
'దేవర' సినిమా అనగానే బ్లాక్‌బస్టర్ అయిన పాటలే గుర్తొస్తాయి. ఫియర్, చుట్టమల్లే, ఆయుధ పూజ.. ఇలా ఒకటేమిటి దేనికదే సెపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాయి. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాని విపరీతంగా ఉపయోగిస్తున్న ఈ కాలంలో ఏది ఎప్పుడు వైరల్ అవుతుందో? ఎక్కడి వరకు రీచ్ అవుతుందో అస్సలు చెప్పలేం. అలా 'దేవర' పాటలు దేశాలు దాటిపోయాయి.
(ఇదీ చదవండి: పండగ సినిమాల రివ్యూ.. ఏది ఎలా ఉందంటే?)
'దేవర' మూవీలో చాలామందికి నచ్చిన సాంగ్ అంటే 'చుట్టమల్లే' అని అంటారు. ఈ పాటలో జాన్వీ గ్లామర్ చూస్తే.. ఎవరైనా సరే చూపు తిప్పుకోకుండా ఉండలేరేమో! అంత అందంగా కనిపిస్తుంది. వింటే ఎంతగా నచ్చిందో.. థియేటర్లో చూస్తే అంతకు మించి జనాలకు నచ్చేసింది. ఇప్పడీ పాటకు విదేశీ మహిళ.. సేమ్ స్టెప్పులేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది.
సెప్టెంబరు 27న థియేటర్లలో రిలీజైన 'దేవర' చిత్రానికి తొలుత మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ మెల్లమెల్లగా కుదురుకుంది. ప్రస్తుతం రూ.500 కోట్ల కలెక్షన్స్‌కి చేరువలో ఉంది. వీకెండ్ పూర్తయితే పోస్టర్ రిలీజ్ చేస్తారేమో!
(ఇదీ చదవండి: సంక్రాంతికి 'గేమ్ ఛేంజర్'.. దిల్ రాజు ప్రకటన)
Indians have the dance rizz. Russian & Indians fit in quite well. pic.twitter.com/L7EybV6z8I
— Lord Immy Kant (Eastern Exile) (@KantInEast) October 11, 2024