green tea
-
గ్రీన్ కాఫీని తయారు చేసిన విద్యార్థులు!ఐతే టేస్ట్‌లో..
గ్రీన్‌టీ ఆరోగ్యానికి ఎంతో మంచిదని విన్నాం. పైగా దీన్ని తాగడం వల్ల బరువు అదుపులో ఉంటుంది, ఎన్నో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు కూడా. ఐతే గ్రీన్ టీ ఉన్నట్లే..గ్రీన్ కాఫీ కూడా ఉందని విన్నారా..?. కాఫీ అంటే ఇష్టపడని వాళ్లు ఉండరు. అందుకని టీ ఉన్నట్లే కాఫ్లీ కూడా ఉంటే బాగుండనన్న ఆ ఆలోచనకు రూపం ఇచ్చారు ఈ కేరళ విద్యార్థులు. అలానే గ్రీన్ టీ మాదిరిగానే ఈ గ్రీన్ కాఫీ కూడా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాల అందించేదిగా ఉండాలని భావించారు. అందుకోసం వాళ్లు ఏం చేశారు. ఎలాంటి ప్రయోగాలు చేశారు? విజయవంతమయ్యారా తదితరాల గురించి చూద్దాం.!లారస్ ఇన్స్టిట్యూట్ ఫర్ లాజిస్టిక్స్‌కు చెందిన పది మంది సభ్యుల విద్యార్థి బృందం ఈ గ్రీన్ కాఫీని తయారు చేసే ప్రయోగాలకు నాంది పలికారు. వాళ్లు మంచి ఆరోగ్యకరమైన కాఫీని తయారు చేయడం, ఉత్పత్తులు మంచిగా కొనగోలు అయ్యేలా ప్యాకింగ్ వంటి వాటిపై దృష్టి సారించారు. ముఖ్యంగా ఇలాంటి కొత్త ప్రయోగాల్లో కంపెనీలు తమవంత సహాయ సహకారాలు అందిస్తుంది. అలానే కలమ్‌సేరి ఆధారిత ప్రైవేటు కంపెనీ ఒకటి ఈ బృందానికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ఇక ఈ బృందం ఇన్స్టిట్యూట్ ఛైర్మన్ డాక్టర్ అజయ్ శంకర్ సలహాలు, సూచనలతో మంచి గ్రీన్ కాఫీని తయారు చేశారు. అయితే రుచి మాత్రం తాగేలా టేస్టీగా లేదు. ప్రజలు ఆసక్తిచూపి తాగే విధంగా అస్సలు లేదు. దీంతో విద్యార్థుల బృందం తీవ్ర ఆందోళనకు లోనయ్యింది. అయితే దీనికి రోజ్ ఫ్లేవర్, యాలకులు వంటి సుగంధ ద్రవ్యాలు జోడించి చూశారు. అవి జోడిస్తే ప్రొడక్ట్ నిల్వ ఉండే వ్యవధి కాలం తగ్గిపోవడంతో ఇక ఆ ప్రయత్నం మానేశారు. దీంతో ఈ అరబికా కాఫీ గింజలను చిన్న చిన్న ఉండలుగా చేసి ప్యాక్ చేయాలని నిర్ణయించారు. తీరా మార్కెట్లోకి రిలీజ్ చేశాక పూర్తిగా నష్టాల ఎదురయ్యాయి. దీంతో ప్రతి కస్టమర్‌కి గ్రీన్ కాఫీ వల్ల కలిగే ప్రయోజనాల వివరించి అమ్మడం ప్రారంభించారు. కొద్ది రోజుల్లో వారిలో కూడా ఈ ప్రోడక్ట్‌పై నమ్మకం ఏర్పడి కొనుగోలు చేసేందుకు ఆసక్తికనబర్చారు.ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..గ్రీన్ కాఫీ గింజలు బరువు తగ్గడంలో సహాయపడతాయి. క్లోరోజెనిక్ యాసిడ్ ఉండటం వల్ల కొవ్వును బర్న్ చేయడంలో సహాయపడుతుంది. గ్రీన్ కాఫీని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల జీవక్రియ వేగవంతం అవుతుంది. అందువలన, ఇది బరువు తగ్గడానికి, ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది.గ్రీన్ కాఫీ గింజల్లో క్లోరోజెనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, గ్రీన్ కాఫీ వంటి ఆరోగ్యకరమైన పానీయాలు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను చాలా వరకు బ్యాలెన్స్ చేయవచ్చు.గ్రీన్ కాఫీ అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది రక్త నాళాలను విస్తరిస్తుంది. రక్తపోటును పెంచే కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ స్థాయిని తగ్గిస్తుంది. రోజూ గ్రీన్ కాఫీ తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.గ్రీన్ కాఫీ గింజలలో అవసరమైన పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని ఎదుర్కోవడంలో సహాయపడతాయి. ఫ్రీ రాడికల్స్ క్యాన్సర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. అధ్యయనాల ప్రకారం, గ్రీన్ కాఫీ గింజలలోని క్లోరోజెనిక్ యాసిడ్ ట్యూమర్ సెల్స్ ఏర్పడకుండా.. క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుంది.గ్రీన్ కాఫీ గింజలు సహజమైన డిటాక్సిఫైయర్‌గా పనిచేస్తాయి. ఇవి శరీరం నుంచి టాక్సిన్స్, అదనపు కొవ్వు, కొలెస్ట్రాల్‌ను బయటకు పంపడంలో సహాయపడతాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.(చదవండి: ఆ బామ్మ అమ్మే ఇడ్లీల ధర తెలిస్తే షాకవ్వుతారు! ఈ వయసులో..) -
బ్యూటిప్స్: వేసవిలో జుట్టు సమస్యా? అయితే ఇలా చేయండి!
వేసవిలో ఉడకపోతతో ఇబ్బంది పడుతూంటాం. చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఎదురవుతుంటాయి. ప్రధానంగా ఈ మండుటెండల్లో జుట్టు రాలిపోయే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అందువల్ల కొన్ని చిన్న చిట్కాలను పాటించడం ద్వారా దానిని అరికట్టవచ్చు. గ్రీన్ టీ.. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న గ్రీన్ టీ జుట్టు పెరుగుదలను, బలాన్ని పెంచుతుంది. 2–3 గ్రీన్ టీ బ్యాగ్‌లను వేడి నీటిలో నానబెట్టండి. చల్లారిన తర్వాత, మీ జుట్టు, తలపై మసాజ్ చేయాలి. ఒక గంట పాటు అలాగే ఉంచి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. మెంతి గింజల పేస్ట్ మెంతులను రాత్రంతా నానబెట్టి, ఆపై వాటిని పేస్ట్‌గా రుబ్బుకోవాలి. ఈ గ్రోత్–బూస్టింగ్ మాస్క్‌ని మీ జుట్టుకు అప్లై చేసి 30–40 నిమిషాల పాటు అలాగే ఉంచండి. తరువాత, చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇవి చదవండి: Aarzoo Khurana: ఆమె ఉన్న చోట పులి ఉంటుంది -
గ్రీన్ టీ మంచిదని తాగేస్తున్నారా?
ఇటీవల కాలంలో ఆరోగ్య స్ప్రుహ బాగా ఎక్కువయ్యంది. అందులో భాగంగా పాల ఉత్పత్తులకు సంబంధించిన కాఫీ, టీలను దూరంగ ఉంచుతున్నారు. మంచి ఫిట్నెస్ కోసం అని గ్రీన్ టీ, లెమన్ టీ వంటి వాటిని తెగ సేవించేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కాని ఇలా మోతాదుకి మించి గ్రీన్ టీ తాగితే ఆరోగ్యానికి చాలా ప్రమాదని నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. అదేంటీ గ్రీన్‌టీ చెడు కొలస్ట్రాల్‌ని కరిగించేస్తుంది కదా! మరీ ఇదేంటి అని సందేహిస్తున్నారా?. ఐతే ఇలా ఎందుకన్నారో సవివరంగా తెలుసుకోండి.! ఎదురయ్యే దుష్పలితాలు.. గ్రీన్ టీలో ఉండే కెఫిన్ కారణంగా, అధికంగా తాగడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ వచ్చే అవకాశం ఉంది. అలాగే దీనిలో టానిన్లు ఎక్కువగా ఉంటాయి, అవి వాంతులు, వికారాన్ని కలిగించవచ్చు. ఫలితంగా కడుపులో మంట, గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా గ్రీన్ టీ తాగడం వల్ల నిద్ర దినచర్యకు అంతరాయం ఏర్పడి అది నిద్రలేమి, మైగ్రేన్ వంటి సమస్యలకు దారితీయొచ్చు. గ్రీన్ టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. గ్రీన్ టీలో ఉండే కెఫిన్ మైగ్రేన్ నొప్పికి కారణమవుతుంది. గ్రీన్ టీని ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతినే అవకాశాలు కూడా పెరుగుతాయి. మితిమీరిన గ్రీన్ టీ మీ జీర్ణవ్యవస్థను పాడు చేస్తుంది. ఎక్కువగా గ్రీన్ టీ తాగడం వల్ల మీ రక్తపోటు కూడా తగ్గిపోతుంది రోజూ 6 కప్పుల గ్రీన్ టీ తీసుకోవడం వల్ల శరీరంలో రక్తం తగ్గిపోతుంది. ఇది కడుపులో ఎసిడిటీ సమస్యను పెంచి కడుపులో మంట, గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు దారితీస్తుంది. గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసమే. అనుసరించే ముందు వీ వ్యక్తిగత వైద్యులను సంప్రదించి పాటించటం ఉత్తమం. (చదవండి: ప్రపంచంలోనే అత్యుత్తమ బియ్యంగా బాస్మతి రైస్!) -
బీపీని పెంచే అవకాశం.. గ్రీన్ టీ తాగేవాళ్లు ఈ విషయాలు తెలుసుకోండి
బరువు తగ్గాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలనుకునే వారు చాలామంది తమ ఆహారంలో భాగంగా గ్రీన్ టీ తీసుకుంటారు. ఎందుకంటే ఇది మన శరీరానికి చాలా ప్రయోజనాలను అందిస్తుంది. అయితే రోగ్యానికి మంచిదని అధికంగా తీసుకోవడం వల్ల మన శరీరంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ►గ్రీన్ టీ ఎక్కువగా తాగడం వల్ల కొందరిలో కాలేయ సమస్యలు వస్తాయని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. గ్రీన్ టీ తీసుకునేటప్పుడు గర్భిణులు, పాలిచ్చే తల్లులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ► పరిశోధనల ప్రకారం, గ్రీన్ టీలో కూడా కొద్ది మోతాదులో కెఫిన్ ఉంటుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి.ఒకవేళ తీసుకోవాల్సి వస్తే, రోజుకు 200 మిల్లీగ్రాములకు మించి కెఫిన్ తీసుకోకూడదని పరిశోధనలు సూచిస్తున్నాయి. ► గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ దండిగానే ఉంటుంది. ఒకరకంగా ఇది హెల్తీ డ్రింక్ అయినప్పటికీ, గర్భధారణ సమయంలో ఎక్కువ మొత్తంలో గ్రీన్ టీ తీసుకోకూడదని అరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ► గర్భం దాల్చిన మొదటి మూడు నెలల్లో గ్రీన్ టీకి దూరంగా ఉండటం మంచిది. మూడవ త్రైమాసికంలో గ్రీన్ టీని తీసుకోవచ్చు. మరోవైపు కాఫీని అస్సలు తీసుకోకూడదు, ఇందులో కెఫీన్ ఎక్కువగా ఉంటుంది. ► గర్భిణీ స్త్రీలు గ్రీన్ టీకి దూరంగా ఉంటే మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. లేకుంటే ఇది పాల స్రావాన్ని తగ్గిస్తుంది. కాలేయ వ్యాధులు ఉన్నవారు గ్రీన్ టీ తీసుకోకపోవడమే మంచిది. గ్రీన్ టీ తాగేవారికి ఇతర మందులతో రియాక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. ► అందువల్ల మీరు ఇప్పటికే ఏవైనా ఇతర మందులు వాడుతున్నట్లయితే ఒకసారి వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే మీరు దీన్ని మీ ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది. గ్రీన్ టీ అధికంగా తీసుకోవటం వల్ల తలనొప్పి రావచ్చు. ఇది రక్తపోటును అమాంతం తగ్గించే అవకాశం ఉంది. ఇది అశాంతిని కలిగిస్తుంది. ► నిద్రలేమికి కారణం అవుతుంది. జీర్ణవ్యవస్థకు చికాకు కలిగిస్తుంది. భయాన్ని, ఆందోళనను కలిగిస్తుంది.గ్రీన్ టీ తీసుకున్న తర్వాత ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ గమనించినట్టయితే... మీరు వెంటనే మీ వైద్యుడిని సంప్రదించాలి. -
హీరోయిన్ త్రిష అందం వెనకున్న సీక్రెట్స్ తెలుసా?
ప్రముఖ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి రెండు దశాబ్దాలు అయినా ఇప్పటికీ స్టార్ హీరోయన్‌గా తన ఛరిష్మాను కంటిన్యూ చేస్తోంది. కోలీవుడ్‌లోనే కాకుండా తెలుగులోనూ త్రిషకు అదిరిపోయే ఫాలోయింగ్ ఉంది.16 సంవత్సరాల వయస్సులో మిస్ మద్రాస్ టైటిల్ ను గెలుచుకున్న త్రిష తరుణ్ హీరోగా తెరకెక్కిన ‘నీ మనసు నాకు తెలుసు’ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయ్యింది. వర్షం సినిమాతో స్టార్‌డమ్‌ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ ‘అతడు’ ‘స్టాలిన్’ వంటి చిత్రాలతో వరుస హిట్స్‌ని ఖాతాలో వేసుకుంది. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరించిన త్రిష కెరీర్ మధ్యలో కాస్త డల్ అయిన త్రిష మళ్లీ ఈ మధ్యనే ‘పొన్నియన్ సెల్వన్' చిత్రంతో యువరాణి కుందవై పాత్రలో నటించి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది. ముఖ్యంగా ఐశ్వర్యరాయ్ కంటే త్రిషకే ఎక్కువ పేరు వచ్చింది. నాలుగు పదుల వయసులోనూ ఇరవైఏళ్ల అమ్మాయిలా కనిపిస్తుందంటూ త్రిష అందానికి సెలబ్రిటీలు కూడా ఆశ్చర్యపోయారు. మరి ఇంత అందంగా కనిపించడానికి త్రిష ఏం చేస్తుంది అని అడిగితే ఆమె ఏం చెప్పిందంటే.. ''గ్రీన్ టీ.. లేదా గ్లాసుడు గోరు వెచ్చని నీటిలో కాసిన్ని నిమ్మ చుక్కలతో నా ‘డే’ మొదలవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది మిస్ అవను. నా మెన్యూలో జంక్ ఫుడ్‌కి చోటు లేదు. కంటి నిండా నిద్ర కరువయ్యే చాన్స్ లేదు. మొత్తమ్మీద డిసిప్లిన్ లైఫ్ స్టయిలే నా బ్యూటీ సీక్రెట్''! అంటూ పేర్కొంది. -
ఆఫీస్‌లో పని ఒత్తిడా..? అయితే ఇలా చేయండి
ఆఫీసుల్లో పని భారం ఎక్కువైనప్పుడు ఒత్తిడికి గురవడం సహజమే. అయితే ఇది ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. అందుకే దీన్ని తొందరగా తగ్గించుకోవాలి. కొన్ని సాధారణమైన చిట్కాలను పాటిస్తే ఒత్తిడి నుంచి తక్షణమే ఉపశమనం లభిస్తుంది. ప్రస్తుత కాలంలో చాలా మంది మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఆఫీస్ పనులకు వ్యక్తిగతమైన పనులు కూడా తోడు కావడంతో ఒక్కోసారి ఊపిరి సలపనంత పనులతో అవిశ్రాంతంగా పని చేయవలసి వస్తుంది. దీనివల్ల విపరీతమైన ఒత్తిడికి గురవుతుంటారు. ఇది మన శరీరంపై కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఫలితంగా పనులను అస్సలు పూర్తిచేయలేము సరికదా.. ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఈ ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేటందుకు కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే సరి. అవేమిటో తెలుసుకుందాం. గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిది. ఇది బరువును తగ్గించడానికి, వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి, ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా మానసిక ఒత్తిడిని కూడా తొలగిస్తుంది. ఆఫీసులో ఏదైనా కారణం వల్ల మీరు ఒత్తిడికి గురైన ప్పుడు వెంటనే కప్పు గ్రీన్ టీని తాగితే మానసిక స్థితి మెరుగుపడి గందర గోళం తొలగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. సంగీతంతో సాంత్వన సంగీతం మనస్సును ప్రశాంతంగా మారుస్తుంది. అంతేకాదు ఇది ఒత్తిడి నుంచి తక్షణమే ఉపశమనం కలిగిస్తుంది. ఒత్తిడిస్థాయులు ఎక్కువైనాయనిపించినప్పుడు వెంటనే మనసుకు నచ్చిన పాటలను వింటే సరి... ఎందుకంటే సంగీతం కోపాన్ని కూడా అదుపు చేస్తుంది. మనసుకు హాయిని కలిగిస్తుంది. దీంతో ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగలిగే శక్తి వస్తుంది. పజిల్ గేమ్స్ ఆఫీసులో పని ఒత్తిడి పెరిగినప్పుడు విసుగ్గా అనిపిస్తుంది. అందులో పని పూర్తికాకపోతే చిరాకుతోపాటుగా ఒత్తిడి కూడా పెరిగిపోతుంది. ఇక కొన్ని కారణాల వల్ల పై అధికారి పదిమందిలోనూ మీపై చిరాకు పడినప్పుడు ఒకవిధమైన మానసిక అస్థిరత ఏర్పడుతుంది. ఇలాంటి క్లిష్ట సమయాల్లోనే చాలా మంది తప్పుడు నిర్ణయాలను తీసుకుంటారు. లేదా మరింత ఎక్కువ ఒత్తిడికి గురవుతారు. ఈ ఒత్తిడి లేని పోని రోగాలకు దారితీస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడటానికి పజిల్ గేమ్స్ మీకు బాగా ఉపయోగపడతాయి. ఒత్తిడిగా అనిపిస్తే కాసేపు ఆటలు ఆడండి. ఒత్తిడి కొన్ని సెకన్లలో పోతుంది. ఇష్టమైన వారితో గడపండి కొందరికి సంగీతం అంటే ఆసక్తి ఉండకపోవచ్చు. పజిల్ గేమ్స్ పూర్తి చేయలేకపోవచ్చు. అయితే ఇష్టమైన వాళ్లు అందరికీ ఉంటారు. అటువంటి వాళ్లతో కొద్దిసేపు నవ్వుతూ సరదాగా గడిపితే సరి... మానసిక ఒత్తిడి మటుమాయం అవుతుంది. చివరగా ఒక విషయం ఏమిటంటే... ఒత్తిడిగా అనిపించినప్పుడు ఆ విషయాన్ని ఎవరితో ఒకరితో పంచుకోవాలి. ఆ భారం తీర్చుకునే మార్గం ఆలోచించాలి. లేదంటే ఒత్తిడి మనల్ని ఒత్తేస్తుంది. చదవండి: Green Peas Akki Roti: బియ్యప్పిండి, పచ్చి బఠాణీలతో.. గ్రీన్ పీస్ అక్కీ రోటీ తయారీ -
Beauty Tips: గ్రీన్ టీ.. బియ్యం పిండి, తేనె.. ముఖం మెరిసిపోయే చిట్కా
ముఖ చర్మం శుభ్రపడి.. నిగారింపు సంతరించుకోవాలంటే ఈ చిట్కాలు ట్రై చేస్తే సరి! గ్రీన్ టీ మాస్క్! ►కప్పు గ్రీన్ టీలో రెండు స్పూన్ల బియ్యం పిండి, అరస్పూను తేనె వేసి బాగా కలిపి ముఖానికి రాసుకోవాలి. ►20 నిమిషాలపాటు ఆరనిచ్చి, తరువాత ఐదు నిమిషాలపాటు ముఖంపైన గుండ్రంగా మర్దనా చేయాలి. ►ఆ తరువాత ముఖం కడుక్కోవాలి. ►వారానికి రెండు సార్లు ఈ మాస్క్ వేసుకుంటే ముఖ నిగారింపు మెరుగుపడుతుంది. లెమన్ మాస్క్! ►శనగపిండి, పసుపు, నిమ్మరసం, పచ్చిపాలను ఒక్కోస్పూను తీసుకుని మెత్తని పేస్టులా కలుపుకోవాలి. ►ఈ పేస్టును ముఖానికి రాసి మర్దనా చేసుకోవాలి. ►20 నిమిషాల తరువాత చల్లటి నీళ్లతో కడగాలి. ►ఇలా చేయడం వల్ల ముఖచర్మం శుభ్రపడి ఆరోగ్యంగా ఉంటుంది. చదవండి: Beauty Tips: బియ్యప్పిండి.. తేనె.. ట్యాన్ తగ్గుముఖం పట్టడం ఖాయం! ఇక పసుపుతో కలిపి పెడితే.. Health Tips: నట్స్, డార్క్ చాక్లెట్స్, అరటి పండ్లు తరచూ తింటున్నారా? డోపమైన్ అనే హార్మోన్ విడుదల చేసి.. -
Health Tips: గ్రీన్ టీ ఎంత మంచిది? నిజంగానే బరువు తగ్గుతారా?
Green Tea Health Benefits: బరువు తగ్గడానికి తీసుకునే ఆహార పానీయాల్లో గ్రీన్ టీ మెరుగ్గా పనిచేస్తుంది. గ్రీన్ టీ ఎంత పాపులర్ అంటే, ‘డైట్’ అనే పదాన్ని ప్రస్తావించినప్పుడు, గ్రీన్ టీ అందులో తప్పకుండా ఉంటుంది’’ అని న్యూట్రిషనిస్టులు, డాక్టర్లు చెబుతున్నారు. కామెల్లియా సినెన్సిస్ మొక్క నుండి తయారైన గ్రీన్ టీకి.. ఆకుపచ్చ రంగు కారణంగా దానికి ఆ పేరు వచ్చింది. యాంటీ ఆక్సిడెంట్ల పవర్‌హౌస్‌గా పేరు తెచ్చుకున్న గ్రీన్ టీ నిజంగా బరువు తగ్గడంలో ఎంతవరకూ సహాయపడుతుందో తెలుసుకుందాం? మధుమేహాన్ని అదుపులో ఉంచే గ్రీన్ టీ! ►గ్రీన్ టీ వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. టైప్ 2 డయాబెటీస్ వచ్చే రిస్క్ తగ్గుతుందని ఈ పరిశోధనల వల్ల తెలుస్తోంది. దంతాల ఆరోగ్యానికి దంతాల ఆరోగ్యానికి గ్రీన్ టీ బాగా పని చేస్తుంది. నోటి దుర్వాసన, దంతక్షయం, వివిధ రకాల చిగుళ్ళ వ్యాధులు కలిగించే బ్యాక్టీరియాని గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ నశింప చేస్తాయి. నోటి కాన్సర్ వచ్చే రిస్క్‌ని కూడా గ్రీన్ టీ తగ్గించగలదని తెలుస్తోంది. బరువు తగ్గడానికి ►బరువు తగ్గడానికి గ్రీన్ టీ పరోక్షంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వేడి లిక్విడ్ తాగడం వలన ఆహారం తీసుకోవాలనే కోరికను తగ్గిస్తుంది. అలా అని గ్రీన్ టీలో తేనెను అతిగా జోడించ కూడదు. ►అలాగే మంచిది కదా అని గ్రీన్ టీని అతిగా తాగడం మంచిది కాదు. ఎందుకంటే దానివల్ల దుష్ప్రభావాలు కలగవచ్చు. చదవండి: Magnesium Deficiency: ఇది లోపిస్తే కిడ్నీలు పాడవుతాయి.. ఇంకా! ఇవి తింటే మేలు! కానీ ఎక్కువైతే.. -
Health Tips: అరిటాకులో తిన్నారంటే.. గ్రీన్ టీ తాగినట్లే..
