గ్రీన్ టీ తో క్యాన్సర్కి చెక్ | How green tea rids you of oral cancer | Sakshi
Sakshi News home page

గ్రీన్ టీ తో క్యాన్సర్కి చెక్

Published Thu, Jan 29 2015 2:53 PM | Last Updated on Sat, Sep 2 2017 8:29 PM

గ్రీన్ టీ తో క్యాన్సర్కి చెక్

గ్రీన్ టీ తో క్యాన్సర్కి చెక్

వాషింగ్టన్: మానవ శరీరంలోని క్యాన్సర్ కారక కణాలని నాశనం చేసే పదార్ధాలు గ్రీన్ టీలో ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. గ్రీన్ టీ పై జరిపిన అధ్యయనంలో.. దీనివల్ల శరీరానికి ఉపయోగపడే ఇతర కణాలకి ఎలాంటి హాని లేదని తేలింది. గ్రీన్ టీ తీసుకోవడం వల్ల నోటి క్యాన్సర్కి కారణమయ్యే కణాలు మాత్రమే నశిస్తాయని, ఆరోగ్యకరమైన ఇతర కణాల మీద మాత్రం ఎలాంటి ప్రభావం ఉండబోదని పెన్ స్టేట్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫేసర్ జషువా లాంబర్ట్ తెలిపారు.
 
ఇంతకుముందు జరిపిన అధ్యయనాల్లో  గ్రీన్ టీ కేవలం క్యాన్సర్ కారక కణాలని మాత్రమే ఎందుకు నశించేలా చేస్తుందో స్పష్టంగా తెలియలేదు. ప్రస్తుతం జరిపిన అధ్యయనంలో గ్రీన్ టీలోని ఈజీసీజీ అనే మూలకం వల్ల క్యాన్సర్ కారక కణాలని నశింపజేసే ప్రక్రియ మైటోకాండ్రియాలో ప్రారంభమవుతుందని తేలింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement