glamorous
-
అమ్మ బాబోయ్.. యాంకర్ రష్మీ అందాల అరాచకం చూశారా! (ఫోటోలు)
-
Triptii Dimri: యానిమల్ బ్యూటీ గ్లామర్ షో (ఫోటోలు)
-
నీలి కళ్లతో అనసూయ.. ఇంత ఛేంజ్ అయిపోయిందేంటి? (ఫొటోలు)
-
గ్లామరస్ క్వీన్ దీపిక బ్యూటీ సీక్రెట్ ఇదే..!
బాలీవుడ్ గ్లామరస్ క్వీన్ దీపిక పదుకునే తన నటన, అభినయంతో మంచి ఫ్యాన్ పాలోయింగ్‌ని సంపాదించుకుంది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మూవీ 'ఓం శాంతి ఓం'తో ఒక్కసారిగా రాత్రికే రాత్రే స్టార్ అయిపోయింది. ఇక అక్కడ నుంచి వెనుదిరిగి చూడకుండా వరుస సినిమాలతో విజయపథంలో దూసుకుపోతుంది. అంతేగాదు బాలీవుడ్లో అత్యధిక పారితోషం తీసుకుంటున్న హీరోయిన్ల సరసన నిలిచింది. ఇక దీపిక చందమామలాంటి ముఖంతో మంచి స్టన్నింగ్ లుక్‌తో ఇట్టే ప్రేకక్షులను కట్టిపడేస్తుంది. అందుకు ఆమె వన్నెతరగని అందమే కారణం. అసలు వాళ్లు అంతలా గ్లామర్‌ని ఎలా మెయింటెయిన్ చేస్తున్నారు? ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని కుతుహలంగా ఉంటుంది కదా!. మరీ దీపికా పదుకునే బ్యూటీ రహస్యం ఏంటో చూద్దామా..! దీపిక చర్మ సంరక్షణ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తన తల్లి నుంచే నేర్చుకున్నానని చెబుతోంది. తప్పనిసరిగా మేకప్‌ని తొలగించే.. నిద్రకు ఉపక్రమించే ముందు మేకప్‌ని తొలగించే పడుకుంటానని చెబుతోంది దీపిక. ఎంతటి బిజీ షెడ్యూల్ అయినా సరే ముఖాన్ని శుభ్రంగా కడుక్కోనిదే పడుకోనని అంటోంది. దీని వల్ల ముఖంపై మలినాలు, మొటిమలు, బ్లాక్‌హెడ్స్ వంటివి ఉండవని చెబుతోంది. సన్‌స్క్రీన్ తప్పనిసరి.. బయటకు వెళ్తే తప్పనిసరిగా సన్‌స్క్రీన్ లేకుండా వెళ్లనని అంటోంది. దీని వల్ల యూవీ కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుకోగలం. అలాగే వృధాప్య ప్రమాదాన్ని నివారిస్తుంది. చర్మ క్యాన్సర్ సంభావ్యతను తగ్గిస్తుంది. ప్రకాశవంతమైనే మేని ఛాయను ప్రోత్సహిస్తుంది. వేసవి లేదా చలికాలంలో ఇంటి లోపల లేదా బయటతో సంబంధం లేకుండా తన దినచర్యలో భాగంగా ప్రతిరోజూ రెండుసార్లు తప్పనిసరి ముఖానికి సన్‌స్క్రీన్ రాసుకుంటానని చెబుతోంది. క్లోడ్ వాటర్ థెరపీ అలాగే ముఖానికి క్లోడ్ వాటర్ థెరఫీ కూడా ప్రతిరోజు తీసుకుంటానని అంటోంది. ఇది ముఖాన్ని ఫ్రెష్‌గా ఉండేలా చేస్తుందని అంటోంది. అలాగే ముఖం అంతా రక్త ప్రసరణ సాఫీగా జరిగి చర్మం ప్రకాశవంతంగా ఉండటంలో తోడ్పడుతుంది. హైడ్రేటెడ్‌గా ఉంచడం.. తన దినచర్యలో భాగంగా నూనె లేదా మాయిశ్చరైజర్ తప్పనిసరిగా ముఖానికి రాయడం విస్మరించదు. ఇది చర్మాన్ని డీ హైడ్రేషన్‌కి గురికాకుండా చేస్తుంది. ఇలా ముఖం తేమగా ఉండటం వల్ల ముకం ప్రకాశవంతంగా ఉంటుంది. కొబ్బరి నూనె.. శిరోజాలకు తప్పనిసరిగా కొబ్బిర నూనెనే ప్రివర్ చేస్తానని చెబుతోంది. ఇది చుండ్రుని నివారించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఫలితం జుట్టు మంచి షైనీగా మెరుస్తు ఉంటుంది. గ్లామర్ మెయింటెయిన్ చేయడంలో శిరోజాల అందం కూడా ముఖ్యమేనని అంటోంది. జీవనశైలి గ్లోయింగ్ స్కిన్ అనేది చర్మ సంరక్షణ ఉత్పత్తులపై మాత్రమే ఆధారపడి ఉండదని నొక్కి చెబుతోంది దీపిక. మంచి జీవనశైలి, చక్కటి వ్యాయామం, ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండటం వంటి అలవాట్లే మనం అందాన్ని ఇనుమడింప చేస్తాయని చెబుతోంది. అవే మన ముఖాన్ని కాంతిమంతంగా ఉండేలా చేస్తుంది. పైగా ఆర్యోగకరమైన జీవితాన్ని పొందగలమని అన్నారు. (చదవండి: జుట్టు మృదువుగా నిగనిగలాడాలంటే గంజితో ఇలా చేయండి!) -
డీ గ్లామరస్‌గా కనిపించనున్న జాన్వీకపూర్
ఇక్కడున్న జాన్వీ కపూర్ ఫోటో చూశారుగా.. ఎంత గ్లామరస్‌గా ఉన్నారో కదా. ఈ బ్యూటీ తెలుగు తెరపై కనిపించే సమయం ఆసన్నమైంది. అయితే ఆమె తెలుగు ఎంట్రీ ఇక్కడ ఫొటోలో కనిపించేంత గ్లామరస్‌గా మాత్రం ఉండదట. ఇంతకీ విషయం ఏంటంటే... ‘దేవర’ చిత్రంతో జాన్వీ తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మత్స్యకారుల కుటుంబానికి చెందిన యువతిగా, డీ గ్లామరస్‌గా జాన్వీ పాత్ర ఉంటుందని ప్రచారం జరుగుతోంది. కాగా జాన్వీ పాత్రలో కొద్దిపాటి యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నాయని తెలిసింది. ‘దేవర’ షూటింగ్లో ఆల్రెడీ జాన్వీ కపూర్ పాల్గొన్నారు. ఆ షెడ్యూల్లో ఆమెపై చిన్నపాటి యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరిగిందని సమాచారం. మళ్లీ సెప్టెంబరులో జరిగే ‘దేవర’ షెడ్యూల్లో పాల్గొననున్నట్లుగా జాన్వీ కపూర్ ఇటీవల ఓ సందర్భంలో పేర్కొన్నారు. ఇక ‘జనతా గ్యారేజ్’ తర్వాత ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న ‘దేవర’ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని కె. హరికృష్ణ, కల్యాణ్‌రామ్, మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్నారు. -
గ్లామర్ డాల్ పూర్ణ ఫోటోలు
-
హీరోయిన్ శివానీ నారాయణన్ అందాల విందు
-
తారాచంద్రులు
దేవతలలో చంద్రుడు అత్యంత సుందరమైనవారిలో ఒకడిగా పేరు పొందాడు. అయితే, అంతటితో తృప్తి కలగలేదు చంద్రుడికి, ఒక్క అందంలోనే కాదు, త్రిలోకాలలోను తనంతటి మహాజ్ఞాని లేడనిపించుకోవాలనుకున్నాడు. దాంతో దేవతల గురువైన బృహస్పతి వద్ద శిష్యునిగా చేరాడు. బృహస్పతి భార్య తార అపురూప లావణ్యవతి, నవయవ్వనవతి. చంద్రుడు ఆశ్రమంలో విద్యాభ్యాసానికి చేరిన నాటి నుంచీ తార అతని అందచందాలకు, యవ్వన సౌందర్యానికి ముగ్ధురాలై, అటువంటి సుందరాంగుని భర్తగా పొందలేకపోయానే అని మనస్సులో బాధపడుతూ చాటునుంచి చంద్రునివైపు దొంగచూపులు చూస్తూ ఉండేది. చంద్రుడు గమనించాడు. అయితే గురుపత్ని కాబట్టి సాహసించలేకపోయాడు. ఇలా ఉండగా దేవేంద్రుడు ఒక