Health Tips In Telugu: అరిటాకులో భోజనం చేసి ఎన్నాళ్లైంది? ఏమో గుర్తు చేసుకోవడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు. బఫే భోజనాలు వచ్చిన తర్వాత పెళ్లి భోజనం అరిటాకులో వడ్డించడం దాదాపుగా మర్చిపోయారు. అయితే, అరిటాకులో భోజనం చేస్తే కలిగే ప్రయోజనాలు తెలుసుకుంటే మాత్రం కచ్చితంగా ఆ అలవాటును వదులుకోరు. ►గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలను అరిటాకులో భోజనం చేయడంలోనూ పొందవచ్చు. గ్రీన్ టీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు అరిటాకులో కూడా ఉంటాయి. వీటితోపాటు అరిటాకులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ సుగుణాలు అదనంగా ఉంటాయి. ఆహారం క్రిమికీటకాదులతో కలుషితమైతే వాటిని అరిటాకులోని ఈ సుగుణాలు హరించి వేస్తాయి. ►ఒకవేళ భోజనం విషపూరితమై ఉంటే అరిటాకు రంగు మారుతుందని, అందుకే రాజులు బంగారు, వెండి పళ్లేలు లేదా అరిటాకులో భోజనం చేసేవారని చెబుతారు. ప్రాచీన గ్రంథాలే కాదు అరిటాకులో భోజనం చేయడాన్ని ఆధునిక పరిశోధనలు కూడా ఆమోదిస్తున్నాయి. ఇందులోని సుగుణాలు క్యాన్సర్ నివారణిగా పని చేస్తాయని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. అలాగే ఒక చైనా పరిశోధన... పార్కిన్సన్స్ వ్యాధిగ్రస్థులకు అరిటాకు మేలు చేస్తుందని తెలియచేసింది. అరిటాకును అలాగే తినలేరు, కాబట్టి అందులో భోజనం చేయడం మంచిదని పరిశోధకుల అభిప్రాయం. నీటి బొట్టు నిలవదు ►అరిటాకును బాగా పరిశీలించండి. ఇది వాటర్‌ప్రూఫ్‌గా ఉంటుంది. నీటి బిందువులు తామరాకు మీద జారిపోయినట్లే అరిటాకు మీద కూడా నిలవకుండా జారిపోతాయి. ఆకులోని స్వచ్ఛమైన సువాసన, ఔషధగుణాలు వేడి పదార్థాల ద్వారా ఆహారంలో కలిసిపోతాయి. రుచిని ఇనుమడింప చేస్తాయి. అరిటాకులో భోజనం చేస్తే కలిగే ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్లోని రహస్యం అదే. పరిశుభ్రంగా తిందాం ►అరిటాకులో భోజనం చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మాట్లాడుకున్నాం. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే... పంటల మీద పెస్టిసైడ్స్ స్వైర విహారం చేస్తున్న ఈ రోజుల్లో అరిటాకును వాడడంలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుని తీరాలి. ఆకులను ఉప్పు కలిపిన నీటిలో ముంచి శుభ్రం చేయాలి. పైన చెప్పుకున్నట్లు అరిటాకు పై పొర మైనం రాసినట్లు వాటర్ ప్రూఫ్‌గా ఉంటుంది. కాబట్టి ఇతర ఆకులకు పట్టినట్లుగా క్రిమిసంహారక మందులు ఆకును అంటిపెట్టుకోలేవు. అయినప్పటికీ శుభ్రం చేయడంలో అలసత్వం వద్దు. చదవండి: Legs Swelling Health Tips: ధనియాలను నీటిలో మరిగించి తాగారంటే... -
Health Tips: టొమాటో, వాల్నట్స్, నేరేడు పండ్లు.. తరచుగా తిన్నారంటే....
ఆడుతు పాడుతు పని చేస్తే అలుపూ సొలుపేమున్నది అని ఓ పాట ఉంది. అలాగే నాకు అది ఇష్టం, ఇది ఇష్టం లేదు అని అనకుండా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని రకాల ఆహార పదార్థాలను తరచు తింటుండటం వల్ల ఉత్సాహంగా... ఉల్లాసంగా ఉండడంతోపాటు మెరుపులీనే చర్మం, మంచి ఆరోగ్యం మన సొంతం అవుతాయి. అవేమిటో చూద్దాం... టొమాటో: దీనిలోని లైకోపిన్ కాన్సర్ నిరోధకంగా పనిచేస్తుంది. గుండె, రక్తనాళాలకి సంబంధించిన అనారోగ్యాన్ని కూడా నిరోధిస్తుంది. మన చర్మానికి ఎండ తాలూకు ప్రభావాలనుండి రక్షించడంలో మిగతా పోషకాలతో పాటు టమాటోల పాత్ర చెప్పుకోదగినదే. వాల్నట్స్: ముఖ్యంగా వాల్‌నట్స్‌లో ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్, ప్లాంట్ స్టెరోల్స్ సమృద్ధిగా ఉంటాయి. కొలెస్టరాల్ లెవల్ తగ్గించడంలో వీటి పాత్ర అమోఘం. వాల్‌నట్స్‌లో పీచుపదార్థం అధికం. మెగ్నీషియం, కాపర్, ఫోలేట్, విటమిన్–ఇ, ఉండి శక్తిమంతమైన యాంటి ఆక్సిడెంట్స్‌ని అందిస్తాయి. బ్లడ్ ప్రెషర్‌ను తగ్గిస్తుంది. ఆస్టియోపొరోసిస్ రాకుండా ఆపుతుంది. గుండె ఆరోగ్యాన్ని, చర్మానికి ఎండనుండి కలిగే హానినుండి కాపాడుతుంది. ఆల్మండ్స్ చర్మకాంతికి తోడ్పడతాయి. గ్రీన్ టీ: ఇది ఓ సూపర్ డ్రింక్. రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. చర్మాన్ని అంత త్వరగా ముడతలు పడనివ్వదు. కళ్ళకు మెరుపు అందిస్తుంది. కేటరాక్ట్ ముదరటాన్నీ నెమ్మదింపచేస్తుంది. యోగర్ట్ లేదా పెరుగు: ప్రోటీన్, కాల్షియం, విటమిన్–బి లను అందిస్తుంది. ఇవన్నీ కలిసి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇన్ఫెక్షన్ కలగకుండా పోరాడతాయి. యోగర్ట్ మన శరీర ఆరోగ్యానికి, జీర్ణ వ్యవస్థకు, నాడీవ్యవస్థకు మేలుచేస్తుంది. క్యాన్సర్, ఎలర్జీలు, అధిక రక్తపోటు, హై–కొలెస్టరాల్ బారిన పడకుండా కాపాడుతుంది. బీన్స్: ప్రోటీన్స్, పీచుపదార్థం, విటమిన్లు, మినరల్స్, ఫైటోన్యూట్రియెంట్స్. ఇవన్నీ బీన్స్‌లో సమృద్ధిగా ఉంటాయి. అలాగే కొవ్వుకు సంబంధించిన చెడు లక్షణాలు ఉండవు. బీన్స్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. షుగర్ లెవల్స్ సమతుల్యంగా ఉండేటట్లు చూస్తూనే సురక్షితమైన, నిలకడ అయిన నెమ్మదిగా ఖర్చయ్యే శక్తిని అందిస్తుంది. కొలెస్టరాల్ లెవెల్స్‌ని కొంతమేరకు తగ్గిస్తాయి. బీన్స్‌తో చేసిన కూరలు తిన్నప్పుడు కడుపు నిండినట్లు ఉంటోంది గాని అధిక క్యాలరీలు లేకపోవడం వలన బరువు పెరిగే సమస్యే ఉందదు. బెర్రీస్... ముఖ్యంగా నేరేడుపండ్లు: వృద్ధాప్యం త్వరగా రాకుండా చేస్తాయి. వృద్ధులవుతున్న కొద్దీ మెదడు నెమ్మదించే అవకాశం ఉంది. అలాంటి అనారోగ్యలనుంచి బెర్రీస్ కాపాడుతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, క్యాన్సర్ నిరోధకాలు ఉంటాయి. ఆకుకూరలు ఆకుకూరలు చాలా రకాల క్యాన్సర్ల నుండి కాపాడుతాయి. వీటిలో విటమిన్ బి, సి, ఇ, ఫోలేట్, పొటాషియం, పీచుపదార్ధం సమృద్ధిగా ఉంటాయి. ఎముకల ఆరోగ్యానికి మంచిది. కాల్షియంని శరీరం ఇముడ్చుకోవటానికి తోడ్పతాయి. కేటరాక్ట్‌ను నిరోధించడంలో పాలకూర తోడ్పడుతుంది. చదవండి: చర్మసౌందర్యానికి మరింత మేలు చేసే విటమిన్ ‘ఎ’ ఆహారం.. -
గ్రీన్ టీ తాగుతున్నారా? ఇది మీ కోసమే..
Michiyo Tsujimura Google Doodle: గ్రీన్ టీ.. కరోనాకి కొంతమందికి.. కరోనా తర్వాత చాలామందికి లైఫ్‌లో ఇదొక పార్ట్‌గా మారింది. ఆరోగ్యానికి ఆరోగ్యంతో పాటు లావు ఉన్న వాళ్లు సన్నబడేందుకు ఇదొక ప్రత్యామ్నాయంగా ఫీలైపోతుంటారు. అయితే గ్రీన్ టీ గొప్పదనం గురించి ప్రపంచానికి చెప్పిన ఆవిడ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి కదా. ఆమె పేరే మిచియో సుజిమురా. మిచియో సుజిమురా.. జపనీస్ ఎడ్యుకేషననిస్ట్, బయోకెమిస్ట్. గ్రీన్ టీలోని మూలకాల్ని ప్రపంచానికి తన పరిశోధనల ద్వారా తెలియజేసింది ఈమేనే. ఆ పరిశోధనలకుగానూ మిచియోకు ప్రత్యేక గుర్తింపు దక్కింది. ఇవాళ ఆమె 133వ జయంతి. అందుకే గూగుల్ ఆమెను గుర్తు చేస్తూ డూడుల్‌ను రిలీజ్ చేసింది. ► మిచియో సుజిమురా.. జపాన్‌లో వ్యవసాయంలో డిగ్రీ పట్టా పుచ్చుకున్న మొదటి మహిళగా రికార్డుకెక్కారు. ► గ్రీన్ టీలో ఉండే పోషక విలువ గురించి గుర్తించింది. వాటిని ప్రపంచానికి తెలియజేసింది ఆమెనే. ► సుజిమురా 1888 సెప్టెంబర్ 17న సైతామా రీజియన్‌లోని ఓకేగావాలో పుట్టారు. ఖాళీ కడుపుతో గ్రీన్ టీ ఎక్కువ తాగితే గ్యాస్ట్రిక్, లివర్‌కి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి ► స్కూల్ చదువులు పూర్తయ్యాక టోక్యో ఇంపీరియల్ యూనివర్సిటీలో మిచియో బయోకెమిస్ట్రీలో రీసెర్చ్ చేశారు. ► గ్రీన్ టీపై పరిశోధనల్లో డాక్టర్ ఉమెటారో సుజుకీ ఆమెకు సహకరించారు. ► గ్రీన్ టీలో విటమిన్ బి-1 ఉంటుందని గుర్తించింది ఆయనే(సుజుకీ). వారానికి మూడు సార్లు గ్రీన్ టీ తాగితే మనిషి జీవితకాలం పెరగడంతో పాటు గుండెపోటు ముప్పును నివారించవచ్చు. ► సుజుకీ-సుజిమురా పరిశోధనల్లో మైక్రోస్కోప్ పరిశోధనల్లో విటమిన్ సీని గ్రీన్ టీలో గుర్తించారు ► 1929లో తన ఒంటరి పరిశోధనల్లో గ్రీన్ టీలో ఫ్లవనాయిడ్ కాటెచిన్, 1930లో టానిన్లు ఉన్నట్లు సుజిమురా గుర్తించారు. ► ఈ పరిశోధనలన్నింటిని మేళవించి ‘ఆన్ ది కెమికల్ కాంపోనెన్ట్స్ ఆఫ్ గ్రీన్ టీ’ పేరుతో థీసిస్ రూపొందించారు. ► 1932లో వ్యవసాయంలో డాక్టరేట్ గౌరవపట్టా పొందిన తొలి జపాన్ మహిళగా మిచియో సుజిమురా ఘనత సాధించారు. ► గ్రీన్ పరిశోధనలతో పాటు విద్యావేత్తగా ఆమె పేరు సంపాదించుకున్నారు. ► టోక్యో హోం ఎకనమిక్స్ యూనివర్సిటీకి ఆమె మొట్టమొదటి డీన్ కూడా. గ్రీన్-టీలోని ఎపిగాలోకేటెచిన్-3 గ్యాలేట్ (ఈజీసీజీ) అనే పోషకం ఇలా మొటిమల పెరుగుదలకు దోహదం చేసే ప్రాంతంలోనూ బ్యాక్టీరియా పెరగకుండా చేస్తుందట. దీనికి తోడు ఆ పోషకంలోని వాపు, మంట తగ్గించే (యాంటీ ఇన్ఫ్లమేటరీ) గుణం సైతం మొటిమలు రాకుండా ఉండేలా చేస్తుంది. ► ప్రొఫెసర్‌గా పని చేసిన మిచియో సుజిమురా .. 1955లో రిటైర్ అయ్యారు. కానీ, ఆ తర్వాత కూడా పార్ట్ టైం వృత్తిలో చాలా కాలం కొనసాగారు. ► 1969, జూన్ 1న 81ఏళ్ల వయసులో వృద్ధాప్య సమస్యలతో మిచియో కన్నుమూశారు. ► ఓకేగావా సిటీలో ఆమె స్మరణానర్థం పరిశోధనలకు సంబంధించిన విషయాలతో ఒక స్థూపాన్ని నిర్మించారు. గర్భవతులు రెండు కప్పుల కంటే ఎక్కువ గ్రీన్ టీ తాగితే... గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉందని జపాన్ రీసెర్చర్లు చెప్తున్నారు. గ్రీన్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్స్‌తో హృదయం పదిలంగా ఉండటంతో పాటు ఎక్కువకాలం ఆరోగ్యకరంగా జీవించేందుకు దోహదపడుతుంది ఈ టైంలో వద్దు.. రాత్రి పడుకునే ముందు గ్రీన్‌టీతో మందులు వేసుకోకూడదు మధ్యాహ్న భోజనం తరువాత గ్రీన్‌టీ సేవిస్తే భోజనం నుంచి లభించే పోషక వలువలు తగ్గి, పోషకాహార లోప సమస్యలు తలెత్తె అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు ముందుగా చెప్పుకున్నట్లు కొలెస్ట్రాల్ కరిగించడానికి, బరువు తగ్గించడానికి గ్రీన్ టీ చాలా ఉపయోగపడుతుంది -సాక్షి, వెబ్‌స్పెషల్ ఈ గ్రీన్ టీ రుచుల గురించి మీకు తెలుసా? -
బీట్రూట్, క్యారట్, గ్రీన్ టీ.. వీటిని తరచుగా తీసుకుంటే..
