
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర పార్ట్1 చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ మూవీతో దివంగత నటి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమవుతోంది. తెలుగులో ఇది తనకు తొలి సినిమానే అయినప్పటికీ జాన్వీ ఇక్కడి భాష బాగానే మాట్లాడుతోందంటున్నాడు తారక్.
జాన్వీని చూసి షాకయ్యా
తాజాగా దేవర టీమ్.. యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో చిట్‌చాట్ చేసింది. ఈ సందర్భంగా తారక్.. జాన్వీ టాలెంట్ చూసి ఆశ్చర్యపోయానంటున్నాడు. అతడు మాట్లాడుతూ.. జాన్వీ తెలుగు మాట్లాడటం చూసి షాకయ్యాను. బాంబేలో పెరిగిన ఆమెకు ఇక్కడి భాష ఎలా వస్తుంది? సౌత్‌లో తన మూలాలు ఉన్నప్పటికీ అంత స్పష్టంగా తెలుగు మాట్లాడటం కష్టమే కదా!

సంతోషపడిపోయిన జాన్వీ
కానీ తను మాత్రం అదరగొట్టేసింది. ఒక సీన్‌లో తన నటన చూసి ఆశ్చర్యపోయాను. అప్పుడు కొరటాల కూడా నా రియాక్షన్ ఎలా ఉందా? అని నన్నే చూస్తున్నాడు' అని తెలిపాడు. ఈ మాటలు విని సంతోషపడిపోయిన జాన్వీ.. 'మీ మాటలతో నా కడుపు నిండిపోయింది. ఇక ఇంటర్వ్యూ అయిపోయాక నేను దేని గురించీ టెన్షన్ పడనవరసం లేదనుకుంటా'నని సరదాగా మాట్లాడింది. ఇకపోతే దేవర సెప్టెంబర్ 27న విడుదల కానుంది.
చదవండి: సైమా అవార్డ్స్‌లో నాని చిత్రాల హవా.. ఉత్తమ చిత్రం ఏదంటే..?
Comments
Please login to add a commentAdd a comment