యజ్ఞాన్ని తలపెట్టాడు. ఆ యజ్ఞానికి హోతగా బృహస్పతి వెళ్లవలిసి వచ్చింది. ఆయన ఆశ్రమ రక్షణ బాధ్యతను చంద్రునికి అప్పగించి అమరావతికి వెళ్ళిపోయాడు. బృహస్పతి దేవలోకానికి వెళ్లిపోగానే తార, చంద్రునితో మాట కలిపింది. చంద్రుడు కూడా చొరవ తీసుకున్నాడు. ఇద్దరూ ఆనందంగా గడిపారు. క్రమంగా ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా తార గర్భవతి అయింది. అంతలో యజ్ఞం ముగించుకుని బృహస్పతి రానే వచ్చాడు. ఆయన వస్తూనే అక్కడ ఏమి జరిగిందో గ్రహించాడు. ఆయన చంద్రునివైపు ఆగ్రహంతో చూస్తూ ‘దుర్మార్గుడా... గురుపత్నినే కామించిన పాపానికి నువ్వు క్షయ వ్యాధి పీడితుడవై క్షీణింతువుగాక’ అని శపించాడు. ఆ శాపప్రభావం వల్ల చంద్రుడు తన తేజాన్ని, చంద్రకళలనూ కోల్పోయి కాంతిహీనుడయాడు. సూర్యచంద్రులలో ఎవరు లేకున్నా కాలం సక్రమంగా నడవదు గనుక ఇంద్రాది దేవతలు పరుగు పరుగున వచ్చి వ్యాధి పీడితుడైన చంద్రుని బృహస్పతి పాదాలపైన పడవేసి, ‘అతన్ని క్షమించి శాపాన్ని ఉపసంహరించమని ప్రార్థించారు. మనసు కరిగిన బృహస్పతి, ‘లయకారకుడైన శివుడి గురించి తపస్సు చేసి ఆయన అనుగ్రహం సంపాదించినపుడు చంద్రుడు వ్యాధి బారి నుంచి విముక్తుడై తన పూర్వవైభవాన్ని పొందుతాడు’ అని అనుగ్రహించాడు. చంద్రుడు ఆయనకి నమస్కరించి తపస్సు చెయ్యడానికి వెళ్లిపోయాడు. ఘోర తపస్సుతో శివుని ప్రసన్నం చేసుకున్నాడు. అయితే, పాప ఫలితాన్ని అనుభవించక తప్పదు కాబట్టి, పదిహేను రోజులు వృద్ధిచెందడం, పదిహేను రోజులపాటు క్షీణించేలా వరం పొందాడు. అంటే పాపం, పాపపు ఆలోచనలు, పాపపు పనులు చేస్తే దేవతలకు కూడా శిక్ష తప్పదన్నమాటేగా! – డి.వి.ఆర్. భాస్కర్ -
రితూ బెరి బెరి గుడ్
- రితూ గౌన్‌లో క్వీన్‌లా... లెహంగా కడితే విహంగంలా... హాఫ్ శారీలో డిలైట్‘ఫుల్’గా... చోళీలో చార్మింగ్‌గా ఉంటుందా డ్రస్ డిజైనింగ్. అందుకే రితూ బెర్రీని ప్రీతీజింటా నుంచి ప్రిన్స్ చార్లెస్ వరకూ అందరూ బెర్రీ బెర్రీ గుడ్ అంటారు. గ్లామరస్‌గా కనిపించాలంటే రితుబెరి కలెక్షన్‌ను చూడకూడదు. వందల్లో ఒకరిగా కనపడాలన్నా, ప్రత్యేకతను నిలుపుకోవాలన్నా మాత్రం రితూబెరి డిజైనర్ కలెక్షన్ వైపు తప్పక దృష్టి సారించాలి. ఆమె రూపొందించిన డిజైనర్ దుస్తులు అంత అసాధారణంగా ఉంటాయి. ఫ్రెంచ్ ప్రభుత్వం రితుబెరి డ్రెస్ డిజైన్ స్టైల్స్‌ని ‘మైండ్ బ్లోయింగ్ వర్క్’ అని ఆమెను ప్రశంసించింది. ప్రిన్స్ చార్లెస్, అమెరికా మాజీ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్, నికొలె కిడ్‌మ్యాన్, పర్షియన్ సామాజికవేత్తలు, ఇండియన్ బాలీవుడ్ తారలు రాణీ ముఖర్జీ, ప్రీతీ జింతా, మాధురీ దీక్షిత్ వంటి ప్రముఖులు రితుబెరి డిజైన్ చేసిన దుస్తుల్లో మెరిశారు. ఈమె స్టోర్స్ ఢిల్లీ, ఫ్రాన్స్, జెర్మనీలలో ఉన్నాయి. -
చెట్ల చుట్టూ తిరగడం అంత ఈజీ కాదు!
‘‘సెలబ్రిటీ స్టేటస్ చాలా గొప్పది కాబట్టి, నేను ఆర్టిస్ట్ కాలేదు. స్టార్స్ లైఫ్ చాలా సౌకర్యవంతంగా ఉంటుందని కూడా కాలేదు. నటన అనేది నా జీన్స్‌లోనే ఉంది. అందుకే ఎంతో మక్కువతో ఆర్టిస్ట్ అయ్యాను’’ అని శ్రుతీహాసన్ అన్నారు. గ్లామర్, డీ-గ్లామర్ రెండు పాత్రలనూ ఒకే రకంగా చూస్తానని శ్రుతి చెబుతూ - ‘‘మీకు గ్లామరస్ రోల్స్ ఇష్టమా? డీ-గ్లామరా అని ఎవరైనా నన్నడిగితే నాకేం చెప్పాలో తెలియదు. ఎందుకంటే నేను నటిని. ఏ పాత్ర అయినా నాకు ఒకటే. ‘గ్లామరస్ క్యారెక్టర్స్ చాలా ఈజీ. పెద్దగా కష్టపడాల్సిన అవసరంలేదు’ అని కొంతమంది చాలా తేలికగా మాట్లాడతారు. ఏ పాత్రకైనా ఎంతో కొంత కష్టపడాల్సిందే. చెట్ల చుట్టూ తిరగడం అనుకున్నంత ఈజీ కాదు. దానికి కూడా టాలెంట్ ఉండాలి. గ్లామరస్‌గా కనిపించడం అంత సులువు కాదు. అందుకే గ్లామరస్ క్యారెక్టర్స్‌ని చిన్న చూపు చూడకూడదు. నా మటుకు నేను పాత్ర నచ్చితే అది ఎలాంటిదైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తా. ఎంత అందంగా కనిపించడానికైనా ఓకే. అలాగే, పాత్ర డిమాండ్ చేస్తే అంద విహీనంగా కనిపించడానికి కూడా నేను రెడీయే’’ అన్నారు. -
మీరేంటో...మీ చేతి గడియారమూ చెబుతోంది!