శరీరంలో ఏ అవయవానికి జబ్బుచేసినా కష్టమే. ఇప్పటి కరోనా పరిస్థితుల్లో కాలేయం(లివర్) సమస్యలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అయితే లివర్‌ను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు తింటే ఏ సమస్యా రాకుండా చూసుకోవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం.. ►యాంటీ ఆక్సిడెంట్స్.. బీట్ రూట్లో పుష్కలంగా ఉంటాయి. ఇవి లివర్‌ను ఆరోగ్యంగా ఉంచడంలో ప్రముఖ పాత్రను పోషిస్తాయి. అందువల్ల బీట్ రూట్‌ను కూరగా గానీ, సలాడ్‌గా కానీ తీసుకోవాలి. ►క్యారట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అందువల్ల క్యారట్‌ను నేరుగా గానీ జ్యూస్, సలాడ్, లేదా కూరగా చేసుకుని తింటే మంచిది. ►రోజూ నాలుగైదు సార్లు టీ తాగే అలవాటు ఉన్న వాళ్లు పాలతో చేసిన టీ కాకుండా గ్రీన్ టీ తాగితే లివర్‌కు మంచిది. లివర్‌కు కావాల్సిన పోషకాలు దీనిలో సమృద్ధిగా దొరుకుతాయి. ►కాలేయం చెడిపోకుండా చక్కగా ఉండాలంటే దైనందిన ఆహారంలో తప్పనిసరిగా పాలకూర ఉండేలా చూసుకోవాలి. దీనిలో శరీరానికి కావాల్సిన ముఖ్యమైన గ్లుటాథియోన్ అనే యాంటీ ఆక్సిడెంట్‌తోపాటు, విటమిన్ ఏ కూడా ఉంటుంది. ఇవి లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. అందువల్ల పాలకూరను సూప్‌గా గానీ, కూరగా గానీ చేసుకుని తీసుకోవాలి. చదవండి: Health Tips In Telugu: రాజ్‌గిరతో ఆరోగ్యం.. పాలతో అరటిపండు కలిపి తింటే -
రంగు రంగుల‘టీ’.. వీటిని ఒక్కసారైనా టేస్ట్ చేయాల్సిందే
మనందరమూ టీ మక్కువతో తాగుతాం. మనం రెగ్యులర్‌గా తాగే టీలు మాత్రమే కాకుండా... రంగుల పేర్లతోనూ టీ ఉండటం మనకు తెలుసు. ఉదాహరణకు బ్లాక్ టీ, గ్రీన్ టీ, వైట్ టీ, చాక్లెట్ టీ, బ్రౌన్ టీ... ఇలాగన్నమాట. ఆ రంగుల టీలతో సమకూరే ఆరోగ్య ప్రయోజనాలెన్నెన్నో. సాధారణ టీ : మనం రోజూ తాగే రెగ్యులర్ టీ ఇది. కాఫీ కంటే టీలో కెఫిన్ తక్కువ. అందుకే కాఫీతో పోలిస్తే టీని ఎక్కువసార్లు తీసుకున్నా పెద్దగా హాని చేయదు. దీన్ని కూడా మరీ ఎక్కువగా తీసుకుంటే అది సాధారణ జీర్ణ ప్రక్రియకు అంతరాయం కలిగించడం, పోషకాలు ఒంటికి పట్టకుండా చేసే ప్రమాదమూ పొంచి ఉంది. ఇలా ఎక్కువ టీ తాగేవారిలో ఐరన్ ఒంటబట్టడం తగ్గుతుంది. వైట్ టీ : పేరును బట్టి ఇదేదో పాలను ఎక్కువ మోతాదులోనూ డికాక్షన్ను తక్కువగానూ కలపడంవల్ల వచ్చే తేలికపాటి టీ కాదది. వైట్ టీ పేరిట ఒక రకం టీని చాలామంది ఇష్టంగా తాగుతూ ఉంటారు. ఇది చాలా లేతగా ఉండే టీ–ఆకులతో తయారైన టీ–పౌడర్‌తో కాచడం వల్ల తయారు చేసే టీ. ఇది సాధారణ టీ రుచితో కాకుండా కాస్తంత పచ్చిగా ఉన్నట్లుంటుంది. అయితే ఇందులో యాంటీఆక్సిడెంట్ గుణాలు ఎక్కువ. దాంతో చాలా రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. బ్లాక్ టీ : సాధారణంగా పాలు కలపకుండా కేవలం డికాక్షన్ మాత్రమే తీసుకుంటే దాన్ని బ్లాక్ టీగా పరిగణిస్తారు. ఇది నలుపు రంగులోనే కాకుండా డికాక్షన్‌కు ఉండే సహజమైన మెరుపుతో ఉంటే మరీ మేలు చేస్తుంది. ఇందులోని హెర్బల్ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అయితే అంతగా అలవాటు లేనివారు బ్లాక్ టీని మితిమీరి తాగడం మంచిది కాదు. బ్లాక్ టీ కారణంగా నిద్రలేమి, గుండెదడ, రక్తం వేగంగా ప్రవహించడం వంటి దుష్పరిణామాలు సంభవించవచ్చు. గ్రీన్–టీ : ఇటీవల ఆరోగ్యం కోసం చాలామంది గ్రీన్–టీ తీసుకుంటూ ఉండటం మనం చూస్తున్నాం. ఇందులోని హెర్బల్ పోషకాలు, ఫైటోకెమికల్స్ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్స్ క్యాన్సర్‌ను నివారిస్తాయి. అయితేకాదు... గుండెజబ్బులనూ కొంతవరకు నివారిస్తాయి. కొలెస్ట్రాల్ పాళ్లను తగ్గిస్తాయి. బ్లాక్ టీలోని ‘ఎపిగెల్లో కాటెచిన్–3’ అనే యాంటీ ఆక్సిడెంట్ వల్ల అనేక వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది. కొందరు ఈ టీలోని మరీ ఎక్కువ చేదుదనాన్ని నివారించడం కోసం తేనె కలుపుకుంటారు. అయితే దీన్ని చేదుగా తీసుకోవడమే ఆరోగ్యానికి మేలు. చాక్లెట్ టీ : ఈ టీ ఒకింత చాక్లెట్ రంగుతో పాటు చాక్లెట్ ఫ్లేవర్‌నూ కలిగి ఉంటుంది. డార్క్ చాక్లెట్స్ వల్ల మన నరాలు ఉత్తేజితం కావడంతో పాటు ఇందులోని పాలీఫినాల్స్ ఆరోగ్యానికీ మేలు చేస్తాయన్న సంగతి తెలిసిందే. ఈ చాక్లెట్ టీని షుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా తాగడం మంచిది కాదు. బ్రౌన్ టీ లేదా ఊలాంగ్ టీ : ఇది చాలా తక్కువగా ప్రాసెస్ చేసిన గ్రీన్, బ్లాక్ టీల సమ్మిళిత మిశ్రమం. దీన్ని ఎక్కువగా చైనా, తైవాన్ దేశాలలో తాగుతుంటారు. ఊలాంగ్ టీలలో జాస్మిన్, కొబ్బరి, క్యారమెల్ వంటి ఇతర ఫ్లేవర్ కూడా ఇటీవల లభ్యమవుతున్నాయి. టీ ఏదైనా మనల్ని ఉత్తేజితం చేస్తుందన్న విషయం తెలిసిందే. నరాలు ఎక్కువగా ఉత్తేజితం అయితే అవి త్వరగా అలసిపోయి మనం నీరసంగా, నిస్సత్తువగా మారే అవకాశం ఉంది. అందుకే టీ లను ఆరోగ్యం ఇచ్చే పరిమితి మోతాదులో తీసుకుంటూ... అతి వల్ల కలిగే అనర్థాలను నివారించుకుకోవాలి. -
వీటితో గుండె జబ్బులకు చెక్ పెట్టొచ్చు!
సాక్షి, హైదరాబాద్: గుండెజబ్బులతో బాధపడుతున్న వారికి గ్రీన్ టీ, కాఫీలు మేలు చేస్తాయని గుర్తించారు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ శాస్త్రవేత్తలు.. ఆరోగ్యవంతుల్లోనూ ఈ రెండూ గుండె జబ్బుల నివారణకు ఉపయోగపడతాయని వీరు నిర్వహించిన తాజా అధ్యయనం స్పష్టం చేసింది. 40 నుంచి 79 ఏళ్ల వయసున్న సుమారు 46 వేల మందిపై అమెరికన్ హార్ట్ అసోసియేషన్ పరిశోధన నిర్వహించింది. జపాన్‌లోని 45 సమూహాల్లోని వీరి నుంచి జీవనశైలి, నివసించే ప్రాంతం, తీసుకునే ఆహారం వంటి వివరాలు సేకరించారు. గుండెపోటు నుంచి కోలుకున్న వారిని ఒక వర్గంగా, గుండెజబ్బులున్న వారిని ఇంకో వర్గంగా, ఈ రెండూ లేని వారిని మూడో వర్గంగానూ విభజించి గ్రీన్ టీ, కాఫీ అలవాట్లను పరిశీలించారు. గుండెపోటు నుంచి కోలుకుని.. రోజుకు 7 కప్పుల గ్రీన్ టీ తీసుకునే వారు.. అరుదుగా గ్రీన్ టీ తీసుకునే వారితో పోలిస్తే మరణించేందుకున్న అవకాశం 62 శాతం వరకూ తగ్గినట్లు గుర్తించారు. గుండె జబ్బులతో బాధపడుతున్న వారు రోజుకో కప్పు కాఫీ తాగినా.. కాఫీ తాగని వారితో పోలిస్తే మరణించే అవకాశం 22 శాతం తగ్గింది. గుండెపోటు, జబ్బుల్లేని వారు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కప్పుల కాఫీ తాగితే కాఫీ అస్సలు తాగని వారితో పోలి్చనప్పుడు మరణించే అవకాశం 14 శాతం వరకు తగ్గినట్లు ఈ అధ్యయనం గుర్తించింది. మొత్తంగా గుండెజబ్బులు, పోటు నుంచి కోలుకున్న వారికి మళ్లీ గుండె సంబంధిత సమస్యలు రాకుండా గ్రీన్ టీ, కాఫీలు అడ్డుకుంటాయని తెలిసింది. చదవండి : (ఆ సమయాలలో గ్రీన్‌టీ చాలా డేంజర్..) -
ఆ సమయాలలో గ్రీన్‌టీ చాలా డేంజర్..
