లండన్ : దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించాలంటే ఆరోగ్యకర ఆహారం అవసరమే అయినా ఇష్టమైన ఆహారానికి నిత్యం దూరంగా ఉండాల్సిన అవసరం లేదని తాజా అథ్యయనం వెల్లడించింది. దీర్ఘాయుష్షు కోసం చాక్లెట్, కాఫీ, రెడ్‌వైన్‌లతో పాటు గ్రీన్ టీ, వెల్లుల్లి, కోడిగుడ్లు తరచూ ఆహారంలో తీసుకోవాలని డైటీషియన్లు సూచిస్తున్నారు. వీటిలో పుష్కలంగా ఉండే యాంటీఆక్సిడెంట్ల కారణంగా ఆరోగ్యకర జీవనానికి ఇవి ఉపయోగపడతాయని ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ డైటీషియన్ డాక్టర్ జొనా మెక్‌మిలన్ చెబుతున్నారు.
రోజూ నాలుగు కప్పుల గ్రీన్ టీతో పాటు భోజనంతో రెడ్‌వైన్ తీసుకుంటే దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవితం గడపవచ్చని చెప్పారు. యాంటీ ఆక్సిడెంట్లతో కూడిన ఆహారం శరీరంలో వాపును తగ్గించి కణజాలం దెబ్బతినకుండా కాపాడుతుందని వివరించారు.
రోజూ ఎనిమిది కప్పుల కాఫీ తీసుకున్న వారు కాఫీ తీసుకోని వారితో పోలిస్తే దీర్ఘకాలం జీవించినట్టు ఇటీవల వెల్లడైన పరిశోధనను ఆమె ప్రస్తావించారు. గ్రీన్ టీలో సైతం ఉండే పోలిపినాల్స్ కూడా ఇదే తరహాలో శరీరానికి మేలు చేస్తాయని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment