బాలీవుడ్ గ్లామరస్ క్వీన్ దీపిక పదుకునే తన నటన, అభినయంతో మంచి ఫ్యాన్ పాలోయింగ్‌ని సంపాదించుకుంది. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ మూవీ 'ఓం శాంతి ఓం'తో ఒక్కసారిగా రాత్రికే రాత్రే స్టార్ అయిపోయింది. ఇక అక్కడ నుంచి వెనుదిరిగి చూడకుండా వరుస సినిమాలతో విజయపథంలో దూసుకుపోతుంది. అంతేగాదు బాలీవుడ్‌లో అత్యధిక పారితోషం తీసుకుంటున్న హీరోయిన్‌ల సరసన నిలిచింది. ఇక దీపిక చందమామలాంటి ముఖంతో మంచి స్టన్నింగ్ లుక్‌తో ఇట్టే ప్రేకక్షులను కట్టిపడేస్తుంది. అందుకు ఆమె వన్నెతరగని అందమే కారణం. అసలు వాళ్లు అంతలా గ్లామర్‌ని ఎలా మెయింటెయిన్ చేస్తున్నారు? ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని కుతుహలంగా ఉంటుంది కదా!. మరీ దీపికా పదుకునే బ్యూటీ రహస్యం ఏంటో చూద్దామా..!
దీపిక చర్మ సంరక్షణ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తన తల్లి నుంచే నేర్చుకున్నానని చెబుతోంది.
తప్పనిసరిగా మేకప్‌ని తొలగించే..
నిద్రకు ఉపక్రమించే ముందు మేకప్‌ని తొలగించే పడుకుంటానని చెబుతోంది దీపిక. ఎంతటి బిజీ షెడ్యూల్ అయినా సరే ముఖాన్ని శుభ్రంగా కడుక్కోనిదే పడుకోనని అంటోంది. దీని వల్ల ముఖంపై మలినాలు, మొటిమలు, బ్లాక్‌హెడ్స్ వంటివి ఉండవని చెబుతోంది.
సన్‌స్క్రీన్ తప్పనిసరి..
బయటకు వెళ్తే తప్పనిసరిగా సన్‌స్క్రీన్ లేకుండా వెళ్లనని అంటోంది. దీని వల్ల యూవీ కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుకోగలం. అలాగే వృధాప్య ప్రమాదాన్ని నివారిస్తుంది. చర్మ క్యాన్సర్ సంభావ్యతను తగ్గిస్తుంది. ప్రకాశవంతమైనే మేని ఛాయను ప్రోత్సహిస్తుంది. వేసవి లేదా చలికాలంలో ఇంటి లోపల లేదా బయటతో సంబంధం లేకుండా తన దినచర్యలో భాగంగా ప్రతిరోజూ రెండుసార్లు తప్పనిసరి ముఖానికి సన్‌స్క్రీన్ రాసుకుంటానని చెబుతోంది.
క్లోడ్ వాటర్ థెరపీ
అలాగే ముఖానికి క్లోడ్ వాటర్ థెరఫీ కూడా ప్రతిరోజు తీసుకుంటానని అంటోంది. ఇది ముఖాన్ని ఫ్రెష్‌గా ఉండేలా చేస్తుందని అంటోంది. అలాగే ముఖం అంతా రక్త ప్రసరణ సాఫీగా జరిగి చర్మం ప్రకాశవంతంగా ఉండటంలో తోడ్పడుతుంది.
హైడ్రేటెడ్‌గా ఉంచడం..
తన దినచర్యలో భాగంగా నూనె లేదా మాయిశ్చరైజర్ తప్పనిసరిగా ముఖానికి రాయడం విస్మరించదు. ఇది చర్మాన్ని డీ హైడ్రేషన్‌కి గురికాకుండా చేస్తుంది. ఇలా ముఖం తేమగా ఉండటం వల్ల ముకం ప్రకాశవంతంగా ఉంటుంది.
కొబ్బరి నూనె..
శిరోజాలకు తప్పనిసరిగా కొబ్బిర నూనెనే ప్రివర్ చేస్తానని చెబుతోంది. ఇది చుండ్రుని నివారించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఫలితం జుట్టు మంచి షైనీగా మెరుస్తు ఉంటుంది. గ్లామర్ మెయింటెయిన్ చేయడంలో శిరోజాల అందం కూడా ముఖ్యమేనని అంటోంది.
జీవనశైలి
గ్లోయింగ్ స్కిన్ అనేది చర్మ సంరక్షణ ఉత్పత్తులపై మాత్రమే ఆధారపడి ఉండదని నొక్కి చెబుతోంది దీపిక. మంచి జీవనశైలి, చక్కటి వ్యాయామం, ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండటం వంటి అలవాట్లే మనం అందాన్ని ఇనుమడింప చేస్తాయని చెబుతోంది. అవే మన ముఖాన్ని కాంతిమంతంగా ఉండేలా చేస్తుంది. పైగా ఆర్యోగకరమైన జీవితాన్ని పొందగలమని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment