మంచి కండలు తిరిగే బాడీ కావాలని ఎవరికి ఉండుదు. యువకులు దీని గురించి జిమ్ సెంటర్‌లలో గంటల తరబడి నానా హైరానా పడుతుంటారు. కండలు తిరిగిన దేహదారుఢ్యం రావాలంటే టైం పడుతుంది. అందులో ఎలాంటి డౌంట్ లేదు. కానీ కొందరూ ఎలాంటి కష్టం లేకుండా ఈజీగా కండల వంటి దేహం కోసం పక్కదారుల్లో ప్రయాణిస్తారు. అందుకోసం స్టెరాయిడ్స్‌ను వాడతారు. ముందు బాగానే ఉన్నా రానురాను దాని దుష్పరిణామాలు ఒక్కొక్కటిగా బయటపడుతుంటాయి. సినితారలు దగ్గర నుంచి కాలేజ్ కుర్రాళ్ల వరకు కండలు తిరిగే దేహం కోసం స్టెరాయిడ్‌లు వాడి లేనిపోని అనారోగ్య సమస్యల బారిన పడిన ఉదంతాలు కోకొల్లలు. ఈ స్టెరాయిడ్స్ వల్ల కలిగే దుష్పరిణామాల గురించే ఈ కథనం.
బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్ సైతం తాను కూడా ఈ స్టెరాయిడ్‌లు వాడానని, ఏమాత్రం సంకోచించకుండా చెప్పడమే కాకుండా వాడొద్దని హెచ్చరిస్తున్నాడు. తాను 'జానే తు యా జానే' సినిమాలోని ఫోటోలను నెట్టింట షేర్ చేస్తూ దీని గురించి వివరించాడు. తాను సన్నగా ఉండటంతో అందరూ ఎగతాళి చేసేవారని, బాడీ బిల్డర్‌లాగా దేహాన్ని తయారుచేయమని ఒత్తిడి చేసేవారేని చెప్పుకొచ్చాడు. కానీ తాను ఎంత తిన్న.. సన్నగా కనబడే బాడీ తత్వం కారణంగా లావు అవ్వడం కష్టంగా ఉండేది.
మొదట్లో ఎస్ సైజు దుస్తులే తనకు చాలా లూజ్‌గా ఉండేవని చెప్పుకొచ్చాడు. అంతేగాదు తన తొలి సినిమా జానే తులో సన్నగా కనిపంచకుండా ఉండటం కోసం రెండు షర్ట్‌లు వేసుకుని నటించినట్లు తెలిపాడు ఆ తర్వాత బాడీ పెంచడం కోసం స్టెరాయిడ్‌లు వాడి తన దుస్తుల సైజుని పెంచానని నిర్మొహమాటంగా చెప్పాడు. దీని వల్ల తాను చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తాను వాడటం లేదని, కేవలం సహజసిద్ధమైన వాల్‌నట్స్, పసుపు వంటి వాటినే తీసుకుంటున్నట్లు ఇమ్రాన్ ఖాన్ తెలిపాడు.
స్టెరాయిడ్స్ అంటే..
అనాబాలిక్ ఆండ్రోజెనిక్ స్టెరాయిడ్లు(ఏఏఎస్) లేదా కండరాలను పెంచడానికి ఉపయోగించే టెస్టోస్టెరాన్ సింథటిక్ రూపం. నిపుణుల అభిప్రాయం ప్రకారం..స్టెరాయిడ్స్ శరీరంలోని కండరాలు, వెంట్రుకలు, కుదుళ్లు, ఎముకలు, కాలేయం,మూత్రపిండాలు వంటి వివిధ భాగాలను ప్రభావితం చేస్తాయి. మగవాళ్లలో ఉండే హార్మోన్ అయినా ఇది మహిళల్లో కూడా 15-70 ఎన్‌జీ/డీఎల్ వరకు ఉంటాయి. స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల శరీరంలో హార్మోన్ల స్థాయి ఒక్కసారిగా పెరుగుతుంది.
ఎదురయ్యే దుష్పరిణామాలు..
- వ్యాయమం చేయక్కర్లే కుండా మంచి దేహ సౌష్టవం రావడం కోసం వాడినప్పడు ఇది శరీరంలో రక్తపోటు తోపాటు గుండె ఎడమ జఠరిక పరిమాణాన్ని పెంచుతుంది. ఫలితంగా గుండె జబ్బులు బారిన పడి ఆకస్మిక మరణాల సంభవించే అవకాశం ఉంది.
- ఇది దూకుడుగా ప్రవర్తించేలా లేదా ఉద్రేకతను పెంచుతుంది.
- కాలేయానికి హాని కలిగించొచ్చు
- నిరంతరంగా ఉపయోగించడం వల్ల హైపోగోనాడిజమ్‌కు కారణమవుతుంది. వృషణాల పనితీరు తగ్గిపోయాల చేసి చివరకు వంధ్యత్వానికి దారితీస్తుంది.
- ఇది నెమ్మదిగా స్పెర్మ్ కౌంట్‌ని తగ్గించేస్తుంది. ఫలితంగా పిల్లలను కనే సామర్థ్యం తగ్గిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment