ట్రంప్.. గ్రీన్ టీ తాగి... మారండి | Indian firm delivers Assam green tea to Donald Trump to 'purify mind' | Sakshi
Sakshi News home page

ట్రంప్.. గ్రీన్ టీ తాగి... మారండి

Published Fri, Jul 15 2016 4:59 AM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

ట్రంప్.. గ్రీన్ టీ తాగి... మారండి - Sakshi

ట్రంప్.. గ్రీన్ టీ తాగి... మారండి

వాషింగ్టన్: ‘‘మిస్టర్ ట్రంప్! నమస్తే...భారత్ నుంచి మీకోసం చాలా గ్రీన్ టీ ప్యాకెట్లు పంపుతున్నాం. దయచేసి ఈ టీ తాగండి. మీ కోసం. అమెరికా కోసం. మొత్తం ప్రపంచం కోసం. ప్రమాదకర కారకాలతో గ్రీన్ టీ పోరాడుతుంది. మెదడును శుద్ధి చేస్తుంది. ఆరోగ్య సమతుల్యాన్ని తిరిగి పొందడంలో సాయపడుతుంది. ఇప్పటికీ మించిపోయినదేం లేదు.. మీరు మారడానికి ’’ అనే సందేశంతో కోల్‌కతాకు చెందిన టీ కంపెనీ ఒకటి అమెరికాలో  రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు 6 వేల అస్సామీ గ్రీన్ టీ ప్యాకెట్లు పంపింది. సుమారు 4 ఏళ్లకు సరిపడే ఈ ప్యాకెట్ల విలువను కంపెనీ వెల్లడించలేదు. గ్రీన్ టీ తన సుగుణాలతో  ట్రంప్‌లో మార్పు తెస్తుందని భావిస్తున్నట్లు కంపెనీ ఎండీ సుమిత్ షా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement