
గ్లామరస్‌గా కనిపించడానికి రెడీ!
‘‘బాగా యాక్ట్ చేసే ప్రతి ఒక్కరూ నాకు ఆదర్శమే. వాళ్లని ఆదర్శంగా తీసుకుని, నాదైన శైలిలో నేను పాత్రలను పండించడానికి కృషి చేస్తాను’’ అన్నారు రీతూవర్మ.
ఇటీవల విడుదలైన ‘నా రాకుమారుడు’లో మెరిసిన అసలు సిసలైన తెలుగమ్మాయి తను. తన భవిష్యత్తు ప్రణాళికల గురించి రీతూ చెబుతూ-‘‘నటిగా నాకు సంతృప్తినిచ్చే, ప్రేక్షకుల మన్ననలు పొందే పాత్రలు చేయాలనుకుంటున్నాను. పాత్ర డిమాండ్ చేస్తే గ్లామరస్‌గా కనిపించడానికి రెడీ. అలాగే కేరక్టర్‌కి అనుగుణంగా హోమ్లీగా కనిపించడానికి సిద్ధమే.
యాక్టింగ్ సులువు కాదు. మనది కాని పాత్రను చేస్తున్నప్పుడు అందులోకి పరకాయ ప్రవేశం చేయాలంటే ఏకాగ్రత కావాలి. అందుకే కెమెరా ముందున్నప్పుడు నేను రీతూ అనే విషయం మర్చిపోయి, పాత్రను మాత్రమే గుర్తుపెట్టుకుంటాను’’ అన్నారు. త్వరలో కొత్త సినిమాలు సైన్ చేయబోతున్నానని తెలిపారు రీతూ.