న్యూఢిల్లీ: గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మనందరికి తెలిసిందే. కాగా వారానికి మూడు సార్లు గ్రీన్ టీ తాగితే మనిషి జీవితకాలం పెరగడంతో పాటు గుండెపోటు, స్ర్టోక్ ముప్పులను నివారించవచ్చని ఎన్నో అధ్యయాలు స్పష్టం చేశాయి. కాగా గ్రీన్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్స్‌తో హృదయం పదిలంగా ఉండటంతో పాటు ఎక్కువకాలం ఆరోగ్యకరంగా జీవించేందుకు దోహదపడుతుందని పరిశోధకులు తేల్చారు. కానీ గ్రీన్ టీ ఏ సమయంలో తీసుకోవాలో కూడా చాలా ముఖ్యమని పరిశోధకులు విశ్లేషిస్తున్నారు. కొన్ని సమయాలలో గ్రీన్ టీని తీసుకోవద్దని నిపుణులు పేర్కొంటున్నారు. రాత్రి పడుకునే ముందు: మీరు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా, అయితే గ్రీన్‌టీ తీసుకునే సమయంలో జాగ్రత్త వహించాలి. రాత్రి పడుకునే ముందు గ్రీన్ టీని సేవిస్తే నిద్రలేమి సమస్యలు ఎదురు కావచ్చు. గ్రీన్ టీలోకెఫిన్ ఉండడం వల్ల నిద్ర ప్రేరిపిత మెలటోనిన్ విడుదలను అడ్డుకుంటుంది. ఉదయాన్నె గ్రీన్ టీ విషయంలో జాగ్రత్త: ఉదయాన్నే లేచిన వెంటనే ఖాళీ కడుపుతో గ్రీన్ టీని సేవించడం అనారోగ్యమని నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, పాలీఫినాల్స్ గ్యాస్ట్రిక్ యాసిడ్లను ప్రేరేపించి, జీర్ణక్రియ సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. అందుకే ఉదయాన టిఫిన్ చేశాక గ్రీన్‌టీని సేవించడం ఆరోగ్యకరం. గ్రీన్‌టీతో మందులు వేసుకుంటే అంతే.. ఏదయినా వ్యాధితో బాధపడుతున్నట్లయితే కొందరు ఓ కప్పు గ్రీన్‌టీతో మందులు వేసుకుంటారు. కానీ అలా మందులు వేసుకోవడం ఆరోగ్యానికి హానికరం, మందులలో ఉండే కెమికల్స్ గ్రీన్ టీతో కలిసిన క్రమంలో అసిడిటీ సమస్యలు తలెత్తె అవకాశముంది. భోజన సమయంలో జాగ్రత్త: సాధారణంగా గ్రీన్ టీ సేవిస్తే జీర్ణకక్రియ సమస్యలకు ఎంతో ఉపయోగం. కానీ మధ్యాహ్న భోజనం తరువాత గ్రీన్‌టీ సేవిస్తే భోజనం నుంచి లభించే పోషక వలువలు తగ్గి, పోషకాహార లోప సమస్యలు తలెత్తె అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు -
కరోనా జయించాలంటే ఇవి తినాలి
ప్రపంచ దేశాల ప్రజలను భయకంపితుల్ని చేస్తోన్న కరోనా వైరస్ (కోవిడ్-19) సోకకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యల గురించి ప్రపంచ వైద్య నిపుణులు ఇప్పటికే పలుసార్లు వెల్లడించిన విషయం తెల్సిందే. కరోనా వైరస్ సోకితే కచ్చితంగా ప్రాణాపాయమంటూ భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, సకాలంలో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటే ఎలాంటి ప్రాణహాని ఉండదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరించింది. కరోనా బాధితుల్లో మృతుల సంఖ్య 3.6 శాతానికి మించి లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేయగా, ఒక శాతానికి మించి ఉండదని లండన్, ఆస్ట్రేలియా వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. (కరోనా పుణ్యమా.. గూగుల్ వేటలో అదే టాప్) కరోనా వైరస్‌ను జయంచడంలో ప్రజల్లో ఉండే రోగ నిరోధక వ్యవస్థ ఎక్కువగా దోహద పడుతోంది. ఈ రోగ నిరోధక వ్యవస్థ మనం తీసుకునే ఆహారం అలవాట్లపై ఆధారపడి ఉంటుందని, రోగ నిరోధక వ్యవస్థను పెంచే ఆహారాన్ని తీసుకుంటే సరిపోతుందని ఆస్ట్రేలియా వైద్యులు సూచిస్తున్నారు. మన వంటకాల్లో, తినే పదార్థాల్లో యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసే అల్లం, ఉల్లిపాయ, క్యారెట్లు, గుమ్మడికాయ, పసుపు లాంటివి రోజు ఒక్కసారైనా ఉండేలా చూసుకోవాలి. రోజు విడిచి రోజు నాలుగు రకాల కూరలు లేదా కూరగాయలు తినాలి. వీటిలో పాలకూర, బ్రోకలీ, పుట్ట గొడుగులు ప్రశస్తమైనవి. అల్ల నేరేడు పండ్లు, బెర్రీలు, దానిమ్మ పండ్లు, బాదం గింజలు వారానికి మూడుసార్లు తీసుకోవాలి. వీటిలో రోగ నిరోధక శక్తిని పెంచే సీ, బీ, ఈ విటమిన్లు ఉంటాయి. చేపలు, గుడ్లు, మాంసంలో కండరాలు, ఎముకలను బలంగా ఉంచే ప్రొటీన్లతోపాటు డీ సహా 20 రకాల విటమిన్లు ఉంటాయి. జింకు ఎక్కువగా ఉండే నత్త గుల్లలు వారానికి ఓసారి తినడం మంచిది. (ఆపిల్, నైక్, సోని ఆఫీసుల మూసివేత) వీటన్నింటితోపాటు బ్యాక్టీరియా సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల కూడా రోగ నిరోధక శక్తి మరింత పెరగుతుందని ఆస్ట్రేలియా న్యూట్రిషనల్ థెరపిస్ట్ హన్నా బ్రాయ్ తెలిపారు. అలాగే రోజు గ్రీన్ టీ తీసుకోవడం మంచిది. మనం తీసుకునే ఆహారంలో ఇవి ఉండేలా చేసుకున్నట్లయితే సులభంగానే కరోనా వైరస్‌ను జయంచవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. (కరోనా వ్యాప్తికి విరుగుడు కనిపెట్టిన ప్రధాని) -
వారానికి మూడుసార్లు గ్రీన్ టీ తాగితే..
బీజింగ్ : వారానికి మూడు సార్లు గ్రీన్ టీ తాగితే మనిషి జీవితకాలం పెరగడంతో పాటు గుండెపోటు, స్ర్టోక్ ముప్పులను నివారించవచ్చని తాజా అథ్యయనం స్పష్టం చేశారు. గ్రీన్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్స్‌తో హృదయం పదిలంగా ఉండటంతో పాటు ఎక్కువకాలం ఆరోగ్యకరంగా జీవించేందుకు దోహదపడుతుందని పరిశోధకులు తేల్చారు. చైనాలో లక్ష మందిపై జరిపిన అథ్యయనంలో గ్రీన్ టీ తాగేవారు తాగని వారితో పోలిస్తే సగటున 1.26 సంవత్సరాలు అధికంగా జీవించినట్టు గుర్తించారు. గ్రీన్ టీ తాగని వారి కంటే 1.4 ఏళ్ల తర్వాత గుండె పోటు వంటి వ్యాధుల బారిన పడ్డారని సుదీర్ఘంగా సాగిన అథ్యయనంలో వెల్లడైంది. బ్లాక్ టీ తాగిన వారిలో ఇలాంటి ప్రయోజనాలను గుర్తిచలేదని పరిశోధకులు తెలిపారు. అయితే కేవలం మంచి ఆరోగ్యం కోసం గ్రీన్ టీకి మారితే మెరుగైన ఫలితాలు రావని, ఇతర అనారోగ్య అలవాట్లను కొనసాగిస్తూ గ్రీన్ టీ ఒక్కటితోనే పరిస్థితి మారబోదని వారు పేర్కొన్నారు. నిత్యం టీ తాగడం అలవాటుగా చేసకున్నవారికి గుండె జబ్బులు, ఇతర కారణాలతో మరణించే రిస్క్ తక్కువగా ఉంటుందని అథ్యయన రచయిత డాక్టర్ జియాన్ వాంగ్ చెప్పారు. టీలో ఉండే పోలీపెనాల్స్ అనే యాంటీఆక్సిడెంట్ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే లక్షణం కలిగిఉందని అన్నారు. పండ్లు, కూరగాయల్లో కూడా లభించే పాలీపెనాల్స్ దెబ్బతిన్న కణజాలాన్ని శక్తివంతం చేయడంతో పాటు శరీరంలో షుగర్ లెవెల్స్‌ను నియంత్రిస్తూ బరువు పెరగడాన్ని నెమ్మెదింపచేస్తాయి. -
వారెవ్వా.. ఏమి‘టీ’!
ఒత్తిడితో చిత్తయ్యే చాలా మంది టీ లేదా కాఫీ తాగి ఉపశమనం పొందుతుంటారు. ఇంట్లోనూ కాస్త ఫ్రీ టైమ్ దొరికిందంటే టక్కున గుర్తుకొచ్చేదీ ఇదే. అలా టీ తాగుతూ నచ్చిన పుస్తకాన్ని చదివితే అంతకంటే మనసుకు ఆహ్లాదం ఇంకేముంటుంది. స్నేహితులు కలిసినపుడు, తెలిసిన వారు బజారులో పలకరించినపుడు, మర్యాదపూర్వక భేటీల సమయంలో తప్పకుండా ఒక ‘స్ట్రాంగ్ టీ’ గుటకేయాల్సిందే!! లేదంటే చాలా మందికి ప్రాణం ఉసూరుమంటుంది. సాక్షి, ఒంగోలు: తేనీటి ఘుమఘుమలకు టీ ప్రియులు ఫిదా అవుతున్నారు. నిత్య జీవనంలో టీ ప్రముఖ పాత్రే పోషిస్తోంది. మూడు దశాబ్దాల కిందట ఒకటీరెండు రకాల తేనీరే అందుబాటులో ఉండేది. కప్పు రూ.0.15 పైసలతో మొదలై.. ఇప్పుడు రూ.15కు చేరింది. ఒక్క ఒంగోలు నగరంలోనే రోజుకు 10 లక్షలకు పైగా టీలు తాగుతున్నారని వ్యాపారవర్గాల అంచనా. ఈ లెక్కన జిల్లాలో టీ మార్కెట్ అంచనాలకు అందనిది. నాలుగు చినుకులు పడ్డాయంటే.. బయట చిరుజల్లులు. ఆహ్లాదకరమైన వాతావరణం. వేడివేడిగా తేనీటి చుక్కలు గొంతులోకి దిగుతుంటే భలే ఉంటుంది కదూ. ఇద్దరు మిత్రులు కలవగానే నోటి నుంచి వచ్చే మొదటి మాట ‘టీ తాగుదాం భయ్యా’, ‘టీ తాగుదాం బాబాయ్..’, స్ట్రాంగ్ చాయ్ తాగుదాం మావా..’. ఇక విద్యార్థులైతే ఒన్‌బైటూ చాయ్ చెబుతారు. బందువులు ఇంటికి రాగానే తేనీటి సేవనంతోనే కబుర్లు మొదలవుతాయి. మనసు చికాకు పుట్టినా.. కొత్తవారితో దోస్తీ కట్టినా.. వాన పడినా.. మంచు కురిసినా, ఎండ కాసినా టీ రుచులను ఆస్వాదించాల్సిందే. చిరుద్యోగి నుంచి కార్పొరేట్ కంపెనీ సీఈఓ వరకు రోజుకు ఒక్కసారైనా టీ సేవించాల్సిందే. నగరాల్లో ఇరానీ చాయ్ వచ్చేసింది. ప్రత్యేకంగా ఇరానీ చాయ్ రుచులు చూపించే దుకాణాలు ఉన్నాయి. తేయాకు రుచులకు డిమాండ్ నానాటికీ పెరుగుతోంది. ఆరోగ్యం.. ఆనందం..ఆహ్లాదం.. ఆస్వాదన పంచే తేనీరుతో కొన్ని హోటళ్లు ప్రత్యేక ఆహ్వానం పలుకుతున్నాయి. సమయానికి తగినట్లుగా, మూడ్‌కు అనుగుణంగా సరికొత్తగా కొత్త కొత్త రుచులతో తేనీరు అందుబాటులోకి వచ్చింది. మారిన జీవన శైలి.. పోటీ పడి అలసిన వారు కాసేపు సేద తీరేందుకు ఇటు వైపుగా అడుగులు వేస్తున్నారు. నగరంలోనూ కేఫ్ క్లబ్‌లు వెలుస్తున్నాయి. ఆధునిక పోకడలకు దర్పణం పడుతున్నాయి. కొత్తగా ఆస్వాదించాల్సిందే.. మారుతున్న పరిస్థితుల్లో అన్ని వర్గాల్లోనూ ఆరోగ్య స్పృహ పెరిగింది. ఖర్చు ఎక్కువనా వెనుకంజ వేయడం లేదు. కార్పొరేట్ సంస్కృతి అందుబాటులోకి వచ్చింది. కాసేపైనా సమావేశాలు, స్నేహితులు బందువులతో గడపాలంటే టీ రూమ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏకాంతంగా గడిపేందుకు అనుకూల వాతావరణం ఆస్వాదించడానికి అద్భుతమైన రుచులను కోరుతున్నారు. నగరంలో వివిధ బ్రాండ్ల టీ రకాలు అందుబాటులో ఉన్నాయి. హైవే పైనా కాఫీ క్లబ్‌లు, టీ షాప్‌లు వెలిశాయి. 24 గంటలపాటు వీటి సేవలు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయి. ఇక టీ బంకులు ఉండనే ఉన్నాయి. టీ కాస్త బాగుంటే చాలు.. షాప్ వద్ద జనాలు గుంపులు గుంపులే. అర్ధరాత్రి వరకు టీ దుకాణాలు తెరిచే ఉంటున్నాయి. పాత మార్కెట్ సెంటర్‌తోపాటు పలు ప్రాంతాల్లో రకరకాల టీలు లభిస్తున్నాయి. ఘుమఘుమలతో ఫిదా.. టీ గ్లోబల్ మార్కెట్. అంతర్జాతీయంగా ఉండే టీ రకాలు స్థానిక మార్కెట్‌కు వస్తున్నాయి. మూడు దశాబ్దాల కిందట టీ రకం ఒకటే. ఇప్పుడు రకరకాలు. రంగు.. రుచి.. వాసన ఘుమఘుమలతో నగరవాసులు టీకి ఫిదా అవుతున్నారు. 1853లో తేయాకు తోటలను తొలిసారిగా సాగు చేశారు. క్రమంగా విస్తరించి లక్షలాది ఎకరాల్లో తేయాకు పండిస్తున్నారు. అస్సాం, పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, త్రిపుర, అరుణాచల్‌ప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, సిక్కిం, నాగాలాండ్, ఉత్తరాఖండ్, మిజోరాం, మేఘాలయ, కర్నాటక, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి రకరకాల తేయాకు మార్కెట్‌కు వస్తోంది. కిలో రూ.139 నుంచి రూ.1200 వరకు ఉండే రకాలు ఇక్కడ లభిస్తున్నాయి. ఆరోగ్య సూత్రాలు బాగా అవలంబిస్తున్న నేపథ్యంలో బ్లాక్, గ్రీన్, హెర్బల్, దినుసులతో తయారు చేసిన టీ రకాలను ఆస్వాదించే వారి సంఖ్య బాగా పెరిగింది. ఇప్పుడు చిన్న డిస్పోజల్ బ్యాగ్‌లలోనూ టీ లభిస్తోంది. బ్లాక్, చీజ్, పౌడర్, రెడీ టీ, గ్రీన్, జింజర్ రకరకాలు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఔరా అనాల్సిందే.. ఎల్లో బడ్ టీ రెండు కప్పుల విలువ ఎంతో తెలుసా? అక్షరాలా రూ.6,500. స్టార్ హోటళ్లల్లో ఈ టీ లభిస్తుంది. టీ వినియోగానికి పెరిగిన ఆదరణకు ఇది ప్రతీక. అచ్చమైన తేయాకును ఎండబెట్టి 24 కేరట్ల బంగారంతో మిళితం చేసిన ఫ్లేవర్‌తో ఎల్లో బడ్ టీ పొడి తయారు చేస్తారు. ఈ టీ పౌడర్ కిలో ధర సుమారు రూ.8 లక్షలు. ఎంతటి వారైనా ఈ ధర చూసి ఔరా అనాల్సిందే. స్థానిక మార్కెట్లోనూ 40 రకాలకు తగ్గకుండా టీ లభిస్తోంది. అల్పాహార హోటళ్లల్లోనూ నిత్యం వినియోగించే రకాలను అందుబాటులో ఉంచుతున్నారు. ఒంగోలులోని వివిధ సెంటర్లలో జింజర్ టీ, గ్రీన్, బ్లాక్, దాల్చిన చెక్క, వైట్ టీ, ఎల్లో టీ, బాదం టీ, మింట్, మిరియాలు, వాము, గార్లిక్.. ఇలా రకరకాల టీలు విక్రయిస్తున్నారు. ఉదయాన్నే అల్లం టీ తాగేందుకు వాకర్లు గుంపులుగుంపులుగా టీ కొట్ల వద్దకు చేరుతున్నారు. ఉదయం పూట ఒక్క మంగమూరు రోడ్డులోని రెండు మూడు కేంద్రాల్లో వందలాది టీలు అమ్ముడవుతున్నాయి. షాప్ నిర్వాహకులు పార్ట్ టైం సర్వెంట్లను పెట్టుకుని ఉదయం టీ మార్కెట్ నడిపిస్తున్నారు. పాలు, పంచదార కలపకుండా చక్కటి రుచి, సువాసన కలిగిన టీలు కాఫీ షాప్‌ల్లో లభిస్తున్నాయి. ఎలాంటి రసాయనాలు కలపకుండా స్వచ్ఛమైన తేయాకుతో తయారు చేసే టీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. -
ఆ టీతో యాంగ్జైటీ మటుమాయం
టోక్యో : రొటీన్ జీవితంలో ఒత్తిడికి గురికాని వారు అరుదు. నిత్యజీవితంలో ఒత్తిడిని బ్రేక్ చేసి ఉత్సాహంగా పనిచేసేందుకు జపనీయులు ఇప్పుడు మచా టీని ఆశ్రయిస్తున్నారు. ఈ టీలో ఒత్తిడిని తగ్గించే పదార్ధాలతో పాటు పలు ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయని జర్నల్ ఆఫ్ ఫంక్షనల్ ఫుడ్స్‌లో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మచా పౌడర్‌ను ఎలుకలపై ప్రయోగించిన మీదట వాటిలో ఒత్తిడి, కంగారు తగ్గినట్టు గుర్తించారు. ఒత్తిడికి కారణమయ్యే డోపమైన్, సెరటోనిన్లను ఈ టీ ఉత్తేజితం చేయడం ద్వారా ప్రశాంతత చేకూరుస్తుందని పరిశోధకులు గుర్తించారు. మచాలో మానవ శరీరానికి మేలు చేకూర్చే పదార్ధాలు ఉన్నాయని తమ అథ్యయనం గుర్తించిందని అథ్యయన రచయిత, కుమమటో వర్సిటీకి చెందిన యుకి కురిచి చెప్పారు. -
ఆహా ఏమి‘టీ’
సాక్షి, ఆలేరు : ఆంగ్లేయుల నుంచి వలస వచ్చిన టీ అలవాటు మనకు జీవితంలో ఒక భాగమైంది. టీ తాగనిదే పొద్దు గడవదు. చాయ్.. చటుక్కున్న తాగరా బాయ్.. అంటూ ఓ చిత్రంలో కథనాయకుడు టీ పుట్టుపుర్వోత్తారాలను అసక్తిగా చెబుతాడు. అలనాడు టీ తాగిన బ్రహ్మ అనాటి నుంచి ఈనాటి వరకు విశ్రాంతి లేకుండా సృష్టిని కొనసాగిస్తునే ఉన్నాడంటూ టీ మహత్తును గమ్మత్తుగా వర్ణించాడు. నిజ జీవితంలో తేనెటి ఘుమఘుమలతోనే దీనచర్య ప్రారంభమయ్యే వారు ఎందరో. నేడు అన్ని వేళల్లో టీ తాగడం సర్వసాధారణమైంది. ధనిక, పేద అనే తేడా లేకుండా అందరు టీని సేవిస్తారు. ఇంటికి వచ్చిన అతిథులుగా మొదటగా మర్యాదాగా అందించేది టీ తోనే. ఈ రోజే ఎదుకంటే ? ప్రపంచ వ్యాప్తంగా తేయాకు ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న దేశాలు టీ ప్రాధాన్యాన్ని ప్రచారం చేసేందుకు పలుమార్లు అంతర్జాతీయ సదస్సులను నిర్వహించాయి. ఇందులో భారత్ సహా పలు దేశాలు పాల్గొని ఈ దినోత్సవ ఏర్పాటుకు చొరవ చూపాయి. 2005 డిసెంబర్ 15న టీ వినియోగం గుర్తించి మనదేశంలో టీ దినోత్సవాన్ని నిర్వహించారు. ఇలా క్రమేనా అన్ని దేశాల్లో నిర్వహిస్తున్నారు. ఆరోగ్య ప్రదాయిని.. టీ తాగడం కూడా ఆరోగ్యమే. మానసిక ఉత్తేజం కల్గుతుంది. గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ కల్గిస్తుంది. రక్తంలోని కొవ్వు పదార్థాలను కరిగిస్తుంది. శరీరంలో చెడు ప్రభావాలను తగ్గించడంలో కొన్ని రకాల టీలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. వీటిని నానాటికి ఆదరణ పెరుగుతోంది. గ్రీన్, లెమన్, హనీ, బ్లాక్, అల్లం, మసాలా, బాదం టీలు ఈ జాబితాలో ఉన్నాయి. మధుమేహ బాధితులకు గ్రీన్, బ్లాక్ టీలు ఆరోగ్యమని పలు పరిశోధనల ద్వారా తెలిసింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రకాల టీలు అందుబాటులో ఉన్నాయి. భారత్‌తో పాటు తెలంగాణలో కూడా వివి«ధ రకాల టీలను సేవిస్తున్నారు. ఇరానీ, అస్సాం, ఫ్లెవర్, చాక్లెట్, మసాలా, హెర్బల్, ఇలాచీ, బిస్కెట్ అందుబాటులో ఉన్నాయి. ఒక్కో రకం టీకి ఒక్కో రకం ప్రత్యేకత ఉంటుంది. పెరిగిన టీ ధర టీ ధర పేద ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు. తేయాకు, పాలు, చక్కెర, గ్యాస్ ధరలు పెరగడంతో టీ ధరను కూడా పెంచేశారు. రూ. 6 నుంచి 10 వరకు అమ్ముతున్నారు. కూలీ నాలీ చేసే సామాన్యులు సైతం దీనచర్యను చాయ్‌తోనే మొదలుపెడుతారు. చాయ్ తయారుచేయడానికి అవసరమయ్యే అన్నిరకాల వస్తువుల ధరలు పెరగడం వల్ల చాయ్ ధరలను పెంచాల్సి వస్తుందని టీకొట్టుల నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఎందరికో ఉపాధి ఛాయే కదా అని అనుకుంటాం.. కానీ ఎంతో మందికి టీ అమ్మకాలు ఉపాధిని కల్పిస్తుంది. డబ్బా కొట్టు నుండి 5 నక్షత్రాల హోటళ్ల వరకు వివిధ స్థాయిలో టీ లభ్యమౌతుంది. టీ దొరకని ప్రాంతాలుండవు. కొన్ని వందల మైళ్ల దూరంలోని రాజస్థాన్ వంటి రాష్ట్రాల నుంచి వలసవచ్చి మరి టీ కొట్టులు పెట్టుకుని బతుకుతున్న వారు ఎందరో. సినిమా థియేటర్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, దుకాణ సముదాయాల్లో, ఫ్యాక్టరీలలో, కళాశాలలు, పార్కులు, జన సంచారం ఉన్న ప్రదేశాల్లో టీని విక్రయిస్తుంటారు. చిన్న కప్పుల్లో సాగే టీ వ్యాపారం రూపాయలు కోట్లలోనే సాగుతుందంటే ఆశ్చర్యమనిపించక మానదు. -
వానాకాలం ట్రీట్
