
సాక్షి, చెన్నై: నటుడు అర్జున్ నిర్మించిన హనుమాన్ దేవాలయాన్ని ఎమ్మెల్సీ కవిత శుక్రవారం సందర్శించారు. ప్రముఖ ఆంగ్ల పత్రిక నిర్వహించనున్న సదస్సులో పాల్గొనడానికి చెన్నైలో పర్యటిస్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ప్రముఖ సినీ హీరో అర్జున్ నిర్మించిన హనుమాన్ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అర్జున్ దంపతులు కల్వకుంట్ల కవితకు ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ.. చెన్నైలో పర్యటించడం తనకు ఎప్పుడూ ఆనందంగా ఉంటుందని తెలిపారు. తమిళనాడు అస్తిత్వం చాలా గొప్పదని, అక్కడి ప్రజలు స్ఫూర్తిదాయకంగా ఉంటారని అన్నారు. తమిళనాడు ప్రజలు తమ సంస్కృతి భాష చరిత్ర వారసత్వం పట్ల గర్వంగా ఉంటారని, ప్రతి ఒక్కరికి ఆ గౌరవభావం ఉండాలని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆలోచన తత్వం భారతీయులను ఐక్యంగా ఉంచుతుండడం గర్వంగా ఉందని తెలిపారు. దేశంలోని అతిపెద్ద హనుమాన్ దేవాలయాన్ని నిర్మించినందుకు అర్జున్‌కు కవిత అభినందనలు తెలిపారు.
చదవండి: దర్శకుడితో హీరోయిన్ డేటింగ్..!
Comments
Please login to add a commentAdd a comment