hanuman temple
-
హైదరాబాద్‌లోని హనుమాన్ గుడిలో జాన్వీ ప్రత్యేక పూజలు
మొన్నీమధ్య 'దేవర' మూవీతో హిట్ కొట్టిన జాన్వీ కపూర్.. ప్రస్తుతం రామ్ చరణ్ కొత్త మూవీ కోసం రెడీ అవుతోంది. ప్రస్తుతం ఈమెకు సంబంధించిన ఫొటోషూట్.. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో నడుస్తోంది. ఎలానూ సిటీలోకి వచ్చాను కదా అని గుళ్లకు వెళ్లి పూజలు చేసేస్తోంది.(ఇదీ చదవండి: 'దేవర'తో పాటు ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 15 సినిమాలు)తాజాగా గురువారం.. అమీర్‌పేట్ దగ్గరలోని మధురానగర్ ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చింది. ప్రత్యేక పూజలు నిర్వహించింది. అనంతరం ఈమెకు అర్చకులు తీర్థప్రసాదాలు అందించారు. జాన్వీ వచ్చిందని తెలిసి, గుడి దగ్గరకు పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.జాన్వీ కపూర్ సినిమాలు చేస్తున్నప్పటికీ దైవ భక్తి మాత్రం ఎక్కువే. ఎప్పుడు వీలు దొరికినా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ హనుమాన్ టెంపుల్లోనూ ప్రత్యేక పూజలు నిర్వహించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: 'పుష్ప 2' కోసం తమన్.. 'కాంతార' మ్యూజిక్ డైరెక్టర్ కూడా?)అమీర్ పేట్ - వెంగళరావు నగర్‌లోని ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన సినీ నటి జాన్వీ కపూర్. pic.twitter.com/r8AQQKUDqn— Telugu Scribe (@TeluguScribe) November 7, 2024 -
హనుమాన్ గుడి ప్రత్యేకత ఏమిటి?
-
అయోధ్య హనుమాన్ గర్హి ఆలయం.. ఆసక్తికర విషయాలు
-
డోంగర్ గామ్ లోని హనుమాన్ ఆలయంలో పాము సంచారం
-
మొద్దునిద్ర వీడేదెన్నడో.. దొంగల నుండి రక్షించుకో దేవుడా!
కరీంనగర్‌కల్చరల్: రక్షించు దేవుడా అంటూ పొద్దున లేవగానే ప్రార్థించే దేవుడి సొమ్ముకు రక్షణలేకుండా పోతోంది. జిల్లాలోని ఆలయాల్లో వరుస చోరీలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేవుడి ఆభరణాలు.. హుండీ సొమ్ము దొంగలపాలు అవుతోంది. పరిరక్షించాల్సిన దేవాదాయశాఖ అధికారులు మొద్దునిద్ర వహిస్తుండగా.. ఆలయాల్లో సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. జిల్లాలోని పలు ఆలయాల్లో ఇటీవల జరుగుతున్న చోరీలు ఆందోళన కలిగిస్తుండగా.. దేవుడి సొమ్ము దొంగలపాలవుతోంది. ● జిల్లాలోని చాలా ఆలయాల్లో సీసీకెమెరాలు లేవు. ఉన్న ఆలయాల్లో పనిచేయడం లేదు. గతంలో పోలీసులు ఆలయాల్లో నైట్ వాచ్మెన్లను, స్థానికులను, సిబ్బందితో మాట్లాడి రిజిష్టర్‌లో సంతకం నమోదు చేసుకునేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితులే కనిపించడం లేదు. ● కరీంనగర్‌లోని వేంకటేశ్వర ఆలయంలో 12రోజుల క్రితమే హుండీ దొంగతనం కాగా.. మళ్లీ ఆదివారం అర్ధరాత్రి దొంగలు హుండీ చోరీ చేశారు. కరీంనగర్ వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు కూతవేటుదూరంలో ఉన్న ఆలయంలో పక్షంరోజుల్లో రెండుసార్లు దొంగతనం జరగడం పర్యవేక్షణకు అద్ధం పడుతోంది. ● హూజూరాబాద్‌లోని కేసీక్యాంపు వేంకటేశ్వర ఆలయంలో రూ.3లక్షల విలువ ఆభరణాలు, జమ్మికుంటలోని శ్రీవేంకటేశ్వర ఆలయంలో సుమారు రూ.5లక్షల ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. ● అక్టోబర్ 8న కరీంనగర్‌లోని ప్రశాంత్‌నగర్ హనుమాన్ ఆలయంలో హుండీ ఎత్తుకెళ్లారు. ఫిబ్రవరి 2న మంకమ్మతోట లేబర్ అడ్డా భక్తాంజనేయ ఆలయంలో సీసీ కెమెరా వైర్లు కట్‌చేసి హుండీ చోరీచేశారు. హుండీలే కీలకం ఆలయాల ఆదాయానికి హుండీలే కీలకం. భక్తులు హుండీల్లో వేసే కానుకలు చాలా ఆలయాల అభివృద్ధికి ఉపయోగంగా ఉంటున్నాయి. అయితే ఆలయాల్లో సీసీ కెమెరాలు లేకపోవడంతో హుండీ, దేవుళ్ల ఆభరణాలకు రక్షణలేకుండా పోతోంది. ఒక్కోఈవో మూడు నుంచి ఐదు ఆలయాల నిర్వహణ చూస్తుండడంతో పర్యవేక్షణ లోపిస్తోంది. ఆలయాల్లో తప్పనిసరిగా సెక్యూరిటీ గార్డు, నైట్వాచ్మెన్లను నియమించాలని, ఆలయం మూసే ముందు తాళాలు సరిగా వేశారోలేదో చూసుకోవాలని భక్తులు కోరుతున్నారు. సీసీ కెమెరాలు పనిచేసేలా చూడాలని, పోలీసు బీట్బుక్ నిర్వహించాలని సూచిస్తున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలి భక్తుల కానుకలకు భద్రతకల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఇందు కోసం అన్ని ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఈవోలకు ఆదేశాలిచ్చాం. ఆదాయం ఎక్కువగా ఉంటే దేవాదాయశాఖ కమిషనర్ అనుమతితో నైట్‌వాచ్ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశాం. ఆలయ హుండీలను పట్టిష్ఠంగా ఏర్పాటు చేసుకోవాలి. ఈవోలు, అధికారులు తరచూ పర్యవేక్షిస్తుండాలి. – ఆకునూరి చంద్రశేఖర్, ఉమ్మడిజిల్లా దేవాలయశాఖ సహాయ కమిషనర్ -
శక్తి.. యుక్తి.. భక్తిల మేలు కలయికే హనుమంతుడు: స్వామి సూర్యపాద
హైదరాబాద్: ధ్యానం, జ్ఞానం ద్వారా మనిషి జీవితంలో ఒత్తిడిని తొలగించి ప్రపంచ శాంతిని తేవటమే గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ లక్ష్యమని స్వామి సూర్యపాద పేర్కొన్నారు. 10వ తేదీ శనివారం సాయంత్రం కర్మన్ ఘాట్‌లోని ధ్యానాంజనేయస్వామి దేవాలయ ప్రాంగణంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా సత్సంగానికి వందలాది భక్తులు హాజరయ్యారు. సాయంత్రం 6.30 గంటలకు ఓంకారం, గణేశస్తుతితో కార్యక్రమం ప్రారంభమైంది. శక్తి, యుక్తి, భక్తిల కలయికగా హనుమంతుని స్తుతించిన స్వామీజీ, ప్రశాంతత, ధైర్యం, విశ్వాసం సమపాళ్లలో కలిగి ఉండాలనే విషయాన్ని ధ్యానాంజనేయస్వామి నుండి మనం నేర్చుకోవాలని సూచించారు. అనంతరం శ్రీరామ, కృష్ణ, సరస్వతీ దేవతలను, సద్గురువును స్తుతిస్తూ సాగిన స్వామీజీ సుమథుర గానంతో భక్తులందరూ గొంతు కలిపారు. ప్రతీ భజన అనంతరం కొద్ది సేపు భక్తులందరితో చేయించిన ధ్యానం వారికి అలౌకికానుభూతిని కలిగించింది. స్వామి సూర్యపాద గారు పరమపూజ్య శ్రీశ్రీ రవిశంకర్ గురుదేవుల స్ఫూర్తితో గత మూడు దశాబ్దాలుగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగ, జ్ఞాన, ధ్యాన కార్యక్రమాలను ప్రజలకు నేర్పుతున్నారు. భక్తిపూర్వకమైన హృదయంతో వారు సత్సంగాలలో పాడే భజనలు, వాటికి తోడుగా చేసే ఉపదేశ వాక్యాలు బహుళ జనాదరణ పొందటమే కాక, ప్రజల్లో చక్కని పరివర్తనను కలిగించేందుకు, వారిని మంచి మార్గంలో నడిపించేందుకు దోహదపడుతున్నాయి. పూర్వం లక్ష్మీదేవి పల్లెగా పేరొందిన కర్మన్ ఘాట్‌లోని ఆంజనేయస్వామి దేవాలయానికి ఘనమైన చరిత్ర ఉంది. అప్పటి గోల్కొండ కోటను జయించి చుట్టుపక్కల హిందూ దేవాలయాలను నాశనం చేస్తూ వస్తున్న అల్లాఉద్దీన్ ఖిల్జీ ఈ పల్లెకు వచ్చి, అక్కడి ధ్యానాంజనేయస్వామి మూర్తిని చూసి నిరుత్తరుడై నిలిచిపోగా, ఈ మూర్తిని దర్శించాలంటే నీ మనసు స్థిరంగా ఉండాలని చెబుతూ ఆలయ పూజారి 'కరో మన్ ఘట్' అని అన్న మాటతో, ఆ ఆలయానికి హాని చేయకుండా ఖిల్జీ మరలిపోయాడని, ఆనాటి నుంచి ఆ ప్రాంతం కరో మన్ ఘట్ లేదా కర్మన్ ఘాట్‌గా పేరు తెచ్చుకుందని చెబుతారు. ఇంతటి చారిత్రక ప్రాధాన్యం కలిగిన ధ్యానాంజనేయస్వామి ప్రాంగణంలో జరిగిన ఈ మహా సత్సంగం భక్తుల హృదయాల్లో మధురానుభూతులను మిగిల్చి, ఈ ప్రాంతమంతటికీ సకల శుభాలను కలిగించినదనడంలో సందేహం లేదు. ఈ కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ అపెక్స్ సభ్యులు రామ్‌కుమార్ రాఠీ, కృష్ణమూర్తి, కో-ఆర్డినేటర్లు శ్రీనివాస్, రోహన్, అనూప్ తదితరులు పాల్గొన్నారు. -
చెయ్యికి పాము చుట్టినా.. భక్తిపారవశ్యంతో చిందులు
వైరల్: దేవుడిపై భక్తి, నమ్మకం ఉండాలి. కానీ, అది గుడ్డిగా ఉండకూడదు!. భక్తి పేరుతో మూఢనమ్మకాలను ప్రమోట్ చేయడం, అంధ విశ్వాసంతో ఒక్కోసారి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం తరచూ చూస్తున్నాం కూడా. అయితే.. తాజాగా మహారాష్ట్ర-మధ్యప్రదేశ్ బార్డర్‌లోని ఓ గ్రామంలో జరిగిన ఆసక్తికర ఘటన ఒకటి ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది. చిన్‌ద్వారా జిల్లా జామ్ సవాలీ హనుమాన్ ఆలయం.. ఆ చుట్టుపక్కల 11 జిల్లాల్లో బాగా ఫేమస్. ఎందుకంటే ఆ ఆలయంలో స్వామివారి విగ్రహం పడుకుని ఉన్న పొజిషన్లో ఉంటుంది. సంజీవని పర్వతం మోసుకెళ్లే సమయంలో.. ఆయన అక్కడ సేదతీరాడని నమ్మకం. అంతేకాదు విగ్రహ నాభి నుంచి నీరు ఉబికి వస్తుంటుంది. ఆ నీటిని తీర్థంలా స్వీకరిస్తే.. మానసిక జబ్బులు తగ్గిపోవడంతో పాటు దెయ్యాలు, దుష్టశక్తులు వదిలిపోతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఉదయం, సాయంత్రం మహా హారతి వేళ అలాంటి భక్తులతో ఆలయం కిక్కిరిసిపోతుంటుంది. అయితే.. తాజాగా హోలీ పండుగ సందర్భంగా ఈ ఆలయంలో ఒక ఘటన జరిగింది. హరతి సమయంలో భక్తులు హనుమాన్ చాలీసా పఠిస్తుండగా.. ఎక్కడి నుంచి వచ్చిందో ఓ నాగుపాము ఒక భక్తురాలి చేతికి చుట్టుకుంది. అయితే ఆ పరిణామంతో ఆమె బెదరలేదు. పైగా ఆ పాము అలా ఉండగానే పైకి లేచింది. భక్తిపారవశ్యంతో పూనకం వచ్చినట్లు ఊగిపోతూ చిందులేసింది. అది చూసి భయంతో కొందరు దూరం జరిగారు. మరికొందరు స్వామివారి నినాదాలు చేస్తూ ఊగిపోయారు. అదేం విచిత్రమో.. ఆ పాము కూడా ఆమెను ఏం చేయలేదు. కాసేపటికి చెయ్యి నుంచి దిగిపోయి.. తన మానానా తాను బయటకు వెళ్లిపోయింది. ఈ ఆలయంలో ఈ తరహా అద్భుతాలు తరచూ జరుగుతుంటాయని, అంతా స్వామివారి మహిహేనని ఆలయ ప్రధాన అర్చకుడు చెప్తున్నారు. महाराष्ट्र, मध्य प्रदेश के बॉर्डर पर स्थित सौंसर के जामसवली मंदिर में कोबरा प्रजाति का सांप हाथो मे लेकर महाआरती करती महीला, pic.twitter.com/5wNBiHAvPX — Yogendraindiatv (@indiatvyogendra) March 9, 2023 -
సినీ హీరో అర్జున్ నిర్మించిన దేవాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ కవిత
సాక్షి, చెన్నై: నటుడు అర్జున్ నిర్మించిన హనుమాన్ దేవాలయాన్ని ఎమ్మెల్సీ కవిత శుక్రవారం సందర్శించారు. ప్రముఖ ఆంగ్ల పత్రిక నిర్వహించనున్న సదస్సులో పాల్గొనడానికి చెన్నైలో పర్యటిస్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ప్రముఖ సినీ హీరో అర్జున్ నిర్మించిన హనుమాన్ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అర్జున్ దంపతులు కల్వకుంట్ల కవితకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ.. చెన్నైలో పర్యటించడం తనకు ఎప్పుడూ ఆనందంగా ఉంటుందని తెలిపారు. తమిళనాడు అస్తిత్వం చాలా గొప్పదని, అక్కడి ప్రజలు స్ఫూర్తిదాయకంగా ఉంటారని అన్నారు. తమిళనాడు ప్రజలు తమ సంస్కృతి భాష చరిత్ర వారసత్వం పట్ల గర్వంగా ఉంటారని, ప్రతి ఒక్కరికి ఆ గౌరవభావం ఉండాలని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆలోచన తత్వం భారతీయులను ఐక్యంగా ఉంచుతుండడం గర్వంగా ఉందని తెలిపారు. దేశంలోని అతిపెద్ద హనుమాన్ దేవాలయాన్ని నిర్మించినందుకు అర్జున్‌కు కవిత అభినందనలు తెలిపారు. చదవండి: దర్శకుడితో హీరోయిన్ డేటింగ్..! -
ఆంజనేయాలయం కోసం భూదానం చేసిన ముస్లిం
షాజహాన్‌పూర్(యూపీ): ఆంజనేయ ఆలయ నిర్మాణం కోసం ఉత్తరప్రదేశ్‌లో ఒక ముస్లిం వ్యక్తి భూదానం చేసి మతసామరస్యాన్ని చాటాడు. ఢిల్లీ–లక్నో 24వ నంబర్ జాతీయ రహదారి విస్తరణ పనులకు కచియానా ఖేరి గ్రామంలో హనుమాన్ ఆలయం అడ్డంకిగా మారింది. విషయం తెలుసుకున్న స్థానికుడు బాబూ అలీ తన 0.65 హెక్టార్ల భూమిలో కొత్త ఆలయం నిర్మించుకోండంటూ భూమిని దానం చేశాడు. దీంతో రోడ్డపై ఆలయాన్ని పడగొట్టి అలీకి చెందిన స్థలంలో పునర్నిర్మించనున్నారని అదనపు జిల్లా మేజిస్ట్రేట్(పరిపాలన) రామ్‌సేవక్ ద్వివేది బుధవారం చెప్పారు. ఈ మేరకు భూమి బదిలీ ప్రక్రియ పూర్తయిందని తిల్హార్ డెప్యూటీ జిల్లా మహిళా మేజిస్ట్రేట్ రాశీ కృష్ణ వెల్లడించారు. హిందూ – ముస్లిం ఐక్యతను అలీ మరోసారి చాటిచెప్పారని రాశీ పొగిడారు. ఇదీ చదవండి: మా లక్ష్మణరేఖ తెలుసు -
గుళ్లో నిద్రిస్తున్న పూజారిపై కత్తితో దాడి.. హుండీ మాయం!!
జలోర్: గుళ్లో దొంగతనానికి వచ్చి, అడ్డుకున్న 70 యేళ్ల పూజారిని కడతేర్చారు గుర్తుతెలియని అంగతకులు. తాజాగా జిల్లాలో చోటుచేసుకున్నఈ సంఘటన స్థానికంగా కలకలంరేపింది. పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్‌లోని జలోర్ జిల్లాలో దుంబాడియా గ్రామానికి చెందిన నెనుదాస్ వైష్ణవ్ (70) అనే పూజారి గత 30 యేళ్లుగా హనుమాన్ దేవాలయంలో పూజలు చేస్తున్నాడు. ఐతే సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఎప్పటిలాగే పూజా కార్యక్రమాలు ముగించుకుని పూజారి నిద్రిస్తున్నాడు. అదే సమయంలో దొంగతనం చేయాడానికి ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు, అక్కడ నిద్రిస్తున్న పూజారిపై కత్తితో దాడిచేశారు. పూజారి కేకలు వేయడంతో స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన పూజారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఐతే పూజారి చికిత్స పొందుతూ మంగళవారం (నవంబర్ 30) ఉదయం మరణించాడు. ఘటన అనంతరం దేవాలయంలోని విరాళం పాత్ర కూడా కనిపించకుండా పోయింది. కాగా పోలీసులు హత్య కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ కేసులో అర్చకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించినట్లు డీఎస్పీ (భీన్మల్) శంకర్ లాల్ తెలిపారు. మరోవైపు నిందితులను పట్టుకునేందుకు పలు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు వివిధ ప్రాంతాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. చదవండి: OCD Wife: నావళ్లకాదు మహప్రభో.. దయచేసి విడాకులిప్పించండి! -
కుడి చేతిలో గద, ఎడమ చేతిలో ‘అరటిపండు’..
జంగారెడ్డిగూడెం(పశ్చిమ గోదావరి): భారతదేశంలోనే విశిష్టమైన హనుమ దివ్యక్షేత్రం. శిఖరం లేని ఆలయం. తెల్ల మద్ది చెట్టే శిఖరం. స్వయంభూ క్షేత్రం. ఈ క్షేత్రంలో స్వామిహనుమ కుడి చేతిలో గద, ఎడమ చేతిలో అరటిపండు ఉండి అడుగు ముందుకు వేసినట్టు ఉండటం విశేషం. గద భక్తునికి అభయం, అరటిపండు ఫలప్రదం, ముందుకు వేసే అడుగు తక్షణ అనుగ్రహం ఇచ్చే అంశాలుగా భక్తుల అనుభవం. స్వామి శిరస్సుపై ఐదు శిరస్సుల సర్పరాజంగా మద్దిచెట్టు తొర్ర. భక్తుల పాలిట కొంగుబంగారం మద్ది హనుమ. మద్ది అంజన్న దర్శనం తోనే జన్మ లగ్నాత్ శనిదోషాలు, రాహుకేతు దోషాలు, నవగ్రహ దోషాలు పోతాయి అని భక్తుల విశ్వాసం మరియు నమ్మిక. మంగళవారం, శనివారం ప్రదక్షిణలు విశేష ఫలప్రదం. మూడు యుగాలతో ముడిపడిన స్థలపురాణం. గర్గ సంహిత, శ్రీమద్ రామాయణం, పద్మ పురాణంలో స్థలపురాణ అంశాలు. భక్తుడి దివ్యకధకు రూపం. భక్తవరదుడై అనుగ్రహించిన అంజన్న కోరికలు తీర్చే కొంగుబంగారం. ఇలా ఎన్నో, ఎన్నెన్నో విశిష్టతలు తో కూడిన ఆంజనేయ సన్నిధి శ్రీమద్దిఆంజనేయస్వామి వారి ఆలయం. జిల్లాలోని జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో ఎర్రకాలువఒడ్డున పచ్చని పొలాల మధ్య అర్జున వృక్షం (తెల్లమద్ది చెట్టు) తొర్రలో కొలువైఉన్న ఆంజనేయస్వామివారి సన్నిధి శ్రీమద్ది ఆంజనేయస్వామి వారి దివ్యాలయం. ఆలయానికి వెళ్లే మార్గం : పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన నగరం ఏలూరు నుండి జంగారెడ్డిగూడెం వెళ్లే మార్గం లో 48 కిలోమీటర్ల దూరంలో జంగారెడ్డిగూడెం పట్టణానికి 4 (నాలుగు)కిలోమీటర్ల ముందు ఈ క్షేత్రం ఉంది. పశ్చిమగోదావరి జిల్లా వాణిజ్య రాజధాని తాడేపల్లిగూడెం నుండి 56 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఆలయం తెరుచు వేళలు: ప్రతీ రోజూ ఉదయం 6:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు తిరిగి మధ్యాహ్నం 3:00 నుండి రాత్రి 8:30 వరకు, ప్రతీ మంగళవారం మాత్రం వేకువజామున 5:00 గంటల నుండి స్వామివారి దర్శనం భక్తులకు లభిస్తుంది స్థలపురాణం : ఆలయ స్థలపురాణం ప్రకారం మూడు యుగాలకు అనుబందంగా స్థలపురాణం చెప్పబడింది త్రేతాయుగం: రావణుని సైన్యంలోని మద్వా సురుడు అనే రాక్షసుడు సాత్విక చింతనలో రాక్షస ప్రవృత్తిలో కాక ఆధ్యాత్మిక చింతనలో ఉండేవారు. సీతామాతను అన్వేషిస్తూ హనుమ లంకను చేరినప్పుడు హనుమ పరాక్రమం ప్రత్యక్షంగా దర్శించి హనుమకు భక్తుడయ్యాడు. రామరావణ యుద్ధంలో రాముని వైపు పోరాడుతున్న హనుమను దర్శించి మనస్సు చలించి అస్త్రసన్యాసం చేసి హనుమా అంటూ తనువు చాలించారు. ద్వాపరయుగంలో : ద్వాపరంలో మధ్వకుడు అనే పేరుతో జన్మించి కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల వైపు నిలిచి యుద్ధం చేస్తూ అర్జనుని రధం పైనున్న ’జండా పై కపిరాజు’ (ఆంజనేయస్వామి వారు)ను దర్శించి తన గతజన్మ గుర్తుకొచ్చి స్వామిని త్వరితగతిన చేరే క్రమంలో అస్త్రసన్యాసం చేసి ప్రాణత్యాగం చేసుకున్నారు. కలియుగంలో : కలిలో మద్వుడు అనే పేరుతో జన్మించి హనుమ అనుగ్రహం కోసం తపస్సు చేయాలన్న సంకల్పంతో ఎర్రకాలువ ఒడ్డున కుటీరం ఏర్పాటు చేసుకుని ప్రతీ దినం కాలువలో దిగి స్నానం చరించి ఇలా ఎన్నో ఏళ్ళు తపస్సు చేస్తున్న సందర్భంలో ఒకరోజు రోజూ లాగునే ఎర్రకాలువలో ఉదయం స్నానం చేసి పైకి వస్తున్న క్రమంలో జారి పడబోయినవుడు, ఎవరో ఆపినట్టు ఆగిపోయారు. ఒక కోతి చేయి అందించి పడకుండా ఆ క్షణంలో ఆపింది. అంతేకాక ఒక ఫలం ఇచ్చి వెళ్ళింది. తన ఆకలి తీర్చడం కోసం ఫలం ఇచ్చిన ఈ వానరం ఎవరో అని మహర్షి ఆలోచించలేదు. అదే క్రమంలో నిత్య అనుష్ఠానం కొనసాగించడం ప్రతీ రోజూ కోతి వచ్చి ఫలం ఇవ్వడం దానిని మద్వమహర్షి స్వీకరించడం జరిగేది. ఒకరోజు తనకు రోజూ ఫలం ఇస్తున్న వానరం హనుమగా గుర్తించి ఇన్నాళ్లు మీతో సపర్యలు చేయించుకున్నానా ! అని నేను పాపాత్ముడను, జీవించి ఉండుట అనవసరం అని విలపించి బాధపడిన సందర్భంలో స్వామి హనుమ ప్రత్యక్షమై మద్వా ఇందులో నీతప్పు ఎంతమాత్రమూ లేదు నీ స్వామి భక్తికి మెచ్చి నేనే నీకు సపర్యలు చేశాను. ఏమి వరం కావాలో కోరుకోమన్నట్టు స్థలపురాణం ద్వారా తెలుస్తోంది. వరప్రదానం :– మీరు ఎల్లప్పుడూ నా చెంతే ఉండాలి స్వామి అని మద్వమహర్షి కోరగా మద్వా నీవు అర్జున వృక్షానివై (తెల్లమద్దిచెట్టు)ఇక్కడ అవతరించు. నేను నీ సమీపంలో శిలారూపంలో నేను స్వయం వ్యక్తమవుతాను.