డీ గ్లామరస్‌గా కనిపించనున్న జాన్వీకపూర్‌ | Janhvi Kapoor playing de-glam role in 'Devara' - Sakshi
Sakshi News home page

దేవర.. జాన్వీ అలా ఉండబోతుందట

Published Sat, Aug 26 2023 3:31 AM | Last Updated on Sat, Aug 26 2023 11:29 AM

Janhvi Kapoor playing de-glam role in Devara - Sakshi

ఇక్కడున్న జాన్వీ కపూర్‌ ఫోటో చూశారుగా.. ఎంత గ్లామరస్‌గా ఉన్నారో కదా. ఈ బ్యూటీ తెలుగు తెరపై కనిపించే సమయం ఆసన్నమైంది. అయితే ఆమె తెలుగు ఎంట్రీ ఇక్కడ ఫొటోలో కనిపించేంత గ్లామరస్‌గా మాత్రం ఉండదట. ఇంతకీ విషయం ఏంటంటే... ‘దేవర’ చిత్రంతో జాన్వీ తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మత్స్యకారుల కుటుంబానికి చెందిన యువతిగా, డీ గ్లామరస్‌గా జాన్వీ పాత్ర ఉంటుందని ప్రచారం జరుగుతోంది.

కాగా జాన్వీ పాత్రలో కొద్దిపాటి యాక్షన్‌ సన్నివేశాలు కూడా ఉన్నాయని తెలిసింది. ‘దేవర’ షూటింగ్‌లో ఆల్రెడీ జాన్వీ కపూర్‌ పాల్గొన్నారు. ఆ షెడ్యూల్‌లో ఆమెపై చిన్నపాటి యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ జరిగిందని సమాచారం. మళ్లీ సెప్టెంబరులో జరిగే ‘దేవర’ షెడ్యూల్‌లో పాల్గొననున్నట్లుగా జాన్వీ కపూర్‌ ఇటీవల ఓ సందర్భంలో పేర్కొన్నారు. ఇక ‘జనతా గ్యారేజ్‌’ తర్వాత ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న ‘దేవర’ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న రిలీజ్‌ కానుంది. ఈ చిత్రాన్ని కె. హరికృష్ణ, కల్యాణ్‌రామ్, మిక్కిలినేని సుధాకర్‌ నిర్మిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement