మొన్నీమధ్య 'దేవర' మూవీతో హిట్ కొట్టిన జాన్వీ కపూర్.. ప్రస్తుతం రామ్ చరణ్ కొత్త మూవీ కోసం రెడీ అవుతోంది. ప్రస్తుతం ఈమెకు సంబంధించిన ఫొటోషూట్.. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో నడుస్తోంది. ఎలానూ సిటీలోకి వచ్చాను కదా అని గుళ్లకు వెళ్లి పూజలు చేసేస్తోంది.
(ఇదీ చదవండి: 'దేవర'తో పాటు ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 15 సినిమాలు)
తాజాగా గురువారం.. అమీర్‌పేట్ దగ్గరలోని మధురానగర్ ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చింది. ప్రత్యేక పూజలు నిర్వహించింది. అనంతరం ఈమెకు అర్చకులు తీర్థప్రసాదాలు అందించారు. జాన్వీ వచ్చిందని తెలిసి, గుడి దగ్గరకు పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.
జాన్వీ కపూర్ సినిమాలు చేస్తున్నప్పటికీ దైవ భక్తి మాత్రం ఎక్కువే. ఎప్పుడు వీలు దొరికినా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ హనుమాన్ టెంపుల్‌లోనూ ప్రత్యేక పూజలు నిర్వహించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: 'పుష్ప 2' కోసం తమన్.. 'కాంతార' మ్యూజిక్ డైరెక్టర్ కూడా?)
అమీర్ పేట్ - వెంగళరావు నగర్లోని ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన సినీ నటి జాన్వీ కపూర్. pic.twitter.com/r8AQQKUDqn
— Telugu Scribe (@TeluguScribe) November 7, 2024
Comments
Please login to add a commentAdd a comment