రండి... రండి... రండి... దయచేయండి. మా ఇంట్లో టీ మధురం సుమండీ! సూటీ చినుకుల కాలం ఇదండీ! ‘దశ’దిశలు అదిరేటీతో జవాబు చెప్పండి. డీటాక్స్ టీ కావలసినవి: అల్లం తురుము – పావు కప్పు; నిమ్మరసం – ఒకటిన్నర టీ స్పూన్లు; లవంగాలు – 4; దాల్చిన చెక్క పొడి – ఒకటిన్నర టీ స్పూన్లు; లెమన్ గ్రాస్ తరుగు – పావు కప్పు; తులసి ఆకుల తరుగు – ఒక టేబుల్ స్పూన్; తేనె – 2 టేబుల్ స్పూన్లు తయారీ: ∙ఒక పెద్ద పాత్రలో నాలుగున్నర కప్పుల నీళ్లు పోసి బాగా మరిగించాలి ∙తేనె మినహా మిగతా పదార్థాలను మరుగుతున్న నీటిలో వేసి బాగా కలిపి మరోమారు మరిగించాలి ∙తయారైన టీని నాలుగు కప్పులలోకి సమానంగా వడబోయాలి ∙ఒక్కో కప్పులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల తేనె వేసి బాగా కలిపి వేడివేడిగా అందించాలి. పుదీనా గ్రీన్ టీ కావలసినవి:సన్నగా తరిగిన పుదీనా – టేబుల్ స్పూన్; గ్రీన్ టీ బ్యాగ్ – 1; తేనె – టీ స్పూన్; నిమ్మ రసం – అర టీ స్పూను తయారీ: ఒక కప్పులో బాగా మరిగిన వేడి నీళ్లు పోసి, గ్రీన్ టీ బ్యాగ్ వేసి కొద్దిసేపు ఉంచి టీ బ్యాగ్ తీసేయాలి ∙పుదీనా ఆకులు, తేనె, నిమ్మ రసం జత చేసి కలిపి వేడివేడిగా వెంటనే అందించాలి. మష్రూమ్ టీ కావలసినవి:సన్నగా తరిగిన మష్రూమ్స్ – అర కప్పు; ఉప్పు – చిటికెడు; మిరియాల పొడి – పావు టీ స్పూన్; బటర్ – టీ స్పూను తయారీ: స్టౌ మీద బాణలిలో బటర్ వేసి కరిగాక మష్రూమ్స్ జత చేసి సుమారు ఐదు నిమిషాల పాటు అవి గోధుమరంగులోకి మారేవరకు వేయించాలి ∙రెండు కప్పుల నీళ్లు, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి సుమారు ఐదు నిమిషాల పాటు మరిగించి దింపేయాలి వడపోసి కప్పులలో వెంటనే వేడివేడిగా అందించాలి. హెర్బల్ కెఫెన్ ఫ్రీ టీ మసాలా టీ కావలసినవి:చాయ్ మసాలా – అర టీ స్పూన్; టీ పొడి – 2 టేబుల్ స్పూన్లు; పంచదార – 4 టేబుల్ స్పూన్లు; లెమన్ గ్రాస్ – 2 కట్టలు (సూపర్ మార్కెట్లో దొరుకుతాయి); అల్లం తురుము – అర టీ స్పూన్; పాలు – 2 కప్పులు; తయారీ: ఒక పాత్రలో రెండు కప్పుల నీళ్లు, టీ పొడి, పంచదార, లెమన్ గ్రాస్, అల్లం తురుము, చాయ్ మసాలా వేసి స్టౌ మీద ఉంచి, రెండు నిమిషాల పాటు మరిగించాలి ∙పాలు జత చేసి మరోమారు మరిగించాలి ∙టీ వడ పోసి కప్పులలో వేడివేడిగా అందించాలి. ఆపిల్ టీ కావలసినవి: ఆపిల్ తురుము – ఒక కప్పు; పంచదార – 2 టేబుల్ స్పూన్లు; నిమ్మరసం – అర టేబుల్ స్పూన్; గ్రీన్ టీ బ్యాగ్స్ – 2; దాల్చిన చెక్క ముక్కలు – 2 (చిన్నవి) తయారీ: పాత్రలో మూడు కప్పుల నీళ్లు పోసి మరిగించాలి ∙ఆపిల్ తురుము, పంచదార, నిమ్మ రసం జత చేసి బాగా కలిపి మంట తగ్గించి, సుమారు ఐదు నిమిషాలు మరిగించాలి. (మధ్యమధ్యలో కలుపుతుండాలి) ∙రెండు టీ బ్యాగ్‌లు, దాల్చిన చెక్క ముక్కలు వేసి బాగా కలిపి స్టౌ మీద నుంచి దింపి, మూత పెట్టి, పావు గంట సేపు పక్కన ఉంచాలి ∙బాగా చల్లారాక వడపోసి, ఆపిల్ స్లైస్ వేసి, చల్లగా అందించాలి. టీ సంగారియా కావలసినవి: టీ డికాక్షన్ – అర కప్పు; ఆపిల్ జ్యూస్ – 5 కప్పులు; నిమ్మ రసం – 8 టీ స్పూన్లు; పొడి చేసిన ఐస్ – 2 కప్పులు; పండ్ల ముక్కలు – కొద్దిగా తయారీ: ఒక పాత్రలో టీ డికాక్షన్, ఆపిల్ జ్యూస్, నిమ్మ రసం పోసి గరిటెతో బాగా కలపాలి ∙ఐస్ పొడి, పండ్ల ముక్కలు జతచేసి, గ్లాసులలో పోసి చల్లగా అందించాలి. ఫ్రూటీ ఐస్డ్ టీ కావలసినవి: రెడీమేడ్ ఆరెంజ్ జ్యూస్ – కప్పు; టీ బ్యాగ్స్ – 2; పంచదార – 4 టేబుల్ స్పూన్లు; ఐస్ క్యూబ్స్ – 16 తయారీ: ఒక పాత్రలో ఒక కప్పుడు నీళ్లు పోసి మరిగించాలి ∙పంచదార, టీ బ్యాగ్స్ జత చేసి మరో రెండు నిమిషాలు మరిగించాలి. (మధ్యమధ్యలో కలుపుతుం డాలి) ∙టీను చల్లారబెట్టి టీ బ్యాగుల్ తీసేయాలి ∙బాగా చల్లారాక ఆరెంజ్ జ్యూస్, ఒక కప్పు నీళ్లు జత చేసి బాగా కలిపి, నాలుగు కప్పులలోకి సమానంగా పోయాలి ∙ఒక్కో కప్పులో నాలుగు ఐస్ క్యూబ్స్ వేసి అందించాలి. పుదీనా ఆకులతో గార్నిష్ చేయచ్చు. హనీ జింజర్ టీ కావలసినవి: నిమ్మ కాయ – 1; సన్నగా తరిగిన అల్లం ముక్కలు – ఒక టేబుల్ స్పూన్; మరిగించిన నీళ్లు – 2 కప్పులు; తేనె – ఒక టీ స్పూను తయారీ: ∙నిమ్మ కాయను శుభ్రంగా కడిగి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి ∙ఒక చిన్న పాత్రలో నిమ్మ కాయ ముక్కలు, అల్లం ముక్కలు వేయాలి ∙మరిగించిన నీళ్లు పోసి కొద్దిసేపు మూత పెట్టి ఉంచాలి ∙కొద్దిగా చల్లారాక తేనె జత చేసి కప్పులలో అందించాలి. ఏలకుల టీ కావలసినవి: టీ పొడి – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; పంచదార – రెండున్నర టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి – ఒక టీ స్పూన్; పాలు – ఒక కప్పు తయారీ: ∙ఒక పాత్రలో ఒక కప్పు నీళ్లు, టీ పొడి, పంచదార, ఏలకుల పొడి వేసి స్టౌ మీద ఉంచి మరిగించాలి ∙పాలు జత చేసి మధ్యమధ్యలో కలుపుతూ కొద్ది సేపు మరిగించి దింపేయాలి ∙కప్పులలోకి వడబోసి వేడివేడిగా అందించాలి. చాయ్.. ఎంజాయ్ మానవుని ఆహార విహారాల యొక్క స్వరూప స్వభావాలు ఆయా ప్రాంతాల సంస్కృతులపై ఆధారపడి ఉంటాయి. సాంకేతిక విప్లవాల నేపథ్యంలో వివిధ ప్రాంతాల లేదా దేశాల మధ్య సమాచార సందేశాలు పెరుగుతూ వస్తున్నాయి. నేటి కరవాణి (సెల్ ఫోన్) యుగంలో ఇవి తృటి కాలంలో సంభవిస్తున్నాయి. ప్రాచీన సంస్కృతికి ప్రతీకౖయెన భారతదేశంలో శారీరక, మానసిక సామాజిక ఆరోగ్య విషయాలే ప్రధాన పాత్ర పోషించాయి కాని, తాత్కాలిక ఉత్ప్రేరకాలు, ఉత్తేజకాల వంటి అన్నపానీయాలకు ప్రాముఖ్యత తక్కువ. ‘టీ’ చరిత్రను పరిశీలిస్తే ఇది మన దేశానికి 16, 17 శతాబ్దాలలోనే దిగుమతి అయిన దాఖలాలు ఉన్నాయి. మన పొరుగు దేశమైన చైనా దీనికి కాణాచి. క్రీ.పూ. 59వ శతాబ్దంలో ‘టీ’ చైనా దేÔ¶ స్థుల కంటబడింది. అనంతరం దక్షిణ, తూర్పు ఆసియా ప్రాంతాలకు వ్యాపించింది. 200 సంవత్సరాల కిత్రం బ్రిటిష్ వారు కూడా గ్రహించారు. దీని సేవనను అలవాటు చేసుకోవడంతో బాటు వ్యాపార వస్తువుగా మార్చి పారేశారు. ‘టీ’ అంటే? ఇది ఒక వెచ్చని లేదా వేడివేడి ద్రవ పదార్థంగా జగద్విదితం. ‘కేమిల్లియా సెనిన్సిస్’ అనే పేరు గల తక్కువ ఎత్తుగా పెరిగే పొదల నుండి సేకరించిన ‘ఆకులు’ నీళ్లకు జోడిస్తే కనిపించే రూపమే ‘టీ’ నామధేయంతో ప్రాచుర్యం పొందింది. రూపాంతరాలలో ‘తేనీరు, తేయాకు’లుగా వ్యవహరిస్తున్నాం. ఈ తేనీటిని చైనా భాషలో ‘చా’ అంటారు. అది పారశీకులకు వ్యాపించిన పిదప ‘చాయ్’ గా మారింది. టీ ఆకుల స్వరూపం: వాస్తవానికి ఈ ఆకులు ‘ఆకు పచ్చ’ రంగులో ఉంటాయి. చెట్టు లేదా పొదల నుండి వేరు చేయగానే కొంచెం వంగుతాయి. బయటì ఆక్సిజన్ సంయోగం లేనంత వరకు తెలుపు రంగులో ఉంటాయి. మరి కొంత కాలవ్యవధిలో పసుపు పచ్చగా ఉంటూ, ఆకులు వంకరలు తగ్గుతాయి. ఆక్సిజన్‌ను పూర్తిగా గ్రహించిన ఆకులు నల్లబతాయి. వీటి నుండి ‘టీ’ పొడిని తయారుచేస్తారు. తక్కువ గరకుగాను, ఎక్కువ గరకుతోను, చిన్నపాటి ముక్కలుగాను తయారుచేయడం పరిపాటి. తయారీ విధానాలలోని మార్పుల వల్ల... మనకు లభించే టీ పొడి ‘తెలుపు, పసుపు పచ్చ, ఆకు పచ్చ, నలుపు’ రంగులుగా కనపడుతుంది.హెర్బల్ టీ అంటే? పైన చెప్పిన టీ ఆకులకు సంబంధం లేని వేరే వృక్షాల యొక్క ఫలాలు (రోజ్ హిప్), పువ్వులు (చమో మిల్), ఆకులు (రూయ్ బస్)... వీటిని నానబెట్టడం వంటి కొన్ని ప్రక్రియల ద్వారా తయారుచేస్తారు. ‘టీ’ని ఎలా తయారుచేస్తారు? ఇది చాలా సులభమైన ఆచారంగా ఉండేది. కావలసిన పరిమాణంలో టీ పొడిని తీసుకొని, వెచ్చని లేదా వేడివేడి నీటిని తగినంత కలిపి, ఓ పది నిమిషాలు ఆగి వడబోస్తే టీ తయారవుతుంది. దాని సాంద్రతను బట్టి పలుచగాను, చిక్కగాను, లేత గులాబీ రంగులోను, కొంచెం నలుపు ఎరుపు రంగులలోను దర్శనమిస్తుంది. మొదట్లో ఇలాంటి టీ (తేనీటి)ని తాగే అలవాటుండేది. ఇప్పటికీ చాలా విదేశాల్లో ఇలాగే సేవిస్తున్నారు. క్రమేణా ప్రాంతీయ ఆచారాలను బట్టి ఈ నీటికి పాలు, పంచదార కలిపారు. తాగేవారి రుచులు కొత్తదనాన్ని వెతుకుతూ... ఏలకుల వంటి సుగంధ ద్రవ్యాలను చేర్చడం మొదలుపెట్టారు. అదేవిధంగా అల్లం లేదా శొంఠి వంటివి కూడా జత కూడాయి. ఈ విధంగా ‘మసాలా టీ’ అనే పేరు కూడా వ్యాపార అభివృద్ధికి దోహదపడింది. ముందుగా టీ డికాక్షన్ తయారుచేసి చివరలో పాలు, శర్కర (పంచదార) కలపడం ఒక పద్ధతైతే, తయారీకి కావలసిన అన్ని పదార్థాలను ఒక్కసారే కలిపి మరిగించడం, వడగట్టి త్రాగటం మరొక విధానం. అవసరాలకు, ఆరోగ్యాలకు అనుగుణంగా కేవలం పలుచటి, నల్లటి టీ తాగేవారు, పాలు పంచదార కలిపి తాగేవారు, బెల్లం కూడా కలుపుకునే వారు, నల్లటి లేదా లేత గులాబీ కషాయానికి తేనె, నిమ్మ రసం కలిపి, రెండు మూడు పుదీనా ఆకులు జోడించి తాగేవారు... రకరకాలుగా ఉన్నారు. అలాగే పైన చెప్పిన ‘హెర్బల్’ టీ పొడిని సేకరించి దానిని ‘టీ’ గా చేసుకుని తాగేవారు చాలామంది ఉన్నారు. టీ గుణధర్మాలు: తేయాకులో తక్కువ శాతంలో ‘కెఫిన్’ అనే పదార్థం ఉటుంది. (కాఫీలో అధికంగా ఉంటుంది). ‘టీ’ లో ధియోఫిల్లిన్ అనే రసాయనిక పదార్థం అధికంగా ఉంటుంది. ఇది వాయునాళాలను వ్యాకోపింప చేసి శ్వాసక్రియను సాఫీగా చేస్తుంది. కాబట్టి ఉబ్బస రోగానికి మంచిది. వాస్తవానికి ‘టీ’ లో పోషక విలువలు శూన్యమనే చెప్పాలి. కేవలం ఔషధ విలువలే హెచ్చు. అలసిపోయిన శరీర కణాలకు, మెదడుకు తక్షణ తాత్కాలిక ఉత్తేజం కలిగించి, హుషారుగా ఉంచుతుంది. ఆకు పచ్చ, నలుపు రంగుల తేయాకులకు క్యాన్సరుని తగ్గించే గుణం ఉన్నట్లు పరిశోధనలు వెల్లడి చేస్తున్నాయి. తేయాకులోని ‘పోలిఫినాల్స్’ వల్ల దానికి కొంచెం చేదు రుచి వచ్చింది. తేయాకులు కూడా వాతావరణ కాలుష్యానికి బలైపోతున్నాయి. అసలు గుణాలు తగ్గి, ‘ఫ్లోరైడ్ మరియు అల్యూమినియం’ ఆధిపత్యం చూపి దేహానికి హాని కలిగిస్తున్నాయి. మిగిలిన ఆరోగ్య ప్రయోజనాలన్నీ దాంట్లో చేర్చే ఇతర ద్రవ్యాలను బట్టి ఉంటాయి. తేనె బలకరం, నిమ్మ రసం పుష్టికరం, అల్లం శొంఠి వంటివి జీర్ణక్రియకు ప్రయోజనం. పాలు, బెల్లం మొదలైనవి ధాతుపుష్టిని కలిగించి, రక్తవర్థకంగా తోడ్పడతాయి.