నీ కోరిక ప్రకారం ఎల్లప్పుడూ నీ చెంతే ఉంటూ మన ఇరువురి నామాలతో కలిపి మద్ది ఆంజనేయుడుగా కొలువైవుంటాను అని వరం ఇచ్చి ఇక్కడ వెలిశారు అన్నది స్థలపురాణం. స్వప్నదర్శనం: అనంతర కాలంలో 1966 నవంబర్ 1న ఒక భక్తురాలికి స్వప్నదర్శనం ఇచ్చి తాను ఇక్కడ చెట్టు తొర్రలో ఉన్నట్టు స్వామి చెప్పడంతో పాటు శిఖరం లేకుండా చెట్టే శిఖరంగా ఉత్తరోత్తరా ఆలయ నిర్మాణం చేసినా ఏర్పాటు చేయాలని చెప్పినట్టు స్థానికుల నుండి తెలిసిన స్వప్నవృత్తాంతం. చిన్నగా గర్భాలయం: ముందు కేవలం స్వామి చుట్టూ చిన్న గర్భాలయం నిర్మించారు అనంతరం 40 సంవత్సరాల క్రితం మండపం మరియు ఆలయం నిర్మించారు. తర్వాత విశేష సంఖ్యలో భక్తుల రాకతో ఆలయం పునర్నిర్మాణం జరిగి సకల సౌకర్యాలు ఏర్పాటుచేయబడ్డాయి. మద్ది ఒక దివ్యక్షేత్రంగా భాసిల్లుతోంది. హనుమద్ దీక్షలు: ప్రతీ సంవత్సరం భక్తులు హనుమద్ దీక్షలు మండల కాలం చేసి స్వామి సన్నిధిలో హనుమద్ వ్రతం రోజు ఇరుముడి సమర్పిస్తారు.ఈ రీతిగా ముందుగా దీక్షా స్వీకారం చేసి హనుమ కృపతో దీక్షను భక్తితో పూర్తిచేస్తారు.మద్దిక్షేత్రంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయం కూడా ఉంది. ప్రతిష్ఠితమూర్తులను భక్తులు దర్శించవచ్చు. ప్రదక్షిణలు: స్వామి హనుమ సన్నిధిలో ప్రదక్షిణలు విశేషంగా భక్తులు ఆచరించే ధార్మిక విధి. వివాహం కానివారు,వైవాహిక బంధం లో ఇబ్బందులు ఉన్నవారు,ఆర్ధిక ఇబ్బందులు,వ్యాపారం లో నష్టాలు,ఉద్యోగంలో ఉన్నతి లేనివారు ఇలా ఒకటేమిటి అనేక ఈతిబాధలు ఉండి ఏ పని చేసినా కలిసిరాని వారు ముందుగా స్వామిని దర్శించి తమ కోరికను స్వామికి మనస్సులో విన్నవించి 7 మంగళవారాలు 108 చొప్పున ప్రదక్షిణలు చేసి వారి కోరిక యొక్క తీవ్రతను బట్టి అర్చకస్వాములు సూచించిన విధంగా కొన్నివారాలు ప్రదక్షిణలు చేసి కోరిక తీరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేయడం ఇక్కడి భక్తుల నిత్యఅనుభవం. శనిదోషాలు,గ్రహదోషాలు నివారణకు శనివారం పూజ ఇక్కడి విశేషం. అంగారక, రాహు దోషాలు తో పాటు ఎటువంటి దోషాలు అయినా స్వామి పూజలో తొలగుతాయి అన్నది భక్తుల నమ్మిక. ఆధ్యాత్మిక వైభవం :– సువర్చలా హనుమ కల్యాణం ప్రతీ నెలా పూర్వాభాద్ర నక్షత్రం రోజు, పంచామృతాభిషేకం ప్రతీ శనివారం, 108 బంగారు తామలపాకుల పూజ ప్రతీ మంగళ, శుక్ర, శనివారాల్లో, 108 వెండి తమలపాకుల పూజ ప్రతీ మంగళ, శుక్ర, శనివారాల్లో, ఇంకా నిత్యపూజలు, విశేష పర్వదినాల్లో ప్రత్యేకపూజలు, అష్టోత్తర సేవ జరుగుతాయి. కార్తీకమాసంలో నెలరోజులూ వైభవమే: కార్తిక శుద్ధ పాడ్యమి నుండి కార్తిక అమావాస్య వరకూ కార్తికం లో ప్రతీ మంగళవారం విశేష ద్రవ్యాలతో పూజలు చూసి తరించవలసిందే వర్ణించ వీలుకాని వైభవం. అలాగే హనుమద్జయంతి 5 రోజులు పాంచహ్నిక దీక్షగా నిర్వహిస్తారు. వైశాఖ బహుళ నవమి నుండి వైశాఖ బహుళ త్రయోదశి వరకూ జరుగుతుండగా, పవిత్రోత్సవాలు భాద్రపద శుద్ధ నవమి నుండి భాద్రపద శుద్ధ ద్వాదశి వరకూ జరుగుతాయి. ప్రవచనాలు, భజనలు, శోభాయాత్ర, తెప్పోత్సవం ఇలా ఒకటేమిటి ప్రతీదీ ప్రత్యేకమే. -
రెండేళ్ల దళిత బాలుడు... ఆలయంలోకి ప్రవేశించాడని జరిమానా
కొప్పాల్: ఆధునిక యుగంలోనూ కుల వివక్ష యథాతథంగా కొనసాగుతోందనడానికి ఇది మరో నిదర్శనం. రెండేళ్ల దళిత బాలుడు ప్రవేశించడం వల్ల గ్రామంలోని హనుమాన్ ఆలయం మైలపడిందని, దాన్ని శుద్ధి చేయడం కోసమంటూ బాలుని కుటుంబానికి రూ.25వేల జరిమానా విధించారు. కర్ణాటకలోని కొప్పాల్ జిల్లాలో మియాపూర్ గ్రామంలో ఈ నెల 4వ తేదీన ఈ దారుణం జరిగింది. ఈ ఘటనలో పోలీసులు ఐదుగురిని అరెస్ట్‌చేశారు. మియాపూర్‌లో చెన్నదాసరి కులానికి చెందిన చంద్రశేఖర్‌కు రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. ఈ నెల 4న అతడి పుట్టినరోజు కావడంతో హనుమంతుడి ఆశీస్సుల కోసం గుడికి తీసుకెళ్లాడు. చంద్రశేఖర్‌తోపాటు కుటుంబ సభ్యులంతా గుడి బయటే ఉండిపోయారు. బాలుడు లోపలికి వెళ్లొచ్చాడు. ఇది గమనించిన ఆలయ పూజారులు గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. 11న పంచాయితీ పెట్టారు. హనుమంతుడి› ఆలయాన్ని శుద్ధి చేయడానికి జరిమానా కింద రూ.25,000 చెల్లించాలని బాలుని తండ్రిని ఆదేశించారు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ బాలచంద్ర సంగనాల్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామంలో పోలీసుల సమక్షంలో పెద్ద ఎత్తున పూజా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో చెన్నదాసరితో సహా అన్ని కులాల ప్రజలు పాల్గొన్నారు. -
15 ఏళ్లకు గుడి నిర్మాణం పూర్తి చేసిన అర్జున్
సాక్షి, చెన్నై: యాక్షన్ హీరో అర్జున్ సర్జా తమిళనాడులోని చెన్నైలో హనుమంతుడి ఆలయాన్ని నిర్మించాడు. 15 ఏళ్ల క్రితం తలపెట్టిన గుడి నిర్మాణం ఇప్పుడు పూర్తయిందని ఆయన చెప్పుకొచ్చాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేశాడు. "నేను 15 ఏళ్లుగా నిర్మిస్తున్న ఆంజనేయస్వామి గుడి నిర్మాణం పూర్తయింది. ఈ సందర్భంగా జూలై 1, 2 తారీఖుల్లో కుంభాభిషేకం జరుపుతున్నాం" "నా కుటుంబం, స్నేహితులు, అభిమానులు అందరినీ పిలిచి ఈ వేడుకను చాలా గ్రాండ్‌గా చేద్దామనుకున్నా. కానీ కరోనా పరిస్థితుల వల్ల ఎవరికీ ఆహ్వానం పంపలేకపోతున్నా. అయినప్పటికీ ఈ వేడుకను ఎవరూ మిస్ కావద్దన్న ఉద్దేశ్యంతో దీన్ని లైవ్ స్ట్రీమ్ చేస్తున్నాం" అని చెప్పుకొచ్చాడు. కాగా అర్జున్ ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న 'సర్కారు వారి పాట' సినిమాలో పవర్ఫుల్ పోలీసాఫీసర్లా నటిస్తున్నట్లు సమాచారం. చదవండి: Sarkaru Vaari Paata: మహేశ్‌ని ఢీ కొట్టబోతున్న యాక్షన్ కింగ్! -
ఉలిక్కిపడిన ఉప్పల్!
