Beauty Secrets
-
గ్లామరస్ క్వీన్ దీపిక బ్యూటీ సీక్రెట్ ఇదే..!
బాలీవుడ్ గ్లామరస్ క్వీన్ దీపిక పదుకునే తన నటన, అభినయంతో మంచి ఫ్యాన్ పాలోయింగ్‌ని సంపాదించుకుంది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మూవీ 'ఓం శాంతి ఓం'తో ఒక్కసారిగా రాత్రికే రాత్రే స్టార్ అయిపోయింది. ఇక అక్కడ నుంచి వెనుదిరిగి చూడకుండా వరుస సినిమాలతో విజయపథంలో దూసుకుపోతుంది. అంతేగాదు బాలీవుడ్లో అత్యధిక పారితోషం తీసుకుంటున్న హీరోయిన్ల సరసన నిలిచింది. ఇక దీపిక చందమామలాంటి ముఖంతో మంచి స్టన్నింగ్ లుక్‌తో ఇట్టే ప్రేకక్షులను కట్టిపడేస్తుంది. అందుకు ఆమె వన్నెతరగని అందమే కారణం. అసలు వాళ్లు అంతలా గ్లామర్‌ని ఎలా మెయింటెయిన్ చేస్తున్నారు? ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని కుతుహలంగా ఉంటుంది కదా!. మరీ దీపికా పదుకునే బ్యూటీ రహస్యం ఏంటో చూద్దామా..! దీపిక చర్మ సంరక్షణ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తన తల్లి నుంచే నేర్చుకున్నానని చెబుతోంది. తప్పనిసరిగా మేకప్‌ని తొలగించే.. నిద్రకు ఉపక్రమించే ముందు మేకప్‌ని తొలగించే పడుకుంటానని చెబుతోంది దీపిక. ఎంతటి బిజీ షెడ్యూల్ అయినా సరే ముఖాన్ని శుభ్రంగా కడుక్కోనిదే పడుకోనని అంటోంది. దీని వల్ల ముఖంపై మలినాలు, మొటిమలు, బ్లాక్‌హెడ్స్ వంటివి ఉండవని చెబుతోంది. సన్‌స్క్రీన్ తప్పనిసరి.. బయటకు వెళ్తే తప్పనిసరిగా సన్‌స్క్రీన్ లేకుండా వెళ్లనని అంటోంది. దీని వల్ల యూవీ కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుకోగలం. అలాగే వృధాప్య ప్రమాదాన్ని నివారిస్తుంది. చర్మ క్యాన్సర్ సంభావ్యతను తగ్గిస్తుంది. ప్రకాశవంతమైనే మేని ఛాయను ప్రోత్సహిస్తుంది. వేసవి లేదా చలికాలంలో ఇంటి లోపల లేదా బయటతో సంబంధం లేకుండా తన దినచర్యలో భాగంగా ప్రతిరోజూ రెండుసార్లు తప్పనిసరి ముఖానికి సన్‌స్క్రీన్ రాసుకుంటానని చెబుతోంది. క్లోడ్ వాటర్ థెరపీ అలాగే ముఖానికి క్లోడ్ వాటర్ థెరఫీ కూడా ప్రతిరోజు తీసుకుంటానని అంటోంది. ఇది ముఖాన్ని ఫ్రెష్‌గా ఉండేలా చేస్తుందని అంటోంది. అలాగే ముఖం అంతా రక్త ప్రసరణ సాఫీగా జరిగి చర్మం ప్రకాశవంతంగా ఉండటంలో తోడ్పడుతుంది. హైడ్రేటెడ్‌గా ఉంచడం.. తన దినచర్యలో భాగంగా నూనె లేదా మాయిశ్చరైజర్ తప్పనిసరిగా ముఖానికి రాయడం విస్మరించదు. ఇది చర్మాన్ని డీ హైడ్రేషన్‌కి గురికాకుండా చేస్తుంది. ఇలా ముఖం తేమగా ఉండటం వల్ల ముకం ప్రకాశవంతంగా ఉంటుంది. కొబ్బరి నూనె.. శిరోజాలకు తప్పనిసరిగా కొబ్బిర నూనెనే ప్రివర్ చేస్తానని చెబుతోంది. ఇది చుండ్రుని నివారించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఫలితం జుట్టు మంచి షైనీగా మెరుస్తు ఉంటుంది. గ్లామర్ మెయింటెయిన్ చేయడంలో శిరోజాల అందం కూడా ముఖ్యమేనని అంటోంది. జీవనశైలి గ్లోయింగ్ స్కిన్ అనేది చర్మ సంరక్షణ ఉత్పత్తులపై మాత్రమే ఆధారపడి ఉండదని నొక్కి చెబుతోంది దీపిక. మంచి జీవనశైలి, చక్కటి వ్యాయామం, ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండటం వంటి అలవాట్లే మనం అందాన్ని ఇనుమడింప చేస్తాయని చెబుతోంది. అవే మన ముఖాన్ని కాంతిమంతంగా ఉండేలా చేస్తుంది. పైగా ఆర్యోగకరమైన జీవితాన్ని పొందగలమని అన్నారు. (చదవండి: జుట్టు మృదువుగా నిగనిగలాడాలంటే గంజితో ఇలా చేయండి!) -
బ్యూటిప్స్: వేసవిలో జుట్టు సమస్యా? అయితే ఇలా చేయండి!