ప్రస్తుతం ‘ఇరానీ చాయ్’ చాలా ప్రాచుర్యంలో ఉంది. అందులో కలిపే అసలు ద్రవ్యం ఇంకా రహస్యమే. (గంజాయి, నల్లమందు, ఎముకల పొడి వంటివి కలుపుతారని అందరూ ఊహించుకొని సంభాషించుకుంటారు). ఆయుర్వేదం: ఇది క్రీ.శ. 16వ శతాబ్దం అనంతరం మనకు సంక్రమించింది.‘ప్రియ నిఘంటువు’ అనే గ్రంధంలో ఇలా ఉంది:‘చాయం సాయం ప్రాతః ప్రాయః మనుజైః ప్రయుజ్యతే త్వధునా‘ఉష్ణం విబంధ జననం స కషాయం స్ఫూర్తిదం క్షణికమ్‘‘ఉదయం, సాయంత్రం కొంచెం సేవించడం మనుషులకు అలవాటైంది. శరీరానికి వేడి చేసి క్షణిక ఉత్సాహాన్ని ఇస్తుంది. కొంచెం వగరు, చేదు రుచితో ఉండి మలబంధకం చేస్తుంది కనుక ‘అతిసార’ వ్యాధికి మంచిది. అంటే – అధిక విరేచనాలను తగ్గిస్తుంది. యోగరత్నాకరుడు తేయాకులను ‘శ్యామపర్ణి’గా అభివర్ణించాడు. (అంటే నీలి రంగు ఆకు అని అర్థం) గమనిక: ఈ గుణాలు కేవలం వేడి నీటిలో తేయాకును కలిపిన ‘ఫాంటము’ అనబడే ద్రావకానికి ఉంటాయి. మిగిలిన ద్రవ్యాలేమీ కలపకూడదు.గుర్తుంచుకోవలసిన సారాంశం: పాలు శర్కర కలుపంగ వలదు సుమ్మిగోరు వెచ్చని నీటిలో కోరినంతకలుపు తేయాకు పొడిని చెలిమి మీరకనుమ! లాభములు మసాల దినుసులందు. – డా. వృద్ధుల లక్ష్మీనరసింహ శాస్త్రి ప్రముఖ ఆయుర్వేద వైద్యులు మీ వంటలకు ఆహ్వానం మీరూ గొప్ప చెఫ్ అయి ఉండొచ్చు. కిచెన్‌లో రుచికరమైన ప్రయోగాలు చేస్తుండవచ్చు. మీ వంట తిన్నవారు ఏదో ఒక సాకుతో మీ ఇంటికి పదేపదే వస్తుండవచ్చు. ఆ రుచిని పాఠకులకు పంచండి. ఒకే రకమైన పదార్థంతో ఆరు రకాల వంటకాలను తయారు చేయండి. మీరు చేసిన వంటల ఫొటోలను, రెసిపీలను మీ ఫొటో జతచేసి మాకు పంపండి. వంటకు స్త్రీ పురుష భేదం లేదు. నాన్నా, బాబాయ్, అబ్బాయ్... ఎవరైనా వంట చేసి లొట్టలేయిం చవచ్చు. మీకిదే ఘుమఘుమల వెల్కమ్.mail: familyvantakalu@gmail.com లేదా పోస్టు ద్వారా పంపండి. మా చిరునామా: సాక్షి వంటలు, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. -
గ్రీన్ టీ రోజుకు నాలుగుసార్లు తీసుకుంటే..
లండన్ : దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించాలంటే ఆరోగ్యకర ఆహారం అవసరమే అయినా ఇష్టమైన ఆహారానికి నిత్యం దూరంగా ఉండాల్సిన అవసరం లేదని తాజా అథ్యయనం వెల్లడించింది. దీర్ఘాయుష్షు కోసం చాక్లెట్, కాఫీ, రెడ్వైన్లతో పాటు గ్రీన్ టీ, వెల్లుల్లి, కోడిగుడ్లు తరచూ ఆహారంలో తీసుకోవాలని డైటీషియన్లు సూచిస్తున్నారు. వీటిలో పుష్కలంగా ఉండే యాంటీఆక్సిడెంట్ల కారణంగా ఆరోగ్యకర జీవనానికి ఇవి ఉపయోగపడతాయని ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ డైటీషియన్ డాక్టర్ జొనా మెక్‌మిలన్ చెబుతున్నారు. రోజూ నాలుగు కప్పుల గ్రీన్ టీతో పాటు భోజనంతో రెడ్‌వైన్ తీసుకుంటే దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవితం గడపవచ్చని చెప్పారు. యాంటీ ఆక్సిడెంట్లతో కూడిన ఆహారం శరీరంలో వాపును తగ్గించి కణజాలం దెబ్బతినకుండా కాపాడుతుందని వివరించారు. రోజూ ఎనిమిది కప్పుల కాఫీ తీసుకున్న వారు కాఫీ తీసుకోని వారితో పోలిస్తే దీర్ఘకాలం జీవించినట్టు ఇటీవల వెల్లడైన పరిశోధనను ఆమె ప్రస్తావించారు. గ్రీన్ టీలో సైతం ఉండే పోలిపినాల్స్ కూడా ఇదే తరహాలో శరీరానికి మేలు చేస్తాయని చెప్పుకొచ్చారు. -
గ్రీన్ టీ, రెడ్వైన్లతో మేలేమిటో తెలిసింది!
గ్రీన్ టీ, రెడ్ వైన్లలో ఉండే ఒక ప్రత్యేకమైన రసాయన మూలకం శరీరంలో విషతుల్యమైన పదార్థాలు ఏర్పడకుండా అడ్డుకుంటాయని టెల్అవీవ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు అంటున్నారు. పుట్టుకతోనే వచ్చే కొన్ని రకాల వ్యాధులను ఈ మూలకం ద్వారా అడ్డుకోవచ్చునని చెబుతున్నారు. జన్యులోపం ఫలితంగా కీలకమైన ఎంజైమ్ ఉత్పత్తి తగ్గిపోయి, జీవక్రియలకు సంబంధించిన కొన్ని సమస్యలు పుట్టుకతోనే వస్తూంటాయని... గ్రీన్ టీ, రెడ్ వైన్లలో ఉండే ఎపిగాల్లో కాటెచిన్ గాలేట్, టానిక్ ఆసిడ్లు ఈ సమస్యను అధిగమించేందుకు ఉపయోగపడతాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఎహుద్ గాజిట్ తెలిపారు. ఈ రెండు రసాయనాలను డీఎన్ఏ వంటి వాటితో కలిపి చూసినప్పుడు రెండూ అమైలాయిడ్ వంటి విషాలు తయారుకాకుండా అడ్డుకున్నట్టు గాజిట్ చెప్పారు. కంప్యూటర్ సిములేషన్లను ఉపయోగించినప్పుడు కూడా ఇవే రకమైన ఫలితాలు కనిపించాయని తెలిపారు. వేర్వేరు వ్యాధుల్లో జీవక్రియలను ప్రభావితం చేసే రసాయనాల ప్రభావాన్ని అర్థం చేసుకునేందుకు తమ పరిశోధన సాయపడుతుందని, వైద్యంలో ఇది కొత్త అధ్యాయానికి దారితీస్తుందని గాజిట్ వివరించారు. -
గ్రీన్ టీ రసాయనంతో గుండె భద్రం!
గ్రీన్ టీలోని ఓ రసాయనం గుండెపోటు రాకుండా నివారిస్తుందని లాంకస్టర్, లీడ్స్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ రసాయనాన్ని ఇప్పటికే అల్జీమర్స్ వ్యాధి చికిత్సకు ఉపయోగిస్తున్నారని, తాజా పరిశోధనల్లో గుండెజబ్బులకు కూడా ఉపయోగపడుతుందని తెలిసిందని వారు చెప్పారు. ఎపిగాల్లోకాటెచిన్ –3 గాలేట్ (ఈజీసీజీ) అనే ఈ రసాయనం రక్తనాళాల్లో పేరుకుపోయే గార (ప్లాక్) కరిగిపోయేలా చేస్తుందని, అంతేకాకుండా మంట/వాపుల నుంచి రక్షణ కూడా కల్పిస్తుందని ఈ పరిశోధనల్లో పాల్గొన శాస్త్రవేత్త డేవిడ్ మిడిల్టన్ తెలిపారు. అమిలాయిడ్ అనే పదార్థంతో ఏర్పడే గార నిర్మాణాన్ని ఈజీసీజీ మార్చేస్తుందని, ఈ క్రమంలో గార పేరుకుపోయేందుకు కారణమవుతున్న ప్రొటీన్‌పై కూడా ప్రభావం చూపుతుందని డేవిడ్ చెప్పారు. నాడీ సంబంధిత వ్యాధి అల్జీమర్స్లోనూ గారను తొలగించడం ద్వారా ఈ రసాయనం వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుందని వివరించారు. అంతా బాగుందనుకుని.. వెంటనే గ్రీన్ టీ తాగడం మొదలుపెట్టడం కూడా అంతమంచిదేమీ కాదని జాగ్రత్త చెబుతున్నారు బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్‌కు చెందిన జెరెమీ పియర్సన్. ఈజీసీజీని మన శరీర వ్యవస్థ సులువుగా జీర్ణించుకోవడం దీనికి కారణమని ఆయన అన్నారు. అయితే ఈజీసీజీలో స్వల్ప మార్పులు చేయడం ద్వారా భవిష్యత్తులో గుండెజబ్బులు, అల్జీమర్స్లకు మెరుగైన చికిత్స అందే అవకాశముందని అన్నారు. -
తేయాకు కణాలతో ఊపిరితిత్తుల కేన్సర్‌కు కొత్త ఔషధం
గ్రీన్ టీలో బోలెడన్ని యాంటీఆక్సిడెంట్లు ఉంటాయని, తరచూ ఈ పానీయాన్ని సేవించడం ద్వారా కేన్సర్‌ను నివారించవచ్చునని మనం తరచూ వింటుంటాం. ఇందులో వాస్తవం లేకపోలేదు. భారతియార్, స్వాన్సీ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఇంకో అడుగు ముందుకేసి తేయాకులోకి కొన్ని ప్రత్యేక కణాల ద్వారా ఊపిరితిత్తుల కేన్సర్‌కు సమర్థమైన చికిత్స ఇవ్వవచ్చని నిరూపించారు. ఈ క్వాంటమ్ డాట్ కణాలు అతి సూక్ష్మమైనవి. ధర్మాలూ అనూహ్యం. కొన్ని రసాయనాలతో కలిసి వేర్వేరు రంగుల్లో ప్రతిదీప్తిని కనబరుస్తాయి. అందువల్లనే వీటిని ఇప్పటికే సోలార్ సెల్స్ మొదలుకొని వైద్య పరీక్షల్లోనూ వాడుతున్నారు. కేన్సర్ చికిత్సలోనూ, యాంటీబయాటిక్ నిరోధకతను ఎదుర్కొనేందుకూ ఈ క్వాంటమ్ డాట్స్ ఉపయోగపడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతియార్, స్వాన్సీ యూనివర్శిటీల శాస్త్రవేత్తలు తేయాకు నుంచి క్వాంటమ్ డాట్ కణాలను వెలికి తీశారు. వీటి సమక్షంలో ఊపిరితిత్తుల కేన్సర్ కణాలు వెలిగిపోవడమే కాకుండా.. వాటిని నాశనం కూడా చేసేశాయి. కేన్సర్ కణాల్లోకి చొచ్చుకుపోయిన క్వాంటమ్ డాట్స్ 80 శాతం కణాలను నిర్వీర్యం చేసినట్లు ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త సుధాకర్ పిచ్చయి ముత్తు తెలిపారు. క్వాంటమ్ డాట్స్‌ను కేన్సర్ చికిత్సకు మాత్రమే కాకుండా యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలున్న రంగుల తయారీలోనూ వాడవచ్చునని, తేయాకు నుంచి వీటిని మరింత చౌకగా తయారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు.