ఇటీవల కాలంలో ఆరోగ్య స్ప్రుహ బాగా ఎక్కువయ్యంది. అందులో భాగంగా పాల ఉత్పత్తులకు సంబంధించిన కాఫీ, టీలను దూరంగ ఉంచుతున్నారు. మంచి ఫిట్‌నెస్ కోసం అని గ్రీన్ టీ, లెమన్ టీ వంటి వాటిని తెగ సేవించేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కాని ఇలా మోతాదుకి మించి గ్రీన్ టీ తాగితే ఆరోగ్యానికి చాలా ప్రమాదని నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. అదేంటీ గ్రీన్‌టీ చెడు కొలస్ట్రాల్‌ని కరిగించేస్తుంది కదా! మరీ ఇదేంటి అని సందేహిస్తున్నారా?. ఐతే ఇలా ఎందుకన్నారో సవివరంగా తెలుసుకోండి.!
ఎదురయ్యే దుష్పలితాలు..
- గ్రీన్ టీలో ఉండే కెఫిన్ కారణంగా, అధికంగా తాగడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ వచ్చే అవకాశం ఉంది.
- అలాగే దీనిలో టానిన్లు ఎక్కువగా ఉంటాయి, అవి వాంతులు, వికారాన్ని కలిగించవచ్చు. ఫలితంగా కడుపులో మంట, గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
- ఎక్కువగా గ్రీన్ టీ తాగడం వల్ల నిద్ర దినచర్యకు అంతరాయం ఏర్పడి అది నిద్రలేమి, మైగ్రేన్ వంటి సమస్యలకు దారితీయొచ్చు.
- గ్రీన్ టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది.
- గ్రీన్ టీలో ఉండే కెఫిన్ మైగ్రేన్ నొప్పికి కారణమవుతుంది.
- గ్రీన్ టీని ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతినే అవకాశాలు కూడా పెరుగుతాయి.
- మితిమీరిన గ్రీన్ టీ మీ జీర్ణవ్యవస్థను పాడు చేస్తుంది.
- ఎక్కువగా గ్రీన్ టీ తాగడం వల్ల మీ రక్తపోటు కూడా తగ్గిపోతుంది
- రోజూ 6 కప్పుల గ్రీన్ టీ తీసుకోవడం వల్ల శరీరంలో రక్తం తగ్గిపోతుంది.
- ఇది కడుపులో ఎసిడిటీ సమస్యను పెంచి కడుపులో మంట, గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు దారితీస్తుంది.
గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసమే. అనుసరించే ముందు వీ వ్యక్తిగత వైద్యులను సంప్రదించి పాటించటం ఉత్తమం.
Comments
Please login to add a commentAdd a comment