వేసవిలో ఉడకపోతతో ఇబ్బంది పడుతూంటాం. చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఎదురవుతుంటాయి. ప్రధానంగా ఈ మండుటెండల్లో జుట్టు రాలిపోయే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అందువల్ల కొన్ని చిన్న చిట్కాలను పాటించడం ద్వారా దానిని అరికట్టవచ్చు. గ్రీన్ టీ.. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న గ్రీన్ టీ జుట్టు పెరుగుదలను, బలాన్ని పెంచుతుంది. 2–3 గ్రీన్ టీ బ్యాగ్‌లను వేడి నీటిలో నానబెట్టండి. చల్లారిన తర్వాత, మీ జుట్టు, తలపై మసాజ్ చేయాలి. ఒక గంట పాటు అలాగే ఉంచి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. మెంతి గింజల పేస్ట్ మెంతులను రాత్రంతా నానబెట్టి, ఆపై వాటిని పేస్ట్‌గా రుబ్బుకోవాలి. ఈ గ్రోత్–బూస్టింగ్ మాస్క్‌ని మీ జుట్టుకు అప్లై చేసి 30–40 నిమిషాల పాటు అలాగే ఉంచండి. తరువాత, చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇవి చదవండి: Aarzoo Khurana: ఆమె ఉన్న చోట పులి ఉంటుంది -
కీర్తి సురేశ్ అందంగా ఉండేందుకు.. అవి వాడుతుందట!
తమిళ నటి కీర్తీ సురేశ్ తెలుగు, తమిళం, మలయాళం సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇటీవలే దసరా సినిమాతో మంచి విజయాన్ని దక్కించుకుంది. అలాగే చిరంజీవి సినిమా బోళా శంకర్‌లో అతడికి చెల్లిగా నటించి మంచి నటిగా మార్కులు కొట్టేసింది. కళ్లు చెదిరే అందంతో, క్యూట్ లుక్స్‌తో మతిపోగొట్టే కీర్తీ తన అందం వెనుక దాగున్న రహస్యం గురించి పంచుకుంది. బ్యూటీ సీక్రెట్ మానసిక, శారీరక ఉల్లాసం కోసం నేను ప్రతిరోజూ యోగా చేస్తాను. పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవడానికి.. ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటాను. చర్మసంరక్షణలో సహజమైన పద్ధతుల్నే పాటిస్తాను. అంటే.. నారింజ తొక్కల పొడిలో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి స్క్రబ్ చేసుకోవడం.. పచ్చి పసుపు కొమ్ము పేస్ట్‌లో కొన్ని చిక్కటి పాలు కలిపి ఫేస్ మాస్క్ వేసుకుంటాను. షూటింగ్ లేని సమయంలో మేకప్‌కి దూరంగా ఉంటాను. అని చెబుతోంది కీర్తి. (చదవండి: వన్నె తరగని నయన తార బ్యూటీ రహస్యం ఇదే..ఆ క్రీమ్ లేకుండా..) -
దానిమ్మ తొక్కలను పడేస్తున్నారా? ఇవి తెలిస్తే అస్సలు వదిలిపెట్టారు
పండ్లు తిన్న తర్వాత సాధారణంగా తొక్కలను పారేస్తుంటాం. కానీ ఆ తొక్కల్లో ఫైబర్, విటమిన్స్, యాంటిఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయన్న విషయం చాలామందికి తెలియదు. దానిమ్మ పండు విషయానికి వస్తే.. దానిమ్మ గింజలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనారోగ్యంతో ఉన్నవారికి దివ్య ఔషధం దానిమ్మ. ఎన్నో సమస్యలను ఈ పండు నయం చేస్తుంది. దానిమ్మ పండే కాదు, తొక్క కూడా చాలా ఉపయోగకరం. దీనిలో యాంటిఆక్సిడెంట్స్ ,ఫినోలిక్ యాసిడ్స్,ప్రోటీన్లు, ఫ్యాటీ యాసిడ్స్ మెండుగా ఉంటాయి. అసలు దానిమ్మ తొక్క ప్రయోజనాలు తెలిస్తే మీరు అసలు వదిలిపెట్టరు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ దానిమ్మను ఇష్టపడతారు. దానిమ్మలోని పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. విటమిన్-సి, కె, బి, ఎ ఇందులో పుష్కలంగా ఉంటాయి. దానిమ్మలోని గుణాలు గుండెసమస్యలు, హైపర్ టెన్షన్, క్యాన్సర్, డయాబెటిస్ వంటి సమస్యలను దూరం చేస్తుంది. ఇక దానిమ్మ గింజల్లోనే కాదు, తొక్కలోనూ అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యాన్నే కాదు, అందాన్ని కూడా పెంచుతుంది. దానిమ్మ రసం కంటే తొక్కలో 50శాతం అదిక మొత్తం యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. మెండుగా యాంటీ ఆక్సిడెంట్లు ► దానిమ్మ తొక్కల్లో ఉండే అధిక యాంటీ ఆక్సిడెంట్లు హార్ట్ ఎటాక్ రిస్క్‌ను తగ్గిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ► చర్మ క్యాన్సర్‌ని తగ్గించడంలో దానిమ్మ తొక్కలు బాగా పనిచేస్తాయి. హానికరమైన యూవీఏ కిరణాల నుంచి ఇది రక్షిస్తుంది. దానిమ్మ తొక్కలతో పొడి చేసుకొని దాన్ని ముఖానికి అప్లై చేసుకుంటే ముఖం చాలా కాంతివంతంగా మెరిసిపోతుంది. ► దానిమ్మ తొక్కలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల చక్కెర స్థాయిలను తగ్గించి బరువును కంట్రోల్లో ఉంచేలా చేస్తుంది. ► దానిమ్మ తొక్కలను మరిగించి ఆ రసాన్ని తాగితే కీళ్లనొప్పలు, గొంతునొప్పి నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. ► దానిమ్మలో రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు మెండుగా ఉంటాయి. దానిమ్మ తొక్కల రసాన్ని మహిళల్లో పీరియడ్స్ సమస్య తగ్గిపోతుంది. ► దానిమ్మ తొక్కలో అధికంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి...తొక్కలను శుభ్రంగా కడిగి రసం తీసి తాగితే , ఆరోగ్యానికి మంచిది. ► కప్పు నీటిలో టీస్పూను దానిమ్మ పొడి, అరచెక్క నిమ్మరసం వేసి తాగినా మంచిదే. దానిమ్మ పొడి చేసుకోండిలా.. దానిమ్మ గింజలను తిని తొక్కలను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తొక్కలను ఎండలో ఆరబెట్టాలి. చక్కగా ఎండిన తర్వాత మిక్సీలో వేసి పొడిచేసుకొని గాలి చొరబడని డబ్బాలో నిల్వచేసుకోవాలి. దానిమ్మతో అందం, మొటిమలు మాయం టేబుల్‌స్పూను దానిమ్మ పొడిలో అరటేబుల్ స్పూను నిమ్మరసం, అరటేబుల్ స్పూను తేనె వేసి చక్కగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులకు స్క్రబ్బర్‌లా రుద్ది కడగాలి. ఈ స్క్రబర్ వల్ల మృతకణాలు , ట్యాన్ తొలగి ముఖ చర్మం మృదువుగా మారుతుంది. దానిమ్మ తొక్కలు మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇందుకోసం ఏం చేయాలంటే.. దానిమ్మ పొడిలో కొన్ని నీళ్లు పోసి మెత్తని పేస్టులా చేసుకొని ముఖానికి అప్లై చేసుకోవాలి. 20నిమిషాల తర్వాత చల్లని నీళ్లతో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుంటే మొటిమల సమస్య తగ్గిపోతుంది. వయస్సురీత్యా వచ్చే ముడతలను కూడా దానిమ్మ తగ్గిస్తుంది. ప్రతిరోజూ ఈ పొడిని రాసుకుంటే మార్పు మీకే కనిపిస్తుంది. కొబ్బరినూనెలో దానిమ్మ తొక్కలను కలపి వేడిచేసి చల్లారాక తలకు పట్టించాలి. 15 నిమిషాల తర్వాత స్నానం చేస్తే చుండ్రు పూర్తిగా తగ్గిపోతుంది. దానిమ్మ తొక్కలు చర్మం pHని సమతుల్యం చేస్తుంది. తేమగా ఉంచుతంది. చర్మ కణాలను పునరుత్పత్తి చేస్తుంది. హానీకరమైన యూవీ కిరణాల నుంచి రక్షిస్తుంది. -
ఇంతందం దానివల్లేనా? నయనతార బ్యూటీ సీక్రెట్స్ ఇవే!
