సైమా(సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) అవార్డ్స్‌లో నేచురల్ స్టార్ నాని సినిమాల హవా కొనసాగింది. దసరా, హాయ్ నాన్న చిత్రాలు అవార్డులు కొల్లగొట్టాయి. దుబాయ్‌లో జరిగిన సైమా అవార్డ్స్ వేడుకల్లో టాలీవుడ్ విజేతలను ప్రకటించారు. తెలుగులో ఉత్తమ నటుడిగా నాని నిలవగా.. ఉత్తమ నటిగా కీర్తి సురేశ్ అవార్డ్‌ను సొంతం చేసుకుంది. నాని నటించిన దసరా, హాయ్ నాన్న చిత్రాలకు నాలుగు విభాగాల్లో అవార్డ్స్ దక్కాయి. ఈ వేడుకల్లో హీరోయిన్స్ వేదికపై సందడి చేశారు.టాలీవుడ్‌లో ఉత్తమ చిత్రంగా బాలకృష్ణ-అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన భగవంత్ కేసరి నిలిచింది.
సైమా-2024 విన్నర్స్ వీళ్లే..
ఉత్తమ నటుడు: నాని (దసరా)
ఉత్తమ నటి: కీర్తి సురేశ్ (దసరా)
ఉత్తమ దర్శకుడు: శ్రీకాంత్ ఓదెల (దసరా)
ఉత్తమ చిత్రం: భగవంత్ కేసరి
ఉత్తమ సహాయ నటుడు: దీక్షిత్ శెట్టి (దసరా)
ఉత్తమ సహాయ నటి: బేబీ ఖియారా ఖాన్ (హాయ్ నాన్న)
ఉత్తమ హాస్య నటుడు: విష్ణు (మ్యాడ్)
ఉత్తమ పరిచయ నటి: వైష్ణవి చైతన్య (బేబీ)
ఉత్తమ సంగీత దర్శకుడు: అబ్దుల్ వాహబ్ (హాయ్‌నాన్న)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: భువన గౌడ (సలార్)
ఉత్తమ నేపథ్య గాయకుడు: రామ్ మిర్యాల (ఊరు పల్లెటూరు-బలగం)
ఉత్తమ డెబ్యూ యాక్టర్: సంగీత్ శోభన్ (మ్యాడ్)
ఉత్తమ డెబ్యూ డైరెక్టర్: శౌర్యువ్ (హాయ్ నాన్న)
ఉత్తమ డెబ్యూ ప్రొడ్యూసర్: వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ (హాయ్ నాన్న)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్): ఆనంద్ దేవరకొండ (బేబీ)
ఉత్తమ నటి (క్రిటిక్స్): మృణాళ్ ఠాకూర్
ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్): సాయి రాజేశ్
Comments
Please login to add a commentAdd a comment