో సిక్స్ ప్యాక్ సాధించేలా శిక్షణ ఇస్తామని చెబుతున్నాయి. దీనికోసం కొన్ని జిమ్ సెంటర్లు ప్రోటీన్ పౌడర్లను, స్టెరాయిడ్స్‌ను అనధికారికంగా అలవాటు చేస్తున్నాయి. 10 మందిలో ఒకరు స్టెరాయిడ్స్ వినియోగం రాష్ట్రంలో జిమ్‌లకు వెళుతున్న ప్రతీ పది మంది లో ఒకరు స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్లు, ప్రొటీన్లు వాడుతున్నారని నెఫ్రాలజిస్టులు అంచనా వేస్తున్నారు. ఇక వెయిట్ లిఫ్టర్లు, బాడీ బిల్డర్లలో 40 శాతం మంది వీటిని విచ్చలవిడిగా వాడుతున్నారని తేలింది. సహజ సిద్ధంగా చికెన్, మటన్, గుడ్లు వంటి వాటి ద్వారా ప్రొటీన్లు పొందవచ్చు. కానీ చాలామంది అలా చేయడం లేదు. తక్కువ సమయంలో శరీర సౌష్టవాన్ని సాధించాలన్న దురాశతో మోతాదుకు మించి ప్రొటీన్ పౌడర్లు, స్టెరాయిడ్లు వంటి వాటిని వాడుతుండటం వల్లే సమస్యలు వస్తున్నాయి. అంతేకాదు ఎక్కువసేపు జిమ్‌లో గడిపి శక్తికి మించి బరువులెత్తడం, ఆ తర్వాత ఒళ్లు నొప్పులంటూ పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల కిడ్నీపై ప్రభావం చూపిస్తుందని వైద్యులు అంటున్నారు. అనాబాలిక్–ఆండ్రోజెనిక్ స్టెరాయిడ్స్‌ను తరచుగా బాడీబిల్డర్లు, వెయిట్‌లిఫ్టర్లు ఆహార పదార్ధాలుగా ఉపయోగిస్తున్నారని ‘బీఎంసీ నెఫ్రాలజీ’అనే బ్రిటిష్ జర్నల్ తాజాగా ప్రచురించింది. హైదరాబాద్‌లోని జాతీయ పౌష్టికాహార సంస్థ (ఎన్ఐఎన్) లెక్కల ప్రకారం ప్రతి మనిషి రోజుకు 2,400 కేలరీల ఆహారం తీసుకోవాలి. జిమ్‌లకు వెళ్లే వారు ప్రొటీన్ పౌడర్ల ద్వారా రోజుకు 80 నుంచి 100 గ్రాములకు మించి ప్రోటీన్లు తీసుకుంటున్నారు. ఫలితంగా కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయని ఎన్ఐఎన్ వర్గాలు చెబుతున్నాయి. అత్యాశ వల్లే సమస్యలు సిక్స్ ప్యాక్, బాడీ బిల్డింగ్ కోసం అనేక మంది యువకులు జిమ్‌లకు వెళుతున్నారు. వాటిని సాధించాలంటే రెండు మూడేళ్ల సమయం తీసుకోవాలి. క్రమశిక్షణతో ఒక ప్రణాళిక ప్రకారం చేయాలి. కానీ మూడు నెలల్లోనే సాధించాలన్న భావనతో అనేక మంది యువకులు ప్రాణాల మీదకు తెచ్చు కుంటున్నారు. స్టెరాయిడ్స్, ప్రొటీన్లు, పెయిన్ కిల్లర్స్‌ను మోతాదుకు మించి అవగాహనా రాహిత్యంతో వాడుతున్నారు. సాధారణంగా ప్రోటీన్లు చికెన్, మటన్ ద్వారా పొందవచ్చు. కానీ అవసరానికిమించి ప్రొటీన్ పౌడర్లు వా డుతుండటంతో కిడ్నీలపై భారం పడుతుంది. – డాక్టర్ టి.గంగాధర్, నెఫ్రాలజిస్టు, నిమ్స్ న్యూట్రా విజిలెన్స్ లేనేలేదు మార్కెట్లోకి ప్రొటీన్ ప్రొడక్టులు విపరీతంగా వస్తున్నాయి. స్పోర్ట్స్, బాడీ బిల్డింగ్ ఇలా అవసరానికి తగ్గట్లు ఉత్పత్తులు వస్తున్నాయి. వాటిమీద నియంత్రణ లేనేలేదు. పైగా క్లినికల్ టెస్టెడ్ అంటూ వాటిపై ముద్రించుకుంటున్నాయి. అంతేకాదు ఎన్ఐఎన్ రికమండెడ్ అని కూడా కొన్ని వస్తున్నాయి. ఎన్ఐఎన్ ఏ సంస్థకూ రికమండ్ చేయలేదనే విషయం స్పష్టం చేస్తున్నాను. వీటిని వాడడం వల్ల కిడ్నీలు పాడవుతున్నాయి. ప్రోటీన్ ఉత్పత్తులను నియంత్రించేందుకు ‘న్యూట్రా విజిలెన్స్’ అవసరముంది. – డాక్టర్ బి.దినేశ్‌కుమార్, శాస్త్రవేత్త, ఎన్ఐఎన్, హైదరాబాద్