సంచలనం అన్న పదానికి మారు పేరు నయనతార అనవచ్చు. ఎక్కడో కేరళ రాష్ట్రంలోని మారుమూల గ్రామంలో పుట్టి, ఆశనిరాశల మధ్య నటిగా మారి, అవమానాలు, విమర్శల నడుమ కథానాయికగా ఎదిగి, ఇప్పుడు క్రేజీ ఇండియన్ హీరోయిన్గా వెలిగొందుతోంది. దక్షిణాది సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం డిమాండ్ చేస్తున్న లేడీ సూపర్ స్టార్‌గా నిలిచింది. నాలుగు పదుల వయసును టచ్ చేయనున్న నయనతార ఇప్పటికీ ఫిట్‌నెస్‌లో తగ్గేదేలే అన్నట్లు ముందుకు సాగుతోంది. పెళ్లి చేసుకుని ఇద్దరు కవల పిల్లలకు తల్లి (సరోగసి విధానం ద్వారా) అయినా నయనతార ఇప్పటికీ కథానాయికగా నటిస్తూనే ఉంది. అందంతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న ఈ బ్యూటీ ఫిట్నెస్ రహస్యం వివరాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అవేంటో చూద్దాం.. నయనతార బరువు తగ్గడానికి, ఫిట్‌గా ఉండటానికి కారణం జిమ్ వర్కౌట్స్, యోగాలే. ముఖ్యంగా నయనతార ఫిట్‌నెస్‌కు యోగా బాగా ఉపకరించింది. ఈమె నిత్యం రెండు గంటలు యోగా చేస్తుందట. అలాగే ఈమె డైట్ ప్లానింగ్‌లో కచ్చితంగా కొబ్బరినీళ్లు ఉండాల్సిందేనట. ఉదయం అల్పాహారంలో పళ్ల రసం తప్పనిసరి. పళ్లరసం బరువును తగ్గించడంతోపాటు ఎనర్జీ పెరగడానికి దోహదపడుతుంది. మధ్యాహ్నం భోజనంలో నాన్ వెజ్, గుడ్డు, కాయగూరలు సమపాళ్లలో తీసుకుంటుంది. ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ కలిగిన పదార్థాలను దూరంగా పెడతుందట. ఇకపోతే రోజుకు 8 గంటలు నిద్ర పోవడమనే అలవాటును క్రమం తప్పకుండా పాటిస్తుందట. మంచి నిద్రవల్ల కూడా బరువును కంట్రోల్లో ఉంచుతుందన్నమాట! చదవండి: సన్మానం చేస్తే తినడానికి అరటిపండ్లు తేవొచ్చుగా అని దీనంగా అడిగిన టంగుటూరి! -
వాలు కనుల కోసం ఎలక్ట్రిక్ ఐలాష్ కర్లర్.. ఎలా పనిచేస్తుందంటే!