ఉప్పల్ : ఉప్పల్ పోలీసుస్టేషన్ పరిధిలోని జెన్‌ప్యాక్ వద్ద ఇన్నర్ రింగ్ రోడ్‌పై ఉన్న అభయాంజనేయ స్వామి దేవాలయం వద్ద శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ప్రమాదంతో స్థానికులు, వాహనచోదకులు ఉలిక్కిపడ్డారు. ప్రమాద దృశ్యాలను చూసిన వాళ్లు ఎవరైనా భారీ ప్రాణనష్టమే జరిగి ఉంటుందని భావించారు. ప్రతి ఏడాదీ నూతన సంవత్సరం ప్రారంభ రోజైన జనవరి 1న ఈ దేవాలయానికి భక్తులు పెద్ద ఎత్తున వస్తారు. ఈ దేవాలయానికి ప్రమాదం జరగడం ఇటీవల కాలంలో ఇది రెండోసారి. ఇన్నర్ రింగ్ రోడ్లో సికింద్రాబాద్–ఉప్పల్ రూట్లో ఉండే ఈ గుడి వరకు రోడ్డు విశాలంగా ఉంటుంది. దీని దగ్గర రెండుగా చీలి దేవాలయం దాటిన తర్వాత మళ్లీ కలుస్తుంది. ఈ నేపథ్యంలోనే గత ఏడాది మితిమీరిన వేగంతో వచ్చిన భారీ వాహనం దేవాలయ ప్రాంగణాన్ని నేరుగా ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో ఇనుప ఆర్చ్‌తో పాటు ఓ చెట్టు కూలిపోయింది. దీంతో పరిపాలన కమిటీ దేవాలయం ముందు వద్ద ప్రమాదాలకు తావు లేకుండా కొన్ని ఏర్పాట్లు చేసింది. అయితే ఈసారి పక్కగా వచ్చిన వాహనాలు గుడి గోడలు, పరిపాలన విభాగాన్ని పూర్తిగా ధ్వంసం చేశాయి. కాగా నిత్యం దీన్ని ఉదయం 5.30 నుంచి 6.00 గంటల మధ్యే తెరుస్తారు. అయితే శుక్రవారం అర్చకులు రావడం కాస్త ఆలస్యం కావడంతో ప్రమాదం జరిగే సమయానికి దేవాలయం తెరుచుకోలేదు. అలా కాకుండా యథావిధిగా తెరుచుకుని ఉంటే భక్తులు, అర్చకులు, ఉద్యోగులతో పాటు పరిపాలన కమిటీకి చెందిన వారికీ ముప్పు వాటిల్లేది. భారీగా నిలిచిన ట్రాఫిక్... తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదం విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు, డీఆర్ఎఫ్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనాలు దేవాలయం కుడిపక్క మార్గంలో ఉండిపోవడంతో ఆ రూట్‌ను బ్లాక్ చేశారు. ఘటనాస్థలి నుంచి వాహనాలను పక్కకు తీసేసరికి ఉదయం 10.30 గంటలు దాటింది. అప్పటి వరకు ట్రాఫిక్ భారీగా నిలిచిపోయి నెమ్మదిగా కదిలింది. ఈ రోడ్డుకు ఆవలివైపు ఉన్న ఉప్పల్–సికింద్రాబాద్ రోడ్డులోనూ ప్రమాదానికి గురైన వాహనాలు, దేవాలయాన్ని చూడటానికి అనేక మంది ఆగిపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పలేదు. అధికారులు వాహనాలను క్లియర్ చేసినా.. అనేక మంది సాయంత్రం వరకు ఆ స్పాట్లో ఆగి వెళ్తుండటంతో ట్రాఫిక్ నెమ్మదిగానే సాగింది. ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి సందర్శన ప్రమాద విషయాన్ని తెలుసుకున్న ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు ప్రవీణ్ రాజ్‌లు వచ్చి ప్రమాద తీవ్రతను చూసి చలించారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. అప్పుడే వెనక్కి వెళ్లా.. వాచ్‌మెన్‌ని కావడంతో రాత్రంతా గుడిలోనే ఉన్నా. తెల్లవారుజామున లేచి దేవాలయం పరిసరాలను శుభ్రం చేశా. స్నానం చేసి వచ్చి అప్పటి వరకు పరిపాలన విభాగం సమీపంలోనే కూర్చున్నా. వస్త్రాలు ఆరేయడానికి వెనక్కు వెళ్లా. వెనుక నుంచి భారీ శబ్ధాలు రావడంతో పాటు డీసీఎం ఆలయ ప్రాంగణంలోకి దూసుకువచ్చింది. మినీ ట్రాన్స్‌ఫార్మర్‌తో కరెంటు స్తంభాన్ని ఢీ కొట్టి పరిపాలన విభాగంలోకి వెళ్లింది. కరెంట్ తీగలు తెగి నాపైన పడ్డాయి. అయితే అప్పటికే విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో ప్రమాదం జరగలేదు. – కృష్ణ, వాచ్మెన్ ఆ స్వామి దయవల్లనే బతికాం ప్రతి రోజు పూజలు చేయడానికి ఉదయం 5.30 గంటల కల్లా ఆలయంలో ఉండే వాళ్లం. నూతన సంవత్సరం కావడంతో శుక్రవారమూ తెల్లవారు జామునే నిద్ర లేచాం. ఆలయానికి రావడానికి సిద్ధమయ్యాం. ఎందుకో కాస్త ఆలస్యమైంది. ఇంతలోనే ప్రమాద విషయాన్ని వాచ్మెన్ ఫోన్ చేసి చెప్పాడు. రోజు పూజలు చేయించుకునే ఆ దేవుడే మమ్మల్ని కాపాడారు. – ప్రధాన అర్చకుడు రవీంద్ర శర్మ -
హనుమాన్ గఢీని దర్శించిన ప్రధాని మోదీ
-
పదేళ్ల తర్వాత నెరవేరుతున్న కల
సాక్షి, అద్దంకి(ప్రకాశం) : జిల్లాలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానానికి పదేళ్ల తర్వాత పాలక మండలి ఏర్పాటు కోసం దేవాదాయ శాఖ గత నెల 30న జీవో నంబర్ 986ను జారీ చేసింది. వార్షికాదాయం రూ.3 కోట్ల ఆదాయం ఉండి..అసిస్టెంట్ కమిషనర్ స్థాయి దేవస్థానమైన శింగరకొండకు జనవరి నాటికి తొమ్మిది మందితో కూడిన పాలక మండలి కొలువుదీరనుంది. పాలకమండలి ఏర్పాటుకు టీడీపీ ప్రభుత్వం మంగళం శింగరకొండ దేవస్థానానికి ప్రతి రెండేళ్లకు ఒకసారి పాలక మండలిని ఏర్పాటు చేస్తారు. 2008 ఆగస్టు వరకు ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన చిన్ని శ్రీమన్నారాయణ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన పదవీ కాలం పూర్తయింది. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కొనసాగుతూ గొట్టిపాటి రవికుమార్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పాలక మండలి నియామకం చేపట్టలేక పోయారు. ఆ తర్వాత టీడీపీ పాలనలో వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీకి ఫిరాయించిన ఎమ్మెల్యే రవికుమార్, అప్పటికే టీడీపీలో కొనసాగుతున్న కరణం బలరాంల మధ్య ఆధిపత్య పోరులో పాలక మండలి ఏర్పాటు కాలేదు. తాము చెప్పిన వారినే కమిటీలోకి తీసుకోవాలంటూ ఇద్దరు నేతలు పట్టుబట్టడంతో పాలక మండలిని నియమించలేకపోయారు. ఫలితంగా పదేళ్ల నుంచి దేవస్థానానికి పాలక మండలి లేకుండానే అధికారుల పాలనలో నడుస్తోంది. గత నెల 30న పాలక మండలి ఏర్పాటుకు జీవో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత గత నెల 30న దేవదాయ శాఖ జీవో నంబర్ 986 ద్వారా పాలక మండలి నియామకం కోసం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ జీవో ప్రకారం 9 మంది సభ్యులతో కూడిన పాలక మండలి ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 19న ఆఖరు తేదీగా ప్రకటించారు. మహిళలకు ప్రాధాన్యం దేవస్థానం కమిటీ సభ్యుల్లో 50 శాతం మంది మహిళలు ఉండాలి. మిగిలిన 50 శాతం మంది ఎస్సీ, ఎస్సీ, బీసీ (హిందువులై ఉండాలి) వర్గాలకు చెందిన వారికి కేటాయించనున్నారు. అర్హులైన వారు ఈ నెల 19వ తేదీ సాయంత్ర లోపు దేవస్థానం కార్యాలయంలో ఏసీ తిమ్మనాయుడుకి దరఖాస్తులు అందజేయాల్సి ఉంది. సభ్యులుగా దరఖాస్తు చేసే వారు కుల «ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్టు సైజు ఫొటోలు, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు జత చేయాలి. దరఖాస్తు గడువు ముగిసిన తర్వాత పరిశీలనతో జనవరి నాటికి నూతన పాలక మండలి ఏర్పాటు చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఆశావహులు మాత్రం తమను కమిటీ సభ్యులుగా నియమించాలంటూ ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. -
రాయితో ఇల్లు.. ప్రదక్షిణతో పెళ్లి
ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అని అంటుంటారు పెద్దలు. జీవితంలో ఈ రెండు ఖర్చుతో కూడుకున్న కార్యక్రమాలు కావడంతోనే అలా అంటారేమో. రెండు కోర్కెలు నెరవేరాలని జీవితంలో ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఈ రెండు కోర్కెలు తీరే పుణ్యక్షేత్రాలు జిల్లాలోని జంగారెడ్డిగూడెం ప్రాంతంలో ఉండటం విశేషమని భక్తులు చెబుతుంటారు. సొంతింటి కల నెరవేరాలన్నా, పెళ్లి కావాలన్నా ఈ క్షేత్రాలను దర్శిస్తే నెరవేరుతాయన్న నమ్మకం పూర్వం నుంచి వస్తోంది. అందులో ఒకటి జిల్లాలోని ప్రముఖ హనుమద్ క్షేత్రంగా విరాజిల్లుతోన్న గుర్వాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయస్వామి క్షేత్రం, మరొకటి జంగారెడ్డిగూడెం శ్రీ గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి క్షేత్రం. ఆ వివరాలు ఇలా.. సాక్షి, పశ్చిమగోదావరి : జంగారెడ్డిగూడెం పట్టణంలో రాష్ట్ర రహదారిని ఆనుకుని ఏడుకొండలపై కొలువై ఉన్న శ్రీ గోకుల తిరుమల పారిజాతగిరి వేంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయానికి మెట్లమార్గంలో శ్రీమన్నారాయణ, జగదాంబ అమ్మవారు, వినాయకుడు, నటరాజస్వామి ఆలయాలు ఉన్నాయి. ఈ దేవతామూర్తుల ఆలయాల ఎదుట భక్తులు రాయి మీద రాయి ఆపై మరో రాయి పేర్చి సొంతింటి కల నెవరవేరాలంటూ మొక్కుకుంటారు. ఈ క్షేత్రంలో రాయి మీదరాయి పెడితే సొంతింటిని నిర్మించుకునే భాగ్యం కలుగుతుందని పూర్వం నుంచి వస్తున్న భక్తుల నమ్మకం. అంజన్న సన్నిధిలో పెళ్లిళ్ల సందడి మద్ది ఆంజనేయస్వామి వారి క్షేత్రంలో స్వామివారి చుట్టూ చేసే ప్రదక్షిణలకు ప్రాముఖ్యత ఉంది. పెళ్లి కాని యువతీ, యువకులు ఈ క్షేత్రంలో 108 ప్రదక్షిణలు చేస్తే కోరిక తీరుతుందనే నమ్మకం. శని, ఆది, మంగళవారాల్లో అత్యధికంగా స్వామి వారి ప్రదక్షిణ మండపంలో ప్రదక్షిణలు చేస్తుంటారు. రాష్ట్రంలోని అనేక జిల్లాల నుంచి భక్తులు ఇక్కడకు వచ్చి ప్రదక్షిణలు నిర్వహిస్తారు. ఎక్కువగా విష్ణాలయాల్లో అత్యధికంగా వివాహాలు జరుగుతుంటాయి. కానీ పెళ్లిళ్ల సీజన్లో మద్ది అంజన్న సన్నిధిలో అధిక సంఖ్యలో వివాహాలు జరిగి అనేక జంటలు ఒకటి కావడం విశేషం. పూర్వం నుంచి భక్తుల నమ్మకం రాయి రాయి మీద పెట్టి స్వామి వారిని మొక్కుకుంటే సొంతింటి కల నెరవేరుతుందని భక్తులు నమ్మకం. ఈ సంప్రదాయం పారిజాతగిరిలో పూర్వం నుంచి వస్తోంది. కొల్లేపర చిట్టియ్య అనే భక్తుడు పారిజాతగిరి ఆలయ మెట్ల మార్గంలో దేవాతామూర్తుల విగ్రహ ప్రతిమలను ప్రతిష్ఠించారు. అనేక ప్రాంతాల నుంచి భక్తులు ఈ క్షేత్రానికి విచ్చేసి రాయి మీద రాయి పేరుస్తుంటారు. – నల్లూరి రవికుమారాచార్యులు, ప్రధానార్చకులు, పారిజాతగిరి క్షేత్రం 108 ప్రదక్షిణలు చేయాలి మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో 108 ప్రదక్షిణలకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది. పెళ్లికాని, యువతీ యువకులు, భక్తులు, విద్యార్థులు ఆలయానికి వచ్చి 108 ప్రదక్షిణలు చేస్తుంటారు. జ్యోతిష శాస్త్ర ప్రకారం పూర్వీకులు 27 నక్షత్రాలను గుర్తించారు. ఒకో నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. ఈ 27ని 4 పెట్టి గుణిస్తే 108 వస్తుంది. రాశులు 12గా విభజించారు. ఒకో రాశికి 9 పాదాలు కేటాయించారు. 12ని 9 పెట్టి గుణిస్తే 108 వస్తుంది. అందుకే 108 ప్రదక్షిణలు చేస్తే గ్రహ దోషాలు తొలగుతాయని భక్తుల నమ్మకం. –వేదాంతం వెంకటాచార్యులు, ప్రధానార్చకులు, మద్దిక్షేత్రం -
అంజన్న ఆలయాన్ని ఢీకొట్టిన లారీ..!
