- రాజీవ్‌గృహకల్ప కాలనీలో ఉద్రిక్తత
ఘట్‌కేసర్ (రంగారెడ్డి జిల్లా): నిర్మాణ దశలోఉన్న హనుమాన్ దేవాలయాన్ని కూల్చివేయడానికి అధికారులు యత్నించడంతో మండలంలోని రాజీవ్‌గృహకల్పకాలనీలో గురువారం రాత్రి ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కాలనీవాసులు ,అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని పోచారం గ్రామ పంచాయతీ పరిధిలోని రాజీవ్‌గృహకల్పకాలనీలో శ్రీహనుమాన్ దేవాలయం నిర్మాణం కోసం గ్రామ పంచాయతీ పాలకవర్గం కొంత స్థలంకేటాయిస్తూ తీర్మాణించింది. దీంతో కాలనీవాసులు నిధులు ప్రోగుచేసి నిర్మాణంచేపట్టారు.నిర్మాణం స్లాబ్‌వరకు చేరుకుంది. దీంతో సమీపంలో ఉన్న జీసస్‌వే ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాని తనకు ఉన్న స్థలాన్ని కబ్జా చేస్తూ శ్రీహనుమాన్ దేవాలయాన్ని నిర్మిస్తున్నారని అధికారులకు ఫిర్యాదుచేశాడు.
దీంతో రెవెన్యూ అధికారులు,పోలీసుల బలగాలతోగురువారం రాత్రి చేరుకున్నారు.కూల్చీవేయడానికి రెవెన్యూ సిబ్బందితో స్లాబ్ వేయడానికి బిగించిన కట్టెలు తొలగించారు. విషయం తెలుసుకున్న కాలనీ వాసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని కూల్చివేతను అడ్డుకున్నారు. సర్వేనంబర్ 14లో శ్రీహనుమాన్ దేవాలయానికి స్థలం కేటాయిస్తూ తీర్మాణాలు ఉన్నాయని సర్పంచ్ లక్ష్మినారాయణ అధికారులకు తెలపడంతో కూల్చివేత యత్నాన్ని అధికారులు విరమించుకున్నారు. తహసీల్ధారు విష్ణువర్ధన్‌రెడ్డి, సీఐ ప్రకాష్, కాలనీ నాయకులు సారగళ్ల రమేష్, బల్‌రాం,జగన్నాధం, రమేష్,అంజనేయులు,వార్డు సభ్యులు రేణుక,పయ్యావుల లక్ష్మి సంఘటన స్థలంలో ఉన్నారు.దేవాలయ నిర్మాణాన్ని కూల్చవద్దని కాలనీ వాసులు కోరుతున్నారు.
ఆలయం కూల్చివేతను అడ్డుకున్న ప్రజలు
Published Thu, Mar 24 2016 10:19 PM | Last Updated on Sun, Sep 3 2017 8:29 PM
Advertisement