కళైన ముఖానికి.. వాలు కనులు తెచ్చిపెట్టే అందమే వేరు. అందుకే కొంతమంది అమ్మాయిలు.. తమ కనురెప్పలకు మస్కారా అప్లై చేస్తూ.. ఐలాష్ స్టిక్కర్స్ అతికించుకుంటూ తమ కన్నుల సోయగాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాంటి బ్యూటీ లవర్స్ కోసం వచ్చిందే ఈ ఎలక్ట్రిక్ ఐలాష్ కర్లర్! ఇందులో చాలా మోడల్స్.. చాలా ఆప్షన్స్‌తో అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో కొన్నిటిని ఇప్పుడు చూద్దాం. 1. ఈ మోడల్ టూల్.. త్రీ టెంపరేచర్ మోడ్స్‌తో పనిచేస్తుంది. మొదటి మోడ్ షార్ట్ ఐలాషెస్‌కి బ్లూ లైట్‌తో లో – టెంపరేచర్ని, రెండవ మోడ్.. స్టాండర్డ్ ఐలాషెస్‌కి ఎల్లో కలర్‌తో మీడియం టెంపరేచర్ని అందించగా.. మూడవ మోడ్ హార్డ్ ఐలాషెస్‌కి రెడ్ కలర్‌తో హై టెంపరేచర్ని అందిస్తుంది. 10 సెకండ్స్లో ఫాస్ట్ హీటింగ్, 40 సెకండ్స్లో రాపిడ్ కర్లింగ్ సెట్ చేస్తుంది. పైగా ఈ ట్రీట్మెంట్ తీసుకున్న 24 గంటల పాటు కనురెప్పలు అలానే బ్యూటీపుల్ లుక్‌తో ఉంటాయి. ఈ టూల్‌కి ఉండే మినీ హీటర్.. డబుల్ లేయర్ కోంబ్‌తో సౌకర్యవంతంగా ఉంటుంది. దీనికి ఒక్కసారి చార్జింగ్ పెడితే చాలా కాలం నడుస్తుంది. 2. ఈ టూల్ కూడా మల్టీ ఫంక్షనల్ డివైజే. ఒకే ఒక్క నిమిషంలో త్రీ టెంపరేచర్ సెట్టింగ్స్‌తో పనిచేస్తుంది. దీనికి సుమారు 2 గంటలు చార్జింగ్ పెడితే... కొన్ని రోజుల పాటు చక్కగా పనిచేస్తుంది. ఈ టూల్ అచ్చం హెయిర్ కర్లర్లా.. మినీ హీటర్ విచ్చుకుని.. రెండు భాగాలుగా విడిపోయి.. కనురెప్పలను అందంగా మెలి తిప్పుతుంది. అందుకు ఈ టూల్ ముందున్న చిన్న బటన్ యూజ్ అవుతుంది. 3.ఈ టూల్.. పైవాటిలానే పని చేస్తుంది. అయితే ఆప్షన్స్, టెంపరేచర్ వంటివి డివైజ్‌కి ఉన్న డిస్ప్లేలో స్పష్టంగా కనిపిస్తాయి. దాంతో వినియోగదారులకు మరింత ఈజీగా ఉంటుంది. భలే ఉన్నాయి కదూ? వీటిని ఒక పెన్ మాదిరి సులభంగా హ్యాండ్ బ్యాగ్‌లోనో లేదా మేకప్ కిట్లోనో వేసుకుని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. మరింకెందుకు ఆలస్యం? క్వాలిటీపై వినియోగదారుల రివ్యూస్‌ని గమనించి.. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేయండి. -
నా బ్యూటీ సీక్రెట్ అదే!
సమంత చాలా క్యూట్‌గా ఉంటారు. ఆమె వాడే మేకప్ ఏ బ్రాండో? ఈ బ్యూటీ బాధలో ఉన్నప్పుడు దాన్నుంచి ఎలా బయటపడతారు? మామగారు నాగార్జున గురించి ఈ కాబోయే కోడలి అభిప్రాయం ఏంటి?.. వంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. ఇవే కాదు.. ఇంకా బోల్డన్ని ప్రశ్నలకు సమంత ఏం సమాధానాలిచ్చారో తెలుసుకుందాం.. కథానాయికగా ఇంత మంచి స్థాయికి చేరుకుంటానని ఊహించారా? లేదు.. కానీ లక్ష్యంగా పెట్టుకున్నాను. ఛాన్స్ వస్తే భవిష్యత్తులోకి వెళతారా లేక గతంలోకి వెళతారా? ప్రస్తుతం నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఏ పదం ఎక్కవసార్లు యూజ్ చేస్తుంటారు? బేబీ. నాగచైతన్య, మీరు మళ్లీ ఎప్పుడు కలిసి నటిస్తారు? మాకూ నటించాలని ఉంది. తప్పకుండా నటిస్తాం. బహుశా వచ్చే ఏడాది ఈ ప్రాజెక్టు పట్టాలెక్కవచ్చు. మీరు బాగా భయపడే విషయం? ఫెయిల్యూర్ అంటే చాలా భయం. కామెడీ ఫిల్మ్ చేస్తారా? హారర్ ఫిల్మ్చేస్తారా...? ఛాన్స్ వస్తే రెండూ చేస్తాను. ప్రెజెంట్ మీరు ఏ మేకప్ బ్రాండ్ వాడుతున్నారు? మార్క్ జాకబ్స్. శునకాల్లో మీకు నచ్చే విషయం? కారణం లేకుండా అవి అందిరినీ ఇష్టపడతాయి. బాధను అధిగమించడానికి ఏం చేస్తారు? ఐస్క్రీము, చాక్లెట్లూ లాగించేస్తాను. కాబోయే మామగారు నాగార్జున గురించి ఒక్క మాటలో... ఫర్ఫెక్షనిస్ట్. పెళ్లయ్యాక ఆయన్ను ఏమని పిలుస్తారు? ఇంకా ఏమీ అనుకోలేదు. భూమి మీద మీకు ఇష్టమైన స్థలం? ఇంకేముంటుంది? మా ఇల్లు. మీ బ్యూటీ సీక్రెట్ ఏంటి? క్యాలమైన్ లోషన్. -
అందుకే పుట్టావా అంటుంటారు!