సాక్షి, ప్రకాశం : ఒంగోలు-విజయవాడ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి ఒంగోలుకు వెళ్తున్న ఓ లారీ అద్దంకి మండలం వెంకటాపురం గ్రామం వద్ద రోడ్డు పక్కన గల ఆంజనేయస్వామి ఆలయాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. వాహనాన్ని బిహార్‌కు చెందినదిగా గుర్తించారు. మృతదేహాలు లారీ క్యాబిన్లో ఇరుక్కుపోవడంతో స్థానికులు, పోలీసులు సాయంతో బయటకు తీశారు. నిద్ర మత్తు కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని అద్దంకి సీఐ హైమారావు తెలిపారు. -
అంజన్న ఆలయాన్ని ఢీకొట్టిన లారీ..!
-
అంజన్నకు మాల వేస్తూ అనంతలోకాలకు..!
సాక్షి, చెన్నై : ప్రసిద్ధి చెందిన నమక్కల్ ఆంజనేయస్వామి పూజా కార్యక్రమాల్లో అపశృతి చోటుచేసుకుంది. స్వామివారి విగ్రహానికి పూలమాల వేస్తూ ఓ పూజారి కిందపడడంతో ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు..18 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహంతో ప్రసిద్ధి చెందిన నమక్కల్ ఆంజనేయస్వామి గుడిలో వెంకటేశన్ అనే ఆలయ పూజారి నిత్యపూజా కార్యక్రమంలో పాల్గొన్నాడు. 11 అడుగుల ఎత్తైన స్టాండ్‌పై నిల్చుని స్వామివారి విగ్రహానికి మాల వేసే క్రమంలో తూలి కిందపడ్డాడు. దీంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆలయ సిబ్బంది వెంకటేశన్ హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ మృతిచెందాడు. దేవుడికి పూజలు చేస్తూ పూజారి మృత్యువాత పడడంతో భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. -
అంజన్నకు మాల వేస్తూ అనంతలోకాలకు..!
-
ఆలయ ప్రహరీపై హనుమాన్ ఆకారం
తార్నాక: తార్నాక– సీతాఫల్మండి వెళ్లే రహదారిలోని ద ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) వద్ద ఉన్న మూడుగుళ్ల అమ్మవారి ఆలయ ప్రహరీపై çఆంజనేయస్వామిని తలపించేలా ఆకారం ప్రత్యక్షం కావడం సంచలనం రేపింది. గోడపై ఆంజనేయ స్వామి చిత్రాన్ని చూసిన కొందరు ఈ విషయాన్ని తమకు తెలిసిన వారికి చెప్పడంతో ఈ సమాచారం దావానంలా వ్యాప్తించింది. మంగళవారం జరిగిన ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. తార్నాక నుంచి సీతాఫల్మండి బ్రిడ్జి వైపు వెళ్లే రహదారిలో ద ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) ప్రహరీని ఆనుకుని నల్లపోచమ్మ, ముత్యాలమ్మ, మైసమ్మ మూడుగుళ్ల దేవాలయం ఉంది. వందేళ్ల చరిత్ర కలిగిన ఈ దేవాలయాన్ని ఇటీవలే ఆధునికీకరించారు. మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆలయ ప్రహరీపై ఆలయం ఎదురుగా ఉన్న చెట్టు ఆకుల మధ్య నుంచి ఆంజనేయస్వామి ఆకారం కనిపించింది. విద్యుత్ కాంతుల మధ్య గోడపై ధగధగా మెరుస్తున్న ఆంజనేయస్వామి ఆకారాన్ని అటుగా వెళ్లున్నవారు గమనించారు. ఈ సమాచారం ఆ నోటా ఈనోటా బయటకు రావడంతో కొద్ది క్షణాల్లోనే ఆలయ ప్రాంగణం జనంతో నిండిపోయింది. దీంతో రోడ్డుపై ట్రాఫిక్‌తో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. విషయం గమనించిన పోలీసులు అక్కడికి చేరుకుని ఆలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. -
నాన్నకు ప్రేమతో..
ములకలపల్లి: చేసేది చిరుద్యోగమైనా గ్రామానికి ఉపయోగపడాలనే ఆకాంక్షను నెరవేర్చిందీ మహిళ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మాధారంలో ఐసీడీఎస్‌లో అంగన్వాడీ టీచర్‌గా విధులు నిర్వహిస్తోంది బోడపట్ల భూషమ్మ. తన తండ్రి జ్ఞాపకార్థం రూ.12 లక్షల వ్యయంతో ప్రధాన సెంటర్లో శ్రీఅభయాంజనేయస్వామి ఆలయాన్ని నిర్మించింది. గ్రామస్తుల సహకారంతో అయిదేళ్ల క్రితం నిర్మించిన ఈ ఆలయానికి ధూపదీప నైవేద్యాలతోపాటు నిత్యపూజలకు లోటురాకుండా ప్రత్యేకంగా పూజారిని ఏర్పాటు చేసింది. చింతల వెంకయ్య స్మారకార్థం ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చెపుతున్న భూషమ్మ పలువురికీ ఆదర్శంగా నిలుస్తోంది. అయిదు దశాబ్ధాల క్రితం చింతల వెంకయ్య, వెంకమ్మ దంపతులు విద్యుత్‌శాఖలో ఉద్యోగరీత్యా ములకలపల్లి మండల పరిధిలోని మాధారంలో స్థిరపడ్డారు. వీరి ముగ్గురు కుమార్తెల్లో భూషమ్మ తొలి సంతానం కాగా, ఇదే గ్రామంలో భూషమ్మ అంగన్వాడీ టీచర్‌గా విధులు నిర్వహిస్తోంది. తన తండ్రి మరణానంతరం అతని జ్ఞాపకార్థంగా చిరస్థాయిగా నిలిచిపోయేలా ఏదైనా ఓఆథ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించాలని భూషమ్మ తలంచింది. ఈ క్రమంలో తాను నివాసం ఉండే మాదారంలోని ప్రధాన సెంటర్లో శిథాలావస్థలో ఉన్న ఆలయాన్ని పునర్మించేందుకు ఉపక్రమించింది. గ్రామస్తుల సహకారంతో తాను తలపెట్టిన దైవకార్యాన్ని ముందుకు నడిపించింది. రూ.12 లక్షల వ్యయంతో శ్రీఅభయాంజనేయస్వామి ఆలయాన్ని పునర్మించింది. మే 25, 2013న వైభంగా ప్రత్యేక పూజల అనంతరం నిర్మించిన ఆలయాన్ని గ్రామానికి అంకితమిచ్చింది. ఆలయం పేరిట రూ. రెండు లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేసి, వాటిపై వచ్చే వడ్డీని ఆలయ నిర్వహణకు వెచ్చిస్తోంది. ఆలయంలో ధూపదీప నైవేద్యాలు, నిత్యపూజలు నిరాటకంగా జరిపించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. భర్త సహకారంతోనే.. నా భర్త బోడపట్ల ముత్తయ్య, పిల్లలు, కుటుంబ సభ్యుల ప్రోద్భలంతో ఆలయ పునః నిర్మాణ పనులు చురుగ్గా సాగాయి. నిర్మాణ సమయంలో గ్రామస్తుల సహకారం మర్చిపోలేనిది. తండ్రి వెంకయ్య జ్ఞాపకార్థం ఆలయం నిర్మించాలనే నా కోరిక నెరవేరింది. గ్రామంలో భక్తిభావం నెలకొనాలన్నదే నా ఆశయం. -
అంజన్న పెళ్లికొడుకాయనె..
పరకాల రూరల్: ఆంజనేయస్వామి, సువర్చలాదేవి కల్యాణానికి వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలం మల్లక్కపేట భక్తాంజనేయస్వామి ఆలయం వేదిక కానుంది. లోక కల్యాణం కోసం బ్రహ్మచారులకు వివాహ వేడుకలు నిర్వహిస్తారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఆరు సంవత్సరాలుగా ఇక్కడ అంజన్న కల్యాణం నిర్వహి ంచండం ఆనవాయితీగా వస్తోంది. శనివారం నిర్వహించే ఈ కల్యాణ వేడుక కోసం అవసరమైన ఏర్పాట్లును నిర్వాహకులు చేపట్టారు. కల్యాణానికి ప్రత్యేక ఏర్పాట్లు.. భక్తాంజనేయస్వామి ఆలయంలో సువర్చలాదేవి–హనుమంతుడి కల్యాణం నిర్వహించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ ఆవరణలో భక్తుల కోసం చలువ పందిళ్లు, విద్యుత్ లైట్లు ఏర్పాటు చేశారు. తాగునీటి సౌకర్యం కల్పించారు. మహా అన్నదానం చేసేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. పెరిగిన భక్తుల తాకిడి.. పరకాల ప్రాతంలో తొలిసారి హనుమాన్ దీక్షలు ఈ ఆలయంలో చేపట్టడంతో భక్తులు పెరిగారు. పట్టణానికి చెందిన కాటూరి జగన్నాథచార్యులు 1988లో చెట్టుకింద ఉన్న హనుమాన్ విగ్రహానికి పూజలు అభిషేకాలు చేయడం ప్రారంభించారు. 1991లో జగనాన్నథచార్యులుతోపాటు మరో నలుగురు విజయవాడకు వెళ్లి 41రోజుల హనుమాన్ దీక్ష చేపట్టారు. మరుసటి సంవత్సరం నుంచి ఈ ఆలయంలో హనుమాన్ దీక్షాపరుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వచ్చింది. అలాగే 1997లో 108 కలశాలతో దుర్గాప్రసాద్ స్వామీజీ చేత యజ్ఞాలు చేయించారు. 2000 సంవత్సరంలో 1108 కలశాలతో హోమాలు చేయించారు. 2013లో 108 వినాయక విగ్రహాలతో 41రోజుల పాటు ప్రత్యేక పూజలు చేశారు. ప్రస్తుతం ఆలయంతో సుమారు పది వేలకు పై బడి భక్తులు హనుమాన్ మాలాధారణ చేస్తున్నారు. ఆలయానికి వందేళ్ల చరిత్ర.. ఈ ఆలయానికి నూరు సంవత్సరాల చరిత్ర ఉంది. నాడు ఒక చెట్టు కింద విగ్రహ రూపంలో వెలిసిన హనుమంతుడికి ఆలయం కట్టించారు. ప్రతి ఏటా చైత్రశుద్ధ పౌర్ణమి(ఇల్లంతకుంట పౌర్ణమి) రోజున ఆలయం చుట్టుపక్కల ఉన్న మల్లక్కపేట, రాయపర్తి, నాగారం, నర్సక్కపల్లి గ్రామాల నుంచి భక్తులు ఎడ్లబండ్లపై వచ్చి మొక్కులు చెల్లించుకునే వారు. కాల క్రమేనా ఆలయ విశిష్టత పెరిగి ప్రసిద్ధి గాంచిన హనుమాన్ దేవాలయాల్లో ఒకటిగా భాసిల్లుతోంది. బ్రహ్మచారి అయిన హనుమంతుడి కల్యాణం చాలా శ్రేష్టమైనది. మన రాష్ట్రంలో ఇక్కడ మాత్రమే హనుమంతుడి కల్యాణం నిర్వహిస్తున్నాం. హోమంతో ప్రారంభమై పూర్ణాహుతి అనంతరం సువర్చలాదేవితో ఆంజనేయస్వామి కల్యాణ మహోత్సవం జరుగుతుంది. – కాటూరి జగన్నాథచార్యులు, ఆలయ ప్రధాన అర్చకులు -
హనుమాన్ ఆలయ అర్చకుడి హత్య
మంచిర్యాల , తలమడుగు(బోథ్): మండలంలోని పో న్నారి గ్రామ హనుమాన్ ఆలయ అర్చకుడు గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హత్య కు గురయ్యాడు. ఆలయంలో పూజలు చేసి న అనంతరం ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యంలో మాటువేసిన వ్యక్తులు ఆయనను మట్టుబెట్టారు. ఈ హత్య తాంసి, భీంపూర్ మండలాల్లో సంచలనం సృష్టించింది. పోలీసుల వివరాల ప్రకారం.. భీంపూర్ మండలం నిపాని గ్రామానికి చెందిన కత్రజి సుదర్శన్(50) తాంసి మండలం పోన్నారి గ్రామ సమీపంలోని హనుమాన్ ఆలయంలో గత మూడేళ్లుగా అర్చకుడిగా పనిచేస్తున్నారు. మంగళవారం ఉదయం 5గంటలకు నిపాని గ్రామం నుంచి పోన్నారి గ్రామ హ నుమాన్ ఆలయంలో పూజలు నిర్వహించేందుకు యాక్టివా స్కూటీపై వెళ్లాడు. మధ్యాహ్నం ఒంటిగంటకు తిరిగి వచ్చాడు. ఇంట్లో భోజనం చేసి తిరిగి ఆలయానికి వెళ్లిన సుదర్శన్ రాత్రి ఇంటికి రాలేదు. కుటుంబసభ్యులు రాత్రి 9.30గంటలకు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ రావడంతో ఆలయంలో పడుకున్నాడని భావించారు. ఉదయం ఆలయ నిర్వాహకులు సుదర్శన్ కుటుంబసభ్యులకు ఫోన్‌చేసి ఇంకా పూజకు రాలేదని తెలిపారు. రాత్రి ఇంటికి రాలేదని, ఆలయంలోనే పడుకున్నాడని అనుకుంటున్నామని వా రు చెప్పారు. అయితే సుదర్శన్ రాత్రి పూజలు ము గిసిన తర్వాత 9.15గంటలకే ఇంటికి బయలుదేరినట్లు చెప్పారు. అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు బంధువులకు ఫోన్ చేయగా, ఎక్కడికీ రాలేదని సమాధానం వచ్చింది. దీంతో బుధవారం మధ్యాహ్నం దారివెంట వెతకడం ప్రారంభించారు. 12 గంటల సమయంలో తాంసి మండంలం కప్పర్ల గ్రామ సమీపంలోని ఓ పొలంలో తుమ్మ చెట్టుకింద మృతదేహం ఉందన్న సమాచారంతో అక్కడికి వెళ్లి సుదర్శన్‌గా గుర్తించారు. విషయం తెలుసుకున్న ఆదిలాబాద్ సీఐ స్వామి, తాంసి ఎస్సై రాజు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. సమీపంలో మూడుజతల చెప్పులు, లుంగీ గుర్తించారు. మృతదేహంపై కాలుకు, తలకు దెబ్బ లు తగిలి ఉన్నాయి. ఆలయం నుంచి నిపాని తిరిగి వస్తుండగా కొట్టిచంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటన స్థలంలో ఉన్న చెప్పుల జతలు, లుంగి, మత్తడి కాలువలో పడేసిన స్కూటీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అల్లుడిపైనే అనుమానం... సుదర్శన్‌ను కుమారుడు విష్ణు, కూతురు అంజలి ఇద్దరు సంతానం. అంజలిని రెండేళ్ల క్రితం ఆదిలాబాద్‌ని సోనర్గల్లికి చెందిన కృష్ణకు ఇచ్చి వివాహం చేశారు. అత్తారింట్లో కుమార్తెను సరిగా చూడకపోవడంతో ఆమెను సుదర్శన్ ఇంటికి తీసుకొచ్చాడు. దీంతో ఐదు నెలల క్రితం అల్లుడు కృష్ణ, అతడి తమ్ముడు, మరో ఐదుగురిని వెంట పెట్టుకొని వచ్చి మామ సుదర్శన్, అత్త వెంకటమ్మ, బావమరిది విష్ణుతో పాటు ఇంట్లో వారందరిపై దాడి చేశారు. అల్లుడు గతంలో పలుమార్లు తమను చంపుతానని బెదరించాడని, ఈ విషయమై భీంపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశామని వెంకటమ్మ తెలిపింది. తన భర్తను అల్లుడు కృష్ణ, అతడి సంబంధీకులే చంపి ఉంటారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ స్వామి, ఎస్సై రాజు తెలిపారు. పరామర్శించిన ఎమ్మెల్యే బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు సంఘటన స్థలానికి వెళ్లి హత్య జరిగిన తీరు గురించి తెలుసుకున్నారు. సుదర్శన్ కుటుంబసభ్యులను పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. హనుమాన్ ఆలయానికి రెండుసార్లు వెళ్లగా సుదర్శన్ పూజలు చేసిన విషయాన్ని గుర్తుచేస్తే.. ఈ హత్య బాధాకమరమని పేర్కొన్నారు. చుట్టుపక్కల గ్రామాలైన నిపాని, కప్పర్ల, జామిడి, బండల్నాగపూర్, తాంసి, పోన్నారి ప్రజలు అధిక సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకుని కంటతడి పెట్టుకున్నారు.