సైకాలజీ మణికట్టును అంటిపెట్టుకొని సమయాన్ని సూచించడమే కాదు.. ఎంచుకున్న గడియారం మగువ మనస్తత్వమూ చెబుతోంది. అదెలాగంటే...!!! ఆభరణాలకు మ్యాచ్ అయ్యేలా వాచ్ ధరించేవారు ప్రతీ పనిని పక్కాగా చేయాలనుకుంటారు. అంకెల సమయాన్ని సూచించే గడియారాలను ఇష్టపడేవారు ముక్కుసూటి తత్త్వం గలవారు. త్వరగా పనులు పూర్తిచేయాలని తొందరపడిపోతుంటారు. ఫంకీ వాచీలను ధరించేవారు నలుగురి దృష్టీ తమపై ఉండాలనీ, గ్లామరస్‌గా కనిపించా లని ఆరాటపడతారు. రత్నాలు, రాళ్లు పొదిగిన గడియారాలను ఎంపిక చేసుకునేవారు విలాసంగా జీవితాన్ని గడపాలనుకుంటారు. అంకెలు లేని వాచ్‌లను ఎంపిక చేసుకునేవారు నిగూఢంగా ఉండాలనుకుంటారు. అంటే వీరు ఏ విషయాన్నీ ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరన్నమాట. లెదర్ బెల్ట్ గడియారాలను ఇష్టపడేవారు హుందాతనాన్ని కోరుకుంటారు బ్రాండెడ్ వాచ్‌లను ఇష్టపడేవారు కాన్ఫిడెంట్‌గా ఉండాలనుకుంటారు. పాతకాలం మోడల్ గడియారాలను ఇష్టపడేవారు తమ అభిప్రాయాలను మార్చుకోవడానికి ఏ మాత్రం ఇష్టపడరు. -
గ్లామరస్‌గా నటించను
తాను గ్లామరస్‌గా నటించబోనని నటి రిత్తికా శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నారు రిత్తికా శ్రీనివాస్. వళక్కు ఎన్ 18/9, నిమిర్నిందు నిల్ చిత్రాల్లో నటించి పేరు గడించారు. ఇటీవల విలేకరులతో ముచ్చటించారు. తన సొంత ఊరు చెన్నై అని, ప్రస్తుతం భర్తతో దుబాయ్‌లో నివశిస్తున్నట్లు తెలిపారు. లండన్, అమెరికా, దుబాయ్‌లో ఐ బ్రేకర్, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ నడుపుతున్నట్లు తెలిపారు. సినిమాలపై ఆసక్తితో నటించేందుకు వచ్చానన్నారు. మంచి క్యారెక్టర్ పాత్రలు ఎంపిక చేసి నటిస్తున్నానన్నారు. ప్రస్తుతం తెలుగు చిత్రాల్లోనూ నటిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయిరత్తిల్ ఇరువర్తోపాటు పేరు పెట్టని రెండు చిన్న బడ్జెట్ చిత్రాల్లో నటిస్తున్నట్లు తెలిపారు. రొటీన్ క్యారెక్టర్లు మాత్రమే కాకుండా, నటనకు ప్రాధాన్యత ఉన్నవాటిలో నటించాలని ఉందన్నారు. ప్రస్తుతం డాక్యుమెంటరీ చిత్రాలు తీస్తున్నానని, త్వరలో ఒక చిత్రా న్ని భర్తతో కలిసి నిర్మించనున్నట్లు తెలిపారు. -
గ్లామరస్‌గా కనిపించడానికి రెడీ!
‘‘బాగా యాక్ట్ చేసే ప్రతి ఒక్కరూ నాకు ఆదర్శమే. వాళ్లని ఆదర్శంగా తీసుకుని, నాదైన శైలిలో నేను పాత్రలను పండించడానికి కృషి చేస్తాను’’ అన్నారు రీతూవర్మ. ఇటీవల విడుదలైన ‘నా రాకుమారుడు’లో మెరిసిన అసలు సిసలైన తెలుగమ్మాయి తను. తన భవిష్యత్తు ప్రణాళికల గురించి రీతూ చెబుతూ-‘‘నటిగా నాకు సంతృప్తినిచ్చే, ప్రేక్షకుల మన్ననలు పొందే పాత్రలు చేయాలనుకుంటున్నాను. పాత్ర డిమాండ్ చేస్తే గ్లామరస్‌గా కనిపించడానికి రెడీ. అలాగే కేరక్టర్‌కి అనుగుణంగా హోమ్లీగా కనిపించడానికి సిద్ధమే. యాక్టింగ్ సులువు కాదు. మనది కాని పాత్రను చేస్తున్నప్పుడు అందులోకి పరకాయ ప్రవేశం చేయాలంటే ఏకాగ్రత కావాలి. అందుకే కెమెరా ముందున్నప్పుడు నేను రీతూ అనే విషయం మర్చిపోయి, పాత్రను మాత్రమే గుర్తుపెట్టుకుంటాను’’ అన్నారు. త్వరలో కొత్త సినిమాలు సైన్ చేయబోతున్నానని తెలిపారు రీతూ.