పదేళ్ల క్రితం ఎలా ఉన్నారో కాజల్ అగర్వాల్, ఇప్పుడూ అలానే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే... అప్పటికన్నా ఇంకా సన్నబడి, మెరుపు తీగలా తయారయ్యారు. మరి, మీలా ఉండాలనుకునే అమ్మాయిలకు కొన్ని టిప్స్ ఏమైనా ఇస్తారా? అని కాజల్ అగర్వాల్‌ని అడిగితే - ‘‘ప్రత్యేకంగా టిప్స్ చెప్పడం తెలియదు కానీ, నేనేం చేస్తానో చెబుతాను. ఉదయాన్నే నిద్ర లేవగానే వాటర్ తాగుతాను. ఆ తర్వాత ఎగ్ వైట్స్, బిస్కెట్స్, టీ, కాఫీ.. ఇదే నా బ్రేక్‌ఫాస్ట్. లంచ్‌కు దాల్, సబ్జీ, రైస్, రోటీ తీసుకుంటాను. రాత్రి ఏడు గంటలకు లైట్‌గా డిన్నర్ చేస్తాను. రోటీ లేక కొంచెం అన్నం, పప్పు తీసుకుంటాను. ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల లోపు ప్రతి రెండు గంటలకోసారి ఏదో ఒకటి తింటుంటాను. ఉదాహరణకు బ్రేక్‌ఫాస్ట్ తీసుకున్న రెండు గంటలకు రైఫూట్స్, ప్రొటీన్ షేక్లాంటివి, లంచ్ అయిన రెండు గంటలకు బిస్కెట్స్, కొబ్బరినీళ్లు, ఫ్రూట్ జూస్లాంటివి తీసుకుంటాను. నా కో స్టార్స్ అయితే ‘ఎప్పుడూ ఏదో ఒకటి తింటూ కనిపిస్తావు.. తినడానికే పుట్టావా?’ అని నా మీద జోక్స్ వేస్తుంటారు. యాక్చువల్‌గా ఒకేసారి భారీగా తినే బదులు రెండో గంటలకోసారి కొంచెం కొంచెంగా తినడమే మంచిది. ఆహారంతో పాటు వ్యాయామాలు కూడా చేయాలి. నేను యోగా చేస్తాను. జిమ్ కూడా చేస్తుంటాను’’ అని చెప్పారు. -
కృషి ఉంటే... త్రిషలా ఉండొచ్చు!
త్రిష గురించి సింపుల్‌గా చెప్పాలంటే... థర్టీన్ ఇయర్స్ ఇండస్ట్రీ... థర్టీ టూ ఇయర్స్ ఏజ్..! కానీ త్రిష మాగ్నెట్లాగా యూత్ హార్ట్స్ని గుంజుకుంటూనే ఉన్నారు. చూసీ చూసీ మనకు బోర్ లేదు. చేసి చేసీ తనకూ బోర్ రాలేదు. త్రిషలో ఏదో మేజిక్ ఉంది. ఆమె ఒంటి మీద వయసు వాలడం ఆగిపోయిందా? ఆ గ్లామర్... ఆ ఫ్రెష్‌నెస్... ఆ ఫిట్నెస్... ఎలా మెయింటెయిన్ చేయగలుగుతున్నారామె. త్రిష దగ్గరే ఆ సీక్రెట్స్ తెలుసుకుందామా... ఫిట్నెస్ ‘స్ట్రెచింగ్’ ఎక్సర్సైజులు శరీరానికి మంచివి అంటారు త్రిష. ప్రతి రోజూ ఉదయం ఆమె యోగా చేస్తారు. రకరకాల ఆసనాలు చేస్తుంటారు. వాటిలో ఏది చేసినా చేయకపోయినా స్ట్రెచింగ్ ఆసనాలు మాత్రం కంపల్సరీ చేయాల్సిందే. కార్డియో ఎక్సర్‌సైజ్‌తో పాటు మరికొన్ని వ్యాయామాలు కూడా చేస్తారామె. బాగా ఖాళీ దొరికితే స్విమ్మింగ్ చేస్తారు. ఈత వల్ల శరీరాకృతి బాగుంటుందని చెబుతారు త్రిష. ఇన్నేళ్లల్లో శరీరాకృతిలో మార్పు రాకపోవడానికి కారణం తాను చేసే యోగా, వ్యాయామాలని చెబుతారు. వ్యాయామాలు శరీరానికి బాగుంటాయి. యోగా అయితే శరీరంతో పాటు మనసు ప్రశాంతంగా ఉండటానికి ఉపకరిస్తుందని అంటున్నారు త్రిష. డైట్ ఉదయం త్రిష డైట్ గ్రీన్ టీతో మొదలవుతుంది. అల్పాహారం మాత్రం భారీగా తీసుకుంటారు. పరోటాలు, ఆమ్లెట్స్.. ఇలా ఏది అనిపిస్తే అది తింటారు. కడుపు నిండా లాగించేస్తారు. బ్రేక్‌ఫాస్ట్ ఎంత హెవీగా తీసుకుంటే... అంత మంచిది. రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటూ, మన పనులు మనం సునాయాసంగా చేసుకోగలుగుతాం అంటారు త్రిష. బ్రేక్‌ఫాస్ట్‌కీ, లంచ్‌కీ మధ్య చిరుతిండి తినరు. ఎక్కువగా నీళ్లు, పండ్ల రసాలు తాగుతారు. ముఖ్యంగా నిమ్మ, బత్తాయి... ఇలా ‘విటమన్ సి’ మెండుగా ఉన్న పండ్లు తీసుకుంటారు. లంచ్, డిన్నర్‌కి ఏది ఇష్టం అనిపిస్తే అది తింటారు. ఇంత సన్నగా ఉంటారు కాబట్టి, కఠినమైన ఆహార నియమాలు పాటిస్తారనుకుంటే పొరపాటు. నచ్చినవాటిని మితంగా తింటారు. త్రిషకు సీ ఫుడ్ చాలా ఇష్టం. తన డైట్లో అవి కంపల్సరీగా ఉండేలా చూసుకుంటారు. రోజూ ఆరేడు గంటలు నిద్రపోతారు. మేకప్ అందంగా లేనివాళ్లను అందంగా, అందంగా ఉన్నవాళ్లని మరింత అందంగా చూపించే సత్తా మేకప్‌కి ఉంది. త్రిష అందంగానే ఉంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెరపై మరింత అందంగా కనిపించడం కోసం లైట్‌గా మేకప్ చేసుకుంటారు. త్రిషకు హెచ్డి (హై డెఫినిషన్) మేకప్ అంటే ఇష్టం. ఎక్కువగా అదే వాడతారు. ఐ లైనర్, మస్కరా, లిప్ కలర్.. డే టైమ్‌లో అయితే ఇవన్నీ లైట్‌గా ఉండేలా చూసుకుంటారు. నైట్ టైమ్ మాత్రం ముదురు రంగులు వాడతారు. సినిమాల్లో పాత్రలకు తగ్గట్టుగా మేకప్ చేసుకుంటారు. స్టయిలింగ్ త్రిషకు ఇండియన్, వెస్ట్రన్.. రెండు రకాల దుస్తులు ఇష్టం. మోడ్రన్ డ్రెస్సుల్లో ఎంత బాగుంటారో చీరల్లోనూ అంతే అందంగా ఉంటారామె. కంటికి నచ్చినవల్లా కాకుండా ఒంటికి నప్పేవి కొనుక్కుంటారు. హెయిర్ స్టయిల్ విషయానికొస్తే... జుత్తుని ఫ్రీగా వదిలేయడం త్రిషకు ఇష్టం. కానీ, వేసుకున్న డ్రెస్‌కి అనుగుణంగా హెయిర్ స్టయిల్ ఉండాలి. అందుకని ఆ డ్రెస్‌కి తగ్గట్టు, తన ఫేస్‌కి సూట్ అయ్యే హెయిర్ స్టయిల్ చేసుకుంటారు. త్రిషకు టాటూలంటే ఇష్టం. సినిమాల్లో పాత్ర డిమాండ్ మేరకు మాత్రమే కాదు.. పర్సనల్‌గా కూడా టాటూ వేయించుకుంటారు. ఫైనల్‌గా త్రిష ఏం చెబుతారంటే... మనం అనారోగ్యం బారిన పడటానికి ముఖ్య కారణం ఒత్తిడి అని, ఎంత ఒత్తిడికి గురి చేసే విషయాన్నయినా తేలికగా తీసుకోవడం అలవాటు చేసుకుంటే బాగుంటుందని అంటున్నారు. పాజిటివ్ థింకింగ్ చాలా అవసరం అని కూడా చెబుతున్నారు. త్రిష దాదాపు పాజిటివ్‌గానే ఉంటారట. వయసు పెరుగుతున్నా తరుగుతున్నట్లు కనిపించడానికి అదో కారణం అని చెప్పొచ్చు. -
ఇలియానా బ్యూటీ సీక్రెట్స్
సౌందర్య సంరక్షణ అనేది ఆయా కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉండాలి. గత కొన్నాళ్లుగా మనం వేసవిని చూస్తున్నాం. ఈ వేసవికి తగ్గట్టుగా నేను కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా. వేసవి అనగానే నాకో విషయంలో చాలా భయంగా ఉంటుంది. ఈ భయమంతా నా స్కిన్ గురించే. నాది చాలా సున్నితమైన చర్మం. కొంచెం ఎండలోకి వెళ్లినా కందిపోతుంది. అందుకే సమ్మర్లో సన్ స్క్రీన్ లోషన్ రాసుకోకుండా బయటికెళ్లే ప్రసక్తే లేదు. ►ఈ సీజన్లో జుట్టు బాగా ఎండిపోయినట్టుగా అవుతుంది. అందుకనే వారంలో రెండు సార్లయినా తప్పనిసరిగా హెయిర్ ఆయిల్ అప్లై చేస్తాను. ఆ తర్వాత మంచి షాంపూతో హెయిర్ వాష్ చేస్తాను, ► సమ్మర్లో అవుట్డోర్ షూటింగ్స్ ఉండకూడదని కోరుకుంటాను. చల్లని ప్రదేశంలో షూటింగ్ అంటే భలే హాయిగా ఉంటుంది. ►వేసవిలో మేకప్ చేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. షూటింగ్స్ ఉంటే మేకప్ తప్పదు. లేనప్పుడు అస్సలు మేకప్ జోలికి వెళ్లను. ► మామూలుగా ఉదయం లేవగానే వేడి నీళ్లల్లో కొంచెం తేనె, నిమ్మరసం కలుపుకుని తాగుతాను. ఈ సీజన్లో కూడా అలాగే చేస్తాను. ►కాకపోతే ఎక్కువగా ద్రవపదార్థాలే తీసుకుంటాను. కొబ్బరి నీళ్లు, పళ్ల రసాలు ఇలా రెండు గంటలకొకసారి ఏదో ఒకటి తాగుతాను. ►సమ్మర్ వస్తోందంటే చాలు ప్రత్యేకంగా కాటన్ దుస్తులు కొనుక్కుంటాను. ఈ సీజన్లో అవే సౌకర్యంగా ఉంటాయి. ►వేసవిలో ఉదయం 9గంటలకు ముందు, సాయంత్రం ఆరు గంటల తర్వాత స్విమ్మింగ్ చేస్తాను. సమ్మర్లో చల్లని నీళ్లలో ఈతకొడుతుంటే శరీరానికి ఎంతో హాయిగా ఉంటుంది. ►ఎవరికైనా నా సలహా ఒకటే అవసరం అయితేనే ఎండలో బయటకు వెళ్లండి, లేకపోతే కూలింగ్ గ్లాసెస్, టోపీ పెట్టుకుని వేళ్తే ఎండ నుంచి రక్షణగా ఉంటుంది.