బ్యూటిప్స్ –హెయిర్ కేర్
వేసవిలో ఉడకపోతతో ఇబ్బంది పడుతూంటాం. చిన్న చిన‍్న ఇబ్బందులు కూడా ఎదురవుతుంటాయి. ప్రధానంగా ఈ మండుటెండల్లో జుట్టు రాలిపోయే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అందువల్ల కొన్ని చిన్న చిట్కాలను పాటించడం ద్వారా దానిని అరికట్టవచ్చు.
గ్రీన్ టీ..
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న గ్రీన్ టీ జుట్టు పెరుగుదలను, బలాన్ని పెంచుతుంది. 2–3 గ్రీన్ టీ బ్యాగ్‌లను వేడి నీటిలో నానబెట్టండి. చల్లారిన తర్వాత, మీ జుట్టు, తలపై మసాజ్ చేయాలి. ఒక గంట పాటు అలాగే ఉంచి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
మెంతి గింజల పేస్ట్
మెంతులను రాత్రంతా నానబెట్టి, ఆపై వాటిని పేస్ట్‌గా రుబ్బుకోవాలి. ఈ గ్రోత్–బూస్టింగ్ మాస్క్‌ని మీ జుట్టుకు అప్లై చేసి 30–40 నిమిషాల పాటు అలాగే ఉంచండి. తరువాత, చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి.
Comments
Please login to add a commentAdd a comment